ఈమాట » పాఠకుల అభిప్రాయాలు

Expand to right
Expand to left

పాఠకుల అభిప్రాయాలు


ఈ పదం(పదాలు) ఉన్న అభిప్రాయాలు చూపించండి

ఇప్పటిదాకా ఈమాట లో తెలియచేసిన అభిప్రాయాలు: 7511

«కొత్త అభిప్రాయాలు 1 2 3 4 5 ... 752 పాత అభిప్రాయాలు»

  1. కతికితే అతకదు గురించి smeraa అభిప్రాయం:

    05/14/2013 2:59 am

    కతికింది పిల్ల ఇంట్లొ కాదు కద??!!

  2. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    05/13/2013 6:19 pm

    భావనారాయణ గారు, నిర్మాతలు, దర్శకులు మాత్రమే కాదు, నాయకీనాయకులుగా నటించే నటులు కూడ ఈ (దు)స్థితికి ఒక కారణమే. పిబిఎస్ వంటి వారు నటులకు, గాయకులకు మధ్య ఉండే గాత్రముల సాదృశ్యము ఒక భ్రమ (illusion) అని చెప్పినా, నాయకీ నాయకులు కొందరు గాయకులనే తమకు పాడడానికి ఎంపిక చేసికొన్నారు. ఒక 15 సంవత్సరాలు తెలుగులో ఒక గాయకుడిని మాత్రమే నాయకులు గాత్రదానమునకు ఎంపిక చేసికొనడము జరిగినది, ఒక గాయకి మాత్రమే నాయకురాళ్లకు గాత్రదానము చేయడము జరిగినది. మిగిలిన భాషాచిత్రాలలో కూడా ఈ పరిస్థితియే. హీందీలో కొందరు నాయకురాళ్లు తమ ఒప్పందములో కూడ ఫలానా గాయకి పాడాలని వ్రాసికొన్నారు. బహుశా దక్షిణభాషా చిత్రాలలో కూడ ఇది ఉండి ఉంటుంది. ఈ పరిస్థితిలో కొందరు దెబ్బ తిన్నారు. పిబిఎస్ స్థితి మెరుగే, వారికి కన్నడములో పెద్ద పీట ఉండినది. కాని జిక్కి, జమునారాణి, ఈశ్వరి, బెంగళూరు లతా, సుమిత్ర మున్నగువారు ప్రధాన నటులకు పాడలేకపోయారు. ఇప్పుడు కూడ ఈశ్వరి నాయకికి తరచుగా పాడి ఉంటే ఎలాగుండేదో అని నేను ఊహిస్తుంటాను. కనీసము వీరందరు చిత్రాలలో పాడారు. మంచి శారీరము ఉండి అవకాశము లేకుండా ఎందరు పాడలేకపోయారో అన్నది కూడ గమనార్హమే. విధేయుడు - మోహన

  3. పై గదిలో ప్రేమికుడు గురించి indrani Palaparthy అభిప్రాయం:

    05/13/2013 3:14 pm

    తః తః గారు:

    కొడవళ్ళ గారు నాకు తెలియదు.

    వారి వ్యాసాలు కూడా చాలా బాగుంటాయి.

    మీ కామెంట్ చూసే ఉంటారని అనుకుంటున్నాను.

    ఇంద్రాణి.

  4. సిరినివాస వృత్తము గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    05/13/2013 1:27 pm

    మాన్యులు శ్రీ మోహనరావు గారికి
    నమస్కృతులతో,

    “సామజవరగమన”లో “వ - ర - గ” లను రెండు యగణాలుగా మలిచి పద్యాన్ని మీరు రూపొందించిన సంవిధానం చిత్తవిస్తారకంగా అమరింది.

    1) “పాదమందు వయారాల”లో 2) “శయ్య యందు ప్రమోదాల”లో ఉన్న శ్లేషాశ్లేషానికి మీకు అభినందనలు!

    “విలాసాల వంచేవా మడచి” అన్నప్పుడూ “విలాసాలను పంచేవా మడచి (ఇముడ్చుకొని)” అన్న అర్థాంతరం రమణీయంగా ధ్వనిస్తున్నది!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  5. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Siddineni BhavaNarayana అభిప్రాయం:

    05/12/2013 11:57 pm

    విష్ణుభొట్ల లక్ష్మన్నగారూ, జెజ్జాల కృష్ణ మోహన రావు గారూ, పరుచూరి శ్రీనివా స్ గారూ,

    ‘చెట్టులెక్కగలవా, చిలకా గోరింక’. ఈ రెండు పాటలు చాలామందికి చెంచులక్ష్మి (1958) సినిమాలో ఘంటసాల పాడిన యుగళగీతాలు గానే తెలుసు. కానీ ఇవి మొదట పి. బి. శ్రీనివాస్ గొంతుకలోనే రికార్డు కాబడ్డాయి. కానీ తరువాత కారణాంతరాల వల్ల సినిమా ట్రాకులో ఘంటసాల గొంతు వాడుకోవడం జరిగింది.

    Production houses and financial executives are not exactly famous for fair play and fine ethics in their dealings. Creative spark and profit motive work at cross purposes. Investors are not pursuing their trade just to produce memorable pieces of artistic expression. The enterprise involving large investments and a huge potential for quick profits is not brimming with people of moral integrity or with men and women of finely defined ethical timbre. Caring for the fine sentiments of creative artistes such as musician s, lyricists and dialogue writers is not the sole priority of the leaders of this enterprise.

    The remark, attributed to R.K. Narayan, points to the tendency of film makers — they made a feature film out of my navel. I plan a fresh novel out of the film — it is not very rare that unscrupulous elements run the roost. They never hesitate to tinker with the fine artistic nuances of a creative work. Their parameters are driven not by creative values, but by the potential for mass appeal. The cruder the better. Those artistes who fail to shed their sensitive creative traits may be branded misfits. These are liable to be ignored, or summarily hounded out altogether. Deceit by production houses as recourse in creative and financial dealings involving artistes is, though rare, is said to be fairly prevalent.

    Rarely, creative genius is tolerated as long as its application is commercially viable. Originality attracts animosity and is vulnerable to be termed to have an elitist approach. Once your marketing potential starts to decrease your talent fails to attract recognition. Devulapalli and Saluri stand out as rare examples. But others like Jikki and A.M.Raja, despite having endowed with exceptional brilliance of melodic genius are not that lucky. Being fastidious is tantamount to being petulant.

    A combination of substantial genius and immense good luck only may save an artiste from being put to unceremonious interference.

    What I read/ heard made me believe that these two songs, both being duets, had been originally recorded with P.G.krishnaveni [Jikki] and Ghantasala and were retained in the feature film. Later the same songs were recorded again, this time by the gramophone company that bought the marketing rights of the audio sales. The reasons cited for getting the two songs recorded again were exigencies of copy right and royalty sharing. Both the two original songs in Chenculakshmi had been rendered by Ghantasala and Jikki. The information giving this miscellany is silent as to the identity of the female voice participating in the second version along with P B Sreenivas.

    This version is more plausible as the PB Sreeenivas version has a different female voice from the one we hear in the film. To my untrained ear, its instrument selection in orchestral scheme sounds slightly deviated from that of the version used in the film. (I request the writers to throw some more light on these facets, especially , as to the name/names of the female voice/voices.)

    The case with the song “Ooru maarinaa uniki maarunaa” was different. The solo had been first recorded in the voice of P.B Sreenivas with intention of using in the film. But the same song was replaced by a version sung later by Ghantasala. Here you cannot be sure if either of the singers had an inkling of the intention of the production house in advance.

    Regards.
    Yours faithfully,

    Siddineni Bhava Narayana

  6. నాకు నచ్చిన పద్యం: వసంత కుసుమ వికాసం గురించి indrani Palaparthy అభిప్రాయం:

    05/12/2013 8:49 pm

    పద్యం చాలా చాలా బాగుందండి.

    పాలపర్తి ఇంద్రాణి.

  7. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/12/2013 6:06 pm

    ఆనంద్ గారు:
    మీరు చెప్పిందే కరెక్టు!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  8. సిరినివాస వృత్తము గురించి తః తః అభిప్రాయం:

    05/12/2013 3:53 pm

    శ్రీ మోహన: చక్కని మనసుతో, ఒక పాటలా నడుస్తున్న పద్యంతో మీరు ఇచ్చిన వివరణకు ధన్యవాదాలు. దీన్ని ‘హిందోళ’ వృత్తము అనడం సబబుగా ఉంటుందా. అప్పుడు సంగీత సాహిత్యాలలో హిందోళ రాగమూ
    హిందోళ వృత్తమూ ఉన్న ఒక సందర్భం ఏర్పడుతుంది.

    మిత్రుడు
    తః తః

    సామాన్యముగా ఉపజాతులలో అన్ని పాదములు స్వతంత్రముగా నిలిచి ఉంటాయి.” ఈ విషయం గురించి మనం ఇంతకుముందొకసారి ముచ్చటించుకోవటం జరిగింది.

  9. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    05/12/2013 3:33 pm

    తెలుగులో ఎ. ఎం. రాజా, సుశీల ఎంతో మనోహరంగా పాడిన అందాలు చిందు సీమలో, అన్న పాటకి ఏ మాత్రం తీసిపోదు.

    మీరు చెప్పినది నిజమే. ఇది ఏ ఎం రాజా జిక్కీలు పాడిన పాట. నిజముగా ఈ పాటలో ఝనక్ ఝనక్ పాయల్ బాజే చిత్రములో లతా హేమంత్ కుమారులు పాడిన నైన్ సొ నైన్ నహి మిలాఓ పాట ఛాయలు ఉన్నాయి.
    విధేయుడు - మోహన

  10. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి velchEru naaraayaNa raavu అభిప్రాయం:

    05/12/2013 2:45 pm

    నేను కథ కుదించి చెప్పడంలో పొరపాటున వొదిలేశాను, కాని రాముడు ప్రత్యక్షమై ” నీ భక్తికి మెచ్చితి. మచ్చరితంబు భవ్యంబగు కావ్యంబుగా నొనరింపుమని యానతిచ్చి చనియె.” అని రఘునాథ నాయకుడు రాసిన వాల్మీకి చరిత్రము లో వుంది. నావ్యాసాన్ని సూక్ష్మదృష్టితో చదివినందుకు తః తః గారికి కృతజ్ఞతలు. — నారా

«కొత్త అభిప్రాయాలు 1 2 3 4 5 ... 752 పాత అభిప్రాయాలు»