ఎన్ని విధంబుల దెంగిన
తన్నదు తిట్టదు వరాలు ధాన్యము సొమ్ముల్
సన్నపు కోకలు తెమ్మని
నన్నడుగదు యిట్టి వారనారులు కలరే
భగము బిగి మొగము జిగియును
చిగురాకన్మోవికావి చెప్పగతరమా
తగ నన్నును దీనిని కడు
సొగసుగ వర్ణింపవలయు సుకవివతంసా
అని యత్యంత ప్రేమాతిరేకంబున వేడిన నే నిట్లంటి
ఆది పురోహితులైన తేజోమూర్తు
లను గతాయులకడ కనిపినావు
సాధు జయంతి మహాదేవు మాన్యంబు
లెలమి కాసాలంజ కిచ్చినావు
రాయవరంబు మిరాశిదారుల వెళ్ళ
గొట్టి కొంపల పసుల్ కట్టినావు
ధర్మాత్ముడును తాతతమ్ముడు నగు రాయ
విభు నిరుద్యోగి కావించినావు
బోయగొల్లాములో కాసు పోకయుండ
వేంకటమనీషి చేత నిరంకుశగతి
క్రతువు సేయించితివి నీకు కృతియొనర్ప
నర్హమగునట్లు చేతు నీలాద్రిరాజ
అనినం ప్రహృష్టదుష్టహృదయుండై శిరఃకంపంబు సేయ నేనును పరమానందకందళిత మానసారవిందుండనై వచ్చి యతనికి షష్య్టంతంబు లీ ప్రకారంబునం చెప్పం బూనితి
నీచాధారునకు మహా
యాచక శుక శాల్మలీ ద్రుమాకారునకున్
ప్రాచుర్యవికారునకున్
రాచినృపకులాబ్ధి గరళరససారునకున్
క్రూరునకు సాధుబాధా
చారునకు న్యోనిపానసర శీలునకున్
జారునకు విప్రతతిధన
చోరునకున్ బుద్ధిహీన శుభరహితునకున్
పరనారీ భగచుంబన
పరతంత్రున కఖిల దుష్టపాపాత్మునకున్
నిరుపమ దుర్గుణశీలికి
ధరలో నీలాద్రిరాజ దౌర్భాగ్యునకున్
అతిమూఢశీలునకు సం
తత మృగయాఖేలునకున్ దాసీవనితా
వితత రతిలోలునకు ఘన
పతిత కుజన పాలునకును పతయాళునకున్
దుర్భరతనునకు రండా
గర్భాపాతన విధాన కౌశల కలనా
విర్భూతాపయశునకున్
నిర్భర కలుషాత్మునకును నిర్లజ్జునకున్
ఆవిష్కృత చంద్రీభగ
దేవీపూజావిధాన ధీసారునకున్
కేవల రణభీరునకున్
భూవలయోద్ధరణ ఘోర భూధారునకున్
వారవధూ సార మధూ
ద్గారి వదన చుంబన క్రకచభవ దురువ
క్త్రారూఢ రదనునకు కాం
తారాంతర సదనునకు వితత నిధనునకున్
చింతలపాట్యాన్వయతత
కాంతార కుఠారునకును ఘనతర చింతా
క్రాంతునకు నీలధరణీ
కాంతునకున్ వీత సుగుణగణ శాంతునకున్
అనభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పంబూనిన చంద్రరేఖావిలాపంబను సత్ప్రబంధరాజంబునకు కథాక్రమం బెట్టిదనిన
మున్ను శ్రీశివబ్రాహ్మణ వర్ణాగ్రగణ్యుండగు వీరభద్ర భట్టారకేంద్రునకు శ్రీమద్వైఘానస వంశోత్తంసంబగు నంబి నరసింహాచార్యవర్యుం డిట్లని చెప్పం దొడంగె
బహుళ నానావిధ పశుకళేబర చర్మ
కంకాళ వాల ఖురాంకితంబు
మస్తిష్క వల్లూర మాంసఖాదన మోద
కంక వాయస కృధ్ర సంకులంబు
సాంద్రక్షతజ బిందుసందోహ పరిమిళ
న్మక్షికా క్రిమికీటకాక్షయంబు
పలలాశనానందభరిత పరస్పర
కలహకృత్కౌలేయ గవయశివము
మధురతర మదిరాపాన మదభరాతి
ఖేల బాలిశ చండాలజాల తాడ్య
మాన తూర్యనినాద సమన్వితము దు
రాపవనపల్లి బోయగొల్లావు పల్లి
బోయలును గొల్లలును నందు పొందు గూడి
యుండుటను బోయగొల్లమై యూరు వెలసె
మరియు తద్గ్రామమున నొక మాలపెద్ద
చెరువు త్రవ్వించె జనుల కచ్చెరువు కాగ
అంత కొంతకాలంబునకు
అప్పారావున కొక కృతి
చెప్ప నతండడగ నందు చేరెను వినయం
బొప్పన్ వేంకటశాస్త్రులు
గుప్పున నతడాడిమళ్ళ కులు డెన్నంగన్
వాని ప్రార్థింప నొక పెనుపాక చూప
వాసముగ నందు వసియించి వలనుమీర
కొడుకులును తాను వాడిచ్చు కోలు తినుచు
ఇడుములకు నోర్చి కాలంబు గడుపుచుండి