ఈమాట » అమెరికాంధ్రుని ఆలోచనలు (అ,ఆలు)

Expand to right
Expand to left

అమెరికాంధ్రుని ఆలోచనలు (అ,ఆలు)

అమ్రికాసుల వేడి, అయినవారిని వీడి
ఏడ్చు తల్లినొదలి, ఏడేర్లు దాటి
పొట్ట చేత పట్టి, పొరుగింట చేరాము
ఇంటింట సిరులన్న ఇంతింత కావాల

కాళ్ళున్న లేకున్న కార్లుండి తీరాల
అభ్యంగనము రద్దు అత్తర్లు రుద్దాల
కేషున్న లేకున్న క్రెడిటుకార్డుండాల
కార్డులందున ఘనము గ్రీన్‌కార్డుండాల

బిడ్డలను దండింప బెత్తాలు కావాల?
ముద్దు ముచ్చట చేసి దిద్దుకోవాల
మొక్కగా వంగాల మానుగా కాదనుట
అచటి మాట గాని, ఇచటి మాట కాదు.

తల్లి సంస్కృతి మనది తప్పుచున్నామనుచు
బాధపడుట మనకు సహజమయ్యె
సంస్కృతిచట వెలుగు సంఘాల వలన
చింత వదలు నీవు జీవితము వెలుగు

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a