అమ్మ
అనురాగాల అందమైన జగతిలో
మమతల దీపం అమ్మ
మెరిసే నక్షత్ర వినీలాకసంలో
పున్నమి జాబిలి అమ్మ
రంగురంగు విరిసే కుసుమాలలో
చిమ్మే గంధం అమ్మ
చిగురుటాకులలో సుమధురంగా వినిపించే
కోకిలగానం అమ్మ
ప్రశాంతమైన కోవెల కొలనులో
అందమైన తామర అమ్మ
ఆహ్లాదం చిందే పసిపాప
మోములోని దరహాసం అమ్మ
ప్రభాత ఉషోదయంలో
తొలి రవికిరణం అమ్మ
సంధ్యాసాయంత్రంలో
విరిసే వెన్నెల అమ్మ
ప్రేమ, మమత, ఆప్యాయత
అనురాగాల కౌగిలి అమ్మ
మన ప్రతివిజయం వెనుక
కారణభూతం అమ్మ
మన ప్రగతిని కాంక్షించే
దీవెనల అంబరి అమ్మ
ఈ విశాల విశ్వంలో
సాటిలేని పోటీలేని ఉన్నత స్థానంలో
దేముడు మలచిన తన ప్రతిరూపం అమ్మ
కీలక పదాలు : కబురు
Vardhi Reddy Harinadha Reddy అభిప్రాయం:
October 8, 2006 2:45 am
మంజు గారు
నిజంగా చాలా అద్భుతంగా వుంది. మాట ల లో వెలక ట్ట లేని కవిత.
ధ న్య వా దాలు.
హర నాద రెడ్డి. వి
sri అభిప్రాయం:
August 13, 2008 4:06 am
మనసుకు హత్తుకునేలా, మైమరపించే అమ్మ జోలపాటలా వుంది మీ కవిత.
jaideep అభిప్రాయం:
March 10, 2010 11:24 am
మంజు గారు - నిజంగా ఈ కవిత చాలా బాగుంది.