ఈమాట » కినిమా పత్రిక నుంచి - 3

Expand to right
Expand to left

కినిమా పత్రిక నుంచి - 3

ఇలాంటి ఫీచర్స్ చదివిన పాఠకులు చరిత్రపరంగా ఆసక్తి కనబరిచినా సినీజర్నలిజంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాలను గురించి కామెంట్లు రాయకపోవడం ఆశ్చర్యమే. ఆ కాలపు సినిమాలే కాక, సినీజర్నలిజం, విమర్శలూ, సమీక్షలూకూడా భిన్నంగానే ఉండేవి.

అక్కినేని స్కెచ్

అక్కినేని నాగేశ్వరరావు పై వచ్చిన ఈ వ్యాసం కుటుంబరావుగారి రచనే. ఆయన పద్ధతికి సరిపోని నటీనటులందరి జన్మరాశి ప్రస్తావనా కనబడు తోందంటే అది ఎడిటోరియల్ పాలిసీ అయుంటుందని నేననుకుంటున్నాను. నిజజీవితంలో sun signs గురించి మా నాన్న ఒక్కసారి కూడా మాట్లాడలేదు కనక అది నా అభిప్రాయం. బహుశా హాలీవుడ్ సినిమా పత్రికల ప్రభావమేమో.

దుక్కిపాటి, కె.వి.రెడ్డిల కాంబినేషన్లో అప్పటికింకా రాబోతున్న సినిమా దొంగరాముడు. 1952 లోనే నాగేశ్వరరావులో ‘కొత్తపోకడలూ, కొత్తశక్తులూ చూడబోతా’మనే అభిప్రాయం ఎంత నిజమయిందో ఈనాడు అందరికీ తెలుసు. విశేషమేమిటంటే అతని సుదీర్ఘమైన ఆయుష్షు, నటజీవితం మిక్కిలినేని వంటివారికి కూడా సాధ్యం కాలేదనే సంగతి.

సందేహాలు, సమాధానాలు :- ఇందులో సినీజర్నలిస్ట్‌లకు పాఠకులు వేసే ప్రశ్నలు దాదాపు ఎల్లప్పుడూ ఒకేలా ఉండేవని అనిపి స్తుంది. కొన్ని వివరాలకు జర్నలిస్ట్ చాలా ఫుట్‌వర్క్ చెయ్యకతప్పదని కూడా మనం తెలుసుకోవచ్చు.

తొలి అనుభవాలు :- రాబోయే కాలంలో మాయాబజార్‌లో శకుని, అప్పుచేసిపప్పుకూడులో రామదాసు మొదలైన పాత్రలు వేసి శభాష్ అనిపించుకున్న సిఎస్ఆర్ నాటకాల్లో గాయకుడనీ, కృష్ణుడి వేషానికి పేరుపొందాడనీ తరవాతి తరాలకు తెలియదు. అలాగే కృష్ణకుమారి 1952లోనే సినీజర్నల్ స్థాయిలో పరిచయం చేసేంత ఉండేదంటే ఆశ్చర్యమే.

సావిత్రి స్కెచ్

ఇందులో కూడా కొంతభాగం చిరిగింది. 60 ఏళ్ళు గడిచిపోగా ఇంకెన్నాళ్ళు ఈ కాగితాలు భద్రంగా ఉంటాయో తెలియదు కనక స్కాన్ చేసి పెట్టాను. సావిత్రిమీద పాఠకులకూ, ప్రేక్షకులకూ అభిమానం ఏ మాత్రమూ తగ్గలేదు కనక ఈ వ్యాసాన్ని వారు చదివి ఆనందిస్తారనుకుంటాను.

ఆమెకు కుటుంబరావుగారు ఊహించిన ‘మంచి భవితవ్యం’ మాట నిజమయింది కాని హిందీ సినిమాల్లో ప్రవేశం మటుకు లభించలేదు. విజయావారు రషెస్ అందరికీ చూపడం వంటి అపురూపమైన విషయాలు మనం ఈ వ్యాసంనుంచి తెలుసుకోవచ్చు. అలాగే సావిత్రి తొలిదశ విశేషాలు ఇంత వివరంగా మరెక్కడా దొరకవేమో. మొత్తంమీద ఇలాంటివి చదివితే టైమ్ మెషీన్‌ మీద కూర్చుని గతంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి భవిష్యత్తు మనకు గతమే!

 

(4 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. dvrao అభిప్రాయం:

    May 3, 2012 8:55 am

    ఈ ఫీచర్ చాలా బావుంది. అప్పటి ఇంటర్వ్యు లు దొరికితే ప్రచురించండి

  2. Rohiniprasad అభిప్రాయం:

    May 3, 2012 10:17 am

    ఇన్ని దశాబ్దాల తరవాత అప్పటి విషయాలు కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తాయనే ఉద్దేశంతోనే నేనివి స్కాన్ చేసి పంపుతున్నాను. వీటిలో సాహిత్యానికి సంబంధించిన విశిష్టత లేదని కోప్పడకుండా ఉంటే చాలు. రచయితగా కుటుంబరావుగారు సిగ్గుపడవలసినదేదీ చెయ్యలేదని నాకు తెలుసు కనక అటువంటి విమర్శలు కూడా అనవసరమే. ఇక నా కామెంట్లన్నీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రమే.

  3. mallikarjuna sarma అభిప్రాయం:

    May 7, 2012 5:58 am

    రోహిణీప్రసాద్ గార్కి:
    నమస్తే. నాన్నగారి ‘కినిమా’ స్కెచ్ లు అపురూపం. కేవలం బార్బర్ షాప్ కి వెళ్ళినప్పుడే సినిమా పత్రికల్ని తప్పనిసరైనప్పుడు మాత్రమే చూసే అలవాటున్న నాకు, సినిమా పత్రికల్లో ఇంత quality రచనలుంటాయని నాన్నగారి రచనలవల్లనే నమ్మకం కలుగుతోంది. ఇంత సరళమైన ఆరోగ్యకరమైన రచనలు ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా నిలబడగలిగే అర్హత కలిగి వుంటాయి. నాన్న గారు తెలుగు సాహిత్యం లో గల్పికలు మొదలైన ఎన్నో ప్రక్రియలకు జీవం పోసిన ఆద్యులు. ‘సినిమా సాహిత్యం’ లో వారి అడుగుజాడలున్నా, అవి ఆయనవేనని ఇంకా ముందు తరాల వారికి రుజువు చేసి వుంచ వల్సిన చారిత్రక అవసరం వుందని నా అభిప్రాయం.

  4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:

    May 16, 2012 8:39 pm

    రోహిణీప్రసాద్ గారు,

    మీరన్నది నిజమే గానీ ఆశ్చర్యం ఏమీ లేదు. అందులో, గత ఇరవైయేళ్ళలో సమగ్రమైన తెలుగు సినిమా సమీక్ష అన్నది నా కళ్ళబడలేదు. సమీక్షకులున్నారు కానీ పత్రికలకా అవసరం లేదు. ఇవ్వాళ తెలుగుదేశములో ఎన్ని సినిమా పత్రికలొస్తున్నాయన్నది ఎవరూ నికరంగా తేల్చిచెప్పలేని ఒక విచిత్రమైన ప్రశ్న. ఇవాళ వస్తున్న సినిమా పత్రికలు అభిమానుల కోసమే పాఠకులందరి కోసం కాదు. మిగతా వాటిల్లో అంటే సినిమా పత్రికలు కాని వాటిల్లో సినిమా వార్తలు, విశేషాలూ సచిత్రంగానే ఉంటాయి తప్ప సినిమా సమీక్షలు ఉండవు. ఈనాడు దినపత్రిక ప్రింట్ ఎడిషన్ లో ఇవ్వదు కానీ ఆన్ లైన్ ఎడిషన్ లో సినిమా సమీక్షలు ఇస్తుంది. ఆంధ్రభూమి వెన్నెల ప్రతి శుక్రవారం సినిమా అనుబందం ఉన్నవాటిలో చాలా మెరుగు.

    రాష్ట్రంలో జర్నలిజం కోర్సు అందిస్తున్న యే విశ్వవిద్యాలయంలోనూ సినిమా అనేది ‘స్పెషలైజేషన్’ గా లేదు. పైగా యూనివర్శిటీ పట్టాలు పుచ్చుకున్నవారు దాదాపుగా ఎవరూ సినిమా జర్నలిజంలో స్థిరపడటం లేదు.కొ.కు, ఇంటూరి వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ నరసయ్య ప్రభృతులు రాసిన సినిమా వ్యాసాల గురించి ఇవ్వాళ దాదాపుగా ఎవరికీ తెలీదు. తెలియనప్పుడు ‘సినీజర్నలిజంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాలను గురించి కామెంట్లు రాయకపోవడం’ సామాన్యమైన విషయం. అయితే ఈ మాట పాఠకుల వరకూ మీపరిశీలన నిజమే.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a