ఈమాట » నిర్ణేతల వ్యాఖ్య - కథలు

Expand to right
Expand to left

నిర్ణేతల వ్యాఖ్య - కథలు

  1. చాలా కథలు స్పష్టత లేకుండా, పాత వస్తువులనే తీసుకుని వ్రాసినవి. స్పష్టత, seriousness, విశ్లేషణ లేవు.
  2. పోటీకి కథ పంపేటప్పుడు, అవి నిర్ణేతలు చదువుతారని, తమ చేతివ్రాత వారికి అర్ధం కావాలనే విషయాన్నికూడా కొందరు రచయితలు (దాదాపు చాలామంది రచయితలు) విస్మరించారు. కొంతమంది మొదటిపేజీలో తమ పేరు వ్రాశారు. ఈ విధమైన నిర్లక్ష్యమే కథల్లో కనపడ్డంలో ఆశ్చర్యం లేదు.
  3. కథల స్థాయి చాలా తగ్గిపోయిందని చెప్పడానికి విచారిస్తున్నాము.
  4. అంతేకాక కథ వ్రాయడాన్ని కొంతలో కొంతైనా సీరియస్‌గా తీసుకోని రచయితలు ఎక్కువగా కనిపించారు.
  5. వాస్తవికతకోసం - అవి ఎంతగా పల్లెల్లో వాడుకలో వున్న పదాలైనా సరే - కొన్ని జుగుప్సాకరమైన పదాలను పదే పదే - ఒక పేజీలోనే నాలుగయిదు సార్లు - వాడడం అవసరమా?
  6. ముందు జరపబోయే పోటీలకు మాదొక సూచన- అర్ధంకాని దస్తూరీలలో కుస్తీ పట్టడం న్యాయనిర్ణేతలకి ఒక శిక్ష కనుక - పోటీ కథలన్నీ తప్పని సరిగా ప్రింటౌట్‌ తీయించి పంపాలనే నిబంధన పెట్టడం మంచిది.

ఆనకట్ట - గిరిజన తండాల జీవనం. అందులో ఒక అమాయక ప్రేమ. ప్రాజక్టుల వలన ఊళ్ళు మునిగిపోవడం -తండాలు, తట్టలూ బుట్టలూ చంకనెట్టుకుని వేరే వూళ్ళకు పోవడం -అందువలన నిశ్చితార్ధం వరకూ వచ్చిన పెళ్ళి ఆగిపోవడం - కథ -గిరిజన జీవన చిత్రణ, సునిశితమైన పరిశీలన- మరియు మిరండా గీసే చిత్రాల్లాగ ప్రతి చిన్న విషయాన్నీ వర్ణించి చెప్పడం - చివుక్కుమనిపించే ముగింపు. భేషజాలు లేని కథ -సూటిగా సాగిన కథనం.

జింకపిల్ల -ఒక పెద్ద ఆసామిని సంతోషపెట్టి నాలుగు రూపాయలు సంపాదించి చదువుకునే కూతురికి మంచి బట్టలు కొందామని, ఆశపడ్డ తండ్రి, ఇంకో ఆసామిని సంతోషపెట్టి తన పని సాధించు కోడం కోసం ఆ కూతుర్నే ఎత్తుకుపోయి మరొక పెద్దమనిషి - తండ్రి ఎంత వొడుపుగా జింకపిల్లని పట్టుకున్నాడో, అంతే ఒడుపుగా అతని కూతుర్ని ఎత్తుకుపోయాడు ఒక స్వార్ధపరుడు. కథనంకూడా బాగుంది. కాస్త చదువుకుని నాగరిక సమాజంలోకి అడుగుపెట్టాలనుకునే అమాయక యువతుల్ని అణిచి పెడుతున్న వైనం - మాంసం మార్కెట్‌కి సమిధల్ని చేస్తున్న వైనం.

యంగముని వ్యవసాయం - శ్రమైకజీవన సౌందర్యం. సహచరి తోడులోనే సంపూర్ణం. స్త్రీపురుషుల సంబంధంలో పనిని పంచుకోడం జీవితాన్ని సార్ధకం చేసుకోడం - కోరికలు పండించు కోవడం - జానపద శైలిలో సాగిన ఈ కథ ఒక గొప్పజీవన సత్యాన్ని ఆవిష్కరించింది.

లోను- బ్యాంకుల ద్వంద్వ వైఖరి - ఫాక్టరీలకోసం రైతుల పొలాలు కొనడం - గ్రామీణ జీవనం విచ్ఛిన్నం అయిపోవడం.లేని వారిని సతాయించి సతాయించి బాకీలు వసూలు చేసి, ఉన్నవాడికి అప్పులిచ్చి దండం పెట్టడం ఈ కథలో ఇతివృత్తం.

 

(ఒక అభిప్రాయం) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. kiran k అభిప్రాయం:

    July 20, 2006 8:07 pm

    after reading all the stories i have to agree with you , infact i raelly feel sorry for you all, better luck next time, but i thought for the prize money thats offered, may be very good quality stories could be expecetd. are we spreading the message far enough to catch some decent writers. may gods be kind to us next year
    kiran

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a