గతం

తమ్మినేని యదుకుల భూషణ్‌

1. గతం

నల్లని రాతిమెట్లు
అల్లుకొన్నవి లతలు పూవులు
చతికిల పడటానికే తప్ప
నిన్నెటూ తీసుకు వెళ్ళవు

2. గడ్డిలో ఆడుకునే నల్లకుక్కలు

మెడలో గొలుసు మెరవదు
తడవతడవకు తలతిప్పవు

యజమాని
నిజంగా లేడు

వేడెక్కని గాలి
నీడలేమో మృదువు

గాలికి ఊగే పొదలు
చెలిమికి ఎంత అనువు