గుర్తుపట్టగలవు
రాలేనేమో చిన్నీ
రాలేనేమో మళ్ళీ
అయినా సరే
రాత్రి మాత్రం దీపం ఆర్పేయక
నా రాకను నీవు గుర్తించగలవు చిన్నీ
పరిమళ యామిని పరవశించి పాడుతుంది
రాత్రిపాట వినేందుకు కీచురాయి సద్దుచేయదు
తరుశాఖల్లో మిణుగుర్లు ఒక్కసారి వెలిగిపోతాయి
నిదురిస్తున్న ఓ పక్షి కిలకిలమని పలవరిస్తుంది
రాలేనేమో చిన్నీ
రాలేనేమో మళ్ళీ
నా రాకను నీవు గుర్తించ గలవు చిన్నీ
నా నీడను సైతం
నీవు గుర్తుపట్టగలవు చిన్నీ..
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »