ఈమాట » నువ్వు

Expand to right
Expand to left

నువ్వు

నువ్వొస్తున్నావని నాకు తెలిసిందిలే…
నా కన్నులరమోడ్పులు పెదవులు దరహాస వికసితాలు…

ఎటు చూసినా నువ్వే కనిపిస్తావేం,
నన్ను పిచ్చిదాన్ని చేసే కుట్రా?

నువ్వంటే నాకు చెప్పలేని చిరాకు, అంతులేని కోపం,
ఎందుకు నిన్నింతగా ప్రేమించేలా చేస్తావు నన్ను మరి?

వెన్నెల ఉందో లేదో చంద్రుడు ప్రత్యేకంగా చెప్పాలా
నమ్ము ప్రియా, నీ ప్రేమ కంటే నిషా విశ్వంలోనే లేదు

అదేమిటో మరి, నీతో ఉంటె చంద్రుణ్ణి మునివేళ్ళతో ముట్టుకున్నట్లే ఉంటుంది
వెన్నెల గంధాన్ని బుగ్గలకు రాస్తున్నట్లే ఉంటుంది

చూసావా మరి, నా నిద్ర కూడా నిన్నే జపిస్తూ ఉంటుంది
నీ ఎదురుచూపులో నన్నొదిలి పారిపోతుంది

ప్రతిక్షణం నా తలపులలోనే ఉంటావు, నిరంతరం నాలో ప్రవహిస్తుంటావు
లిప్తపాటయినా నాతో ఉండవు, కన్నుల దాహమయినా తీరనీయవు

ఇంతగా ప్రేమించే నీ హృదయం సుమసద్రుశమనుకున్నాను
నన్నిలా విసిరేస్తుంటే యిప్పుడేమనుకోను?

నీది తీపి జ్ఞాపకాల పరిమళం
నా ప్రేమ దహించే శాపం

ప్రేమంటే నీకో హృదయాల సమాహారం
నాకయితే అదే జీవనాధారం

సీతాకోకచిలుక రెక్కల్ని నాకతికించి ఎగరేసింది నువ్వే
నిర్దాక్షిణ్యంగా నేలకు తోసేసింది నువ్వే

అందుకే, నీ సాన్నిహిత్యం కంటే కూడా ఎదురుచూపే మధురం
విషాద సమ్మిళిత సమ్మోహన యోగం

 

(13 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. ప్రదీప్ అభిప్రాయం:

    July 1, 2010 8:03 am

    కవిత చాలా బాగా రాసారండి :) నాకు చాలా నచ్చేసింది. Super అంతే.

  2. kalyan అభిప్రాయం:

    July 3, 2010 7:47 am

    తల్లి నీకు మంచి భవిష్యత్తు ఉంది, ముందుకు వెళ్ళు, మంచి రచయిత నీలో ఉంది … కవిత నాకు చాలా నచ్చేసింది.

  3. deepu అభిప్రాయం:

    July 7, 2010 3:55 am

    This is very nice. Keep it up.

  4. Meghadhutha అభిప్రాయం:

    July 7, 2010 4:30 am

    బాగుంది. కాని అది విరహమా, వ్యామోహమా, వైరాగ్యమా, విరక్తా, ప్రేమా, పారవశ్యమా లేక యీ అన్ని భావనలు కలబోసుకున్న అయోమయమా అన్నది మాత్రం తెలియడంలేదు. కవిత్వం లోతయిన భావాలను సరళతరం చేయాలని నా అభిప్రాయం.

  5. Bharath Yadlapalli అభిప్రాయం:

    July 7, 2010 9:10 am

    నిజంగా మీ కవిత చాలా బాగుంది. కానీ ఒక చిన్న సలహా. “సితా చిలుక” అనడం కంటే “సితాకోక చిలుక” అనడం మరింత బాగుంటుందని భావిస్తున్నాను. నేను కవిని కాదు, కేవలం నా అభిప్రాయం వ్యక్త పరుస్తున్నాను అంతే!

    (ఇది పొరపాటు. సీతాకోకచిలుకగా తప్పు సరిదిద్దాము. పట్టించినందుకు కృతజ్ఞతలు. - సం.)

  6. kavitha అభిప్రాయం:

    July 7, 2010 2:35 pm

    మేఘదూత గారూ, యథాతథంగా ప్రేమికురాలి మనసు అలాగే ఉంటుంది. ఆవిడ కంఫ్యూజన్ ని బాగా చూపించారు.

  7. soujanya అభిప్రాయం:

    July 20, 2010 1:03 am

    చాలా బాగా రాసారు. నిజమే అతని సాన్నిహిత్యం కంటే కూడా ఎదురుచూపే మధురం మధురాతిమధురం……..!!!

  8. Nagaraju అభిప్రాయం:

    July 23, 2010 9:20 am

    చాలాబాగుందండి

  9. radhakrishna అభిప్రాయం:

    July 24, 2010 3:33 am

    మీ కవిత చాలా బాగున్నది. మైదానము లొ చలమ్ చెప్పినవి గురుతుకు వస్తున్నవి. భావమ్ చాలా బావున్నది.

  10. Madhu Anneboina అభిప్రాయం:

    July 27, 2010 12:41 pm

    చాలా బాగుంది రాగ ద్వీప గారూ…
    ” ఎదురుచూపే మధురం
    విషాద సమ్మిళిత సమ్మోహన యోగం :”. నిజమే కదా..!

  11. rambvn అభిప్రాయం:

    August 1, 2010 2:01 am

    “విషాద సమ్మిళిత సమ్మోహన యోగం ” - సూపర్ఎక్స్ ప్రెషన్. చాలా బాగున్నది.

  12. రాజా బాబు అభిప్రాయం:

    August 1, 2010 7:38 am

    ఎదురుచూపులో వున్న అవ్యక్తానుభూతి
    విరహంలో వున్న తీయని బాధ
    కలగలిపిన ఈ కవిత చాలా బాగుంది
    - రాజాబాబు

  13. sreekanth.vemulapalli అభిప్రాయం:

    August 12, 2010 8:24 am

    మీ కవిత చాలా bagundi i dont know 2 type in telugu sorry bye

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a