నేనే
భూమ్యాకర్షణలేని
శూన్యావరణం చేరి
భారరహిత స్థితిలో
బాసిపట్టు వేయగలను.
మోయలేని బరువుతో
మోకాలి నొప్పితో
మూలనున్న మంచమెక్కి
ముసుగు తన్ని పడుకొంటాను.
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »