విషయ సూచి

పుస్తక సమీక్షలు

ఆసాయంత్రం
రచన - గరికపాటి పవన్
సమీక్ష - వినీల్‌ గట్టు

కవిత్వం గురించి చెబుతూ ఎజ్రా పౌండ్ "భావ ప్రకటనకి పనికిరాని ఒక్క పదాన్నైనా సహించకూడదన్నారు". ఆ లక్షణాన్ని పవన్ బహు చక్కగా పుణికిపుచ్చుకున్నారు.

అలసిపోయిన అస్థికలు - ఒక కవిత్వ సమీక్షా పరిచయం
రచన - రక్తనేత్ర
మాధవ్ మాచవరం

"టూ వీలర్ కాలుష్యంతో బిరుసెక్కిన నా కళ్ళతో
నీ రక్తమాన్‌దిరాక్స్ తాగడానికే నేను రక్తనేత్రుడనైనాను " అని కవి ఆగ్రహంతో చేస్తున్న ప్రకటనలు సమాజాన్ని పీడిస్తున్న సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దుష్టశక్తులపైకి దూసుకొస్తున్న కవితా సునామీలు!

వ్యాసాలు

సాహిత్యానువాదము - వివేచన - డా. వడపల్లి రామారావు

సాహిత్యానువాదాల నాణ్యతని తూచడానికి సరైన పడికట్టు రాళ్ళు లేవు. దీనికి కారణం సాహిత్యానువాదాన్ని గురించిన సిద్ధాంతం లేకపోవడమే.

స్త్రీ పర్వంలో గాంధారి -వేలూరి వెంకటేశ్వర రావు

ఆమె దురదృష్టమో ఏమో కాని, స్త్రీ పర్వం సాధారణంగా ఎవరూ చదవరు. చదివించరు. వ్యాసభారతంలో ఒకే ఒక్క శ్లోకం మినహా ఇంకేవీ ఎక్కడా ఉదహరించరు.

పాదూఖండం - భైరవభట్ల కామేశ్వర రావు

ఈ సన్నివేశం చిత్రించాలంటే, ఒక్కసారిగా కథనం భరతుడి నుంచి రాముడి వద్దకు మారాలి. ఈ మార్పు పాదూఖండంలోని కథాప్రవాహాన్ని(flow ని) భగ్నం చేస్తుంది. ఈ సమస్యని విశ్వనాథ ఎలా పరిష్కరిస్తాడా ...

ఇది జీవశాస్త్రపు శతాబ్దం! - వేమూరి వెంకటేశ్వర రావు

ఇలా ఏ దృక్కోణంలో చూసినా జీవశాస్త్రం ఇరవయ్యొకటవ శతాబ్దాన్ని ఏలెస్తుందనడంలో సందేహం లేదు.

ఈమని శంకర శాస్త్రి - డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

దురదృష్టవశాత్తూ ఎక్కువమంది తెలుగువాళ్ళకి సినిమాలో శంకరాభరణం శంకరశాస్త్రి అంటే తెలుస్తుందికాని ఈమని శంకరశాస్త్రి అంటే తెలియకపోవచ్చు. వీణలో మహామహోపాధ్యాయుడైన ఈమని శంకరశాస్త్రిగారి కచేరీలు విన్నవారికి ఆయన గొప్పదనం ఎటువంటిదో తెలిసినదే.

ముట్టు - అరవింద పిల్లలమఱ్ఱి

ఆడ వాళ్ళు కొన్ని చదవకూడదు, కొన్ని నేర్చుకోకూడదు. ఎందుకు? గుడి లో ఇంత వరకే వెళ్ళచ్చు దాటి లోపలకి వెళ్ళకూడదు. ఎందుకు? పూజారి అవటానికి అర్హులు కారు... ఎందుకు? అని అడిగితే ఇచ్చే జవాబుల్లో మొదటిలో కాని, చివరిలో కాని, మొత్తానికి ఒకే విషయం వచ్చేది: "ముట్టు."

కథాశిల్పం - డా. విష్ణుభొట్ల లక్ష్మన్న

"కథ ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? పాత్రలను ఎలా మలచాలి? ఎటువంటి నేపథ్యంలో చెప్పాలి? ఎటువంటి కంఠస్వరం ఉపయోగించాలి? ఎల్లాంటి దృష్టికోణంలో చెప్పాలి?" అన్న ప్రశ్నలకి సమాధానమే కథా శిల్పం .

కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? - కొడవళ్ళ హనుమంత రావు

స్త్రీ పురుషుల మధ్య, వివిధ వర్గాల మధ్య, తరాల మధ్య, మనుషుల మధ్య ఇంకా ఎన్నో గోడలున్నాయి. వీటికి మూలం మన కర్మలోనో, మానవుడికి అతీతమైన మరో శక్తిలోనో వున్నాయనే నమ్మకాలున్నాయి. అవి వున్నంతకాలమూ కుటుంబరావు రచనలకి ప్రయోజనం ఉంది.

కథలు

ఫిష్‌ దట్‌ గాట్‌ అవే - విప్లవ్

అట్లా స్వచ్చమైన నీళ్ళలోకి ఫిషింగ్‌ లైను బెయిట్‌తో వేసి ఇక ప్రపంచంతో పనిలేనట్టు ఇంకా బయటకు రాని సూర్యునికోసం ఎదురుచూడ్డమంటే మా ఇద్దరికీ మరీ ఇష్టం.

"తండ్రి"తనం - జె.యు.బి.వి. ప్రసాద్

నాన్నగారూ! మీకెప్పటి నించో చెబుదామనుకుంటున్నాను. చాలా కాలం నించీ నాకు దేముడి విషయాల మీద నమ్మకం పోయింది. ఆ కార్యక్రమాలు నేను ఇక చెయ్యలేను.

సివిలైజ్డ్ ఇన్ అమెరికా

"హహ్హహ్హ, నైస్‌ జోక్‌, వెరీ నైస్‌" అన్నాను నేనూ నవ్వు కలుపుతూ, రాధిక కేసి కన్ను గీటుతూ. దాంతో ఆమె కూడ నాతో నవ్వు కలిపింది. ముగ్గురం అలా కాసేపు పగలబడి నవ్వుకున్నాం. ఫేమిలీ వేల్యూస్‌ అంటే మా ఫేమిలీ అంతా పడిచస్తాం మరి!

కవితలు

తెలుగు కైత - లైలా

కైతను నేను.
పైపై పూతను కాను
పసరు పూపను కాను.

ఎవరిలో ఎవరో - డా. పాపినేని శివశంకర్

ఎవరిలో ఆదిమ అటవీసౌందర్యాలు విస్తరిస్తుంటాయో
అర్ణవాలు ఘూర్ణిల్లుతుంటాయో
జలపాతసాహసాలు ఉరుకుతుంటాయో
ఎవరికి తెలుసు?

ఘోష - సాయి బ్రహ్మానందం గొర్తి

గుమ్మం ముందు
ఉదయించిన వార్తలూ -
వరండాలో కాఫీ చప్పరిస్తున్న
వార్తాపత్రికలూ -

వార ఫలం - కనక ప్రసాద్

వాళ్ళని కాళ్ళని పట్టుకు కిందికి దిగలాగి
గురిగా బాణం దెబ్బకి నాణెం రాలిన గిల గిల విన్నాను.

అనువాదాలు

మంచి కవిత్వం - రిల్కే ఉత్తరాలు - 1
రచన - Rainer Maria Rilke
అనువాదం- అఫ్సర్

ఒక యువకవి పదే పదే పంపిస్తున్న కవిత్వానికి ఏం జవాబివ్వాలో తెలియక, సతమతమై, చివరకి ఆ కవికి వుత్తరాలు రాయటం మొదలు పెట్టాడు రిల్కే. అలా అతను రాసిన పది వుత్తరాలు "లెటర్స్ టు ఎయంగ్ పోయెట్" అనే శీర్షికన పుస్తకంగా అచ్చయి, ఆ యువకవిని సాహిత్య చరిత్రకి ఎక్కించాయి.

మృతజీవులు(2)
రచన - Nikolai Gogol
అనువాదం- కొడవటిగంటి కుటుంబరావు