మంచు తెఱల ఉదయాన గుసగుసలు
పద్మశ్రీ ఎస్.వి. రామారావు
ఓ మాత్రపు చిఱుచలికే
ఒళ్ళు ఒణుకుతున్నది
సంవత్సరాంతపు మాసమ్లో
తొలిసారి కాలుపెట్టిన
తుంపర మంచు
దోబూచులాట ఆడుతుంది.
దగ్గరలో ఉన్న వెలుతురుతో
దూరంగా ఉన్న చీకటితో.
చలిలో ఒణుకుతున్న
ప్రకృతి సుందరి
మళ్ళీ క్రొత్తగా
ప్రేమలో పడ్డతున్నది -
నూనూవు మీసాల
ఉదయ భానుణ్ణి చూసితన కౌగిలిలోకి
పరుగు పరుగున
పొగమంచు తెఱలను
చీల్చుకొని రమ్మని
చారడంత కాటుక కనులతో
సైగలు చేస్తున్నది.
వొంపులు తిరుగుతున్న
వయ్యారాలతో
ప్రేరేపిస్తున్నది,
అప్పుడు ఉదయించబోయే
వేల కిరణాల సుందరుణ్ణి.ఎక్కడి నుండోప్రయాణం చేసి వచ్చిన ఒంటికి
అంటిన మురికిని వదిలించుకోవాలని,
కొండ చెరియలలోపారిన పిల్ల సెలయేర్లు,
మంచు గడ్డ చలి నీళ్ళలోస్నానం చేస్తున్నాయి.
ఒణుకుతూ పళ్ళు కొరుకుతూ
పోసికోలు కబుర్లు
చెప్పుకుంటున్నాయి,
అందరికీ ఒంకలు పెడ్తూ,
అందరినీ ఎగతాలి చేస్తూ.క్రొత్తగా వలలో పడ్డ
యువరాజు సూర్యుణ్ణి
చూసి జాలి పడుతూ,
ఒక్క రోజులోనే
పీల్చి పిప్పి చేసి
కందిన ఎఱ్ఱటి ముఖంతో
అతన్ని ఇంటికి పంపిస్తుందిలో అని
తామెప్పుడూ ఎరుగున్న
పృధుఘన స్తన ప్రకృతి సుందరి
సుందరాకాండాల గురించి
అందరికీ తెలిసిన ఈ విషయలోలిని గురించి
చెవులు కొఱుక్కుంటున్నాయి
నవ్వుల మధ్య
ఇకిలింపులతో
గుసగుసలాడుతున్నాయి,
సెలయేర్లు - పిల్ల సెలయేర్లు.