విడిపించు
పాడుబడిన బావి
తడి ఆరని నేల
అడుగు నున్నది తాబేలు
విడిపించు.
గడచిపోయింది పగలు
నడవనీదు నన్ను
తొడలు కొరికే తోడేలు
విడిపించు.
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »