నీరులా నీడలా నిలువలేని కాడలా !
యోగానంద్ సరిపల్లి
నీరులా నీడలా నిలువలేని కాడలా!2
జీవిద్దాం ఇలానే!
ఈ సంకుచించుకుపోయిన మన ప్రపంచం లోనే!
పయనిద్దాం ఈ ఇరుకు దారుల్లోనే!
మనమంతా నిమిత్త మాత్రులమనీ
జగమంతా ఈశ్వర తత్వమనీ,
కర్త, కర్మ,తప్పొప్పులు,మంచిచెడులు-
అంతా "పై" వాడి భారమనీ,
మన మానాన మనం బతుకు వారమనీ
జీవిద్దాం!!
జీవిద్దాం ఇలానే!తప్పించుకుంటూ మతి తప్పిన మాయావాదుల్లానే4!
జీవిద్దాం!!
జీవిద్దాం ఇలానే!
నీరులా నీడలా నిలువలేని కాడలా!లేదు కదా మనకంటూ వ్యక్తిత్వం!
లేదు కదా మనదంటూ జీవితం!
రాదు కదా మనకోసం
రహించే 1మంచి భవితవ్యం!
అమ్ముడు పోతూ3 ఎవడు కొనుక్కుంటే వాడికి!
తలూపుతూ ఎవడేదంటే దానికి!
మొద్దుల్లా, ఎద్దుల్లా, గంగిరెద్దుల్లానే జీవిద్దాం!చెదిరిపోతూ చెరిగిపోతూ
ఈకల్లా, ఆకుల్లా, వాడిన పూరేకుల్లానే
జీవిద్దాం!!
జీవిద్దాం ఇలానే!నీరులా నీడలా నిలువలేని కాడలా!
జీవిద్దాం...
పయనిద్దాం...
ఈ ఇరుకు దారుల్లోనే!
04-20-05
యోగానంద్
వివరణ:
- రహించే : To thrive, to shine, to bloom, to increase, to improve (ref: Telugu- English Dictionary compiled by P. Sankaranarayana)
- నీరు, నీడ, నిలువలేని కాడ: వ్యక్తిత్వం లేకపోడానికి సూచకం
- అమ్ముడు పోతూ: లంచాలు, కట్నాలు, గుర్తింపు కోసం దేశాన్నమ్మేడాలు!
- మతి తప్పిన మాయావాదులు: ఏమీ అవగాహన లేకుండా, తప్పొప్పులు, మంచి చెడులు మనం కాదు కదా నిర్ణయించేది, అంతా"పై" వాడే కదా నిర్ణయించేది..." అంటూ బాధ్యతా రహితంగా వర్తించే వారినివిమర్శిస్తూ చెప్పిన వాక్యం. కాలం ఎంత మారినా సామన్య ధర్మం మారదు కదా! సామన్య ధర్మం ప్రకారమే గా అన్నీ నిర్ణయించబడేది!మరి "ఈ తప్పొప్పులు, మంచి చెడులు, నిర్ణయించడానికి మనమెవరం" అంటూ వింత వాదన ఎప్పట్నుండి, ఎక్కణ్ణుండి వచ్చిందో! మనం కాపోతే ఎవడు నిర్ణయిస్తాడివి!
విమర్శకులందరికీ ధన్యవాదాలు.