శపియించుచు ఎండలచే
తపియించుచు నేటికేమి తాళుడటంచున్
చపలస్వాంతుం డీతడు
కపటపు యజ్ఞంబు సేయ కడగె నటంచున్
చప్పట్లు చరచుకొంచును
ముప్పున నితడేల క్రతువు మొనసి యొనర్చెన్
మొప్పెతనంబున, అర్థము
గుప్పున ఇక్కపటవృత్తి కూర్చె నటంచున్
జవ్వనంబున వేంకటసాని యధర
మధువు గ్రోలిన రోతవో మదితలంచి
వృద్ధదశ సోమపాన మివ్విధి నొనర్చె
కాని స్వర్గాపవర్గేచ్ఛ కాదు సుండు
అనుచు జనులెల్ల నిబ్భంగి నాడుచుండి
రంత వేంకటశాస్త్రి ఆగాయతనము
ప్రకటముగ చూడ చింతలపాటి నీల
నరవరగ్రామణి మనంబునం దలంచి
బోగము మిడిమేళంబులు
భాగవతులు వేటకాండ్రు భషకచయంబుల్
మూగి తనవెంట కొలువగ
వేగంబున తరలి యట ప్రవేశంబయ్యెన్
ఇట్లు ప్రవేశించి యవ్విప్రపుంగవు దర్శించి యుడుగరలొసంగి శాలాసమీపంబునం పటకుటీరాభ్యంతరంబున నిలిచి తదీయ క్రతుమంత్రతంత్ర ప్రయోగ ప్రధాన విధానంబు లాలోకించి హాళిం గనుచుండె; నయ్యవసరంబున
విష్ణలోపలి పుచ్చవిత్తుల గతి కప్పు
గల గొగ్గిపండ్ల సింగారమడర
విప్పు కల్గిన పేడకుప్పలో పురువుల
చొప్పున కొప్పున సుమము లమర
కప్పచిప్పల పొల్సుకండ లూడెడి రీతి
చీకుకన్నుల పుసు లేపుమీర
నూతిచెంగట వ్రేలు నునుతంబ కాయల
సరణి పొక్కిలిదండ చన్నులొప్ప
గడ్డిబొద్దు వలెను మేను కానిపింప
బారకర్రల తెరగున బాహులలర
జనకయాగంబు చూడవచ్చెను త్రికోణ
సాంద్రతర రోమరేఖ ఆ చంద్రరేఖ
ఇటువలె నచటికి వచ్చెడు
విటకంటకి చూచి చిత్తవిభ్రమ మొదవన్
తటుకున నీలనృపతి హృ
త్పుటమున సోలుచును దాని పొగడదొడంగెన్
జడకుచ్చును మెడహెచ్చును
నడగచ్చును బొచ్చుపెరిగి నలువగు మేనున్
నిడుదగు తొడల బెడంగున్
కడు వలమగు నడుము కలుగు కలికిది భళిరా
నిక్కు పొగపిడుత కదరా
ముక్కు; మొగంబెన్న కోతిముఖమున కెనయౌ
పొక్కిలి మొలలో తగు భళి
అక్కజపుం నూనెసిద్దెలౌర కుచంబుల్
మోవి పీయూషమూరును కేవలముగ
గవ్వదళసరి పండ్లహా! కలికిమేని
మృదువు కోరింతకంపల గదుమజాలు
చెక్కులలరారు లోహపునక్కు లౌర
చూపు కాకిచూపు నేపారుకన్నులు
పిల్లికనుల గదుమ నుల్లసిల్లు
స్వరము గార్దభమును పరిహసింపగ జాలు
మదనసదనమెల్ల మంగలంబు
ఈనీటు సాని నెచ్చట
కానముగద మున్ను; నేడు గట్టిగ దీనిన్
పోనీక రతి గలంపక
యే నేక్రియ తాళువాడ నిక నిచ్చోటన్
భషక కపి చటక గార్దభ
వృషభాదిక బంధగతుల వేమరు దీనిన్
విషయింపక ఏలాగున
విషమశరు కరాళి బాధవీడునె నాకున్
బాలరండల పదివేల మరుల్గొల్పి
కోర్కె దీరగ మున్ను కూడినాడ
మగవాండ్ర పెక్కండ్ర మచ్చికలగావించి
కొంచక రతుల చొక్కించినాడ
దాసికాజనులకు కాసువీసంబీక
వెస గొల్లవంపులు వెట్టినాడ
సానిబోగమువాండ్ర చనవుబల్మిని బట్టి
పలుమారు రతికేళి కలసినాడ
కాని యీసోయగమును ఈ కలికిమీది
ప్రేమమును పెరచోట లభింపలేదు
మరుని మాయావికారమో మగువ మచ్చు
మందు చల్లెనో నామది మందగించె
ఈ మాపీ యింతిని నా
కామాతురతమెల్ల తీర గాఢతరమహా
స్తోమాయత ఖరబంధో
ద్దామత మెరయంగ దెంగెదను వలపారన్
పుణ్యంబేదిన నేదనీ, జనులు గుంపుల్గూడి కాదంచు కా
ర్పణ్యప్రక్రియ తెల్పినం తెలుపనీ, రాజుల్ మహాదుర్గుణా
గణ్యుండంచును పల్కినం పలుకనీ, కౌతూహలంబొప్ప నీ
పణ్యస్త్రీ మధురాధరోదిత సుధాపానంబు కావించెదన్
చెక్కిలినొక్కి ముద్దుగొని చిక్కని చక్కని గుబ్బచన్నులం
దొక్కట గోరులుంచి జిగియూరువు లంటుచు కోర్కెతీరగా
కుక్కుటబంధవైఖరుల కూడినగాక మనోజుధాటిచే
ఇక్కడ నిల్వగా తరమె యించుకయున్ పెరమాట లేటికిన్