ఈమాట » సార్థకం

Expand to right
Expand to left

సార్థకం

హరివిల్లు రంగులు వద్దు
అమరత్వపు బాధా వద్దు

గతించనీ..
గడ్డిపూవుగా,
పథికుడి వెతను
మరిపించి
ఒకసారైనా

రాలిపోనీ..
శీతగాలికి,

స్పృశించనీ
పవ్వళించిన
పాప నుదుటిని,
అలసి సొలసిన
అమ్మ చేతిని

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a