ఈమాట » పాఠకుల అభిప్రాయాలు

Expand to right
Expand to left

పాఠకుల అభిప్రాయాలు


ఈ పదం(పదాలు) ఉన్న అభిప్రాయాలు చూపించండి

ఇప్పటిదాకా ఈమాట లో తెలియచేసిన అభిప్రాయాలు: 7518

«కొత్త అభిప్రాయాలు 1 ... 3 4 5 6 7 ... 752 పాత అభిప్రాయాలు»

  1. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Siddineni BhavaNarayana అభిప్రాయం:

    05/12/2013 9:48 am

    విష్ణుభొట్ల లక్ష్మన్న గారూ, జెజ్జాల కృష్ణ మోహన రావు గారూ, పరుచూరి శ్రీనివాస్ గారూ,

    ఆయన డాకు భూపత్ అన్న హిందీ డబ్బింగ్‌ సినిమాలో (తెలుగు మాతృక: రాజనందిని, 1958) సుశీలతో కలిసి పాడిన నైనా జో నైన్ సే మిలే పాట, తెలుగులో ఎ. ఎం. రాజా, సుశీల ఎంతో మనోహరంగా పాడిన అందాలు చిందు సీమలో, అన్న పాటకి ఏ మాత్రం తీసిపోదు.

    ఈ పాట తెలుగులో పాడినవారు జిక్కి గదా? ఒక్క సారి సరి చూస్తారని విన్నపం.
    విధేయుడు,
    సిద్దినేని భావ నారాయణ

  2. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/12/2013 9:30 am

    ప్రకాశ రావు గారు:

    మీరు చెప్పిన తరవాత ‘కాదలిక్క నేరమిల్లై’లో వున్న నాళాం నాళాం తిరునాళాం అనే యుగళ గీతం విన్నాను. పాట బాగుంది కానీ, ‘వెన్నెల రేయి ఎంతో చలీ చలీ ‘ పాట స్థాయిలో లేదు. నాకు తెలుగు పాట నచ్చటానికి ఒక కారణం ఈ పాట ‘కళావతి ‘ అన్న హిందూస్తానీ రాగంలో స్వరపరచడమే. తెలుగు సినిమాల్లో అరుదుగా వినపడే రాగం కళావతి. ‘బుద్ధిమంతుడు ‘ సినిమాలో పాట ‘తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా” పాట మిశ్ర కళావతి రాగంలో ఉంటుంది (మధ్యమం కూడా వినిపిస్తుంది). ‘కర్ణ ‘ సినిమాలో బాలమురళి, జానకి పాడిన ‘ వసంత గాలికి వలపులు రేగ ‘ కళావతి రాగంలో స్వరపరచబడ్డ ఒక చక్కని సినిమా పాట.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Siddineni BhavaNarayana అభిప్రాయం:

    05/12/2013 6:55 am

    Sir,

    The link for చిలకా గోరింక కులికే పకా పకా is not working. I request the editor to see it that the snag is fixed.

    [Fixed. Please try again - Ed.]

  4. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి తః తః అభిప్రాయం:

    05/12/2013 3:25 am

    “అయినా అతను అలా జపిస్తూనే కూర్చున్నాడు. కొన్నాళ్ళకి రాముడు ప్రత్యక్షమై అతనికి మోక్షమిచ్చాడు.”

    అంటే ఈ వాల్మీకి రామయణం రాశాడని ఈ కథ చెప్పటం లేదు. ఈతను మరొక వాల్మీకేమో.

  5. సిరినివాస వృత్తము గురించి తః తః అభిప్రాయం:

    05/12/2013 3:09 am

    శ్రీ మోహన:
    ‘ [సస]/సామజవరగమన ‘ - 1, 10 అక్షరాలకీ, మళ్ళీ 13,21 అక్షరాలకీ యతులతో - లఘువుతో ముగిసే పాదాలు కలిగిన ఛందమవటానికి అవకాశం ఉందా?

    మిత్రుడు
    తః తః

  6. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి V S PRAKASA RAO అభిప్రాయం:

    05/12/2013 1:54 am

    లక్ష్మన్న గారూ,
    ‘కాదలిక్క నేరమిల్లై’లో వున్న నాళాం నాళాం తిరునాళాం అనే యుగళ గీతం స్థానం లో ప్రేమించి చూడు కోసం వెన్నెల రేయి ఎంతో చలీ చలీ అనే పాటని రికార్డ్ చేశారనుకుంటాను. (నేను ‘ప్రేమించి చూడు’ చూడలేక పోయాను కాబట్టి మోహన గారే నిర్ధారించాలి.) మాస్టర్ వేణు తెలుగు బాణీ తమిళ పాట బాణీ కన్నా శ్రావ్యంగా వుందని నా అభిప్రాయం.

  7. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి Srilakshmi అభిప్రాయం:

    05/11/2013 4:54 pm

    Excellent article on my uncle PBS. I was fortunate enough to have known about his greatness through my mother Smt. Mani Raghunath (youngest sister of PBS) but the magnitude of work in this article speaks volumes about the equal expertise that you have in the field of literature. Thanks for sharing such an informative article as a tribute to such a legend. Also thanks for sharing the tribute paid by my Mother in law Smt. Jaya Sastry who happens to be from the family of Devulapalli Krishna Sastry garu.

    Srilakshmi. C (Niece of Dr. P.B. Srinivos)

  8. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Srilakshmi అభిప్రాయం:

    05/11/2013 2:45 pm

    Excellent article. Excellent choice of all songs mentioned in the article and was a fantastic idea to include the songs too in this article. Thanks for sharing these precious gems.

    - Srilakshmi (Niece of Dr. P.B. Srinivos)

  9. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Siddineni BhavaNarayana అభిప్రాయం:

    05/11/2013 9:21 am

    Mohana Garu,

    It would be unbecoming of us not to acknowledge your contribution to the memory of P.B .Sreenivas garu. I thank you for providing us with an easy access to the video interview. [Those people who are not consistently loyal to the new medium of Telugu television are bound not to be aware of the existence of this interview in the U tube archives].

    – Siddineni BhavaNarayana

  10. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    05/10/2013 9:17 pm

    ప్రేమించి చూడు సినిమాలో ANR పాటలు PBS పాడడంలో రహస్యం చెప్పగలరా!

    ఈ విషయాలను, ఇంకా ఎన్నో విషయాలను గురించి శ్రీనివాస్ గారే గుర్తుకొస్తున్నాయి కార్యక్రమములలో పేర్కొన్నారు. వాటిని యూట్యూబులో క్రింది లంకెలలో చూడ వీలగును.

    gurtukostunnayi - 1

    gurtukostunnayi - 2

    gurtukostunnayi - 3

    gurtukostunnayi - 4

    విధేయుడు - మోహన

«కొత్త అభిప్రాయాలు 1 ... 3 4 5 6 7 ... 752 పాత అభిప్రాయాలు»