వేసవి
రైయ్యిమని వడగాలి పరుగుకు
జిల్ జిల్ గోళీ సోడా ఈల
చురుక్కు కొమ్ములు విసిరే ఎండకు
సింహం తల కూజా పంజా
సెగల రెక్కలు సాచిన ఇనునికి
పకపక నవ్వుల పంకా జోరు
నిప్పుల పువ్వులు విచ్చిన వేసవి
రస్నా పాపకు దాహం దాహం
భగభగ మండుటెండను పట్టే
పుచ్చకాయలో ఎర్రని కిటికీ
ఉక్కలు పెట్టే బొబ్బలు పుట్టే
చెమటకాయలతో చికాకు పెట్టే
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఎండకు ఎండకు ఎండకు
నా పొట్ట నిండుగా మామిడి రసము.
తఃతః అభిప్రాయం:
July 5, 2012 2:39 pm
ఒక ఆసక్తి కరమైన విషయం - విశ్వనాథ ‘తెలుగు ఋతువులు’ లొ గ్రీష్ముణ్ణి వర్ణిస్తూ ఇంద్రాణి అన్న చివరి మాట అన్నారు, ‘పొట్ట’ తొ సహా. దాదాపు ఒక డెభ్బయి సంవత్సరాలయినా అయ్యుంటుందా ! ‘మాకంద నవఫలానంద తుందిలరసాత్తానంద భావుడౌ అమృత భొగి’ అని ఉన్న తేడా పెద్దదే, మామిడి రసం అక్కడ కవి తాగలేదు. గ్రీష్ముడు ఆ భోగి.
ఎప్పటికీ మాయని భావాలు ఎప్పటికప్పుడు డిజైనర్ దుస్తులేసుకుని రాంప్ మీద నడుస్తాయనుకుంటాను.
thummuri rammohan rao అభిప్రాయం:
July 6, 2012 12:58 pm
గ్రీష్మతాపోపశమన కవిత. చిన్న మార్పులు చేస్తే నిర్దుష్టంగా వుంటుంది.
1st లైనులో - రయ్యిమనే, 5th లైను - రెక్కలను; 9th లైను - మండే ఎండను; 12th లైను - కాయలతొ
లయాత్మక కవిత శ్రీశ్రీ గారి దారిలో ఉంది.
Seetha Kumari అభిప్రాయం:
July 12, 2012 1:38 am
మీలో ఎంత భావుకత్వమో సుమా! ఎంత బాగా వ్రాసారంటే ప్రతి చిన్న విషయాన్నీ కదలికనూ ఎంతో కవితాత్మంగా… Keep writing. All the best.
అనంత్ మల్లవరపు అభిప్రాయం:
August 3, 2012 12:22 pm
మీ గోళీ సోడాతో , కూజాతో మా చిన్న నాటి వేసవిని గుర్తు చేసి మనస్సుని చివుక్కుమనిపించారు!
sureshraju అభిప్రాయం:
August 21, 2012 6:26 am
పద ప్రయోగాలు ఎప్పుడూ సాహితీప్రియులని రంజింపచేస్తూనే ఉంటాయి.