ఈమాట » నీ ఆలోచనలు

Expand to right
Expand to left

నీ ఆలోచనలు

ఒక మధ్యాహ్నం

ఎండ

కనురెప్పలు కాల్చినట్టు

గుండ్రని నవ్వుల

గోళీలు

రాచుకున్నట్టు

ఎర్రని మెట్లపై

ఎపుడూ పాకే నీరు

పలక

పగుల గొట్టే బాలుడు

చెమటతో

తడిచిన రాత్రి

కొనగోటితో మీటే

కొసరు గాలి

కాగితం మీద

నూనె బొట్టు

చిందినట్టు

నీ ఆలోచనలు.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a