ఈమాట కొత్త వేషం
రచన : పద్మ ఇంద్రగంటిఇంటర్నెట్ లో సమాచార విప్లవం మొదలై దాదాపు దశాబ్దం కావస్తోంది. ఈ పదేళ్ళలో, తెలుగు వెబ్‌సైట్ల రాశి పెరిగినా వాటి వాసి ఏ మాత్రం పెరగలేదు. కొన్ని వ్యక్తిగతమైన బ్లాగులు, వికీపీడియా మినహాయిస్తే, మిగిలిన దిన, వార, మాస పత్రికల వెబ్‌సైట్లు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫాంట్ ని వాడుతూ, ఒకదానికి మరొకదానికి సంబంధం లేకుండా, చిన్న చిన్న సమాచార ద్వీపాల్లా ఉన్నాయి. పది పేజీలకన్నా ఎక్కువ పేజీలు ఉన్న ఏ వెబ్‌సైట్ కైనా ముఖ్యంగా కావలసిన రెండు సౌకర్యాలు:
- వెబ్‌సైట్ లో వెతకగలిగే సౌకర్యం (ఇది అన్ని రకాల వెబ్‌సైట్లకి ప్రాణం లాంటిది.)
- పాత సంచికలు చదవగలిగే అవకాశం. ఇది పత్రికల (periodicals) లాంటి తరచుగా మారే సమాచారం ఉన్న వెబ్‌సైట్లకి అత్యంత అవసరం.
ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ద్విభాషా వెబ్‌సైట్లు అనే బండి గతికి యూనికోడూ, ప్రామాణికమైన పద్ధతుల ఉపయోగం రెండూ రెండు చక్రాల్లాంటివని మా ప్రగాఢ విశ్వాసం. ఈ రెండిటిలో ఏది ఉపయోగించకపోయినా బండి నడక కుంటుబడుతుంది.
ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఏ తెలుగు వెబ్‌సైట్‌కీ పూర్తిస్థాయి search సౌకర్యం లేదు. రక రకాల ఫాంట్లు వాడడం వల్ల గూగుల్ ద్వారా కూడా search చేసే అవకాశం లేదు. ఫాంట్ల సమస్యని పరిష్కరించడానికే యూనికోడ్ ఏర్పడింది.
ప్రామాణికమైన పద్ధతులని (standards based web design) ఉపయోగించి వెబ్‌సైట్‌ని రూపొందించక పోవడం వల్ల file size విపరీతంగా పెరిగిపోయి చాలా వెబ్‌సైట్లు పాతసంచికలని అందించలేకపోతున్నాయి. ప్రామాణికమైన పద్ధతులు అంటే W3C నిర్దేశించినట్లు XHTML ని వాడి, వెబ్‌సైట్లో సమాచారాన్నీ (content), అలంకరణ పద్ధతులని(presentation– ఫాంట్లు, రంగులు వగైరా)ని విడి విడిగా వేర్వేరు files లో ఉంచడం. వెబ్‌సైట్ అలంకరణ పద్ధతులని సూచించే files నే stylesheets అంటారు. stylesheets ఉపయోగించడం వల్ల వెబ్‌సైట్ లోని అన్ని పేజీలని ఒకే విధంగా తయారు చేయచ్చు. stylesheets ని ఉపయోగించకపోతే, వెబ్‌సైట్‌లో అన్ని పేజీలు ఒకే విధంగా ఉండడానికి ప్రతి పేజీలోనూ అలంకరణ పద్ధతులని మళ్ళీ మళ్ళీ సూచించవలసి వస్తుంది, తద్వారా file size పెరిగిపోతుంది. XHTML + stylesheets ని వాడి వెబ్‌సైట్ రూపొందించడం గత 5-6 ఏళ్లుగా అన్ని ముఖ్యమైన ఇంగ్లీషు వెబ్‌సైట్లలో జరుగుతున్నదే.
ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ద్విభాషా వెబ్‌సైట్లు అనే బండి గతికి యూనికోడూ, ప్రామాణికమైన పద్ధతుల ఉపయోగం రెండూ రెండు చక్రాల్లాంటివని మా ప్రగాఢ విశ్వాసం. ఈ రెండిటిలో ఏది ఉపయోగించకపోయినా బండి నడక కుంటుబడుతుంది. ఈమాట లాంటి విలక్షణమైన పత్రికని సులభంగా నడిపించడానికి, పాఠకులకి మరిన్ని సదుపాయాలు కల్పించడానికీ ఇవి రెండు మరింత అవసరం. అదీకాక, అధునాతన సాంకేతిక వనరుల్నితెలుగు భాషకు ఉపయోగించడంలో మార్గదర్శకంగా ఉండాలన్నది ఈమాట లక్ష్యాలలో ఒకటి కాబట్టి 2005 నుండి ఈమాటని యూనికోడ్, stylesheets వాడుతూ ప్రచురించడం మొదలుపెట్టాము.
ఏ వెబ్‌సైట్ లో నైనా పేజీల సంఖ్య పెరిగిన కొద్దీ, డేటాబేస్ ద్వారా పని చేసే వెబ్ ప్రచురణా వ్యవస్థ (database backed web publishing platform) అవసరం పెరుగుతుంది. ఈ సంచిక నించీ ఈమాట సమాచారం నిర్వహించడానికి వర్డ్‌ప్రెస్ ని ఉపయోగించడం మొదలు పెట్టాము. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ లో సమాచారాన్ని అంతటిని వేర్వేరు ఫైల్స్ లో కాకుండా డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తుంది. వెబ్‌సైట్ అలంకరణ పద్ధతులన్నీ విడిగా మరొక ఫైల్ లో ఉంచుతుంది. ఇందువల్ల సమాచారాన్ని (content), అలంకరణ పద్ధతులని (presentation) విడి విడిగా ఉంచడం సాధ్యమవుతుంది. (Strict separation of content and presentation). అందువల్ల వెబ్‌సైట్ లో సమాచారాన్ని ఏ విధంగా కావాలంటే ఆవిధంగా చూపించవచ్చు. ఉదాహరణకి అన్ని వ్యాసాల సూచిక, అన్ని కథల సూచిక, ఒక్కొక్క రచయిత రచనల సూచిక– ఇటువంటి పేజీలని సులభంగా తయారు చేయచ్చు. అందుకే ఇకనుంచి ఈమాట వినూత్నమైన సౌకర్యాలతో మీ ముందుకి వస్తోంది. అందులో కొన్ని:
- ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలని ని పూర్తిగా తెలుగులో కూడా వెతకగలిగే సౌకర్యం.
- ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.
- ఏ రచయిత రచనల నైనా ఒకే పేజీలో చదవగలిగే సౌకర్యం.
- మరికొన్ని ఉపయోగ్యతా పెంపుదలలు (usability enhancements)
- కంటికింపైన రంగులు, పాత సంచికల సూచిక, శీర్షికల సూచిక వగైరా, వగైరా..
యూనికోడ్ , XHTML+CSS ఉపయోగించే వెబ్‌సైట్లు కొత్త బ్రౌజర్లు, విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఉన్నవాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంటాయన్న అపవాదు ఒకటి ప్రచారంలో ఉంది. (యూనికోడ్ , XHTML+CSS తెలుగు వెబ్‌సైట్ల నిరాదరణకి నోచుకోవడానికి కూడా ఈ అపవాదే కారణమై ఉంటుంది.) ఈ అపవాదులో నిజం లేదు. Macintosh ఉపయోగించే పాఠకులకి యూనికోడ్ తెలుగు కనిపించకపోవడం ఈ అపవాదుకి బలం చేకూర్చింది. త్వరలో, నాగార్జున వెన్న రూపొందించిన “పద్మ” లాంటి client side పరికరాలు ఈమాటని Macintosh పాఠకుల ముందుకి తెస్తాయి. (అంతవరకూ ఈమాట మే 2006 సంచిక PDF లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు). ఏ బ్రౌజర్ లోనైనా (గ్రాఫిక్స్ సౌకర్యం లేని బ్రౌజర్‌లో కూడా)ఈమాట చదవగలిగేలా చేయలన్నది మా ఆశయం. ఈ ఆశయ సాధనలో భాగంగా కొన్ని server side పనిముట్లను కూడా పరిశీలిస్తున్నాము.
ఇంకా 1998 నుండీ ప్రచురించిన పాత సంచికలన్నింటినీ యూనికోడ్ లోకి మార్చి ఆ సంచికల్లోని రచనలని కూడా వెతకగలిగే సౌకర్యం కల్పించడానికి ముమ్మరంగా కృషిచేస్తున్నాము. మా ప్రయత్నాలని సహృదయతతో అర్థం చేసుకొని ప్రోత్సహిస్తున్న పాఠకులకు , రచయితలకు మా కృతజ్ఞతలు. ఈమాటకు మేము చేస్తున్న మార్పులపై మీ అభిప్రాయాలను, సూచనలని సాదరంగా అహ్వానిస్తున్నాం. మీకెదురయ్యే సాంకేతిక పరమైన ఇబ్బందుల గురించి కూడా మాకు రాస్తే మీ సమస్యలను పరిష్కరించడానికి మా చేతనైన సహాయం చెయ్యడానికి ప్రయత్నించగలం.
చంద్రశేఖర్ వల్లభనేని అభిప్రాయం:
May 1, 2006 10:36 pm
ఈ బ్లాగు Idea బాగుంది.
Wordpress ను పూర్తిగా తెలుగులోకి అనువదించినట్లు అనిపిస్తోంది.
తెలుగు Posting/Commenting కు ఏదన్నా Plugin create చేసారా?
మురళి నందుల అభిప్రాయం:
May 2, 2006 5:50 am
ఈమాట క్రొత్తవేషం అద్భుతంగా ఉంది. సురేశ్, పద్మగార్లకు ప్రత్యేక అభినందనలు.
నచకి అభిప్రాయం:
May 2, 2006 8:46 am
తొలితరం తెలుగు వెబ్-పత్రిక అయిన “ఈమాట” ఆ తరంలోనే ఆగిపోకుండా నవ్యతకు పెద్దపీట వేస్తూ సాగుతూండటం ఆనందదాయకం! మరిన్ని హంగులనూ త్వరలోనే సాధించుకుంటుందని నా ఆశ.
అక్కిరాజు భట్టిప్రోలు అభిప్రాయం:
May 2, 2006 10:06 am
కొత్త వేషం చాలా బాగుంది. NYTimes, CNN లాంటి సైట్లతో పోల్చతగినట్టు గా ఉంది. మీ శ్రమ వృథా పోలేదు, పోదు.
ఏ వ్యాసం కామెంట్లు ఆ వ్యాసం కిందే ఇవ్వటం హాయిగా ఉంది. అదే సందర్భంలో, మొత్తం అన్ని వ్యాసాల, కథల, కవితల కామెంట్లూ చదివేశేయాలానే నాలాంటి దురాశా పరులకి కొంత కష్టమవుతోంది. బోలెడు క్లిక్కులు కొడితేగానీ ఏమన్నా కొత్త కామెంట్లు వచ్చాయో లేదో తెలియకుండా ఉంది. మరో పేజీ, “అన్ని కామెంటులూ” అని ఒకటి తయారు చేసి, దాంట్లో అన్నింటినీ చూప గలరేమో ప్రయత్నించండి. వెనకాల డేటాబేస ఉందన్నారు కాబట్టి సాధ్యమవాలి.
అక్కిరాజు భట్టిప్రోలు
పద్మ అభిప్రాయం:
May 2, 2006 10:19 pm
అక్కిరాజు గారు, నచకి గారు, మురళి గారు,
thanks for the positive feedback and for making my day. :-)
ఇది చాలా మంచి సూచన. ఇప్పుడు మీరు ఈమాట లో కొత్తగా వచ్చిన పది అభిప్రాయాలని చదవగలరు. త్వరలో ఈ పేజీని sidebar లో కూడా లింక్ చేస్తాను. మరొక సులువైన మార్గం: ఈమాట లో కొత్తగా వచ్చిన పది అభిప్రాయాలని RSS ద్వారా సిండికేట్ చేస్తున్నాము. మీకు సేజ్, లేదా మరేదైనా Feed aggregator ఉంటే కొత్త అభిప్రాయాల RSS Feed కి subscribe చెయ్యచ్చు.
సురేశ్ కొలిచాల అభిప్రాయం:
May 3, 2006 2:24 am
అభిప్రాయాలు తెలుగులో రాయటానికి ఈమాట ఇంతకు ముందు పాత సంచికలలో వాడిన మీ మాట javascript నే తిరిగి వాడుకున్నాము. ఈ స్క్రిప్ట్ ము రళి నందుల గారు రాసిన తెలుగు టూల్‌బార్ స్క్రిప్ట్ ఆధారంగా నిర్మించబడ్డది. ఆయన స్క్రిప్ట్ మార్చి, వాడుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు పత్రికా ముఖంగా మురళి నందుల గారికి మరో సారి కృతజ్ఞతలు. - సురేశ్.
Subrahmanyam Mula అభిప్రాయం:
May 3, 2006 2:46 am
ఈమాట కొత్త వేషం చాలా బావుంది. సురేష్ , పద్మ గార్లకు కృతజ్ఞతలు.
JUBV Prasad అభిప్రాయం:
May 3, 2006 6:49 am
సురేష్ గారూ,
ఈ “ఈమాట” పత్రిక కొత్త గెటప్ చాలా బాగుంది. మీరు చాలా శ్రమ పడి వుంటారు ఈ పనికి. నాకయితే చాలా నచ్చింది. అయితే రెండు విషయాలు: 1. కధ గానీ, వ్యాసం గానీ scroll చేస్తుంటే, చాలా slow గా వుంది కదలిక. 2. ఇక్కడ అభిప్రాయం రాస్తున్నప్పుడు, ఒక పదం type చేసి, దాన్ని correct చెయ్యడానికి ప్రయత్నిస్తే, అది వేరేగా చూపిస్తోంది. ఈ రెండూ చిన్న విషయాలే అనుకోండీ. మొత్తానికి బాగుంది.
ప్రసాద్
Kiran Kumar Chava అభిప్రాయం:
May 3, 2006 2:59 pm
I guess this slowness is due to our browsers only, not due to this eemaata software.
Still our browsers scroll unicode text very slowly.
But Will addming more new lines, will adding less lines for paragraph might solve the scroll slowness issues.
suresh అభిప్రాయం:
May 4, 2006 2:37 am
ప్రసాద్ గారు: 1) కిరణ్ గారు చెప్పినట్లు మైక్రోసాప్ట్ యూనికోడ్ సపోర్టుచేయటం కోసం తయారుచేసిన యూనిస్క్రైబ్ (Uniscribe) లైబ్రరీ ఈ స్లో కదలికకు కారణం కావచ్చు. మీ పీసీకి అదనంగా ఇంకొంత మెమొరినీ (RAM) జతచేస్తే యూనిస్క్రైబ్ శాంతించి మీ కంటికి కొంత ఊరటను, ఆహ్లాదాన్ని కలిగించవచ్చు. 2) తెలుగులో టైపు చేస్తున్నప్పడు మీకు ఎదురైన సమస్యల గురించి ఇంకొంత వివరంగా నాకు రాస్తే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. -సురేశ్.
granthi ramaraju అభిప్రాయం:
May 4, 2006 5:39 am
Sir,
Eematta new look is wonderful. Unfortunately, we are not able to see unicode telugu script on our browser (firefox). I also couldnot find ‘pdf ” version of May 2006 issue. Could you please provide the “pdf” version so that some of us, the lesser souls, have oppurtunity to enjoy eemaata?
Regards.
GRR
suresh అభిప్రాయం:
May 4, 2006 6:43 am
Dear Sir,
The PDF version has been available for 2 days. Click on the “PDF Version” on the front page or directly go to:
http://www.eemaata.com/issue43/directory.pdf
On reading unicode text, did you try to use Internet Explorer to see if you can read the unicode text? For reading it in Firefox, you may have to enable Complex text support for indic scripts. The following site has the instructions:
http://en.wikipedia.org/wiki/Wikipedia:Enabling_complex_text_support_for_Indic_scripts
If you can share the info about the operating system on your computer and the browser version, we may be able to help you enable unicode on your machine.
Thanks,
Suresh.
తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
May 4, 2006 11:43 pm
మంచి ప్రయత్నం.బ్రహ్మాండంగా ఉంది పత్రిక. ఇదంతా మీ కృషి,పట్టుదల వల్లే సాధ్య మయింది. మీకు నా జోతలు !!
తమ్మినేని యదుకుల భూషణ్.
yoga అభిప్రాయం:
May 5, 2006 5:21 pm
ఈ కొత్త రూపం అత్యంత అద్భుతం గా ఉంది. సూపరు!
yoga అభిప్రాయం:
May 5, 2006 5:25 pm
దయ చేసి ఈ మెయిలు అడగద్దండీ. స్పాం మెయిలు ఎక్కువయిపోతుంది. బుధ్ధిలేని anonymous కామెంట్సు తగ్గించడానికి “log on” సౌకర్యం పెడితే మంచిది..
పద్మ అభిప్రాయం:
May 6, 2006 7:44 pm
ఈమాట సంపాదక వర్గం మీ ఈ మెయిలు ని వేరే ఎవ్వరికీ ఇవ్వదనీ, ఈమాట వల్ల మీకు స్పాం/లేదా ఇతర unsolicited మెయిలు రాదనీ పూర్తి నమ్మకంతో చెప్పగలను.
కొన్ని అరుదైన సందర్భాల్లో, ఈమాట పాఠకులని తమ అభిప్రాయం విషయమై సంప్రదించవలసి వస్తుంది. పాఠకులు “ఉత్తుత్తి ఈమెయిలు” ఉపయోగించినప్పుడు సంప్రదించే వీలు లేక ఆ అభిప్రాయం తిరస్కరించబడే అవకాశం ఉంది.
logon వల్ల పాఠకులు ఇంకొక అదనపు పాస్ వర్డ్ ని గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది కదా! ఈ అసౌకర్యం వల్ల పాఠకులు తమ అభిప్రాయం తెలియచేయకుండానే తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ, comment spam ఎక్కువగా ఉంటే ఈమాట లో login గురించి పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటి దాకా ఈమాటలో వచ్చిన అభిప్రాయాలు స్థాయిలో ఈమాట రచనలకి సరితూగగలిగేలా ఉన్నాయి. “..ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు, ఒప్పు తప్పొరయు రసజ్ఞుల..” కన్నా ఏ పత్రిక కోరేదేముంది? :-)
కిరణ్ కుమార్ చావా అభిప్రాయం:
May 9, 2006 1:18 am
స్పాము తగ్గించడానికి వర్డ ప్రెస్సు లో akismet plugin is damn useful.
కొద్దిగా సిగ్గులేకుండా అడుగుతున్నాను,
మీ ఈ కామెంటు ప్లగ్గిన్ను మాక్కూడా అందుబాటులో తేగలుగుతారా? తద్వారా మేము కూడా www.oremuna.com/blog నందు దీనిను ఉంచగలుగుతాము :)
Kiran Kumar Chava అభిప్రాయం:
May 9, 2006 8:01 am
అన్నట్లూ
ఈ పాఠకుల పేజీకి
ఓ ఆర్ ఆర్ యస్ ఫీడు ఇస్తే బాగుంటుంది కదా
ప్రతీసారీ చూసుకునే బాద పోతుంది
Rohini Kumar అభిప్రాయం:
May 9, 2006 8:13 am
చాలా బాగుంది. అన్నిటి కంటే ఈ feedback form చాలా నచ్చింది. వ్రాయటానికి చాలా సులువు గా ఉన్నధి. :)
granthi ramaraju అభిప్రాయం:
May 9, 2006 11:04 pm
Dear Suresh Garu,
Thank you very much for your kind reply and suggestions. I will try to follow the links. I am also trying to see Eemaata in IE.
Regarding my system, I use windows XP and use firefox as the browser.
Finally, I would like to know whether the PDF versions of articles (by VNR) on Pattabhi are available?
Congrats to you and the editorial team for your “sewa ” to Telugu language and culture.
Bhavadeeyudu,
Raju
telugu అభిప్రాయం:
May 10, 2006 10:05 am
మీ కృషి అభినందనీయం. పత్రిక చూడ ముచ్చటగా ఉంది. కాకపోతే ఈ మాట కొత్త వేషం అనే కన్నా కొత్త రూపు అంటే బావుండచ్చు.
పద్మ అభిప్రాయం:
May 10, 2006 4:18 pm
కిరణ్ గారూ, ఇంతకు ముందు తెలియచేసిన అభిప్రాయాల RSS feed ఎలాగూ ఉండనే ఉంది కదా?
మురళీకృష్ణ అభిప్రాయం:
May 11, 2006 3:22 am
బాలేదని కామెంట్ చేయడానికేమీ లేదిక్కడ. అంత బాగుంది మరి … చిన్నప్పుడు వేసవి సెలవలకి మా పల్లెటూరు వెలితే, అక్కడ మా అక్కయ్యలు ఆవకాయ పెట్టి, దాన్ని జాడీల్లోకి సర్దేసిన తర్వాత మిగిలిన దాంట్లో వేడి వేడి అన్నం, కమ్మని నెయ్యి కలిపి ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. తలచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్ళూరుతాయి. ఇదీ అంతే బాగుంది.
కాకపోతే అప్పుడు ముద్ద పప్పు కూడా వుంటే ఇంకెంత బాగుండేదో అనుకునే వాళ్ళం. ఇక్కడా ఓ నాల్గు గీతలుంటే (బొమ్మలు) ఇంకెంత బాగుండేదో !! ప్చ్ !!
vtp అభిప్రాయం:
May 31, 2006 5:42 pm
అడిగే వాళ్ళ కోరికలకు అంతూ పొంతూ లేదనుకోండి. కాని ఒక చిన్న విన్నపం.
మీ గ్రంథాలయంలోని పాత పుస్తకాల లింకులు పునరుద్ధరించవలసిందిగా మనవి. శిలాలోలిత సగంలో చదివి ఆపేశాను. ఇప్పుడు లింకు కనిపించట్లేదు.
పద్మ అభిప్రాయం:
May 31, 2006 6:07 pm
శిలాలోలిత, ఇంకా ఇతర పుస్తకాలన్నీ కొత్త format లోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. మీ సూచనకి ధన్యవాదాలు.
Nagaraja అభిప్రాయం:
June 24, 2006 7:08 am
సురేష్ గారికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఎంతో దీక్షతో మాత్రమే ఇటువంటివి సాధించగలము అని నా అభిప్రాయము.
అదే విధంగా మీరు తయారు చేసిన టెక్నాలజీ ఇతరులకు అందుబాటులో వుంచడము వలన మిగతా వారికి కూడా తెలుగు సైట్లు తయారు చేయుటకు ప్రోత్సాహము కలిగించినట్లవును. ఈ విషయమై మీరు ఆలోచించగలరు. అందుకు కావలసిన సహాయము అందచేయడానికి నేను సిద్ధముగా వున్నాను.
Malathi అభిప్రాయం:
July 4, 2006 6:49 am
After opening the file, the screen keeps moving on, slightly different from the problem JUBV Prasad mentioned earlier. I could not stop the page to read. This does not happen with other Telugu sites I have visited.
I am also curious about unicode. I am using the Unicode, which came with Windows (called Gautami). Your Unicode seem to have a different keyboard.
I tried your link to Aksharamala, and it returned error msg.
Otherwise, the site is wonderful. I am particularly glad to see the editorial by Veluri Venkateswara Rao. Very timely appeal.
Appreciate your help.
Vinay అభిప్రాయం:
July 20, 2006 1:24 pm
ఈమాట చాలా బావుంది
మీ కృషి అభినందనీయము
గుళ్లపూడి శ్రీనివాసకుమార్ అభిప్రాయం:
August 10, 2006 5:22 am
కొత్త వేషం ముచ్చటగా ఉంది. మీ బృందం అభినందనీయమైన సేవలు చేస్తోంది. ఈ సందర్భంగా నేనొక విషయాన్ని మీతో పంచుకుందామనుకుంటున్నాను.
తెలుగు యునికోడ్ ఫాంట్ ఉపయోగించి క్ చ్ ట్ త్ ప్ గ్ జ్ డ్ ద్ బ్ వంటి హలంతాక్షరాలను టైప్ చేసేప్పుడు ఇక్కడ తెలిపిన ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు… కంప్యూటర్‌కు… హార్డ్వేర్లో… మానిటర్తో… మెషీన్‌పై… అని మీరు టైప్ చెయ్యాలనుకుంటే… హలంతాక్షరాలు, వాటితోపాటు టైప్ చేసిన అక్షరాలు కలిసిపోయి కంప్యూటర్కు… హార్డ్వేర్లో… మానిటర్తో… మెషీన్పై ఇలా వస్తాయి. దీంతో ఏం చెయ్యాలో అర్థంకాక చాలా మంది కంప్యూటర్ కు… హార్డ్ వేర్ లో… మానిటర్ తో… మెషీన్ పై… ఇలా హలంతాక్షరానికి, దాని వెంటనే టైప్ చెయ్యాల్సిన అక్షరానికి మధ్య ఒక ఖాళీ ఉంచి టైప్ చేస్తున్నారు. దీనికి ఓ పరిష్కారం ఉంది. వర్డ్ లేదా నోట్‌ప్యాడ్‌లో మీరు ఇలా చేసుకోవచ్చు.
హలంతాక్షరం టైప్ చెయ్యగానే దాని పక్కనే కర్సర్ ఉంచి Ctrl+Shift+2 కీలు కలిపి నొక్కండి. ఆ తర్వాత మీకు కావలసిన అక్షరాలను పక్కనే టైప్ చేసుకున్నప్పటికీ అవి హలంతాక్షరాలతో పైన చూపిన విధంగా కలిసిపోవు. Ctrl+Shift+2 కీల ద్వారా హలంతాక్షరం పక్కనే నాన్-జాయినర్ (ఇది కనిపించదు) చేర్చబడి, ఈ సమస్యను నివారిస్తుంది.
ఇదే సమస్యకు మౌస్ ఉపయోగించి, నోట్‌ప్యాడ్‌లో కూడా పరిష్కారం పొందవచ్చు. హలంతాక్షరం పక్కనే మీ కర్సర్ ఉంచి, మౌస్ రైట్ క్లిక్ చెయ్యండి. అక్కడ కనిపించే మెనూలోంచి “INSERT UNICODE CONTROL CHARACTER” పైన మౌస్‌ను పాయింట్ చేస్తే… ఉప మెనూ తెరుచుకుంటుంది. ఇందులో “ZWNJ - Zero Width non-joiner” పైన క్లిక్ చెయ్యండి. దీంతో హలంతాక్షరం పక్కన నాన్-జాయినర్ (కనిపించదు) చేర్చబడి, ఈ సమస్యను నివారిస్తుంది. తర్వాత ఈ టెక్ట్స్‌ను వర్డ్, ఎక్సెల్ లేదా మీకు కావలసిన దానిలోకి కాపీ చేసుకోవచ్చు.
ఈమాట ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నది నా అభిమతం.
ఇదే పరిష్కారం కన్నడ భాషకూ వర్తిస్తుంది.
Rohiniprasad అభిప్రాయం:
September 6, 2006 1:54 pm
అమెరికాలోనూ, మన దేశానికి దూరంగా ఇతర ప్రాంతాల్లోనూ ఉంటున్న తెలుగువారు తమ సంస్కృతిని మరిచిపోకుండా ఉండేందుకూ, తమ పిల్లలకు దాన్ని గురించి పరిచయం చేసేందుకూ తంటాలు పడటం మామూలే. ఇందులో భాగంగా సంగీతం, నాట్యం మొదలైన కళలనూ, తెలుగు భాషనూ నేర్పేందుకు చిన్నా పెద్దా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించకుండా ఇందులోని సాధక బాధకాల గురించీ, నేర్పేవాళ్ళ, నేర్చుకునేవాళ్ళ అనుభవాల గురించీ వ్యాసాలు ఈమాటలో వేస్తే నలుగురికీ ఉపయోగకరంగా ఉంటుంది. అస్తమానం సినిమా నటులని పిలిపించి వారితో అవస్థలు పడేకన్నా స్థానికంగా జరిపే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయని నా ఉద్దేశం. ఇటువంటి రచనలను ఆహ్వానిస్తూ సంపాదక వర్గం ప్రకటన చేస్తే బావుంటుందేమో. అటువంటి రచయితల గురించి తెలిస్తే వారిని వ్యాసాల కోసం సంప్రదించటం కూడా మంచిదే.
దిలీపు మిరియాల అభిప్రాయం:
September 13, 2006 12:24 pm
ఇది వరకు గ్రంధాలయం లో పుస్తకాలకు లింకు వుండేది . అది ఇప్పుడు కనిపించడం లేదు. దాన్ని మళ్ళీ వుంచితే బాగుంతుంది.
Dr.Darla VenkaeswaraRao అభిప్రాయం:
October 11, 2006 8:16 pm
ఈమాట ద్వారా తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈమధ్య కంప్యూటర్ లో తెలుగు భాష గురించి ఒక సదస్సు నిర్వహిస్తున్నట్లు చదివాను. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుంది. విశ్వవిద్యాలయాలు చేయవలసిన కృషిని మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
డా.దార్ల వెంకటేశ్వరరావు.
తెలుగు అధ్యాపకుడు,
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు.
Kameswararao అభిప్రాయం:
November 2, 2006 5:02 pm
మొదటి 30 సంచికలు P D F గా download చేయబడ్డాయి.
అక్కడినుండి మిగిలిన సంచికలు కూడా PDF గా Download చేసుకునే అవకాశమ కలిపించండి.
మీ
కమేశ్వరరావు.
PATHAKUDU అభిప్రాయం:
November 8, 2006 11:08 am
జూలై 2004 సంచిక చూడలేక పోతున్నాము. దయచేసి ఈ సమస్యని పరిష్కరించండి.
Parameswar అభిప్రాయం:
November 17, 2006 4:51 am
“ఈ మాట” లొ ఇంత సంకిళీతముగ పొందుపరఛిన మీఅందరికి నాదనవాదములు
chavakiran అభిప్రాయం:
November 19, 2006 9:27 pm
సంకిళీతముగ అనగా నేమి?
jabalimuni అభిప్రాయం:
July 2, 2007 11:11 pm
అన్ని సంచికలు PDF files గా download చేసుకోగలిగేటట్లు అవకాశము కల్పించండి
మీ కృషి శ్లాఘనీయము.
జాబాలిముని
Vanguri Chitten Raju అభిప్రాయం:
July 3, 2007 9:27 am
ఈ యూనికోడులూ, మంచం కోడులూ నాకు బొత్తిగా తెలియవు కానీ, “ఈమాట” కొత్త వేషం బహు ముచ్చటగా ఉంది. ఇప్పుడు అన్నీ చదవడం సులభంగా ఉంది. అఫ్కోర్సు, చదివినవన్నీ అర్థం అయ్యాయి అని అబధ్ధం చెప్పను కాక చెప్పను.
సంపాదకులకీ, నిర్వాహకులకీ ధన్యవాదాలు, అభినందనలు.
భవదీయుడు
వంగూరి చిట్టెన్ రాజు వ్రాలు
chavakiran అభిప్రాయం:
July 5, 2007 10:10 pm
యూనీకోడూ — మంచం కోడూ
బాగుంది
ట్రేడు మార్కులు ఏమీ లేకపోతే మేము అప్పుడప్పుడూ మా సంభాషణల్లో ఉపయోగించుకుంటాము.
ఇహపోతే మీరు యూనీకోడును అనుభవించాలంటే మీకు యూనీకోడు గురించి తెలియవలసిన అవసరం లేదు:) సంగీతం అనుభచించాలంటే సంగీతం తెలియక్కర్లేదంటారట కదా!
Dr. Uma Mannem అభిప్రాయం:
November 9, 2007 6:14 am
తెలుగువాళ్ళు తెలుగు భాషతల్లికి చేస్తున్న సేవలకి నాకు చాలా సంతోషము గా ఉన్నది. నేను ఈమాట పత్రిక ను 6 సంవత్సరాలుగ చదువుతున్నాను. యూనికోడు ప్రవేశపెట్టినాక పత్రిక యొక్క ఉపయొగకారితనము చాలా బాగుంది.
Vasu Bojja అభిప్రాయం:
January 28, 2008 5:13 am
ఈమాట చాలా బాగుంది, కొత్త రూపులో. మీకు అభినందనలు. అసలు తెలుగు లొ వెబ్ సైటుని ఎలా నిర్మించాలో ఒక పాఠము తయారు చేసి పెట్టండి.
వందనములతొ,
వాసు.బొజ్జ
Vasu Bojja అభిప్రాయం:
January 31, 2008 10:58 pm
గూగుల్ వారి indic transliteration by Google labs ద్వార అందమయిన తెలుగు బాష కంప్యూటర్ తో టైపు చేయడం ఇప్పుడు ఎంతో సులభం అయింది.ఇది ఆన్ లైన్ ద్వార మాత్రమే పనిచేస్తుంది.ఒక్క తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళం వాళ్ళు కూడా వారి మాతృ బాషలో టైపు చేసుకోవచ్చు. మీకోసం లింక్ http://www.google.com/transliterate/indic/telugu
జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:
February 21, 2008 12:34 pm
సురేశ్ గారూ,
ఎప్పటి నించో ఈ రెండు మాటలూ రాద్దామనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు బద్దకం.
“ఈమాట రచయితలు” అని మీరు ప్రవేశ పెట్టిన సెక్షను చాలా బాగుంది. ఒక రచయితకి సంబంధించిన రచనలన్నీ, ఒకే చోట ఇవ్వడం చాలా అద్భుతంగా వుంది. రక రకాల లింకుల బదులు, ఒకే లింకు పంపొచ్చు ఎవరికన్నా. నాకు చాలా నచ్చింది ఈ సెక్షను ఆర్గనైజేషన్. అభివందనలు. ఇలా చేస్తామని మీరు ఎపుడో చాలా కాలం కిందట చెప్పినట్టు గుర్తు.
- ప్రసాద్
sasidhar pingali అభిప్రాయం:
April 4, 2008 7:56 pm
సాగి పోయెను నెచ్చలీ సార భరిత
వత్సరము లెన్నొ ఈరీతి వదలి నన్ను
ఒంటినై సాగ నిక మీద నోర్వ లేను
వేగ రమ్మోయి ప్రియతమా ! వేడుకొందు !
—
ఇటు వంటి కవితలు పద్యాలు ఇంకా కొన్ని వునాయి.
మాకూ మీ ఈమాట లొ పాలు పంచు కోవాలనుంది.
రచనలు పంపే విధానం తెలుపండి.
మీ ఫాక్సు నెంబరు కూడా తెలుప గలరు.
పింగళి శశిధర (జాబిల్లి)
హైదరాబాదు
Rohiniprasad అభిప్రాయం:
July 7, 2008 7:11 pm
సాహిత్యాన్నీ, సాంకేతిక నైపుణ్యాన్నీ విజయవంతంగా ఏకం చేసిన మొదటి ప్రయత్నం ‘ఈమాట‘ వారిదే.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు మాట్లాడడం, అర్థంచేసుకోవడం మాత్రమే చేతనైన తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వారి ‘నిరక్షరాస్యత’ మూలంగా తెలుగు సాహిత్యంతో వారి సంపర్కం నానాటికీ తగ్గిపోతోంది. దీనికి కళ్ళెం వెయ్యాలంటే “శ్రవణసాహిత్యం’ మంచి పద్ధతి.
ఈమాటలో ఆడియో బుక్స్ సదుపాయం కల్పించి, ఆ ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకుని సీడీలను ‘కాల్చుకోగలిగిన’ ఏర్పాటు ఉచితంగా లభ్యమైతే కొందరయినా (వారికి తెలుగు చదవడం వచ్చినా) కారులో వెళుతున్నప్పుడో, మరొకప్పుడో కథలూ, నవలలూ విని ఆనందించగలుగుతారు.
1958కు మునుపు చనిపోయిన రచయితలకు కాపీరైట్ ఉండదు కనక వారి సాహిత్యంతో మొదలుపెట్టవచ్చు. ఈ ప్రయత్నాల్లో ఆసక్తి ఉన్న ఫణి డొక్కా తదితరులు ముందుకొచ్చి, స్వచ్ఛందంగా ఇటువంటిది చేపడితే మంచి ఫలితాలు కలుగుతాయి. వీలును బట్టి స్త్రీ, పురుషుల కంఠాలతో తగుమాత్రం నాటకీయతతో పాత రచనలను అందించగలిగితే ‘ఈమాట‘ మరొక pioneering effort కు కారణం కాగలదు.
అన్నిటికన్నా ముఖ్యవిషయం ఇలాంటిది జరిగితే దాన్ని గురించిన ప్రకటనలు ఇంగ్లీషులో తక్కిన తెలుగు వెబ్ సైట్లలో రావాలి.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:
July 31, 2008 9:35 pm
పెద్దలకు ఒక విన్నపం. ఈమాటలో రచనలు, ఆ రచనలపై వ్యాఖ్యానాలు ఇలా పంపినవారికి ఆయా ఇమెయిల్ చిరునామాకు ఆ తర్వాతి స్పందనలు తెలియజేసే ప్రక్రియను ప్రారంభించ మనవి.
[రాజేంద్ర కుమార్ గారు: మీ సూచనకి కృతజ్ఞతలు. మేము రచనలని, వాటిపై వచ్చిన అభిప్రాయాలని ఎప్పటికప్పుడు పాఠకులకి ఈమెయిల్ (Server Push) చేయడం కన్నా, పాఠకులు వాటిని RSS Feed (ఈమాట రచనల ఫీడు, ఈమాట అభిప్రాయాల ఫీడు) ద్వారా తమకి వీలైనప్పుడు చదువుకోవడం (Client Pull) మెయిన్టెనెన్సు కారణాల దృష్ట్యా సులభం. (అంతే కాక, అభిప్రాయాలు రాసిన ప్రతివారి ఈమెయిలు అడ్రస్‌నీ validate చెయ్యడం సాధ్యం కాదు.) పాఠకుల సౌకర్యం కోసం అభిప్రాయాల ఫీడులో 25 అభిప్రాయాలు చూపిస్తున్నాము.
భవిష్యత్తులో మరికొంతమంది పాఠకులు కోరితే ఈ సూచనని పరిశీలించగలము. — పద్మ, ఈమాట సంపాదక వర్గం]
రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:
August 2, 2008 4:07 am
ధన్యవాదాలు పద్మ గారు :)
p n rao అభిప్రాయం:
August 5, 2008 3:40 am
మొదటి సారి ఈరోజు “ఈమాట” చూడగాగానే చాలా సంతోషం వేసింది యిన్ని రోజులు ఈమాట చూడకుండా అజ్ఞానంలో వున్నానా అని బాధ కూడా కలిగింది.
Koti అభిప్రాయం:
September 2, 2008 11:30 pm
ఎమని చెప్పను ఎన్నని చెప్పను
ఈ పత్రిక గురించి
ఎడారిలొ ఒయాసిస్సువనా,
కల్లోలిత కడలిలొ దొరికిన ఉటబావివనా
బాసటగా నిలిచిన నేస్తానివనా
e.bhaskaranaidu అభిప్రాయం:
November 15, 2008 9:05 pm
ఈ పత్రిక చాలబాగుంది. దీనికి ఇంకొన్నిమెరుగులు దిద్దితే ఇంకా ఎంత బాగుండేదో కదా అని అనిపిస్తుంది. మెరుగులు అంటే ప్రశ్నలు-జవాబులు, సాహిత్య పదబందాలు, లాంటివన్నమాట.
Shankar అభిప్రాయం:
March 28, 2009 8:17 pm
చాలా బాగుందండి…
Raman అభిప్రాయం:
July 25, 2010 11:01 am
మొదటి సారి చదువుతున్నా ఈ పత్రిక. గుడ్ వర్క్.
subbarao అభిప్రాయం:
November 15, 2011 7:22 pm
ఈకొత్త వేషము బాగున్నది.అయితే ప్రతి రచయితని నిరుత్సాహ పరచకుండగా వారి వారి రచనలను ప్రచురించి ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. ఆలోచించగోర్తాను.
ఇట్లు,
తమ మిత్రుదు,
సుబ్బారావు పోచిరాజు
Appaji Ambarisha Darbha అభిప్రాయం:
August 24, 2012 6:07 am
ఈమాటలో ఈ వ్యాఖ్యానం చూసి ఆశ్చర్యపోయాను. “Macintosh ఉపయోగించే పాఠకులకి యూనికోడ్ తెలుగు కనిపించకపోవడం ఈ అపవాదుకి బలం చేకూర్చింది.”. నేను ఈమాటని ఎప్పడినుంచో చదువుతున్నాను. నేను నా website లో తెలుగు Typing లింక్లో తెలుగు టైపు చేసుకోదలచిన వారికోసం 5 రకాల కీబోర్దులను వుంచడం జరిగింది. Inscript, varitype, sreelipi, DOE, Phonetic రకాలు. అలాగే రమణీయ అనే తెలుగు యూనికోడ్ ఫాంట్ వుంచడం జరిగింది. కావలసిన వారు వాడుకోవచ్చును.
గురునాథ రావు దిక్కల అభిప్రాయం:
February 10, 2013 2:18 am
ఈ మాట రూపము చాలా నచ్చింది. సాహిత్యానికి మీరు చేస్తున్న సేవ అభినందనీయము.