ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్.

ఎలాగే సుఖాల – వీరభాస్కరుడు అందాలబాల – రమాసుందరి భోగినీ దండకం ఎంత ఘనుడివయ్యా – శ్రీకృష్ణ గారడీ ఆనందమోహనా – కార్తవరాయని కథ సుధామధురము – కృష్ణప్రేమ

భక్తి (ఏమి రామకథ), ప్రణయం (మనసులోని కోరిక), విరహం (వెన్నెల రేయి), విషాదం (మంటలు రేపే) మోహం (అది ఒక ఇదిలే) కవ్వింత (బుచ్చబ్బాయ్) లాంటి రసాలనే కాక, సరదా పాటలు (రావే రావే బాలా, చక్కని చుక్క సరసకు రావే) కూడా అంతే సులువుగా పాడటం మరొకరికి సాధ్యమా? 1966లో గుత్తా రామినీడు ఎంతో సాహసంతో గుమ్మడి ప్రధాన పాత్రధారిగా భక్తపోతన సినిమా తీసినప్పుడు పోతన అంటే నాగయ్యే అన్న భావన ఆనాటి ప్రేక్షకుల్లో స్థిరంగా వుండటంతో గుమ్మడి నటన ఎంత బాగున్నా ఆ చిత్రం విజయవంతం కాలేదు. దానితో పాటు పి.బి. శ్రీనివాస్ ఎంతో బాగా పాడిన భోగినీ దండకం, భాగవతంలోని పద్యాలు కూడా మరుగున పడ్డాయి. అలాగే ఘంటసాల గొంతు ప్రథమ శ్రేణి నటులైన అక్కినేని, నందమూరిలకు స్థిరపడి పోవటంతో, పి.బి. శ్రీనివాస్ ఎక్కువగా ద్వితీయ శ్రేణిలోని నటులకు, లేక డబ్బింగు చిత్రాలకు పాడటం, ఆ చిత్రాలు ఆర్ధికంగా అంత విజయవంతం కాకపోవడంతో మరిన్ని మంచి పాటలు మరుగున పడ్డాయి.

రాదటే చెలీ రాధికా చిలకా గోరింక కులికే పకా పకా చెట్టులెక్కగలవా – చెంచులక్ష్మి

ఈ సందర్భంలో పేర్కొవలసిన మరొక రెండు మంచి పాటలు ‘చెట్టులెక్కగలవా, చిలకా గోరింక’. ఈ రెండు పాటలు చాలామందికి చెంచులక్ష్మి (1958) సినిమాలో ఘంటసాల పాడిన యుగళగీతాలు గానే తెలుసు. కానీ ఇవి మొదట పి. బి. శ్రీనివాస్ గొంతుకలోనే రికార్డు కాబడ్డాయి. కానీ తరువాత కారణాంతరాల వల్ల సినిమా ట్రాకులో ఘంటసాల గొంతు వాడుకోవడం జరిగింది. ఈ పాటలు పి.బి.ఎస్. గొంతుకలో వినండి.

వెన్నెల రేయి – ప్రేమించి చూడు బుజ్జి బుజ్జి పాపాయి – ఆడబ్రతుకు ఓహో గులాబి బాల – మంచి మనిషి

పిబిఎస్ పాడిన మరికొన్ని మరపురాని పాటలు: వెన్నెల రేయి ఎంతో చలీ చలీ (ప్రేమించి చూడు), ఓహో గులాబి బాల (మంచి మనిషి), చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా (కానిస్టేబుల్ కూతురు) బుజ్జి బుజ్జి పాపాయి (ఆడబ్రతుకు), చక్కని చుక్క సరసకు రావే (ఇద్దరు మిత్రులు), నీవే నీవే నిన్నే నిన్నే (ఇంటీకి దీపం ఇల్లాలే!), తనువుకెన్ని గాయాలైన మాసి పోవు ఏలాగయినా (ఆడబ్రతుకు).

ఎగరేసిన గాలిపటాలు – స్నేహం గోరుముద్దలు – గోరంత దీపం

చివరిగా పి.బి. శ్రీనివాస్ పాటలను గుర్తుకు తెచ్చుకుంటున్న ఈ సమయంలో బాపు-రమణ, ఆరుద్రల కలయికలో వచ్చిన పాటలను కనీసం ఒకటి రెండైనా పేర్కొనకుండా వుండలేము. గోరంతదీపం (1978) సినిమాలో ఆయన పాడిన గజళ్ళ లాంటి కూనలమ్మ పదాలు, 1977 లో వచ్చిన స్నేహం సినిమాలో ఆరుద్ర ఎంతో తేలికైన పదాలతో బాల్య జ్ఞాపకాలమీద రాసిన ఎగరేసిన గాలిపటాలు ఎంత బాగుంటాయి!

పడవ నడపవోయ్ ఇదేకదా తొలిరేయి హృదయ సమీర సాంధ్య ప్రణయసీమ పయనమవుదామా

సినిమా పాటలే కాకుండా అసంఖ్యకంగా ప్రైవేటు రికార్డులు, క్యాసెట్లు కూడా యిచ్చారు. వీటిలో కొన్ని గజళ్ళు, యుగళగీతాలు ఉన్నా, అధిక భాగం భక్తి పరమైనవి. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసినది దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి సాహిత్యానికి ఆయనే వరసలు కట్టుకుని పాడిన టేపు. ఇవే కాకుండా రేడియో, టి.వి.ల్లో చాలా లలితగీతాలని పాడారు. పడవ నడపవోయ్, ఇదే కదా తొలిరేయి (ఎస్. జానకితో, ఒక ఆత్రేయ నాటకంలోని పాట), హృదయ సమీర సాంధ్య లాస్యము లాంటి పాటలు విజయవాడ కేంద్రం ద్వారా తరచుగా వినపడేవి. ఈ లలితగీత పరంపరలో మరో రెండు మంచి పాటలు: రాదటే చెలి రాధికా, ప్రణయసీమ పయనమవుదామా (కె. జమునారాణితో).

తమిళ పాటలు

పిబిఎస్ తమిళంలో మొదట జెమినీవారి మిస్టర్ సంపత్ సినిమాలో కోరస్‌ పాడాడు. ప్రధాన గాయకుడిగా ఆర్. నాగేంద్రరావు నిర్మించిన జాదగం చిత్రం మూడు భాషలలోనూ (కన్నడ – జాతకఫల; తెలుగు – జాతకఫలం) పాడాడు. తరువాత విడుదలై సినిమాకి పని చేశాడు. అలాగే పక్కింటి అమ్మాయి తమిళ వెర్షన్‌లో (అడుత్త వీట్టు పెణ్) పాడిన పాటలకు (మాలైయిల్ మలర్ సోలైయిల్) కూడా బాగా పేరు వచ్చింది. 1950లలో జెమినీ గణేశన్‌కు ఎ.ఎం. రాజా పాటలు పాడేవాడు. కాని వీరపాండ్య కట్టబొమ్మన్ చిత్రానికి సంగీత దర్శకుడు రామనాథన్ శ్రీనివాస్‌ చేత జెమినీ గణేశన్ కోసం పాడించాడు (ఇన్బం పొంగుం వెణ్ణిలా వీశుదే). ఆ తరువాత ఎన్నో సినిమాలలో జెమినీ గణేశన్‌కు మాత్రమే కాకుండా శివాజీ గణేశన్, ఎం. జి. రామచంద్రన్, ముత్తురామన్ వంటి నటులకు పాడటానికి శ్రీనివాస్‌ను విశ్వనాథన్-రామమూర్తి లాటి సంగీత దర్శకులు ఎన్నుకొన్నారు.

జాదగం – శిందనై ఎన్ శెల్వం నాన్ ఉన్నై శేర్న్ద శెల్వం నినైప్పదెల్లాం నడందు విట్టాల్ ఇంద మండ్రత్తిల్ ఓడివరుం ఇళం తెండ్రలై రోజామలరే రాజకుమారీ

బలే పాండియా, శుమైతాంగి, నెంజిల్ ఓర్ ఆలయం (మనసే ఒక మందిరం), కాదలిక్క నేరమిల్లై (ప్రేమించి చూడు), పోలీస్‌కారన్ మగళ్ (కానిస్టేబుల్ కూతురు) చిత్రాలలోని పిబిఎస్ పాటలు పేరు గడించుకొన్నాయి.

కొన్ని ఆణిముత్యాలు: అత్తిక్కాయ్ కాయ్ కాయ్, మనిదన్ ఎన్బవన్ దెయ్వమాగలాం, మయక్కమా కలక్కమా,అనుబవం పుదుమై(అది ఒక యిదిలే), నాళాం నాళాం తిరునాళాం (సుశీలతో), ఇంద మండ్రత్తిల్ ఓడివరుం ఇళం తెండ్రలై (జానకితో, చిగురాకుల ఊయెలలో), పొన్ ఎన్బేన్ శిరు పూవెన్బేన్ (పూవు వలె విరబూయవలె), నినైప్పదెల్లాం నడందు విట్టాల్ (తలచినదే జరిగినదా), నిలవే ఎన్నిడం నెరుంగాదే, నాన్ ఉన్నై శేర్న్ద శెల్వం, జానకితో పాదకాణిక్కై సినిమాలో పూజైక్కి వంద మలరే వా, మణప్పందల్‌ సినిమాలో ఉడలుక్కు ఉయిర్ కావల్ (తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే లోని ఎవరికి ఎవరు కాపలా, ), వీరత్తిరుమగన్ సినిమాలో రోజామలరే రాజకుమారీ, వాళ్కైప్పడగు సినిమాలోని చిన్న చిన్న కణ్ణనుక్కు ఎన్నదాన్ పున్నగైయో — ఇలా ఎన్నో ఎన్నెన్నో మధురగీతాలు.

హిందీ సినిమా న్యూఢిల్లీ తమిళంలో కూడి వాళ్దాల్ కోడి నణ్మై అనే సినిమాగా తీశారు. శంకర్-జైకిషన్‌ల సంగీతదర్శకత్వంలో పిబిఎస్ కిశోర్‌కుమార్ హిందీలో చేసినట్లు తాను కూడ యోడెలింగ్ చేసినది ఆయనకే ఒక మరపురాని అనుభవం. ఇంటిలో రిహర్సల్ చేసేటప్పుడు దానిని కుక్క కూతలు, నక్క కూతలు అని గేలి చేసేవారట.

ఇందులో ఒక రెండు పాటలను గురించి కొంచెం చర్చిద్దాం. మొదటిది, ‘పావమన్నిప్పు’లో విశ్వనాథన్-రామమూర్తి దర్శకత్వములో జెమినీ గణేశన్‌కి పాడిన కాలంగళిల్ అవళ్ వసందం అనే పాట, పిబిఎస్ గాత్రంలోని మార్దవాన్ని, మాధుర్యాన్ని చాటి చెబుతుంది. 1961లో ఆ పాటను పాడిన పిబిఎస్, ఆ తరువాత ఎన్నో పాటలను పాడాడు. పాడడం మానేసినా, ఇప్పుడు మనమధ్య లేకపోయినా, ఈ పాట విన్నప్పుడు మాత్రం మనముందు ఎప్పుడూ నిలిచేది పిబిఎస్ గాత్రంలోని వసంత ఋతువు వైభవం, ఆమని అందాలే. కణ్ణదాసన్ వ్రాసిన ఆ పాట ఇది:

కాలంగళిల్ అవళ్ వసందం

కాలంగళిల్ అవళ్ వసందం
కలైగళిలే అవళ్ ఓవియం
మాదంగళిల్ అవళ్ మార్గళి
మలర్గళిలే అవళ్ మల్లిగై

(ఋతువులలో వసంతము, కళలలో చిత్రకళ, నెలలలో మార్గశిరము, పూలలో మల్లెపూవు ఆమె)

పరవైగళిల్ అవళ్ మణిప్పురా
పాడల్గళిల్ అవళ్ తాలాట్టు
కనిగళిలే అవళ్ మాంగని
కాట్రినిలే అవల్ తెండ్రల్

(పక్షులలో ముద్దు పావురము, పాటలలో జోలపాట, పండ్లలో మామిడిపండు, పవనాలలో పిల్లగాలి ఆమె)

పాల్‌పోల్ శిరిప్పదిల్ పిళ్ళై – అవళ్
పనిపోల్ అణైప్పదిల్ కన్ని
కణ్పోల్ వళర్పదిల్అన్నై – అవళ్
కవిజ్ఞ నాక్కినాళ్ ఎన్నై

(అమాయకముగా నవ్వుటలో శిశువు, మంచులా కౌగిలించుకొనుటలో షోడశి, కంటిలా కాపాడుటలో తల్లి, ఆమె నన్ను ఒక కవిగా మార్చినది)