ఈమాట » పాఠకుల అభిప్రాయాలు

Expand to right
Expand to left

పాఠకుల అభిప్రాయాలు


ఈ పదం(పదాలు) ఉన్న అభిప్రాయాలు చూపించండి

ఇప్పటిదాకా ఈమాట లో తెలియచేసిన అభిప్రాయాలు: 7511

«కొత్త అభిప్రాయాలు 1 2 3 4 5 6 ... 752 పాత అభిప్రాయాలు»

  1. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    05/12/2013 2:31 pm

    మాస్టర్ వేణు తెలుగు బాణీ తమిళ పాట బాణీ కన్నా శ్రావ్యంగా వుందని నా అభిప్రాయం.
    మీరు చెప్పిన తరవాత ‘కాదలిక్క నేరమిల్లై’లో వున్న నాళాం నాళాం తిరునాళాం అనే యుగళ గీతం విన్నాను. పాట బాగుంది కానీ, ‘వెన్నెల రేయి ఎంతో చలీ చలీ ‘ పాట స్థాయిలో లేదు.

    రెండు పాటలలో ఏ పాట బాగుందో అన్నది పూర్తిగా ఒక వ్యక్తికి చేరిన స్వంత అభిప్రాయము. నా ఉద్దేశములో తెలుగు పాట నీరవనిశిథినిలా సాఫీగా నడుస్తుంది. తమిళ పాట పదహారేళ్ల యౌవనములా వేగముగా పరుగులు తీస్తుంది. రెండింటిలో సుశీల గళమాధుర్యము, శ్రీనివాస్ గళమాధుర్యము - రెండు మధురస్రవంతులు సంగమించి ఒకే మధురస్రవంతిగా మారినది.

    విధేయుడు - మోహన

  2. సిరినివాస వృత్తము గురించి మోహన అభిప్రాయం:

    05/12/2013 2:07 pm

    తఃతః గారు,
    గుర్వంతమైనా కావచ్చును, లఘ్వంతమైనా కావచ్చును, ఏ పేరితోనైనా సార్థకనామవృత్తమును కల్పించవచ్చును. కాని లాక్షణికులు 20వ శతాబ్దపు మధ్యకాలము వఱకు సుమారు 1500 వృత్తములను మాత్రమే సృష్టించి యున్నారు. సంస్కృత ఛందస్సులో లఘ్వంతముగా పేర్కొనబడిన వృత్తములను వ్రేళ్లపైన లెక్కించవచ్చును. దీనికి కారణము సంస్కృత ఛందస్సులో పాదాంతములో విరామయతి ఉంటుంది. అందువలన చివరి అక్షరము గురుతుల్యమే. అందుకే గురువున్న చోటులో కూడ లఘువును వాడుతారు. ఉదాహరణకు వసంతతిలకవృత్తములో శ్రీవేంకటేశ్వర సుప్రభాతములో ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ / పూగద్రుమాది సుమనోహర పాళికానాం … ఇందులో నారికేళ లోని ళ లఘువు, కాని అక్కడ గురువు స్థానమును ఆక్రమించుకొన్నది (తరువాతి పాదమునందు నాం వలె). తెలుగు ఛందస్సులో కూడ ఉపజాతులైన సీసము, ఆటవెలది, తేటగీతి, జాతి యయిన ద్విపదలలో పాదాంతములోని అక్షరము లఘువే. సామాన్యముగా ఉపజాతులలో అన్ని పాదములు స్వతంత్రముగా నిలిచి ఉంటాయి. ద్విపదలలో ఇది తప్పని సరి నియమము. అంటే పాదాంతములో ఒక విరామయతి ఉంటుంది. అందువలన ఇవి నా ఉద్దేశములో గురుతుల్యమే.

    తెలుగులో సామాన్యముగా లాక్షణికులు గుర్వక్షరముపైన యతి నుంచుతారు. ఇది యెల్లప్పుడు సరి కాదని నేననుకొంటాను. ఉదాహరణకు తోటక వృత్తములో (నాలుగు స-గణములు), తొమ్మిదవ అక్షరము యతి. కాని పాదములో నాలుగు చతుర్మాత్రలు ఉన్నాయి, అవి రెండు రెండుగా విఱిగితే శ్రవణసుభగముగా నుంటుంది. సంస్కృతఛందస్సులో నాకు తెలిసి ఒక సార్థకనామవృత్తము మాత్రమే ఉన్నది, దాని పేరు న-ర. పద్యాలు పఠనీయములు మాత్రమే కావు, వాటిని పాడుకోవాలి కూడ. అందువలన నేను సార్థకనామవృత్తములను సృష్టించినప్పుడు అవి మాత్రాగణములుగా విఱుగుతాయో లేదో అనే విషయముపైన దృష్టి నుంచుతాను. అటువంటి వృత్తములకే నేను ఉదాహరణలను ఇస్తాను. ఈ ఉపోద్ఘాతముతో సామజవరగమనను పరిశీలిస్తే, దాని స్వరూపము ఇలాగుంటుంది -
    స-స-మ-జ-వ-ర-గ-మ-న అనగా IIU IIU UUU IUI IU UIU U UUU III. ఈ అమరికను ఆఱు మాత్రలుగా విడదీసి వ్రాసినప్పుడు దీనికి సంగీతసౌలభ్యము లభిస్తుంది. ఆ అమరిక IIUII UUU UIUI IUUI UUU UUIII, ఈ అమరికతో యతి స్థానము 9, 17 అక్షరాలతో చెల్లుతుంది. సామజవరగమనవృత్తమునకు నా ఉదాహరణ -

    సామజవరగమన - స స మ జ య య మ న, యతి (1, 9, 17)
    24 సంకృతి 14719516

    వరగామిని నీవేనా - పాదమందు వయారాల - వచ్చేవా సొంపై నడచి
    స్వరభారతి నీవేనా - పాటలందు విలాసాల - వంచేవా యింపుల్ మడచి
    సురసుందరి నీవేనా - చుక్కలందు రవల్ దెచ్చి - చొక్కేవా దేవీ మురిసి
    స్మరమోహిని నీవేనా - శయ్యయందు ప్రమోదాల - జల్లేవా పూలన్ గురిసి

    విధేయుడు - మోహన

  3. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి ఆనంద్ అభిప్రాయం:

    05/12/2013 10:31 am

    “వసంత గాలికీ వలపులు రేగ” అనే పాట కర్ణ సినిమా లోనిది కాదు. ఈ పాట శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణు అనే సినిమాలోది.
    ఆనంద్

  4. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Siddineni BhavaNarayana అభిప్రాయం:

    05/12/2013 9:48 am

    విష్ణుభొట్ల లక్ష్మన్న గారూ, జెజ్జాల కృష్ణ మోహన రావు గారూ, పరుచూరి శ్రీనివాస్ గారూ,

    ఆయన డాకు భూపత్ అన్న హిందీ డబ్బింగ్‌ సినిమాలో (తెలుగు మాతృక: రాజనందిని, 1958) సుశీలతో కలిసి పాడిన నైనా జో నైన్ సే మిలే పాట, తెలుగులో ఎ. ఎం. రాజా, సుశీల ఎంతో మనోహరంగా పాడిన అందాలు చిందు సీమలో, అన్న పాటకి ఏ మాత్రం తీసిపోదు.

    ఈ పాట తెలుగులో పాడినవారు జిక్కి గదా? ఒక్క సారి సరి చూస్తారని విన్నపం.
    విధేయుడు,
    సిద్దినేని భావ నారాయణ

  5. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/12/2013 9:30 am

    ప్రకాశ రావు గారు:

    మీరు చెప్పిన తరవాత ‘కాదలిక్క నేరమిల్లై’లో వున్న నాళాం నాళాం తిరునాళాం అనే యుగళ గీతం విన్నాను. పాట బాగుంది కానీ, ‘వెన్నెల రేయి ఎంతో చలీ చలీ ‘ పాట స్థాయిలో లేదు. నాకు తెలుగు పాట నచ్చటానికి ఒక కారణం ఈ పాట ‘కళావతి ‘ అన్న హిందూస్తానీ రాగంలో స్వరపరచడమే. తెలుగు సినిమాల్లో అరుదుగా వినపడే రాగం కళావతి. ‘బుద్ధిమంతుడు ‘ సినిమాలో పాట ‘తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా” పాట మిశ్ర కళావతి రాగంలో ఉంటుంది (మధ్యమం కూడా వినిపిస్తుంది). ‘కర్ణ ‘ సినిమాలో బాలమురళి, జానకి పాడిన ‘ వసంత గాలికి వలపులు రేగ ‘ కళావతి రాగంలో స్వరపరచబడ్డ ఒక చక్కని సినిమా పాట.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  6. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Siddineni BhavaNarayana అభిప్రాయం:

    05/12/2013 6:55 am

    Sir,

    The link for చిలకా గోరింక కులికే పకా పకా is not working. I request the editor to see it that the snag is fixed.

    [Fixed. Please try again - Ed.]

  7. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి తః తః అభిప్రాయం:

    05/12/2013 3:25 am

    “అయినా అతను అలా జపిస్తూనే కూర్చున్నాడు. కొన్నాళ్ళకి రాముడు ప్రత్యక్షమై అతనికి మోక్షమిచ్చాడు.”

    అంటే ఈ వాల్మీకి రామయణం రాశాడని ఈ కథ చెప్పటం లేదు. ఈతను మరొక వాల్మీకేమో.

  8. సిరినివాస వృత్తము గురించి తః తః అభిప్రాయం:

    05/12/2013 3:09 am

    శ్రీ మోహన:
    ‘ [సస]/సామజవరగమన ‘ - 1, 10 అక్షరాలకీ, మళ్ళీ 13,21 అక్షరాలకీ యతులతో - లఘువుతో ముగిసే పాదాలు కలిగిన ఛందమవటానికి అవకాశం ఉందా?

    మిత్రుడు
    తః తః

  9. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి V S PRAKASA RAO అభిప్రాయం:

    05/12/2013 1:54 am

    లక్ష్మన్న గారూ,
    ‘కాదలిక్క నేరమిల్లై’లో వున్న నాళాం నాళాం తిరునాళాం అనే యుగళ గీతం స్థానం లో ప్రేమించి చూడు కోసం వెన్నెల రేయి ఎంతో చలీ చలీ అనే పాటని రికార్డ్ చేశారనుకుంటాను. (నేను ‘ప్రేమించి చూడు’ చూడలేక పోయాను కాబట్టి మోహన గారే నిర్ధారించాలి.) మాస్టర్ వేణు తెలుగు బాణీ తమిళ పాట బాణీ కన్నా శ్రావ్యంగా వుందని నా అభిప్రాయం.

  10. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి Srilakshmi అభిప్రాయం:

    05/11/2013 4:54 pm

    Excellent article on my uncle PBS. I was fortunate enough to have known about his greatness through my mother Smt. Mani Raghunath (youngest sister of PBS) but the magnitude of work in this article speaks volumes about the equal expertise that you have in the field of literature. Thanks for sharing such an informative article as a tribute to such a legend. Also thanks for sharing the tribute paid by my Mother in law Smt. Jaya Sastry who happens to be from the family of Devulapalli Krishna Sastry garu.

    Srilakshmi. C (Niece of Dr. P.B. Srinivos)

«కొత్త అభిప్రాయాలు 1 2 3 4 5 6 ... 752 పాత అభిప్రాయాలు»