ఈమాట » బాల బేలవు ముద్దరాల

Expand to right
Expand to left

బాల బేలవు ముద్దరాల

బాల బేలవు ముద్దరాల

రాగం: నీలాంబరి
తాళం: రూపక

సంగీతం, గానం: పేరి పద్మవతి
స్వర రచన: వేంకటరామన్ సత్యనారాయణ
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్

సాహిత్యం

పల్లవి:
బాల బేలవు ముద్దరాల
విపణ పణి
తాళ జాలవు కుహన జాల
బేలవూ
తాళ గలవా?
చాలా |బాల|

కూహ కదాశయ పటు సహస్ర ఫణి
దంష్ట్రా దంశిత చేత జూత పణి

చరణం:
మాటైన మాటాడవూ
పలుకైననూ పలుకవే
మాటైన మాటాడవూ ఏల
పలుకైననూ పలుకవే
మాటైన మాటాడు
పలుకైన పలుకవే
చిలుక ముద్దుల కొలికిరో చెల్లెలా
కల్లల్ల లోకమమ్మా
అల్ల కల్లోలమమ్మా |బాల|

పణ విపణి
వెయ్యి కోరల భవ కరాళ
బేలవు
చాల గలవా? |బాల|

భీకర చండ మనీషాభీరణి
దురిత విపాదిత జర్జర ధారణి

చరణం:
ఆ వంక ఆరడి
ఈ యంక రాయిడి
నీవింత నినుపార మేలా?

అడుగడుగు మోసమమ్మా
అడరు వాచాలమమ్మా
అట్టే
తెల్లబోతావు సుమ్మా
పరమేశ్వరీ |బాల|


For శిరీష, who makes this necessary, and then possible


 

(ఒక అభిప్రాయం) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Srinivas Vuruputuri అభిప్రాయం:

    June 19, 2012 12:36 am

    పేరి పద్మావతిగారి పాటలు డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఉంటుందా? ఆడియో సీ.డీ.లు అమ్మకానికి ఉంటే వివరాలు తెలుపగలరా?

    అలాగే కొడుకుల శివరాంగారి భాగవత గానం కూడా…

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a