రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి

రచన: సాయి బ్రహ్మానందం గొర్తి
సెప్టెంబర్ 2012

దక్షిణ భారత దేశంలో కర్ణాటక సంగీత దిశానిర్దేశక విషయ ప్రస్తావన వస్తే రామామాత్యుడు మొదలుకొని, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య ఇలా ఒకరేమిటి ఎంతో మంది తెలుగు వారు తమ సర్వస్వాన్నీ సంగీతానికి ధారపోశారు. ఈనాడు కర్ణాటక సంగీతం సశాస్త్రీయంగా, శుద్ధంగా ఉండడానికి కారణం వీరే. వీరందరి పేర్లు మనకి చిరపరిచితమే. కానీ నిశ్శబ్దంగా, నిర్విరామంగా సంగీతానికి తొంభయ్యేళ్ళకి పైగా కృషి చేసిన ఒక మహానుభావుడి గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం – మన మధ్యే ఉన్న ఆ శతవసంతాల సంగీతచూడామణి అందించిన సంగీత సర్వస్వం గురించి ముచ్చటించడం.

ఆ మహా మనీషి డా. శ్రీపాద పినాకపాణి.


డా. శ్రీపాద పినాకపాణి

సంగీత ప్రపంచంలో ఆయన గురించి తెలియని వారుండరు. నూరేళ్ళ సంగీతయానం ఆయనది. వృత్తి రీత్యా వైద్యుడయినా సంగీతజ్ఞుడినని చెప్పుకోవడానికే ఇష్టపడే అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన కేవలం గాయకుడే కాదు; కేవలం వైణికుడే కాదు. సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఆపోశన చేసిన వాగ్గేయకారుడు. సంగీతమూ, విజ్ఞానమూ పదిమందితో పంచుకున్నప్పుడే అది పదికాలాలపాటూ నిలుస్తుందని నమ్మిన ఆయన ఎంతో మంది శిష్యుల్ని ఆణి ముత్యాలుగా మలిచారు. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి, ఓలేటి వేంకటేశ్వర్లు, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది బ్రదర్స్, ప్రసిద్ద సినీ గాయని ఎస్. జానకి, ఇలా ఎందరో మహామహులు ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నారు. వారందరూ శ్రీపాద వారి గురించి అనే ఒకే మాట – ఆయన గురువులకే గురువని.

శ్రీపాద పినాకపాణి ఆగస్ట్ 13, 1913న శ్రీకాకుళంలో ప్రియాగ్రహారంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించారు. తండ్రి కామేశ్వరరావు, మైసూర్ బి. లక్ష్మణరావు గార్ల వద్ద 11వ యేట మొదటి పాఠాలు నేర్చుకున్నారు. ఆయన నేర్చుకున్న మొదటి కృతి గజానన సదా. ఆ వయసులోనే ఆ కృతికి స్వరరచన చేసిన శ్రీపాద ఆ తరువాత ఎన్నో కృతులకు తనదైన పద్ధతిలో స్వరరచన చేసుకొని నేర్చుకున్నారు. ప్రముఖ వయొలిన్ విద్వాంసులు ద్వారం వేంకటస్వామి నాయుడు, శ్రీరంగ రామానుజ అయ్యంగార్ల వద్ద శిష్యరికం చేసి సంగీతంలో ప్రావీణ్యత సాధించారు. 1938లో ఆంధ్రా యూనివర్శిటీ మెడికల్ కాలేజీనుండి వైద్యంలో పట్టా తీసుకున్నారు. ఈయనకి రాగాలు కట్టాలన్నా, రోగాలు కట్టాలన్నాఒకటే మక్కువని అప్పట్లో అందరూ అనుకునేవారట.


శ్రీపాద స్వర్ణకంకణం

సంగీతంలో ఈయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో, సంగీత నాటక అకాడమీ పురస్కారంతో, మద్రాసు సంగీత సభ వారు సంగీత కళానిధి బిరుదుతో, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణతో సత్కరించారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా ఆయనకు స్వర్ణకంకణాన్నీ, గానవిద్యా వారిధి బిరుదునూ ఇచ్చి, ఆయన గౌరవార్థం కర్నూలులో శత జయంత్యోత్సవ వేడుకలు నిర్వహించారు. గత ఎనిమిదేండ్లుగా ఆయన మంచం పట్టి ఉన్నా, ఆయన మేధ ఏమాత్రమూ పదును తగ్గలేదనీ, ఇప్పటికీ ఆయన ఎంతో ఆసక్తితో సంగీతం గురించి చర్చిస్తారనీ వారి శిష్యులు చెప్తుంటారు.


మన పూర్వీకులు సంగీతాన్ని రెండు రకాలుగా విభజించారు. మొదటిది మార్గ సంగీతం – అంటే భరతముని ప్రవచించిన సంగీత పద్ధతి. రెండోది దేశీయ సంగీతం – దేశకాల సంబంధమైన జనరంజక సంగీతం. ప్రస్తుతం మన సంగీతాన్ని దేశీయ సంగీతమనే వ్యవహరిస్తాం.


మూడు తరాలు – శ్రీపాద, నేదునూరి
మల్లాది బ్రదర్స్ (లోకాభిరామం బ్లాగ్ నుంచి)

జనరంజకమయిన పాటకు కూడా ఒక మార్గము, పద్ధతి ఉంటాయి. కూనిరాగం కావచ్చు, లేదూ జానపదం, శాస్త్రీయం కావచ్చు; ఏ పాట అయినా, లయబద్ధమై ఉంటుంది. పాటకి లేదా శబ్దానికి ఆ లయకు తోడుగా, రూపం, నడక కలిసినప్పుడు అది జనరంజకం అవుతుంది. ఆ శబ్దప్రకరణాన్నే రాగం అన్నారు. అంటే వివిధ శబ్దాలను ఒక పద్ధతిలో ఒక నడకకి నప్పితే అదొక రాగం అవుతుంది. ఇక్కడ శబ్దం అంటే స్వరంగా భావించాలి. మన పూర్వీకులు అలా పొడిపొడి శబ్దాలు లేదా స్వరాల నడకకి సరైన మాటలు లేదా పదాలు అమర్చీ, వారికిష్టమైన భావాలు ఆయా పదాల్లో చొప్పించీ పాడేవారు. దీన్నే గీతం లేదా పాట అనేవారు. ఈ పాట ఒకరి నుంచి మరొకరికి వినికిడి ద్వారానో లేదా అనుసరణ ద్వారానో చేరేది. ఇటువంటి చక్కని గీతాన్నే సంగీతం అన్నారు. సంగీతం అంటే సమ్యక్ గీతం – అంటే ఒక చక్కని పాట.

సంగీత శాస్త్రానికి ప్రథమంగా శార్ఙ్గదేవుడు సంగీత రత్నాకరం రచించి ఒక పద్ధతిని సూచించాడు. తరువాతి కాలంలో రామామాత్యుడు తాను వ్రాసిన ‘స్వరమేళ కళానిధి’ లో రాగ లక్షణాలను బట్టి వాటిని ఒక శాస్త్రీయపద్ధతిలో కూర్చడానికి ప్రయత్నించాడు. తరువాత వేంకటమఖి ఆ ప్రతిని సరిదిద్ది, కొత్త ప్రతిపాదనలు చేస్తూ 72 మేళకర్తరాగ విభజన చేసి సంగీతానికి ఒక శాస్త్రీయత చేకూర్చాడు. ఈ పద్ధతినే ప్రస్తుతం మనం అనుసరిస్తున్నాం.

ఇదంతా 16, 17 శతాబ్దాల్లో జరిగింది. రాగవిభజన చేసి సంగీతానికి ఎంత శాస్త్రీయత చేకూర్చినా, వాగ్గేయకారుల రచనలు మాత్రం గురుముఖంగానే నేర్చుకోవల్సి వచ్చేది. ఈ క్రమంలో కృతీ, వర్ణమూ వంటివి అటూ ఇటూగా రూపాంతరం చెందేవి. ఏది సరైనదన్న ఒక నిర్ధారణకి రాలేక సంగీతజ్ఞులు సందేహంలో మునిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాలక్రమేణా సంగీతంలో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యమైన మార్పు ఏమిటంటే పాటకి రాగాన్ని అనుసరించి స్వరం రాయడం. దీన్నే మనం స్వరరచన (Notation) అని అంటాం.

మన పూర్వీకులయిన ఎంతో మంది వాగ్గేయకారుల రచనలు స్వరరచన లేకపోవడం, స్వరాలు తెలియకపోవడం వలన పాట తీరూ, రూపమూ తెలుసుకోవడం కష్టమవుతుంది. ఇలా నొటేషను లేకుండా ప్రస్తుతం మనకి లభించిన అనేక క్షేత్రయ్య పదాలూ, జావళీలూ, అన్నమయ్య సంకీర్తనల వంటివాటికి ఆ వాగ్గేయకారులు ఎలా స్వరపరిచారో, ఏ విధంగా పాడేవారో తెలియకుండా పోయింది. అప్పటికీ, ఇప్పటికీ రాగాల పేర్లలో మార్పులు రావడంతో ఈ ప్రయత్నం మరింత కష్టతరమయింది. ఈ కారణాల వల్ల అనేక సంగీత రచనలు మరుగున పడిపోయాయి.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన మధ్యనే ఉంటూ ఇటువంటి సంగీత రచనలనీ ఏర్చి కూర్చి, వాటికి వాగ్గేయకారులు నిర్దేశించిన రాగాల్లో స్వరాలు వ్రాసి, వాటిని ముందు తరాలకి అందించిన శ్రీపాద పినాకపాణిగారి బృహత్కార్యాన్ని పరిచయం చెయ్యడం కోసం. ఒకటీ రెండూ కాదు, 1500 పైచిలుకు వాగ్గేయకారుల కృతులకి స్వరరచన చేసి ఒక చోట పుస్తకంగా అచ్చు వేయడానికి ఒక జీవితకాలం కావాలి. శ్రీపాద తన జీవితకాలాన్ని ఇందుకే వెచ్చించారు.


కర్ణాటక సంగీతానికి పినాకపాణి వారు అందించిన విలువైన కానుకలు ఆయన రాసిన పుస్తకాలు: పల్లవి గాన సుధ, మేళరాగమాలిక, మనోధర్మ సంగీతం, సంగీత సౌరభం (నాలుగు సంపుటాలు). కొద్దికాలం క్రిందట ప్రచురించబడిన స్వరరామం, అభ్యాసం, ప్రపత్తి అనే మూడు పుస్తకాలు సంగీత విద్యార్థులకి ఎంతో ఉపకరించేవి.


శ్రీపాదతో కృష్ణమూర్తి, శివానందమూర్తి

ఇవి కేవలం పుస్తక రూపేణా అందించిన సంగీత రచనలు. ఇవికాక స్వరాలు లభ్యంకాని ఎన్నో కృతులకు సశాస్త్రీయంగా రాగ బద్ధంగా కూర్చిన స్వరరచనలు మరికొన్ని మచ్చుతునకలు. అన్నింటికన్నా గొప్ప విషయం తన వద్దకి వచ్చినవారికి కాదనకుండా సంగీతం నేర్పడం; తనకున్న సంగీత జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించడం. విశాల హృదయం ఉంటే తప్ప నిష్కల్మషంగా సంగీత బోధన జరగదు. ప్రముఖ వైణిక విద్వాంసురాలు మేడూరి సుబ్బలక్ష్మి కర్నూలులో ఆయన వద్ద మూడేళ్ళు సంగీతం నేర్చుకున్నారు.

//eemaata.com/Audio/sep2012/8.SripadaPinakapani-MusicAppreciation.mp3సంగీతం – ఒక ప్రశంస – శ్రీపాద పినాకపాణి

“త్యాగరాజునీ, దీక్షితారునీ, శ్యామశాస్త్రినీ నేను చూడలేదు. వాళ్ళ పాటలు వినడమే తప్ప వ్యక్తిగతంగా మనకి వారు తెలియదు. పినాకపాణి గార్ని చూస్తే ఓ త్యాగరాజూ, ఓ దీక్షితారూ, ఓ శ్యామశాస్త్రీ – ఈ ముగ్గురి రూపం ఒక మనిషిని ఆవహించిందా అనిపిస్తుంది. చాలా మంది గురువులు సంగీత పాఠం చెబుతారు. పినాకపాణిగారు మాత్రం అలా కాదు. నేర్చుకునే వారికి అది సంపూర్ణంగా, క్షుణ్ణంగా వచ్చే వరకూ తాపత్రయపడతారు. సంగీత పాఠం చెప్పడంలో శిష్యులకుండాల్సిన శ్రద్ధ, జిజ్ఞాస కంటే వందరెట్లు ఎక్కువగా ఆయనలో కనిపిస్తుంది. అటువంటి వారి వద్ద నేర్చుకోవడం ఒక అదృష్టం. ఆయన వట్టి గురువు కాదు. గురువులకే గురువు. గురువంటే ఇలా ఉండాలి అన్న దానికి ఆయనే ఒక పెద్ద నిర్వచనం,” అని పినాకపాణి గారి గురించి మేడూరి సుబ్బలక్ష్మి అంటారు.

ఇది కేవలం వారి అభిప్రాయమే కాదు, ఆయన వద్ద శిష్యరికం చేసిన ప్రతీ వారూ అనే మాటే ఇది. “గొప్ప వ్యక్తులు పుట్టుకతో గొప్పవారు కారు. వారి సంస్కారం, ఎదుటివారి ఎడల చూపించే ప్రేమల వల్ల గొప్పవారవుతారు,” అని సుబ్బలక్ష్మి చెప్తారు.

సీతాపతి గారి క్షేత్రయ్య పదములు అనే పుస్తకానికి ముందు పీఠికలో ఈ. కృష్ణయ్యర్ ఇలా అంటారు.

“మన దేశమందు వెలసియుండిన కళలలో నేటికీ మనం నిలబెట్టుకొని జ్ఞప్తి యందుంచుకొనిన వాటికంటె ఎక్కువ కళలను పోగొట్టుకొని మరచి పోయినాము. ఇది మన దురదృష్టం. రాబోవు తరముల వారు పాడుకొనుటకు ఉపకరించునట్లుగా స్వరమెట్లతో క్షేత్రయ్య తక్కిన చాలామంది వాగ్గేయకారుల వలనే తన పదములు రచించలేదు. పాడవలసిన తీరు తెలియక అనేక పదములు పోయినవి. పదములు సేకరించుట కూడా చాలా కష్టమైన పని. ఎన్నో మారుమూలల దాగి యున్నవి. ఎంతో శ్రమపడి వాటిని సంగ్రహించవలసియున్నది. సంగ్రహించిన పదములలో ఏవి వాస్తవముగా క్షేత్రయ్య రచించినవో, ఏవి కావో ముద్రలేని పదముల విషయములో చెప్పుకొనుట కష్టముగానున్నది. ఇప్పుడు పాడుచున్న పదములలోనైనను సరియైన పాఠములేవో తెలుసుకొనుట చిక్కుగా నున్నది. కడు కొద్ది మంది మాత్రమే సంప్రదాయ సిద్ధములను, శుద్ధములను నగు పాఠములను చెప్పగలరు…”


రాగలక్షణం (సంగీత సౌరభం)

పై మాటలు కేవలం క్షేత్రయ్య పదాలకి మాత్రమే వర్తించవు. మరుగున పడిన ఎంతో మంది వాగ్గేయకారుల రచనలకీ అది వర్తిస్తుంది. నారాయణ తీర్థుల తరంగాలు కానీ, అన్నమయ్య పదాలు కానీ, రామదాసు కీర్తనలు కానీ వీటికి సాహిత్యం మాత్రమే ఉంది తప్ప, సంగీతపరంగా స్వరాలు పదిలపరచి లేవు. ప్రతీ పాటకీ కేవలం రాగాల పేర్లు మాత్రమే లభ్యమయ్యాయి. అందువల్ల వారు ఆ పాటల్ని ఎలా స్వరపరిచి పాడారో చెప్పడం సాధ్యం కాదు.

పినాకపాణి వారు ఇటువంటి అనేకమంది వాగ్గేయకారుల సాహిత్యానికి స్వరాలు కూర్చి, సొంతంగా బాణీలు కట్టి పొందుపరిచారు. సంగీత సౌరభం అనే పుస్తకంలో అన్నమయ్య కీర్తనలూ, క్షేత్రయ్య పదాలూ, జావళీలూ, వర్ణాలూ ఇలా దాదాపు రెండు వేలకి పైగా పాటలకు స్వరరచనను అందించారు. ఈ ప్రయత్నానికి ఎంతో సహనం, ఓర్పు, శ్రద్ధ, నిబద్ధత కావాలి. తన ముందు తరాలకి పూర్వపు వారందించిన సంగీత సంపద చేరాలన్న తపన వల్లనే ఇది సాధ్యమయింది. ఆయనే ముందుమాటలో చెప్పినట్లుగా, “ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులలో పెద్దలు పాడి ప్రచారము చేసిన పాఠాంతరములలో కర్ణాటక సంగీత లక్ష్య, లక్షణ సంప్రదాయము నిబద్ధమై ఉంటుంది. అటువంటి కృతులను కనీసం వెయ్యింటినైనా సేకరించి వీలైనంత మట్టుకు వివరములతో స్వరపరచి ఆంధ్ర యువతరాని కందజేయగలిగితే, వారి కృతి సంపదలతో పాటు సంగీత జ్ఞానము, సంగీతపు బాణి, గీటుకందిన అంతస్థు చేరుకుంటాయి అనే ధీమాతో నేను చేసిన ప్రయత్నమీ గ్రంథరచన.”

కేవలం సాహిత్యం ఉన్న పాటలకి స్వరం కూర్చడం అంత సులభం కాదు. ముఖ్యంగా పూర్వపు వాగ్గేయకారులు నిర్దేశించిన పాటలకి రాగాల పేర్లున్నాయి కానీ స్వరాలు లేవు. అందువల్ల వారు చెప్పిన రాగంలోనే కట్టాల్సి వస్తుంది. వాటిలోని రాగాలు ప్రస్తుతం వాడుకలో ఉండకపోవచ్చు. లేదా మరొక పేరుతో పిలవబడవచ్చు. ఉదాహరణకి ఎన్నో అన్నమాచార్య కీర్తనల్లో పేర్కొన్న రాగాలు (తెలుగు కాంబోది, కొండమలహరి వంటివి) ప్రస్తుతం లేవు. అప్పుడు వాడుకలో ఉన్నా అవి ఎలా వుండేవో తెలియదు. అటువంటి సందర్భాల్లో సాహిత్యానికి అనుగుణంగా ఉన్న రాగం ఎన్నుకోవాల్సి వస్తుంది. ఆయా రాగాన్ననుసరించి భావం చెడకుండా సాహిత్యానికి నప్పుతూ స్వరపరచాల్సి ఉంటుంది. ఈ పని చెయ్యాలంటే ముందుగా ఎంతో సంగీతజ్ఞానం కావాలి. రాగాల మీద పట్టు సాధించాలి.


క్షేత్రయ్య పదం స్వరరచన

వివిధ వాగ్గేయకారులు రచించిన పాటలకు స్వరాలతో, అనుస్వర, గమక సహితంగా స్వరరచన చేసి పినాకపాణి సంగీత సౌరభంలో పొందుపరిచారు. అందులో కూడా వాడుకలో ఉన్న కొన్ని కృతులలో స్వరస్థానాలని సవరించి వాటిని, విద్వాంసులతో చర్చించి మరీ, సాధికారకంగా ప్రచురించారు. “నేను సేకరించిన కృతులు, పదములు, జావళీలు మొదలైన సంగీత రచనలన్నీ నేను నేర్చి, పాడుకొని, స్వరపరచి భద్రపరచినవే. ఇతరుల పాఠాంతరములను ఇంతకు పూర్వం ప్రచురింపబడిన గ్రంథముల నుండి తస్కరించలేదు. చాలాభాగం గురుముఖంగా నేర్చుకున్నవే; కొన్ని విద్వాంసుల నాశ్రయించి వారు పాడుతూ చెప్పగా నొటేషనుతో వ్రాసుకున్నవి; కొన్ని చిన్న కృతులు పదే పదే విని నేర్చుకున్నవి; నా చిన్ననాటి నుండీ (1930 సం||మొదలు) గ్రాంఫోను రికార్డులలో పూర్వతరం విద్వాంసులు పాడి వాయించి ఉన్న కృతులు కొన్ని; ప్రముఖ గాయకులు రేడియో ద్వారా వినిపించిన క్రొత్త కృతులను Cassette Tapes మీద ఎక్కించుకొని, వాటిని సావధానంగా నొటేషనుతో వ్రాసి నేర్చుకున్నవి కొన్ని:- ఈ విధంగా అన్నీ పెద్దలనుండి స్వయంగా నేర్చి సేకరించిన కృతులనే సమర్పించుకుంటున్నాను. ఇది వరలో నేర్చియున్న పాఠాంతరములలో నీరసంగా ఉన్న కృతులను దరిమిలా మనసుకు నచ్చిన పాఠాంతరములు విని సవరించుకున్నాను.”

ఈ సంగీత సౌరభం నాలుగు సంపుటాల్లో మూడు వందలకు పైగా అన్నమాచార్య కీర్తనలను స్వరయుక్తం చేశారు. కొన్ని కృతులు తక్క, అన్నమాచార్య కృతులు ఏఏ రాగాల్లో రాగిరేకుల్లో ఉన్నాయో అవే రాగాలలో వాటికి స్వరాలున్నాయి. ఉదాహరణకి, అతి ప్రసిద్ధమైన “బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే – తందనానా ఆహి, తందనానా పురే” పదం ప్రస్తుతం మనం బౌళి రాగంలో పాడగా వింటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన అన్నమయ్య కీర్తనల్లో కూడా బౌళి రాగమనే ఉంది. బాలమురళిగారు మాత్రం భూపాలంలో పాడిన ఈ పాటను పినాకపాణి గారు శంకరాభరణంలో స్వరపరిచారు.

అలాగే ఈ సంగీత సౌరభంలో నూటికి పైగా క్షేత్రయ్య పదాలు ఉన్నాయి. సుమారు తొంభై జావళీలున్నాయి. తిల్లానాలూ, తిరుప్పుగళ్ వంటి రచనలు కూడా ఉన్నాయి. వీటిలో త్యాగరాజాది తదితరుల కృతులూ, దీక్షితార్, శ్యామశాస్త్రుల కృతులు కూడా ఉన్నాయి. ఇందులోని అన్నమయ్య కీర్తనల్లో సింహభాగం పినాకపాణిగారి స్వీయ స్వరకల్పనలే అయినా, వాటిలో కొన్ని తన శిష్యుడైన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి స్వరపరిచినవి కూడా పేరు ఇచ్చి జతచేయడం తన శిష్యుల ప్రతిభనీ, విద్వత్తునీ గౌరవించడమే.

కృతి లేదా పాటకి నొటేషను రాయడంలో ఒక పెద్ద చిక్కు వుంది. ఒకే పాటకి అనేకరకాలుగా రాగం వరుస చెడకుండా నొటేషన్ రాయచ్చు. ఉదాహరణకి అందరికీ పరిచయమున్న – “సామజ వరగమన” త్యాగరాజ కృతికి సంగీతం పుస్తకాలలో కొంచెం తేడాగా వేర్వేరు నొటేషన్లు కనిపిస్తాయి. కేవలం పల్లవి, సామజ వరగమనా సాధు హృత్, మాత్రమే తీసుకుంటే ఇలా ఉంటుంది: మా;; గ స నీ దా నీ నీ | సా ; ; సా | మా గా మా ; ||. ఇదే పల్లవి వేరొక పుస్తకంలో: సా మా – మ గ సా – సనిదా – నీ నీ | సా ; – ; సా | సా మా గా మా || అని ఉంటుంది.


సామజ వరగమనా

స్వరపరంగా, రాగం పరంగా రెండూ సరైనవే అయినా ఇందులో ఏది ప్రామాణికమో తెలీదు. అంటే త్యాగరాజ కృతిలో మొట్టమొదట ఏవిధంగా స్వరరచన ఉందో తెలుసుకోవడం కష్టం. వినే వాళ్ళకి రెండూ ఒకేలా అనిపించవచ్చు. కానీ నొటేషనులో మాత్రం తేడా ఉంది. ఇలా, ఎన్నో కృతులకి ఈ విధమయిన స్వరభేదాలు ఉన్నాయి. ఇటువంటప్పుడు దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ముఖ్యంగా ముందు నేర్చుకునేటప్పుడు ఒక ప్రామాణిక పద్ధతిలో నేర్చుకొని కాస్త రాగ జ్ఞానమూ, స్వర స్థానములూ అబ్బిన తరువాత కొద్ది మార్పులు చేసుకుంటూ పాడడం ఒక పద్ధతి. కానీ చాలామంది మొట్టమొదట సంగీత పాఠాలు గురుముఖంగానే నేర్చుకుంటారు; నేర్చుకోవాలి కూడాను. ప్రతీ గురువూ తనకి నచ్చిన రీతిలో కృతుల నొటేషన్లని మార్చి విద్యార్థులకి చెప్పడం జరిగినప్పుడు, తప్పు స్వరాలు దొర్లే అవకాశం ఉంది. అంతే కాకుండా ఏది అనుసరించాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులన్నీ చూసి, మనకి ఒక ప్రామాణికమైన సంగీత పాఠ్యగ్రంథం కావాలి, అందులో స్థిరమైన నొటేషనుతో సంగీత పాఠాలు ఉండాలి, అవి చూసి విద్యార్థులు మొదట నేర్చుకుంటే, పైస్థాయికి వెళ్ళినప్పుడు అనేక రకాల సంగతులు చొప్పించి మరీ పాడుకోగలరు అనే ఉద్దేశ్యంతో, ప్రామాణికతను ఆపాదిస్తూ పినాకపాణి సంగీత సౌరభం పుస్తకాన్ని ఎంతో కాలం శ్రమించి కూర్చారు.

“నేటికి లభ్యమయ్యే వివిధ గ్రంథస్థములైన కృతులు ప్రౌఢ గాయకులు పాడే రీతులలో స్వరపరిచి లేవు. పాడినవి పాడినట్లే స్వరపరిచే విధానం తెలియకనే, చదివి నేర్చుకునే పాఠకులకు అర్థం చేసుకోడానికి కష్టమేమీ లేని విధంగా స్వరపరచవలెననే భావన అడ్డుతగలడం వల్లనో, స్వరపరిచిన విధానానికీ, కృతి వినబడే రీతికీ సంబంధం లేకుండా పోయిందీ గ్రంధాలలో. కృతుల స్వరూపాలకి బదులు వాటి అస్థిపంజరాలే మిగిలి ఉన్నాయా అనిపిస్తుంది.

పాడిన కృతి పాడినట్లే అనుస్వర సహితంగానూ, నిర్దిష్టమయిన కాల ప్రమాణముతోనూ స్వరపరిచి వ్రాయడమూ, ఆ విధంగా వ్రాసియున్న కృతిని పాఠం చెయ్యడమూ; తగినంత కృషి చేసిన వారికే సాధ్యమవుతుంది కానీ, నొటేషన్ జోలికే పోనివారికి కాదు. సంగీతజ్ఞులందరూ నొటేషనుతో కృతులు వ్రాయడము, నొటేషనుతో యున్న కృతుల చదివి పాఠం చెయ్యడమూ అలవాటు చెయ్యాలి. పాట తేలికగా ఉంటే, దాని నొటేషనూ తేలికగానే వుంటుంది. నొటేషను కష్టమని ప్రసిద్ధ పాఠాంతరముల జోలికే పోకపోవడం కళాసేవ ఎలా అవుతుంది? రంగు పూసలను భద్రపరచి ఆణి ముత్యాలను వదులుకున్నట్లు కాదా?”

ఈ సంగీత సౌరభంలో ఇంకొక విశేషం కూడా ఉంది. ప్రతీ సంపుటిలోనూ వచ్చిన రాగాల మీద చివర్లో రాగం ఆరోహణ, అవరోహణ, రాగ సంచారం, విశేష ప్రయోగాలు వంటివి అదనంగా ఇవ్వడం. సాధారణంగా వినికిడి ద్వారానూ, లేదా గురుముఖంగానూ కొంత రాగసంచారం వంటివి అలవాటయినా, ప్రతీ రాగం గురించీ అందరికీ తెలియకపోవచ్చు. సంగీత విద్యార్థులకి కొంచెంగా రాగం తెలిసినా, ఈ పుస్తకంలో ఇచ్చిన దాని తాలూకు సంచారం సాధకం చేస్తే రాగం మీద పట్టు దొరుకుతుంది. సంగీతం నేర్చుకోవడంలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి ఉన్న విద్యార్థులకే కాకుండా, గురువులకు కూడా ఉపయోగపడే పుస్తకం ఈ సంగీత సౌరభం. పాఠం చెప్పేటప్పుడు ప్రామాణికంగా, ప్రతీ పాటా, స్వరమూ శాస్త్రీయంగా ఒకటికి పలుమార్లు పరీక్షించి స్వర దోషాలు లేకుండా ఇచ్చిన ఈ పుస్తకం గురువులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది.

సంగీత సౌరభం లాంటి గొప్ప కార్యాన్ని ఇంతవరకూ ఏ సంగీతజ్ఞుడూ సాధించలేదంటే అతిశయోక్తి కాదు. త్యాగరాజు కీర్తనల మీద, దీక్షితార్ కృతులమీదా విడిగా వచ్చి వుండవచ్చు కానీ అనేకమంది వాగ్గేయకారుల రచనలు ఒకే చోట పదిలపరచడం మాత్రం జరగలేదు. శుద్ధమైన కర్ణాటక సంగీతాన్ని పరిరక్షించాలన్న తపనతో కంకణం కట్టుకుంటే తప్ప ఇలాంటివి సాధ్యపడవు.



మనోధర్మ సంగీతం

తెలుగులో ప్రామాణిక నిఘంటువు లేనట్లుగానే కర్ణాటక సంగీతానికి కూడా ప్రామాణిక పాఠ్యగ్రంథాలు లేవు. ముఖ్యంగా మధ్యమస్థాయి నుండి ఉత్తమస్థాయికి వెళ్ళే విద్యార్థులకోసం ప్రత్యేకమయిన గ్రంధాల్లేవు. రాగం-తానం-పల్లవి, మనోధర్మ సంగీతం ఇవన్నీ గురుముఖంగా నేర్చుకున్నా ప్రతీ రాగానికీ సంబంధించి ఎక్కడా ఈ వివరాలు నిక్షిప్తమయినట్లు కనిపించదు. మనోధర్మ సంగీతం అంటే ఏవిటో, కొద్దిపాటి వివరణలతో ఉంటుంది కానీ అది ఎలా అనుసరించాలి, ఏ ఏ నియమాలూ, సూత్రాలూ పాటించాలి వంటివి కూలంకషంగా చర్చించిన పుస్తకాలు చాలా అరుదు. పినాకపాణి గారి మనోధర్మ సంగీతం ఆ లోటుని తీరుస్తుంది.

//eemaata.com/Audio/sep2012/1.Sripada-Pinakapani-Varnam-Manasija-Adi-Hindolam.mp3మనసిజ – వర్ణము – హిందోళం – శ్రీపాద పినాకపాణి //eemaata.com/Audio/sep2012/2.SripadaPinakapani-Slokam-BhajaGovindam-Ragamalika-Purvikalayani-HindolamKuntalavarali-Kapi.mp3భజగోవిందం – రాగమాలిక//eemaata.com/Audio/sep2012/3.SripadaPinakapani-KasturiTilakam-Ragamalika.mp3కస్తూరీతిలకం – రాగమాలిక //eemaata.com/Audio/sep2012/4.Vanitaro-Ee-Javali-AnandaBhairavi.mp3వనితరో – ఏ వన్నెలేలనే – జావళీ

కవిత్వంలో ఆశుకవిత్వం లాంటిదే సంగీతంలో మనోధర్మ సంగీతం. కవిత్వం ఒక అంశమ్మీద ఆశువుగా చెప్పినట్లే సంగీతంలో ఒక రాగాన్ని తీసుకొని ఆశువుగా స్వరకల్పన చేయడాన్ని మనోధర్మ సంగీతం అంటారు. స్వరకల్పన, రాగము, నెరవు, పల్లవి, మనోధర్మ సంగీతానికి ఉదాహరణలుగా చెప్పచ్చు.

సూక్ష్మంగా – స్వరకల్పన అంటే తాళాన్ని అనుసరిస్తూ చేసే రాగ విస్తారణ. నెరవు అంటే – పాటకున్న సాహిత్యంలోని ఒక వాక్యాన్ని లేదా పాదాన్ని తీసుకొని రాగ బద్ధంగా పదే పదే మారుస్తూ పాడటం.

“గౌరవ ప్రదమైన సంగీత జ్ఞానం కలిగిన గురువుల వద్ద అభ్యాస సంగీతం నేర్చుకొని, దీక్షతో శ్రద్ధగా తగినంతకాలం సాధకం చెయ్యడమే కాకుండా, ప్రసిద్ధ గాయకుల సంగీతం విశేషంగా వినిన శిష్యులకు లయజ్ఞానం, స్వరజ్ఞానం, రాగజ్ఞానం అలవడతాయి. ఆ విధమైన కృషి చేయలేని, చేసినా మనోధర్మ సంగీతం అలవడని, విద్యార్థులు చాలామంది ఉంటారు. వీరికే శ్రద్ధ, పట్టుదల, తాపత్రయమూ ఎక్కువగా ఉంటాయి కూడాను. సాధారణంగా ఈ రెండవ తెగకు చెందిన విద్యార్థులను ‘మనోధర్మ సంగీతం చెప్పేదేమిటి?’ అని తోసి వేయడమేనా, వారి చేత కూడా రాగం, స్వరకల్పనా, నెరవూ పాడించడానికి వీలుందా? వీలున్నది అని చెప్పే జవాబే ఈ పుస్తక రూపంగా మనవి చేసుకుంటున్నాను.”

నొటేషన్ లిఖిత పూర్వకంగా రాయడం పట్ల కూడా పినాకపాణిగారికి నిర్దిష్టమయిన అభిప్రాయం ఉంది. “…అభ్యాస సంగీతం క్షుణ్ణంగా నేర్చి సాధకం చేసిన విద్యార్థులకే జ్ఞానం కలుగుతుంది. సాధారణంగా కొద్దో గొప్పో నొటేషను వ్రాయనేర్చిన వారికి పాడిన పాట పాడినట్లే అనుస్వర సహితంగా, లయబద్ధంగా వ్రాయడానికీ పుస్తకం సహకరిస్తుంది. అచ్చంగా పాట పాడినట్లే వ్రాసిన నొటేషను కాకపోతే అది ఎందుకూ పనికి రాదు…” అని సంగీతంలో, ముఖ్యంగా పాటలకి నిర్దిష్టమయిన స్వరరచన ఎందుకవసరమో పినాకపాణి చెప్తారు.

సంగీతంలో ఒక స్థాయికి వస్తే కానీ మనోధర్మ సంగీతం రాదు. సూచనప్రాయంగా సూత్రాలు పాటిస్తూ గురుముఖంగా నేర్చుకున్నా, ఎవరికి వారు స్వతహాగా పెంపొందించుకోవాల్సిన ఈ నేర్పు ఒక పద్ధతిగా నేర్చుకుంటే సులభం అవుతుందన్నది పినాకపాణి వారి అభిప్రాయం. వారి మాటల్లో తరువాత తరాలకి సంగీతం ఎలా అందించాలన్న తపన కనిపిస్తుంది.

“తమిళనాడులో సంగీతం గురువు వద్ద అభ్యసించకపోయినా, సంవత్సరాలపాటు రాగాలాపన విని, విని, వినికిడి అనుభవంతోనే రాగాలు పాడగలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆంధ్రదేశంలో శాస్త్రీయ సంగీతం అంత ధారాళంగా వినబడడానికి మనం నోచుకోలేదు. అందుచేతనే సంగీతం యధావిధిగా నేర్చిన విద్యార్థులకు కూడా రాగం పాడే శక్తి రావడం లేదు. గురువే రాగం పాడుతూ విద్యార్థి చేత పాడిస్తూ నేర్పాలి. చెప్పగా, చెప్పగా అభ్యాసం సంగీతం నేర్చిన విధంగానే రాగం కూడా వచ్చేస్తుంది విద్యార్థికి. నొటేషను వ్రాసి, చదువనేర్చిన విద్యార్థికి ప్రసిద్ధ రాగములలో తరచూ వినబడే సంగతులని స్వరపరిచి వ్రాసిచ్చి, వాటిని కంఠోపాఠంగా వచ్చేవరకూ చెప్పి, పాడించాలి. స్వరకల్పన పాడుతూ పాడించినట్లే రాగం కూడా గురువు నేర్పాలి. కల్పన సంగీతం అభ్యాస సంగీతం వలెనే పాఠం చెప్పి నేర్పించాలి ప్రతీ విద్యార్థికీను…”


డా. శ్రీపాద శతజయంతి వేడుక

మేళరాగమాలిక పినాకపాణిగారి మరో ఉత్కృష్టమయిన సంగీత రచన. కర్ణాటక సంగీతంలో ప్రధానంగా ఉన్న 72 మేళకర్త రాగాలతోనూ చేసిన రాగమాలిక. ఈ 72 రాగాల మేళరాగమాలిక మొదట రచించింది మహావైద్యనాథయ్యర్. పినాకపాణిగారి పుస్తకంలో అసలు ఈ రాగమాలిక ఎలా పాడాలీ, ఏ ఏ రాగాలు పాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలూ, శ్రద్ధా తీసుకోవాలీ అన్న విషయాలు ఎంతో వివరంగా, సులభంగా అర్థం అయేట్టుగా ఉంటాయి. ఈ మేళరాగమాలిక పాడటం ఒక దుస్సాధ్యమనుకునే వారికి పినాకపాణిగారి వివరణ ఒక వరం లాంటిది. అలాగే, కర్ణాటక సంగీతంలో అతి క్లిష్టమయిన ప్రక్రియ రాగం-తానం-పల్లవి లోని పల్లవి సంప్రదాయం గురించి పల్లవి గాన సుధ పుస్తకంలో చర్చించారు. ఇందులో కొన్ని పల్లవులు వీరి శిష్యులు నేదునూరి కృష్ణమూర్తి, మల్లాది సూరిబాబు, తదితరులు వారి కచేరీల్లో పాడేవారు.

//eemaata.com/Audio/sep2012/5.Sripada-Pinakapani-Javali-Vaddani-Nenanatiga-Roopaka-Kapi.mp3వద్దని నేనంటినిగా – జావళీ //eemaata.com/Audio/sep2012/6.Palukuthe__Abheri__Annamayya.mp3పలుకు తేనెల తల్లి – అన్నమయ్య //eemaata.com/Audio/sep2012/7.Mosamaye_Ahiri_Misra_Chapu-Kshetrayya.mp3మోసమాయె – ఆహిరి- క్షేత్రయ్య //eemaata.com/Audio/sep2012/9.gurulEka_eTuvaNTi_guNiki-gaurimanOhari.mp3గురులేక ఎటువంటి గుణికి – త్యాగరాజు

కేవలం సంగీతానికి సంబంధించిన పుస్తకాల రచనే కాకుండా ఆయన స్వయంగా ఎన్నో కృతులకి స్వరాలు కట్టారు. అన్నమయ్య, క్షేత్రయ్య పదాలకు ఎన్నిటికో ఆయన స్వరరచన చేశారు. పినాకపాణిగారే కొన్ని కృతులు, వర్ణాలు కూడా రచించారు. ఈ క్రింది ‘మనసిజ’ హిందోళ వర్ణం, భజగోవిందం వంటివి ఈయన చేతులమీదుగా స్వరాలు దిద్దుకున్నవే!

శ్రీపాద పినాకపాణి స్వరపరిచిన/గానం చేసిన కొన్ని సంగీత రచనలు: 1. మనసిజ – వర్ణము – హిందోళం – శ్రీపాద పినాకపాణి; 2. భజగోవిందం – రాగమాలిక – పూర్వికళ్యాణి – హిందోళం – కుంతలవరాళి – కాపి – ఆదిశంకరాచార్య; 3. కస్తూరీతిలకం – రాగమాలిక; 4. వనితరో – ఏ వన్నెలేలనే – జావళి; 5. వద్దని నేనంటినిగా – జావళి; 6. పలుకు తేనెల తల్లి – అన్నమయ్య
7. మోసమాయె – ఆహిరి- క్షేత్రయ్య; 8. గురులేక ఎటువంటి గుణికి – త్యాగరాజు — ఈ వ్యాసంతో జతచేసినవి, ఆయన ప్రతిభకి ఒక చిన్న మచ్చుతునక మాత్రమే.

స్వతహాగా వైద్యులు కావడం వలన రోగానికి కారణం వెతికినట్లే, సంగీతం ఎలా నేర్పాలి, ఎలా నేర్పితే సులభతరం అవుతుంది అన్నవి ఎంతో ఆలోచన పెట్టి పరిశోధన చేసిన పినాకపాణిగారికి ‘గురుర్బ్రహ్మా – గురుర్విష్ణుః – గురుర్దేవో మహేశ్వరః’ అన్న సూక్తి అక్షరాలా వర్తిస్తుంది.

చాలామంది సంగీత విద్వాంసులకి పాటలు పాడీ, కచేరీలు చేసీ సొమ్ము చేసుకుందామనే ఉంటుంది తప్ప, పదిమందికీ తమ జ్ఞానాన్నీ, విద్యనూ అందించే గుణం ఉండదు. ఉన్నా అది అసంపూర్ణంగానే ఏ కొద్దిమందికో తప్ప అందదు. పినాకపాణి గారి లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అందుకే ఆయన గురువులకి గురువు.


జెజ్జాల కృష్ణ మోహనరావుగారికీ, మేడూరు సుబ్బలక్ష్మి గారికి, తమ వెబ్‌సైట్ నుంచి చిత్రాలకు అనుమతి నిచ్చిన శభాష్.కామ్ వారికీ నా కృతజ్ఞతలు. ఆడియోలు సంగీతంషేర్.ఆర్గ్ వారినుంచి సేకరించబడ్డాయి.

ఉపయుక్త గ్రంథసూచి

  1. సంగీత సౌరభం 1,2,3,4 సంపుటాలు – శ్రీపాద పినాకపాణి – 1999 – తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ.
  2. మనోధర్మ సంగీతం – శ్రీపాద పినాకపాణి – 1992- తెలుగు విశ్వవిద్యాలయం – హైద్రాబాదు.
  3. అన్నమయ్య పదసౌరభం – నాద సుధాతరంగిణి – 1994 – విశాఖపట్నం.
  4. క్షేత్రయ్య పదములు – గిడుగు వేంకట సీతాపతి – 1952- పిఠాపురం మహారాజా వారి ప్రచురణ.
  5. క్షేత్రయ్య పదములు – విస్సా అప్పారావు – 1950 – ఆంధ్ర గాన కళా పరిషత్తు – రాజమండ్రి.
    
   

22అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    chavakiran September 1, 2012 12:31 pm

    శ్రీపాద పినాకపాణి వారి ఈపుస్తకాలు ఇక్కడ http://kinige.com/kbrowse.php?via=author&name=Dr.+Sripada+Pinakapani&id=155

  2. 2
    rama bharadwaj September 1, 2012 2:33 pm

    “శ్రీపాదతో నూకల మూర్తి తదితరులు” అన్న వాక్యం ఉన్న ఫోటోలో ఉన్నది నేదునూరి కృష్ణమూర్తి, స్వామి సచ్చిదానందమూర్తి గారలు. నూకల చినసత్యనారాయణ ఆ పోటోలో లేరు. సవరించగలరు.

    “పలుకుతేనెలతల్లి” లో శ్రీపాదవారి గొంతు రమణీయంగా ఉంది. నేదునూరి మనోధర్మ సంగీతం పై ఆయన గురువు గారి ప్రభావం స్పష్టం గా వినిపిస్తూ ఉంటుంది.

    రమ.

    [తప్పు సరిదిద్దాము. పట్టించినందుకు కృతజ్ఞతలు – సం.]

  3. 3
    రవిశంకర్ September 2, 2012 10:06 am

    వ్యాసం బాగుంది. పైన చెప్పిన ఫొటోలో నేదునూరిగారితో ఉన్నది సద్గురు కందుకూరి శివానందమూర్తిగారు.

  4. 4
    rama bharadwaj September 2, 2012 1:16 pm

    సంపాదకులకి,
    ఆ ఫొటోలో నేదునూరి కృష్ణ మూర్తి గారి పక్కన ఉన్నది సద్గురు కందుకూరు శివానంద మూర్తి అని తెలుసు నాకు. కానీ ఏదో పరధ్యానంగా సచ్చిదానందమూర్తి అని రాసినట్టున్నాను. అది దొర్లిన పొరపాటే! క్షమించి ఆ తప్పుని సవరించండి.

    రమ .

  5. 5
    తఃతః September 4, 2012 4:17 am

    మహనీయులు శ్రీ పినాకపాణి గారి పై మంచి వ్యాసం అందించిన శ్రీ గొర్తికి అభినందనలు.

    ఈవ్యాసానికన్నా ముందే తెలుగులో(కూడా) వస్తున్న పక్ష పత్రిక The Sunday Indian మంగళవారం, సెప్టెంబర్ 4, 2012 సంచికలో నూరు వసంతాల శ్రీ శ్రీపాద వారిపై వ్యాసం చదివాను. విశాఖ పట్నంలొ ఆయన మిత్రులు డాక్టర్ బ్రహ్మయ్య శాస్త్రి గారు తదితరులు శ్రీపాద వారు పిట్టల కూతలకీ, తలుపుల చప్పుళ్ళకీ కూడా నొటేషన్ రాస్తుండేవారని ఆయన కచేరీ చేసిన ఒక సభ లొ అనుకోవడం నేను విన్నాను.
    ఆ సభ లొనే వారు పాడిన “చల్లరే…” [ఆహిరి , త్యాగరాజు] నాకు గుర్తుండి పొయింది.

    The Sunday Indian లో వ్యాసంలో [శాస్త్రీయ]సంగీతంలో ఉన్న సాహిత్యం మీద వారి అభిప్రాయం, చాలా బాధాకరంగా ఉంది. సంగీతంలో ఉన్న సాహిత్యాన్ని ‘పిప్పి’ గా వారు చూస్తారు. వారు ఎంత పెద్ద వారైనా ఈ విషయంలో ఈ పాత కాలపు తమిళ ధోరణి దుర్భరం. ఇదే కారణంగానేమో ధారావాహికగా చాలా సంవత్సరాల క్రితం వచ్చిన వారి ఆత్మ కధలో వారు బాల మురళి ని ప్రస్తావించలేదన్నట్టుగా గుర్తు.[పట్టాభిరామయ్య గారు తనని మెచ్చుకున్నారని అందులొ వారు ఒక చోట అన్నారు]. అలాగే కొత్త రాగాల విషయంలొనూ అన్యాపదేశంగా బాలమురళి మీద ఒక కరుకుదనం వినపడుతుంది. వారి అంతరాంతరాలలొ బాలమురళికి సంగీతం రాదన్న అభిప్రాయం ఉందేమోనని అనిపిస్తుంది నాకు. ఈ విషయం మీద The Sunday Indian వ్యాసం చదివిన వారు గానీ ఇతరులు గానీ యెవరైనా ఈమాటలో రాస్తే చదవాలని ఉంది.

    తఃతః

  6. 6
    మోహన September 4, 2012 3:34 pm

    మంచి వ్యాసము, ఎన్నో క్రొత్త విషయాలు తెలిసినాయి. ఆసక్తి ఉంటే ఏ విభాగములోనైనా రాణించవచ్చును అనే నమ్మకము కలుగుతుంది ఈ వ్యాసము చదివిన తరువాత. ఆ కాలములో తిరుపతిలో పినాకపాణిగారి సంగీత కచ్చేరి విన్నట్లు గుర్తు. 50 ఏళ్ల విషయము, అంశాలు గుర్తుకు రావడము లేదు. బ్రహ్మానందంగారికి అభినందనలు.

    తఃతః గారు తెలిపిన వ్యాసాన్ని చదివినాను – అందులోని కొన్ని చర్చనీయమైన అంశాలను క్రింద ఇస్తున్నాను –

    పాణిగారు: చెరకు గడను మెషీన్‌లో పెడితే ఏం వస్తుంది? రసం వస్తుంది. ఆ రసం సంగీతం, పిప్పి సాహిత్యం.
    సం: కీర్తన చెరుకుగడ అయితే, సాహిత్యము పిప్పి, సంగీతము రసమూను, కీర్తన ఒక వర్ణ చిత్రమనుకొంటే, సాహిత్యము వర్ణలేపనాని కాధారమైన పటము మాత్రమే అని రాశాడు గోపాలకృష్ణముర్తిగారు (పినాకపాణి అన్న). ఇది 1951 భారతిలోని వ్యాసమట. నా దగ్గర ఉందో లేదో చూడాలి.
    పాణిగారు: అవును, అంతే.
    సం. కాని అన్నమయ్య సాహిత్యంలో ఈ మాదిరి ప్రాబ్లం లేదు కదా?
    పాణిగారు: అన్నమయ్య సాహిత్యము అంతేనండి, అది కూడ అంతే. అన్నమయ్య సాహిత్యంలో అచ్చ తెలుగు ఎక్కువ. త్యాగయ్య తెలుగుతోబాటు సంస్కృతం కూడా కలిపాడు. అంతే.
    నా కచ్చేరి జరిగిన మరునాడు వారిని (మంగళంపల్లి పట్టాభిరామయ్య) సమీపించి సలహా అర్థించగా “నేను 50 అసంవత్సరాలనుండి పెద్ద విద్వాంసుల పాట విన్నాను, వారిలోనున్న గుణవిశేషాలన్నీ మీలో నున్నాయి” అని మూడు క్షణాలు ఆగి “మరెక్కడా లేవు” అని గొంతు రెట్టించి అన్నారు.

    అప్పుడూ, ఇప్పుడూ, బహుశా ఎప్పుడూ ఇంతే. కవులకన్న గాయకునికే అందరూ పెద్ద పీట పెడుతారు. సాహిత్యానికి సంగీతానికి ఒకే స్థానము కల్పించబడినా, సాహిత్యాన్ని చిన్న చూపుతోనే చూస్తారు. చిన్న సందేహం, సినీరంగములో గాయకునికి, కవికి ఒకే విధమైన పారితోషికమా లేక తరతమ భేదము ఉన్నదా? సంగీతమే అంత ప్రధానమయితే మఱుగేలరా ఓ రాఘవా కు బదులు లలలాలలా లా లాలలా అని ఎందుకు పాడుకోరాదో?

    విధేయుడు – మోహన

  7. 7
    Brahmanandam Gorti September 5, 2012 12:36 am

    తః తః గారికీ, మోహన గారికీ మీ అభినందనలకి సంతోషించాను.

    తఃతః గారిచ్చిన లింకులో వ్యాసం చదివాను. పినాకపాణి లాంటి మేధావులు పాటల్లో సాహిత్యం గురించి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. పాటల్లో సాహిత్యం నిజంగా పిప్పి అయితే మరెందుకు క్షేత్రయ్య పదాలకి ఆయన వరసలు కట్టారో అర్థం కావడం లేదు. మరీ ఘాటుగా చూస్తే క్షేత్రయ్య పదాల్లో శృంగారం పాలు ఎక్కువే. అది సాహిత్య పరంగా ఇబ్బంది కానప్పుడు మామూలు పాటల్లో సాహిత్యం తుక్కు అనడం వింతగా వుంది. రాళ్ళపల్లి వారు కూడా త్యాగయ్య కృతుల్లో సాహిత్యం పాలు తక్కువన్నారు. అన్నమయ్య పాటల్లో సాహిత్య గుబాళింపులే ఎక్కువని పొగిడారు. సంగీతానికి సాహిత్యం ఉంటేనే ప్రజల నాలుకల మీద నానుతుంది. పూర్వం సాహిత్యం లేకుండానే కచేరీలు చేసుకునే వారు. అందుకే మామూలు జనం సంగీతానికి దూరంగా పారిపోయారు. పురందరదాసూ, రామదాసూ, త్యాగయ్యా, అన్నమయ్యా వంటి వారు కాస్తో కూస్తో సాహిత్యపు మెరుగులు అద్దాకే ప్రజలకి సంగీతం పట్ల అభిరుచి ఎక్కువయ్యింది. కేవలం స్వరాలతోనే పాడితే అది అనుభూతి రహితంగా ఉంటుంది. ఏ కళయినా అనుభూతికి దూరంగా మనలేదు.

    ఇహ బాలమురళి గురించి చాలామంది పలురకాలుగా విమర్శలు చేసారు. నటులందరూ దర్శకులు కాలేనట్లే, గాయకులందరూ వాగ్గేయకారులూ, సంగీతజ్ఞులూ కాలేరు. కొంతమందికి అలా అనిపించుకోవాలన్న కోరిక వుండచ్చు.
    కొత్తవి కనుక్కోవాలన్న ముచ్చట తప్పేమీ కాదు. త్యాగరాజు ఒకటే పాటని కొన్ని కొన్ని రాగాల్లో కట్టాడనుకున్నా, అవన్నీ చక్కటి పాటలే కదా? పాట వినేటప్పుడు చెవిని మొదట చేరేది స్వరాలు కావు. దాన్ని అంటిపెట్టుకున్న అక్షరాలే రసస్పందన్ని కలిగిస్తాయి. ఏమయినా సంగీతకారులకి సాహిత్యం అంటే తక్కువ అభిప్రాయమే ఉండడం అనాదిగా చూస్తూనే ఉన్నాం. ఇదేమీ కొత్త కాదు.

    -బ్రహ్మానందం

  8. 8
    తఃతః September 5, 2012 2:24 am

    శ్రీ మోహన: సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం. గాయకులను నట విటుల్లొ కలిపేశారు. ముఖ్యంగా మన దక్షిణాది సంప్రదాయంలో గాయకులకు గౌరవం వారు పాడు తున్న భక్తి సాహిత్యం నుంచి వచ్చింది. వారు భాగవతారులుగా పరిగణింపబడ్డారు.

    వేదాన్ని పాడకూడదన్న నియమం ఉన్నదనీ, కవి అన్న పదం వేదంలో సాక్షాత్తూ భగవంతుని సూచించే పదంగా ఉన్నదనీ కవిని స్వయంభువుగా పరిభువుగా వేదం అభివర్ణిస్తుందనీ పెద్దల నుంచి విన్నాను. [ఈ కారణంగానే పద్యాలను రాగాలు తీసి పాడేవాళ్ళంటే నాకు కొంత చిన్న చూపు. పౌరాణిక నాటకాలలో నటుల్లొ పీసపాటి వారి పద్ధతి నాకు చాలా ఇష్టం ]

    సంగీతాన్ని పొగుడు తున్నప్పుడు సాధారణంగా దొర్లించే, ” శిశుర్వేత్తి …” నిజానికి సాహిత్యం యొక్క గొప్పదనాన్ని సంగీతంతో పోల్చి చెప్పినది. కృష్ణ శాస్త్రి గారి ఒక పాటకు వరస చేసి శాస్త్రి గారికి పాడి వినిపిస్తున్నప్పుడు శ్రీ వోలేటి శాస్త్రి గారి పాదాల చెంత కూర్చున్నారని విన్నాను. సచిన్ దేవ్ బర్మన్ తో సాహిర్ లూధియాన్వీ ప్యాసా పాటల విషయంలో ఈ కారణంగానే విబేధించాడు.

    మనోధర్మ [కర్ణాటక] సంగీతం అంటె నా అభిప్రాయంలో సాహిత్యాన్ని మనసుకు ఎక్కించుకుని తదనుగుణంగా పాడేదే. “సామజ వర గమన ” అంటే అర్థం తెలీకుండా సంగీతం నేర్పే వాళ్ళను -పెద్ద సంగీత సంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను – నేను చూశాను అటువంటివాళ్ళు యెంత ‘మనోధర్మ’సంగీతం పాడతారా అన్నది నా మనో ధర్మ సందేహం.

    सुकविता यद्यस्ति राज्येन किम् ॥
    “సుకవితాయద్యస్తి రాజ్యేన కిం”

    నమస్కారాలతో
    తఃతః

  9. 9
    మోహన September 5, 2012 4:16 pm

    తః తః గారు,
    సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం.
    నేను నా అభిప్రాయాన్ని క్రింది శ్లోకముపైన ఆధారము చేసికొని వ్రాసినాను –
    సంగీత మపి సాహిత్యం
    సరస్వత్యా స్తనద్వయం
    ఏక మాపాత మధురం
    అన్య దాలోచనామృతం
    నా ఉద్దేశములో ప్రజలు ఎక్కువగా సంగీతాన్ని ఎందుకు ఆదరిస్తారంటే, దానిని వినేటప్పుడు సామాన్యముగా మరే ఆలోచన చేయనక్కరలేదు. కాని సాహిత్యపు సంగతి అలా కాదు. చదివేటప్పుడు కాని, వినేటప్పుడు కాని కొద్దిగానైన ఏకాగ్రత చూపాలి. లేకపోతే ఏమి అర్థము కాదు. నా ఉద్దేశములో కవిత్వము పాడుటకు ఉపయోగపడేటట్లు మాత్రమే వ్రాయాలి. సంగీతము ఆ పాటలోని భావాన్ని బాగుగా బహిర్గతము చేయాలి. అప్పుడే ఆ సరస్వతీదేవికి సంతృప్తి కలుగుతుంది. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అంటే ఆ తల్లిని అవమానించినట్లే. విధేయుడు – మోహన

  10. 10
    Srinivas Vuruputuri September 6, 2012 3:16 am

    పాటలో సాహిత్యం గౌణమనే శ్రీపాద వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. సాహిత్యం సహాయం లేకుండా కర్నాటక సంగీతాన్ని ఆనందించగలగడం కనీసం కొన్ని సందర్భాలలో వీలు పడుతుంది కదా.

    ఈమని వీణ మీద విన్న “రఘు వంశ సుధాంబుధి…”, ఎల్.సుబ్రమణ్యం వయొలిన్ పై వినిపించిన “బ్రోవ భారమా…” రెండింటినీ కృతి సాహిత్యంతో పరిచయం లేకుండానే విని ఆనందించగలిగాను నేను. ఆ తరువాత విన్న ఎమ్మెస్ అమ్మ పాడిన “రఘువంశ సుధాంబుధి” నాకు వాద్యం మీద విన్నప్పటి ఆనందాన్నివ్వలేక పోయింది. “బ్రోవ భారమా” సాహిత్యాన్ని చదువుకున్నప్పుడు “ఓస్, ఇంతేనా!” అనిపించింది.

    మొన్నెప్పుడో చదివాను: “‘కృష్ణా నీ బేగనే బారో’ పాడినప్పుడు కృష్ణుడి మీద భక్తి కాదు నాకు ముఖ్యం, యమన్ కల్యాణి మీదే నా శ్రద్ధ అంతా” అన్నారట బాంబే జయశ్రీ. సాహిత్యభావం-రాగభావం ఒకటి కావని, గాయకుడికి రాగభావమే ముఖ్యమని రాళ్ళపల్లి వారన్నారు ఓ ఆకాశవాణి సంభాషణలో.

    సాహిత్యమే ప్రధానమనుకుంటే – దాని వెనకాలే గాయకుడి ఉచ్చారణా దోషాలు, వాగ్గేయకారుడి భావజాలం, గాయకుడి/శ్రోతల సైద్ధాంతిక నేపథ్యం, కళలను ప్రజల పరం చేయాల్సిన ఆవశ్యకతా… లాంటి “noisy” సమస్యలన్నీ చర్చలోకి ప్రవేశిస్తాయి. అవన్నీ అనవసరమని నేను అనను గానీ ఇంత చర్చలో సంగీతం ఆపాతమధురం కాకుండా పోతుందని భయం.

    అన్నట్లు హిందుస్థానీ సంగీతంలో సాహిత్యానికి అట్టే విలువ లేదు కదా…

  11. 11
    rama bharadwaj September 6, 2012 2:28 pm

    నండూరి పార్ధసారధి గారు శ్రీపాద పినాక పాణి గారిని చేసిన ఇంటర్వ్యూ ఆసాంతం చదివాకా నాకు అర్ధమైన విషయాలు ఇవి. సాహిత్యం గురించి తక్కువగా శ్రీపాద వారు ఏమీ అనలేదు. ఆయన ఆ మాటల్ని అన్న సందర్భం అక్కడ పూర్తిగా వేరు. సంగీతకారులకి రాగం పాడేటప్పుడు దాని మీద ఎక్కువ శ్రధ్ధ ఉంటుందే తప్ప ఆ రాగానికి సహాయకారిగా ఉన్న అక్షరాల మీద ఏమాత్రమూ కాదు అన్నది శ్రీపాద పినాకపాణి గారి భావన. ఇది కృతుల లోని సాహిత్యానికి సంబంధించిన విషయమే గానీ విడిగా సాహిత్యం మొత్తానికి గానూ లేదా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులని గురించి గానీ ఆయన చేసిన వ్యాఖ్య కాదు. అలాగే సాహిత్య ప్రేమికులైన వారి అన్నగారు సైతం కావ్య సాహిత్యాన్ని కవిత్వాన్ని గురించి అన్నది కాదది. వాగ్గేయకారుల రచనలని మాత్రమే ఆయన ప్రస్తావన చేశారు “సాహిత్యం” అని అన్నప్పుడు. ఆయనకి కూడా – గానం లోని రాగ స్వరూపమే ముఖ్యం అంతే! అందుకు ఉపయోగపడే అక్షర సముదాయం కాదు. అందుకే సాహిత్యానికి ఎంతో అభిమాని అయిన ఆయనే వారి అమ్మాయి “డుబుక్కు” 🙂 లని పాడుతూ ఉంటే ఏమాత్రమూ పట్టించుకోలేదు. అందుకు ఇబ్బంది కూడా పడలేదు. “వాగ్గేయకారుల రచనలలో కవిత్వం గురించి వెతకడం దండగ” అన్న అభిప్రాయాన్ని ఈ శ్రీపాద బ్రదర్స్ వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు.

    అందువలననే త్యాగరాజు మంచి సంగీతకారుడే గాని మంచి కవి కాదు అని వారు అనుకున్నారు. ఇందులో అంతగా విబేధించవలసిన అవసరం నా వరకూ నాకేమీ కనిపించలేదు. చాలా సార్లు ఆయన రచనలని విన్నప్పుడు అది నిజమే కూడాను అని నాకు అనిపించినది సత్యమే! అయితే అక్కడ త్యాగరాజు గారి ప్రధాన ఉద్దేశ్యం కూడా తన సంగీతమే తన రామ భక్తే! ఆయన కవిత్వం రాస్తున్నానని బహుశా అనుకోలేదేమో? లేదా ఆయనకి శక్తి చాలకనే కవిత్వం రాయలేదో లేక సంగీతానికి అవసరమైనంత అక్షరాలని చాలు లెమ్మని అనుకునే రాయలేదో మనం ఇవాళ చెప్పలేకపోయినా, సాహిత్యం దృష్ట్యా చూస్తే మాత్రం త్యాగయ్య తప్పక కిందిశ్రేణి కవి గానే అనిపించక మానడు. ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను శ్రీపాద వారి అభిప్రాయం కేవలం కృతులలోని కీర్తనలలోని సాహిత్యం మాత్రమే! ఆయనకి ఒక గాయకునిగా తాను పాడే కృతిలోని సంగీతమే ముఖ్యం గానూ సాహిత్యం ఆ తరువాతిది గానూ అనిపిస్తే అందులో విడ్డూరం నాకేమీ కనిపించలేదు మరి.

    అయితే ఇది వాగ్గేయకారుల అందరి రచనలలోనూ పూర్తిగా నిజమా? అందులో కవిత్వం ఉండదా అంటే చాలాసార్లు ఉండకపోవడాన్నే మనం గమనించవచ్చు. ఒక్క అన్నమయ్య మాత్రమే ఇందుకు మినహాయింపు. అయితే ఒక సాహిత్య స్వరూపాన్ని సంపూర్తిగా ఆవిష్కారం చేయాలీ అంటే అది సంగీతపు జంజాటం లేని పక్షం లోనే సాధ్యం అని కూడా మనం చెప్పవచ్చు. అందువలననే సంగీతం కోసం పాడుతున్నప్పుడు సాహిత్యం గురించి పట్టించుకోనవసరం లేదని వారు అనుకున్నదీ, అన్నదీను. ఈ రెండూ రెండు రకాలైన విషయాలు.

    ఐతే మరి మనకెందుకని సంగీతం పాడేవాళ్ళు అక్షరాలని చిత్రవధ చేసి పాడుతున్నప్పుడు చెప్పనలవి కాని బాధ కలుగుతున్నాదీ అంటే తెలుగు భాష లోని వాళ్ళకి ఆ భాష మీద ఉండే మమకారం అత్యంత సహజం! మనం దాని ఉచ్చారణలో ఎటువంటి అపసవ్యతనీ సహించలేం! కష్టం అది మనకి. అయితే అది సంగీతం పాడేవారికి మాత్రం సమస్య కావడం లేదు. అక్కడ వారి దృష్టి వేరు. గాయకులుగా వారు రాగానికే బాధ్యులు గానీ అక్షరానికి కాదలుచుకోవడం లేదు. వాళ్ళకి సంగీతపు పానం చేయడంలో రాగపు రసం గ్రోలాలి. సాహిత్యాన్ని పిప్పిగా పక్కకి పడేయడానికి వాళ్ళు వెనకాడటం లేదు అని మనకి పినాకపాణి గారి మాటలు తెలియజేస్తున్నాయి అయితే ఇక్కడ మళ్ళీ ఒక తేడా చాలా స్పష్టం గానే మనముందుకి వస్తూంది. అదేమంటే ఈ ఉచ్చారణా రీతి తెలుగు వచ్చిన వారిలో ఒక తీరుగా ఉండి మళ్ళీ పరాయి భాష వారి గాత్రంలో అదే కృతి మరొక తీరున పలకడం. ఇందుకు మాతృభాష అయిన వారు మరీ అంతగా తప్పులని పలకలేకపోవడాన్నే మనం కారణంగా అర్ధం చేసుకోవాలి.

    అయితే ఇక్కడ భక్తి అన్న అంశం కూడా అంతే ముఖ్యమైనది. ఆ రామ భక్తే తనని నడిపించకపోయి ఉంటే అంతటి త్యాగయ్య కేవలం సంగీతం కోసమే ఏవో కృతులూ వర్ణాలూ అంటూ అల్లేవారా? త్యాగయ్య సంగీతానికి మూలమైన రామ భక్తిని మనం తక్కువ అంచనా వేయలేము. అయితే మళ్ళీ భక్తి భావం వేరు. సాహిత్యపు స్థాయి వేరూను. మనం ఈ రెండింటినీ కలిపి చూడకూడదనే నేననుకుంటాను.

    అందువల్లనే “సాహిత్యం కావాలని అనుకునే వాళ్ళు సంగీతం వినడానికి రావడం దండగ” అని పినాకపాణి గారు అక్కడ అలా అన్నది. అది బయటకి కొంత కరుకుగా వినిపిస్తున్నా వారి సంగీతపు పరిమితి లోని సాహిత్యానికి సంబంధించి అది అక్కడ సత్యమే మరి. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తూందంటే వారన్న “సంగీతమూ సాహిత్యమూ రసమూ పిప్పీ” లాంటి పోలికలని ఒక విస్తృతార్ధంలో మొత్తం సాహిత్యానికి కాక పరిమితమైన అర్ధంలో కేవలం సంగీత రచనల వరకూ మాత్రమే అని మనం అర్ధం చేసుకోవాలి. అప్పుడు శ్రీపాద వారి అభిప్రాయం పట్ల అంత కోప ప్రకటన సాహిత్యం మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేయనవసరం లేదని తెలుస్తుంది.

    అయితే గాయకులు ఎక్కువాను కవులు తక్కువానా? అన్నారు మోహన గారు. మోహన గారూ! పినాకపాణి గారి మాటలని మీరు మిగతా చోట్లకి అంతగా విస్తృతపరిచి చూడనవసరం లేదు. వారు మంచి కవులు అయినప్పుడు వారు ఏది రాసినా బహుబాగుగా రాయగలరు. అక్కడ అది ఏ చోటైనా ఏ ప్రక్రియ అయినా ఎప్పుడైనా కవిత్వానిదే పై చేయి అవుతుంది. అలాంటి రచనల విషయంలో శ్రీపాద పినాకపాణి గారు కాదు కదా ఎవరేమన్నా అది ఒప్పదు. అలాగే ఆ రాసే వారి లోని ప్రతిభ అందుకు తగిన స్థాయిలో లేదంటారా అక్కడ అక్షరపు ప్రభావం ఏమీ ఉండదు. ఇంక సినిమా రంగమూ అక్కడి పారితోషికాలూ సంగీతపు సాహిత్యపు తూనిక రాళ్ళు కానేరవు. సినిమా రంగాన వారు ఉత్తమ కవులనైనా తక్కువగా కొనగలరు. డబ్బులు వస్తాయని అనుకుంటే ఒక డబ్బా సంగీత దర్శకుని ముందు డబ్బులు కుమ్మరించనూగలరు.

    కాకపోతే పినాకపాణిగారు అన్నమయ్య విషయంలో మాత్రం అన్నమయ్య అక్షరం గురించి సరిగ్గా తెలియక నోరు జారారనే అనుకోవాలి. పినాకపాణి గారికి తెలుగు భాషా సాహిత్యాల గురించేమీ అంతగా తెలిసినట్టు లేదు. అన్నమయ్య గురించి అంటూ “ఆయన అచ్చతెనుగు రాసేడు” అనో లేదా త్యాగయ్య అక్షరాన్ని గురించి చెబుతూ ” త్యాగయ్య సంస్కృతమూ తెలుగూ కలిపి రాసేడు” అనో అన్నమాటలు మనకి ఏమీ ప్రత్యేకంగా చెప్పవు. దానికీ అన్నమయ్య గారి కవితా బలానికీ ఏమి సంబంధం? అన్నమయ్య గారు తన పద్నాల్గు లైన్ల పదాలలో అంత గొప్ప కవిత్వాన్ని పలికించడం అన్నది తప్పకుండా ఆయన అసమాన ప్రతిభకి తార్కాణమే! అన్నమయ్యకి బహుశా తన భావ ప్రచారం ప్రధానమూ సంగీతం అటు తరవాతా అయి ఉండాలి. లేదూ సహజం గానే కల్పనాచతురుడై ఉత్తమ భావుకుడైన ఆయన పరిమితమే అయిన తన పద చట్రంలోనే కవిత్వాన్ని అంత అలవోకగా ఒలికించి ఉండాలి. అన్నమయ్య గారి సాహిత్యం విషయం లో మాత్రం శ్రీపాద పినాకపాణి గారి అభిప్రాయం అయోమయంగానూ కాస్త తొందరపాటుగానూ అపరిపక్వంగానూ మిగిలిపోతుంది.

    రమ

  12. 12
    Brahmanandam Gorti September 6, 2012 3:10 pm

    ఇలాంటివి చాలా దుందుడుకు అభిప్రాయాలు:
    “‘కృష్ణా నీ బేగనే బారో’ పాడినప్పుడు కృష్ణుడి మీద భక్తి కాదు నాకు ముఖ్యం, యమన్ కల్యాణి మీదే నా శ్రద్ధ అంతా” అన్నారట బాంబే జయశ్రీ.

    మరి యమన్ కల్యాణి మీదే శ్రద్ధ ఉన్నప్పుడు పాటెందుకు పాడడం. చక్కగా రాగాలాపన చేస్తూ కచేరీ చేయొచ్చుకదా? సంగీతం గురించి సాహిత్యకారుల వ్యాఖ్యలకి ఎలా విలువుండదో అలాగే పాటల్లో సాహిత్యంపై సంగీత కారుల వ్యాఖ్యల్నీ పట్టించుకోనవసరం లేదు. సాహిత్య రహితంగా ఒక కచేరీ చేసి, మామూలు శ్రోతలని అవసరం లేదు, సంగీతం వచ్చిన వాళ్ళనే రంజింపచేయమనండి. ఎంతమంది అటువంటి కచేరీలకి వెళతారో?
    ఇదంతా ఎందుకంటే – మనం కూడా ఇలా వితండ వాదం చెయ్యచ్చు.

    పాట పాడేటప్పుడు స్వరాలు తప్పితే సంగీతకారులు ఎంత తప్పుగా పరిగణిస్తారో, సాహిత్యాన్ని ఉచ్ఛారణ దోషాలతో ఖూనీ చేయడం సాహిత్యకారులూ ఖండిస్తారు. ఒకటి ఎక్కువా, మరొకటి తాక్కువా కాదు. రెండూ కలిసున్నప్పుడు ఆ రెండు కళలకీ గౌరవం ఇవ్వడం సంస్కారం. అది లేనప్పుడే కళలమీదా, కళాకారులమీద గౌరవం పోతుంది.

    పాటలో సాహిత్యం గౌణం అన్న శ్రీపాదవారే క్షేత్రయ్య పదాలు ఎంత భావ స్పూర్తినీ , రస స్పందన్నీ కలిగిస్తాయో అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పాటల్లో సాహిత్యం తుక్కు అన్న రాళ్ళపల్లి వారే అన్నమయ్య కీర్తనల్లో సాహిత్యాన్ని ఆకాశానికి ఎత్తేశారు. త్యాగరాజు – ఎందరో మహాను భావులు” కీర్తనలో భావం ఎంత గొప్పదో అన్న వారే కొన్ని కీర్తనలు ఏరి, వీటిలో సాహిత్యం లేదనీ అన్నారు. ప్రతీ వ్యాఖ్యకి సమయం, సందర్భం ఉంటాయి కదా? వారు ఏ వయసులో, ఏ కాలంలో, ఏ సందర్భమ్లో అటువంటి వివాద వ్యాఖ్యలు చేసారో చూడ్డం చాలా అవసరం.
    అన్నింటికీ అన్నీ ఆపాదిస్తే వచ్చే చిక్కే ఇది.

    రాళ్ళపల్లీ, శ్రీపాద వారి వారి రంగాల్లో మేధావులే, ఎవరూ కాదనరు. కానీ వారేం చెప్పినా అదే వేదం, ప్రమాణం అని అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు.

    -బ్రహ్మానందం

  13. 13
    Aruna September 6, 2012 11:30 pm

    ఇక్కడ అంతా పెద్దవారు సంగీత జ్ఞానం ఉన్నవారు మాట్లాడుతున్నారు. నాకు పెద్దగా సంగీత జ్ఞానం లేకపోయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. త్యాగరాజు, అన్నమయ్య ప్రస్తావన వచ్చింది, మరి వారు రచించినవి భగవంతుని కీర్తిస్తూ, పొగుడుతూ, తెగుడుతూ కూడా వ్రాసారు. శాస్త్రీయ సంగీతం లో దాదాపు ౯౦% రచనలు భక్తి సంప్రదాయాన్ని అనుసరించి ఉన్నవే. మరి అందులో భావము వదిలేస్తే పరిపూర్ణత ఉంటుందా? నేను చిన్నప్పుడు వీణ ఒక తమిళ్ టీచర్ దగ్గర నేర్చుకున్నాను. ఆమెకు తెలుగు రాదు కాని తెలుగు లోనే వ్రాసి ఇచ్చేవారు. కాని ఏ రోజు పాడనే లేదు.అర్ధం కూడా చెప్పలేదు. ఏమైనా చెప్పినా అర్ధం అయ్యే వయసు కాదు కూడా. ఇప్పుడు మల్లి ౩౫ వస్త్రాల తరువాత సంగీతం ఒక తమిళ్ టీచర్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఆమెకు తెలుగు వాళ్ళంటేనే చిన్న చూపు. ఆమె దగ్గర ఉన్న తెలుగు వాళ్ళకి కూడా అదే ఉద్దేశ్యం. సో వాళ్ళు ఆమె ఏది నేర్పితే అదే కరెక్ట్ అనే రకం. కాని ఏమైనా సాహిత్యంలో దోషాలు ఉంటే సరి చేస్తే నచ్చదు.

    నాకు భావముతో కూడి పాడితేనే తృప్తి. లేదంటే ఏదో ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ తో పాడించవచ్చు కదా? భగవంతుని నామ స్మరణ మనస్పూర్తిగా అవగాహనతో చేయటం వేరు, కాసేట్ ప్లే చేయటం వేరు కదా? అందుకే త్యాగరాజు, అన్నమయ్య వంటి వాళ్ళతో కంపేర్ చేయటం మంచిది కాదు. టెక్నికల్ ఎక్సలెన్స్ ఉండవచ్చు. కాని నాద ఉపాసకులు కావడం కష్టం.

  14. 14
    తఃతః September 7, 2012 12:34 am

    సాహిత్యభావం-రాగభావం ఒకటి కావని, గాయకుడికి రాగభావమే ముఖ్యమని రాళ్ళపల్లి వారన్నారు ఓ ఆకాశవాణి సంభాషణలో.

    నమస్తే శ్రీనివాస్: రాగానికి భావము అంటూ ఒకటి ఉంటుందా? రాగానికి సంచారాలు మాత్రమే కదా ఉంటాయి. రాగానికి భావము ఉండదు అని అనటంలొ నేనేమయినా పొరపాటు చేస్తున్నానా ? నాకు తెలిసినంత వరకూ రాగానికి ఒక నిర్ధిష్టమైన భావము అని ఉంటుందని బాలమురళి అనరని అనుకుంటాను.

    “‘కృష్ణా నీ బేగనే బారో’ పాడినప్పుడు కృష్ణుడి మీద భక్తి కాదు నాకు ముఖ్యం, యమన్ కల్యాణి మీదే నా శ్రద్ధ అంతా” అన్న బాంబే జయశ్రీ మాటలని వినే అదృష్టం వ్యాసరాయర్ కి లేకపొయింది. శాస్త్రీయ సంగీతంలో సాహిత్యం ప్రాధాన్యత లేనిదే అని అంగీకరించినా ‘సాహిత్యం పిప్పి’అని (ప్రధానంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో) శ్రీ పినాకపాణి అనటం ఎటువంటి సందేశం ఇస్తుంది?

    (నా దురదృష్టం ఏమిటొ తెలీదుకానీ ఎమ్మెస్ అమ్మ పాడిన ఏ పాటా నేను ఇష్టంగా వినలేను)
    తఃతః

    తా. క.: ఆపాతమధురమైన సాహిత్యమూ ఆలోచనామృతమైన సంగీతమూ ఉన్నాయని రాళ్ళ పల్లి వారన్నట్టు గుర్తుకొస్తోంది

  15. 15
    Srinivas Vuruputuri September 7, 2012 10:59 am

    తః తః గారికి నమస్తే. రాగ భావం అనే మాట ఉంది అని గూగుల్ చెబుతోంది. 🙂

    శ్రుతి పత్రికలో “సాహిత్యం-సంగీతం” విషయమై ఓ వ్యాసం రాసారు. అందులోంచి:

    “Once sahitya is introduced, it is a musician’s duty to render it correctly, do justice to its structure and harmonise the sahitya bhava with the raga bhava. The mere fact that this is not being done by many musicians does not invalidate the general point that such harmony enhances musical enjoyment…”

    – శ్రీనివాస్

  16. 16
    Gopal Nemana September 8, 2012 2:01 am

    మా బ్రహ్మానందం ఈ వ్యాసాన్ని బ్రహ్మాండంగా వ్రాసి నన్ను బ్రహ్మానందభరితుణ్ణి చేసేడు. వ్రుద్ధుడినీ, వైద్యుడినీనైన నాకు పినాకపాణిగారి కచ్చేరీలు ఆలిండియా రేడియోలోనూ, అప్పుడప్పుడూ విజయవాడ కేంద్రం నించీ ప్రసారాలూ వినడం గుర్తు కొస్తున్నాయి. ఆప్పట్లో ఆయనకి సంగీతం వ్రుత్తీ, వైద్యం హాబీ అనుకునేవారు. ఈ వ్యాసంలో మళ్ళా ఆయన గొంతుక వినిపించడం అద్రుష్టమే. ఆయనని శతాయుష్కునిగా చూడడమూ అదృష్టమే.

  17. 17
    Bharani September 11, 2012 4:56 pm

    సంగీత సౌరభం పుస్తకం ఎక్కడ దొరుకునో దయ చేసి చెప్పగలరు, వ్యాసము చాల బావుంది.

  18. 18
    Madhav September 21, 2012 2:30 pm

    శ్రీ శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారు భారతి పత్రిక 1952 సెప్టెంబర్ సంచికలో త్యాగరాజ సాహిత్యము అనే పేరుతో రాసిన వ్యాసప్రతిని ఈమాటలో ఉంచాము. ఈ వ్యాసాన్ని అందించిన జెజ్జాల కృష్ణ మోహనరావు గారికి కృతజ్ఞతలు.

    సంపాదకులు.

  19. 19
    Sridevi Josyula September 28, 2012 3:16 pm

    శ్రి సాయి బ్రహ్మానందం గారు, మీ ఈ వ్యాసం చాలా బాగుంది. ఎన్నో మంచి విషయాలు విపులంగా వివరించారు, కృతజ్ఞతలు. శ్రిదేవి.

  20. 20
    శ్రీధర, శ్యాం September 28, 2012 7:20 pm

    “రాళ్ళపల్లీ, శ్రీపాద వారి వారి రంగాల్లో మేధావులే, ఎవరూ కాదనరు. కానీ వారేం చెప్పినా అదే వేదం, ప్రమాణం అని అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు.”

    రాళ్ళపల్లి వారు సంస్కృతాన్ధ్ర ప్రాకృత కన్నడ భాషా పండితులు, కవి, వాగ్గేయకారుడు, సంగీత శాస్త్రజ్ఞుడు. ఆయన విషయ జ్ఞాన పరిధి, లోతు రెండూ ఎక్కువే. (అయినా కూడా ఆయన అభిప్రాయం వేదంగా తీసుకోనవసరం లేదు, మన ఆలోచన స్వేచ్ఛ మనది).

    సంగీతం లో సాహిత్యం పై ఆయన AIR ముఖాముఖిలో క్లుప్తంగా “రామ నీ సమానమెవరు” పంక్తితో ఉదహరించినారు.

    భావం అనేది నిర్వికారం. దానిని వ్యక్తపరచడానికి భాష కావాలి. రాళ్ళపల్లి వారు మహా పండితులు, అన్నమాచార్యుల “project” కు ఒక రూపు ఇచ్చిన భక్తి సంపన్నులు, కాబట్టి “రామ నీ సమానమెవరు” ఎన్నుకున్నారు. (ఈ రెండు గుణాలు ఏ కోశాన లేని నేను) దీనికి ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, మన గద్దర్ పాటలు శుభపంతువరాళి లో పాడుతే రక్తం ఉడికి ఉఱ్ఱూతలు ఊగదు సరి కదా, నేనైతే పోయి గద్దర్ ను తిరిగి కొట్టిఉండే వాడిని. పోనీ, గద్దర్ పాడినట్లుగానే, అదే ఊపుతో “గోంగూర పచ్చడి” గురించి పాడుతే, నీ రక్తం మరగదు కదా, కాబట్టి సాహిత్యం ప్రధానం, అని ఇచట సాహిత్య పిపాసులు అడగవచ్చు! కానీ, ముందుగా చెప్పినట్లు భావం ప్రధాన్యం, ఆ ఆక్రోశం పెల్లుబికడానికి ఆ భావం మాటలను/పదాలను/వాక్యాలను నిర్దేశిస్తుంది, కాబట్టి ఆ భావానికి వ్యక్తపరచ తగు మాటలు ఎన్నుకోబడతాయి. (గోంగూర పచ్చడి లో కారం దట్టిస్తే, రక్తమేమి, పంచ ప్రాణాలు మరగవచ్చు, అది వేరే చర్చ!) అందువల్లే, ప్రసిద్ధ వాగ్గేయకారులు చాలా మటుకు స్వరాలను బట్టి సాహిత్యం కూర్చారు అని వింటూఉంటాము.

    భావ ప్రకటనకు అనేకులు అనేక సాధనాలు వాడుతారు, కవిత్వం, చిత్రలేఖనం, శిల్పాలు చెక్కడం, నాట్యం, సంగీతం ఇత్యాదివి.

    నాట్యానికి, సంగీతానికి ఒక చిక్కు ఏమిటంటే, అవి ఒక సకార/సగుణ సందేశం ఇవ్వదలుచుకుంటే, భాష అవసరమవుతుంది. నీళ్ళు, మంచు గడ్డ ల వలె, సంగీతానికి సాహిత్యం సకార రూపం ఇస్తుంది. కేవలం నిరాకార సంగీతానికి సాహిత్యం అనవసరం.

    సంగీత ప్రదర్శనలోని ముఖ్యాంశంలో, సింహ భాగం ఆలాపన, నెరవు, స్వరవిస్తారాలవే. పాడే సాహిత్యం లో కూడా పల్లవి లోని పదాలను రకరకాలుగా విరిచి, స్వర గమకాలతో వేరు వేరు కాలాలలో సంగీత విన్యాసాలతో అలంకరించి గాని అనుపల్లవి, చరణాలకు పోరు. అంటే ఆలాపన (నిరాకార రూపం) తో ఒక విస్తారమైన వేదిక ను ఏర్పాటు చేసి, దానిపై (సకార రూపం) సాహిత్యాన్ని ప్రవేశ పెట్టి, తరువాత స్వరకల్పన (మళ్ళా నిరాకార రూపం) తో ముగిస్తారు.

    అసలు “సాహిత్యం” అనే పదమే ఒక పెద్ద చిక్కు. “సాహిత్యం” అనే ప్రౌఢ శబ్దం వినగానే నాకైతే, ఛందస్సులు, అలంకారాలు, ఉపమానాలు, సమాసాలు ఇవన్నీ గుర్తొచ్చి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. (ఈ సంచిక జెజ్జాల మోహన వ్యాసానికి గగుర్పాటు కూడా వచ్చింది). “సాహిత్యం” బదులు lyrics/మాటలు అనే కొంచం సాధారణ పదం వాడి ఉంటే, సాహిత్య పండితులు, పాటలలో తద్ సాహితీ సూక్ష్మాలు, విశేషాలు శోధించే వారు కారేమో!

    అన్నమయ్య కీర్తనకారుడు, కాబట్టి ఆయనను ఈ చర్చలోకి లాగకూడదేమో!

    ఇహపోతే, భావం ముఖ్యం, మిగతాది బావి లోకి అనేది కూడా పూర్తిగా సమర్థనీయం కాదేమో, ఎందుకంటే కృతికర్త యొక్క సందేశం సాహిత్యం లో పొసిగి ఉంటుంది. కాకపోతే భాషేతరులలో స్వల్ప సాహిత్య దోషం సంగీత దృష్టితో చూడాలి.

  21. 21
    rama bharadwaj September 29, 2012 1:04 pm

    శ్రీధర్ గారూ, శ్యాం గారూ! మీ అభిప్రాయంలో ఆవేశం పాలు మరీ అధికమైనందువలన కాబోలు, మీరు వ్యక్తపరిచిన విషయం సంపూర్తిగా అర్థస్ఫూర్తిని ఇవ్వడం లేదు.

    సాహిత్యం అన్న పదం ఏ రకమైన సాహిత్యానికైనా వర్తిస్తుంది. కీర్తన కారులు రాసిన మాటలకి వేరే మరో పేరంటూ ఉండదు కదా?? అందునా ఆ వాగ్గేయకారుడు మహా కవులని తలదన్నిన మహా “మాటలెన్నో” [ ఇది మీరు వాడిన మాట సుమా ! ] వాడి వేల సంకీర్తనలని పాడినప్పుడు వాటికి ఒక సాధారణ మైన ఏదో “మాట” ఒకటి వాడటం పొసగదు. తెలుగులో లిరిక్ కి దగ్గరగా ఉన్న మరో పదబంధం వాడినా కూడా ఆయన రాసింది గాఢమైన కవిత్వం. అందువలన గేయ/ పద/పాటల/కృతుల సాహిత్య కారుడిగా కూడా అన్నమాచార్యుడు ముఖ్యమైన వ్యక్తి, తెలుగు సాహిత్యంలో! అందువలన ఏ రాగంలో ఆయన అక్షరాలకి సంగీతకారులు నిరాకార సంగీతాన్ని సమకూర్చినా ఆయన పాడీన ఆ సాకార భావం/కల్పన, విన్న/చదివిన వారి మనసుని గాఢంగా వశపరుచుకుంటాయి. దీన్ని రాళ్లపల్లి వారు స్పష్టంగానే గుర్తించారు. శ్రీపాద వారు అంతగా గమనించలేదు. ఇందుకు కారణం రాళ్లపల్లి సాహిత్యం తెలిసిన పండితులు. శ్రీపాద ఒక్క సంగీతంలో మాత్రమే పండితులు.

    ఇక్కడ అసలు విషయం మరుగున పడిపోయి వేరే విషయాలు ముందుకి చర్చకు వస్తున్నట్టు గా అనిపిస్తున్నది. మీభావం ప్రకారం సైతం మీ వాక్యాలలో ఉన్న అనేక “ఏమో” లు ఇవే చెబుతున్నాయి. మీరు కూడా సాహిత్యాన్ని పక్కకి పెట్టడం భావ్యం కాదనే కదా అంటున్నారు. మరి గొర్తి బ్రహ్మానందం సైతం అదే కదా అన్నది. మీరు ఆయనతో ఎక్కడ విబేధించారూ? బహుశా రాళ్లపల్లి వారి మీద ఆయన అన్నమాట కేమో!

    ఆమాటలో తప్పనిసరిగా తొందరపాటు వినిపిస్తోంది నిజమే! కానీ అది సాహిత్యాన్ని పక్కకు పెడితే కవులకి లేదా కవితాభిమానులకి వచ్చే కోపంలో భాగం గా మాత్రమే కదా గ్రహించాలీ? శ్రీపాద పినాకపాణి గారికి సంగీతం ప్రధానమూ, కృతి లోని సాహిత్యం అటు తరవాతాను. కానీ తెలుగు కృతి మీద ప్రేమ ఉన్న ఎందరికో సంగీతంతో పాటు అందులోని సాహిత్యమూ అంతే ముఖ్యమైనదని ఈ చర్చల పర్యవసానం! ఇందులో “సాకార భావం” సైతం ఆస్వాదించ గలిగిన తెలుగు వారు తప్పనిసరిగా సాహిత్యం వైపు మొగ్గే వీలుంది. శ్రీపాద పినాక పాణి గారు మొగ్గలేదు. అందుకు పైన ఒక అభిప్రాయంలో అరుణ గారు చెప్పినట్టు ఆయన మీద తంజావూరి బాణీ, అలాగే ఆయన మిక్కిలి గౌరవించిన ఆ అయ్యర్ గురువుల ప్రభావమూ రెండూ మరీ అధికం గా ఉండటమే! ఈ విషయం లో వారు తెలుగు భాష కన్నా, తమిళుల రాగ భావం వైపు/ నిరాకార భావం వైపే మొగ్గారు మరి. తమిళులు ఎలా అయితే తెలుగు భాష మీద శ్రధ్ధ చూపించరో అలాగే శ్రీపాద పినాక పాణి గారు సైతం శ్రధ్ధ చూపించలేదు అని ఆయన అన్నమాటలు మనకి చెబుతున్నవి కావా??

    మీరు ఇచ్చిన నిర్వచనం ప్రకారమే సాహిత్యం లో ఉపమానాలు కల్పన వగైరాలు ముఖ్యమైనవి. అవే పదకర్త అయిన అన్నమయ్యకి ప్రేరణని ఇచ్చిన విషయాలు. అన్నమయ్య గారు కల్పనని / ఊహనీ భగవంతునికి మారుగా ప్రతిపాదించాడు తన ఉపమానాలలో తన పదాలలో. మరి ఆయన రాసింది అత్యుత్తమ సాహిత్యమేనని మీకు కూడా మీ నిర్వచనం ప్రకారమే స్పష్టపడి ఉంటుంది. ఆయన తన పదాలలో “నిరాకార భావానికన్నా” అలా “సాకార భావానికే” ఎక్కువ ప్రాధాన్యమిచ్చినాడు అందులకే! అచ్చమైన తెలుగు కవిగా !!

    రమ.

  22. 22
    Brahmanandam Gorti September 30, 2012 5:24 pm

    శ్రీధర్, శ్యాం గార్లకి,

    మీరు నేను రాసిన వ్యాఖ్యలో మీకు నచ్చిన ముక్కలు ఏరుకొని మిగతావి వదిలేసారు.
    ­“రాళ్ళపల్లీ, శ్రీపాద వారి వారి రంగాల్లో మేధావులే, ఎవరూ కాదనరు. కానీ వారేం చెప్పినా అదే వేదం, ప్రమాణం అని అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు.” అన్న ఒక్కటే మీరు ప్రస్తావించారు. దాని ముందు కొన్ని వాక్యాలున్నాయి. వాటికీ, దీనికీ సంబంధం ఉంది.

    “… ప్రతీ వ్యాఖ్యకి సమయం, సందర్భం ఉంటాయి కదా? వారు ఏ వయసులో, ఏ కాలంలో, ఏ సందర్భమ్లో అటువంటి వివాద వ్యాఖ్యలు చేసారో చూడ్డం చాలా అవసరం. అన్నింటికీ అన్నీ ఆపాదిస్తే వచ్చే చిక్కే ఇది… ” అన్న ఈ వాక్యం వదిలేసి, రాళ్ళ పల్లి వారంటే గౌరవం లేనట్లుగా రాసేసారు. రాళ్ళపల్లి వారు పండితులూ, మేధావీ కాదని నేనెక్కడా అనలేదే! రాళ్ళపల్లి వారు త్యాగరాజూ, మిగతా కొంతమంది వాగ్గేయకారుల పాటలు కొన్నింటిలో చక్కని సాహిత్యం అని మెచ్చుకున్న వారే మరొక సందర్భంలో తుక్కూ అన్నారు. మీకు కావాలంటే రుజువులు ఇవ్వగలను.
    ఒక్క చిన్న విషయంలో విభేదిస్తే వారంటే గౌరవం లేదని కాదు.
    రాళ్ళపళ్ళి వారు పండితులు కాదనీ, వారికి సంగీత సాహిత్యాల్లో అపార జ్ఞానం లేదనీ నేననలేదు.

    “…ముందుగా చెప్పినట్లు భావం ప్రధాన్యం, ఆ ఆక్రోశం పెల్లుబికడానికి ఆ భావం మాటలను/పదాలను/వాక్యాలను నిర్దేశిస్తుంది, కాబట్టి ఆ భావానికి వ్యక్తపరచ తగు మాటలు ఎన్నుకోబడతాయి. (గోంగూర పచ్చడి లో కారం దట్టిస్తే, రక్తమేమి, పంచ ప్రాణాలు మరగవచ్చు, అది వేరే చర్చ!) అందువల్లే, ప్రసిద్ధ వాగ్గేయకారులు చాలా మటుకు స్వరాలను బట్టి సాహిత్యం కూర్చారు అని వింటూఉంటాము…” –
    భావం వ్యక్తపరచడానికే మాటలు అవసరం అన్న అర్థం మీ మాటల్లో గోచరిస్తుంది. ప్రసిద్ధ వాగ్గేయకారులందరూ స్వరాలకి సాహిత్యం సమకూర్చడం అని ఎందుకు విన్నారంటే సంగీతకారులందరికీ భాషా నైపుణ్యమూ, ఆసక్తీ వుండవు కనుక. పైగా సంగీతానికి మీటరు ఉంటుంది. అంటే అందులో ఇరికించే పదాలే వాడాలి. ఎంతో పద సంపంద వుంటే కానీ సరిగ్గా ఇమడవు. త్యాగరాజూ, పురందరదాసూ వంటి వారూ ఆశువుగానే కీర్తనలు పాడారనీ వింటూ ఉంటాం.
    చర్చించుకుంటే చాలా వున్నాయి.

    “కేవలం నిరాకార సంగీతానికి సాహిత్యం అనవసరం.” – నిరాకార సంగీత స్థితికి సామాన్యులు చేరడానికి ఓ జీవితకాలం పడుతుంది. ఒకళ్ళో, ఇద్దరో ఆ స్థాయికి చేరి – ‘ఇది అనవసరం, ఇది అవసరం’ అని ప్రతీ దానికీ ఆపాదించడం ఎంతవరకూ సబబు?

    ” అసలు “సాహిత్యం” అనే పదమే ఒక పెద్ద చిక్కు..” పాటకి భావం కావాలి. భావానికి భాష కావాలి. దానికి అందమైన అమరిక కావాలి. అంటే భావం లేని ఒక పాట మామూలు జనాలకి ఎక్కదు కాక ఎక్కదు. వారికి సంగీతంలో ప్రవేశం ఉంటే తప్ప. ఒక పక్క భావం అవసరం లేదంటూ, మరొక పక్క కావాలని చెప్పడం గందరగోళంగా అనిపిస్తోంది.

    నాకు రాళ్ళపల్లి వారంటే అపార గౌరవం వుంది. అలాగే శ్రీపాద పినాకపాణి గారన్నా కూడా. ( అందుకే వ్యాసం రాసాను, ఊసు పోక కాదు )

    -బ్రహ్మానందం

  23. 23
    తః తః December 5, 2012 4:23 pm

    ఒక పది నిమిషాల క్రితం “ఆంధ్ర ప్రభ సౌజన్యంతో” అని చివరలో చెబుతూ సామవేదం వారి ఋషిపీఠం అక్టొబరు 2012 సంచిక – పుటలు 27-28- లో వచ్చిన ‘ఈ శతాబ్దపు హిమనగం’ అన్న వ్యాసం చదివి ఆసక్తి గలవారలకు తెలియజేయాలని ఇది రాస్తున్నాను. వ్యాస రచయిత పినాకపాణి గారి పెద్దన్న గారి అల్లుడయిన శ్రీ గొల్లపూడి మారుతీరావు.

    తః తః

  24. 24
    lyla yerneni December 5, 2012 9:51 pm

    ఒక పది నిమిషాల క్రితం… – తః తః

    తహ్ తహ్!

    వహ్ వహ్!

    మీ పేరేమో మీరు గుప్తంగా ఉంచుతున్నారు. గొల్లపూడి మారుతీరావు పినాకపాణి పెద్దన్న అల్లుడు అన్న సమాచారం రిలీజ్ చెయ్యటంలో మతలబ్ క్యా హై జీ!

    లైలా

  25. 25
    తః తః December 6, 2012 3:52 pm

    లైలా గారూ
    ‘గొల్లపూడి మారుతీరావు పినాకపాణి పెద్దన్న అల్లుడు అన్న సమాచారం’ ఆ వ్యాసంలొ ఉన్నది. మరికొంచం ఆసక్తి రేకెత్తించటానికి గమత్లబ్ గా ‘రిలీజ్’ చేసాను. ఒక విషయం [బుచ్చమ్మతొ] ఇంగ్లీష్ లొ చెప్పి ఆ విషయం ఇంగ్లీష్ లొ ఎంత అర్థమయిందొ దాని తెలుగు తర్జూమా కూడా అంతే అర్థమవుతుందని గిరీశం అన్నట్టు నెను అసలు పేరుతొ రాసినా ఇలాగే రాస్తాను కాబట్టి అసలు పేరును దాని మానాన దాన్ని ఉండనిచ్చేసాను.
    నమస్కారాలతొ
    తః తః..

  26. 26
    lyla yerneni December 10, 2012 4:34 pm

    “అసలు పేరుతొ రాసినా ఇలాగే రాస్తాను కాబట్టి అసలు పేరును దాని మానాన దాన్ని ఉండనిచ్చేసాను.”
    నమస్కారాలతొ
    తః తః..

    తహ్:

    నమస్కారము.

    మారుపేరుతో రాస్తున్నా మీరు మహనీయులే ఐఉంటారు. ఏదో సబబు కారణమే ఉండి ఉంటుంది. లేకుంటే ఈ విధానము ఎందుకు అవలంబిస్తారు? ఎవరి పేరును వారు కోరి మరుగు పరుచుకుంటారు?

    (నా ఉద్దేశములో, సొంత పేరుతో రచనలు, అభిప్రాయాలు, ప్రచురించే పత్రికలకు విలువ ఎక్కువ ఉంటుంది. అభిప్రాయాలు కూడా పత్రిక సొత్తే. పత్రిక ఒక విలువైన ఆస్థియే. ఆ విషయం మీకు మాత్రం తెలియనిదా ఏమి. 🙂 ఈమాట పత్రిక రచయితలకు “Pulitzer” రావాలని నా కోరిక.)

    The important thing is to enjoy various people’s writings in the magazine, and also give the readers other relavant articles ( like you are doing, Thank you, ) to broden our reading experience.

    I get lot of joy out of writers of this magazine, and from the good company of people who participate in hearty discussions here.

    I thought this article on Dr. PinakapAni is a very nice one, and so is the other reference you gave us earlier.

    Good Writing! Happy Reading and Happy Holidays to All!

    లై 🙂

  27. 27
    Ssankara Bhanu Gorthi January 31, 2013 10:16 am

    What a wonderful essay! I wish it is published in any standard magazine like “Gana Kala” of Kakinada. I had the fortune of residing 2houses next to the residence of revered Dr Sripada Pinakapani garu in Official colony, Maharanipete, Visakhapatnam from 1953 to 58. In those days, Sri Nedunuri, Sri Nukala (later luminaries) in their twenties used to visit him very frequently. In spite of his busy schedule, he used to organise competitions in music to encourage youngsters. It is interesting that Dr Pinakapani garu was also a fine sportsman, good in weight-lifting, Tennis etc. He is a a legend, YUGAPURUSHA.

    Gorthi Sankara Bhanu

  28. 28
    బ్రహ్మానందం March 11, 2013 10:17 am

    ఇప్పుడే తెలిసిన వార్త!
    శ్రీపాద పినాకపాణి గారు భౌతికంగా ఇహ లేరు.
    సంగీత సామ్రాజ్యం మరో విద్వాంసుణ్ణీ, పండితుణ్ణీ కోల్పోయింది.

  29. 29
    s. kalanjali March 12, 2013 1:24 am

    గాయకుడు, స్వరకర్త, డాక్టర్ శ్రీపాద పినాకపాణి మృతి భరతావనికి, సంగీత లోకానికి తీరని లోటు. ఆయన కు నా నివాళి. ఆయన కుటుంబానికి, సంగీతాభిమానుల అందరి తరఫున నా సంతాపం తెలుపుకుంటున్నాను.

    ఎస్. కళాంజలి.

  30. 30
    parasuram govindu March 23, 2013 4:42 am

    చక్కటి వ్యాసం, అంతే ఎత్తు వ్యాఖ్యానాలూ ఎంతో ఆనందదాయకం. ఐతే స్వ. పినాకపాణి గార్కి శ్రీ బాల మురళి గారిపై దురభిప్రాయాన్ని ఆపాదించడం ఆప్రస్తుతం మరియు అసమంజసమని నా అభిప్రాయం.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అతిథి వ్యయో భవ
  • థాంక్స్‌ గివింగ్‌
  • ఏకాకితనం
  • యథార్థ చక్రం – 1
  • కోనసీమ కథలు: రెండు ప్రేమ కాట్లు

ఇటువంటివే…

  1. శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం
  2. గిడుగు గురించి శ్రీపాద
  3. స్వీయప్రచురణ గురించి శ్రీపాద
  4. నా గురువు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి
  5. రాగలహరి: కల్యాణి

సెప్టెంబర్ 2012 సంచికలో ...

  • ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం!
  • ఒక సరళ నిర్వచనం
  • కాల్వీనో కథల నుంచి – 5
  • కిటికీ
  • కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012)
  • గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి
  • చెట్టు కింది మనుషులు
  • ఛందస్సులో గణితాంశములు
  • జానపద చిత్రకళాకారుడు జామినీ రాయ్
  • జీవిత నవల – 2
  • తథాస్తు
  • నా కోరిక, నా ప్రార్థన
  • నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన
  • నువ్వే నేననీ…
  • మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి
  • వర్ష రచన
  • విలువలు: కథ నచ్చిన కారణం
  • విశ్వనాథగారితో వేదాంత చర్చ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

విలువలు: కథ నచ్చిన కారణం
ఎగిరే గుర్రాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.