ఈమాట » ఒక పుస్తకం

Expand to right
Expand to left

ఒక పుస్తకం

నీకేం నువ్వు
పుస్తకం ఇచ్చి వెళ్లావు
ఒక్క పదమూ తెలిసింది లేదు
తెలియక పోయిందీ లేదు

వింతగా ఉంది
దారం చెయ్యిలా ఉంది
పడపోతానని బయం
పటం కింద గాలి నవ్వు

విండో సిల్ మీద పేచీ
గాలి మీద సాము
రెండు పావురాలు
ప్రణయమేమో

చెంపల మీద కాంతి
కంటిలో కరుగుతోంది
ఎదురైతే పలకరించక
పోవడమే మంచిదా

ఇది చాల బాగుంది
ఎక్కడికక్కడ విరిగిపోవడం
రెండు పెగ్గులు పద్యం తాగి
ఒక బుజమ్మీద ఒరిగిపోవడం

పాతది మాట్టాడనని
వ్రతం పట్టావు
ప్రేయసి అందుతుంది
బయపడకు, గెడ వెయ్

కాగితాలు ఎట్టాగో పేర్చి
అమ్మను పిలుస్తా
చూడు ఏం చేశానో అని అరుస్తా
ఫొటో తీసుకుంటుంది

మనుషులు కలుసుకోవాలి
మాట్లాడుకోవాలి
తెలుసుకోవాలి ఇంకా
ఏం ఒరిగింది, విడిపోయి
చాల బింబాలుగా
పగిలిపోయి… ?

(అనంతుకు, నాయుడికీ; ఒక ‘బుడదంగి’తో పండుగ చేసుకుంటూ. బుడదంగి - అనంతు కొత్త పుస్తకం పేరూ, వాళ్లూరిలో గాలిపటమూ)

 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. ravikiran timmireddy అభిప్రాయం:

    June 26, 2012 9:31 pm

    ఇవి నానీలా హెచ్ అర్కే గారు? ఇవి నానీలయితే ఒకటి రెండు బాగున్నాయి, కానీ ఇది కవిత అయితే మాత్రం మీ మనసులో తోచిన భావం మా మనసులకి చేరలా. మీరు చెయ్యి తిరిగిన గొప్ప కవితా పెయింటర్ అయుండొచ్చు, నిజంగానే అంత గొప్ప కవులే మీరు, కానీ మీ భావం మీ కవిత లో షార్ట్ సర్క్యూట్ అయిపోయి, పాఠకులని చేరకముందే డిసిపేట్ అయిపోయినట్టుంది.
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  2. rama bharadwaj అభిప్రాయం:

    June 27, 2012 2:07 pm

    రవికిరణ్! మీకు ఇంకా ఇలాంటి అనుమానాలు రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది సుమా! ఇంతటి కవికి “వెనక మాటలు” రాసిన విమర్శకులు ఏదో నాడు దీనికీ భాష్యం చెప్తారు. అందాకా ఆగాలి కదా! ప్రశ్నలు కూడదు. మీకు కావలసిందల్లా కాస్త ఓపిక. అంతే!!

    రమ.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a