తప్పటడుగు
చదరంగం బల్ల
పరచుకొన్న నలుపూ తెలుపు గళ్లు
పెనవేసుకొన్న రేబవళ్లు
ఆట మొదలైన తర్వాత
కదపకూడని పావును కదిపి
నిలపకూడని గడిలో నిలిపితే
పావే కాదు
ఆటే వదులుకుంటావు.
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »