మేఘసందేశం – ఆడియో రూపకం

అనేన ప్రకారేణ యక్షః ఆత్మనః గృహం అభిజ్ఞాతుమ్ సూచనాని వినిర్దిశ్య అపరం జలధరమేవ ఉద్దిశ్య ఆత్మనో జాయాం ప్రతి ప్రకృతావస్థాం వర్ణయతి||

తన్వీ శ్యామా శిఖరి దశనా పక్వ బింబాధరోష్ఠీ
మధ్యే క్షామా చకితహరిణీ ప్రేక్షణా నిమ్ననాభిః
శ్రోణీభారాదలసగమనా స్తోకనమ్రా స్తనాభ్యాం
యా తత్రస్యాద్యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతుః||

తాం జానీథాః పరిమిత కథాం జీవితం మే ద్వితీయం
దూరీభూతే మయి సహచరే చక్రవాకీమివైకాం
గాఢోత్కంఠాం గురుషుదివసేషు ఏషు గచ్ఛత్సు బాలాం
జాతామన్యే శిశిరమథితాం పద్మినీవాన్యరూపాం||

గచ్ఛన్విహాయ రామగిరౌ సుదీర్ఘం తు తేన ప్రోక్తం
అలకాయై తావన్మార్గం కర్ణగతాంతర్విశిష్టతాం
తత్ర [యచ్ఛదనిరూపణం తద్ధి యోగినీ ప్రియాపదాం]
శ్రుతవతా జలధరేణ సః సద్యోదత్త్వా సంకల్పా
అలకాపుర్యాం దర్శయామహ ప్రత్యక్షం యక్షభామినీం||

యస్యాం దూరసీమ్నివా యస్యాం విపిన భూమ్నివా
కియచ్చిరం విరహోऽయం కథం సహ్యతే విభునా
ఇహైతావదహమేకా తప్తా కృశా భవామి
పరవాసీ తత్ర ప్రాణపతిః కథం సౌఖ్యమేతి
కిమర్థమద్య విహరతి స్వైరం దక్షిణానిలః
ఇతో మనోరథసుతస్య గరుత్సు శక్తిర్విశతి
శాపస్యావసానస్య సామీపీర్యం కిమిదం
[దశవైత‌హ కిమలమతో] అహర్గణన తత్పరతా||

ఏతస్యాం విరహావస్థాయాం సంతప్తాం యక్షనాయికాం విశాలాక్షీం సమ్మేలయితుం విహంగీబృందం యక్షస్య గృహాంతరే జలధరం ప్రవేశయతి||

ప్రవిశ ప్రవిశ జలధర పశ్య పశ్య పయోధర‌
[ఇటఇకోపి] ధనదగృహాదుత్తరేణ దూరభూః
అయం తు క్రీడాశైలః అత్ర తిష్ఠ క్షణమపి
పశ్య పురస్తాదత్ర యక్షనిలయ తోరణం

పాతయ విద్యుద్దృష్టిం ఏహి కలభతనుతాం
గృహాంతరే శృణోషి కిమ్ యక్షవధూభాషణమ్||

శారికే రసికే స్మరసి పత్యుః కచ్చిదపి
త్వం హి తస్య ప్రియేతి చ తస్య ప్రేమ వచనాని
చిత్రే [మత్కృతేస్త్యప్రత్ భావకం] యత్ దృశా కృతమ్
పశ్యసి కిమ్ సాదృశం పత్యుర్నిజరూపేణ

[వీణా సారణోద్యోక్తయ‌ తమ్ శ్లిష్య] గాయన్త్యా
మూర్ఛనా హి విస్మ్రియతే అశ్రుసిక్త తంత్ర్యా మయా||

విశాలాక్షి యక్షప్రేయసి కియచ్చిరం తథా రోదిషి?
దక్షిణాదిశావాయాతః దక్షిణానిలేన త్వరితః
త్వత్ర్పియస్య వార్తాహరః యక్షరమణి ప్రత్యయం హర‌
అలం విరహగ్లానినాపి చ…

(సశేషమ్)

రూపక పరిచయం

0:00
విశ్వసాహిత్యమునకు, అందులో నాటక సాహిత్యమునకు, కాళిదాసు భారతదేశపు ఒక గొప్ప కానుక. వ్యాసవాల్మీకుల తరువాత కవికులగురువు కాళిదాసు పేరు ప్రసిద్ధమైనది. ఈ కవి, నాటక రచయితను గురించిన వివరాలు మనకు దొరకడము లేదు. విశ్వనాటక సాహిత్యములో కాళిదాసు వ్రాసిన అభిజ్ఞాన శాకుంతలము తనదేయైన ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకొన్నది. అతని నాటకప్రతిభకు శాకుంతలము ఒక నిదర్శనమయితే, అతని కవితాప్రతిభకు మేఘదూతము ఒక గొప్ప ఉదాహరణ అవుతుంది.

మేఘదూతములో కాళిదాసు శైలి కవిత్వంతో నిండుకొని భావవంతముగా నున్నది. ఇందులో కనిపించే యక్షుని విరహవేదన, తహతహ, భావతీవ్రత కాళిదాసునిదే యేమో అనిపిస్తుంది. కొందరు విద్వాంసులు మేఘదూత కావ్యానికి రామాయణము ఆధారమంటారు. అరణ్యవాసములో రావణునిచే అపహరించబడిన సీతకోసం రాముని నిరీక్షణ, సంతాపము విరహి యక్షుని నిరీక్షణలో, సంతాపములో సాక్షాత్కారమైయున్నది. రామాయణములో కనబడే వర్షాకాలపు వర్ణన మేఘదూతమునకు ప్రేరణ నొసగినదనే అభిప్రాయము ఉన్నది.

ప్రణయలోకములో మునిగియున్న యక్షుడు కర్తవ్యపరిపాలనా దోషముచే ఒక సంవత్సరకాలము తన ప్రభువైన కుబేరుని శాపమువలన దేశభ్రష్టుడై యుండవలసి వచ్చినది, ప్రియురాలినుండి దూరము కావలసి వచ్చినది. ఈ కాలమును విరహియైన యక్షుడు మధ్యభారతములోని నాగపురము దగ్గర రామగిరిలో, అంటే నేటి రాంటేక్ ప్రాంతములో గడిపాడు. వానాకాలములోని ఒక సంఘటన – విరహి యక్షుడు దిగ్భ్రాంతితో ఆకాశమువైపు చూస్తున్నాడు. అప్పుడు ఒక మేఘము ఆకాశములో ఉత్తరాభిముఖముగా వెళ్ళుతున్నది. దీనిని గమనించిన యక్షునికి వియోగముతో బాధపడే తన ప్రియురాలికి ప్రేమను తెలిపి ఆమెలో ఆత్మవిశ్వాసము పుట్టించడానికి ఆ మేఘము ద్వారా సందేశము పంపాలనే ఒక ఆలోచన కలిగి అలాగే చేస్తాడు. యక్షుని ప్రేమపూర్ణ సందేశమును మోసికొని మేఘము అలకానగరమునకు వెళ్ళే దారిని కూడ వివరిస్తాడు. విరహముతో బాధపడే ప్రియురాలికి, ప్రేమికుల కలయికలోని ప్రీతి, ప్రేమపై నమ్మకము కలిగించే నవజీవనమును, వెన్నెల రాత్రిలో విహరించే ప్రేమాశ్వాసనను ప్రసాదించమని మేఘాన్ని ప్రార్థిస్తాడు.

కాళిదాసు మేఘదూతము వ్యక్తిగత కావ్యము. కథానాయకుడు మూగదైన మేఘముతో మాట్లాడుతాడు. తానే స్వగతములో మాట్లాడుకొంటాడు. ఇవన్నీ కల్పనయే. వీటిని నాట్యబద్ధము చేయడము కాని, దృశ్య మాధ్యమములోకాని, ఎన్నో పాత్రల మూలముగా శ్రవ్యరూపములో ప్రసారము చేయడము కాని ఒక గొప్ప సవాలు. ప్రస్తుతము శ్రవ్యరూపకముగా నేర్పరచిన దీనిలో భూతభవిష్యద్వర్తమాన కాలములు ఒకే సమయములో పొందు బరచబడియున్నదని శ్రోతలు గమనించగలరు. సంభాషణలు, మాటలు లేకుండా నాటకీయము గావించడము కుదరదని కొందరు ఆధునికుల వాదము. అయితే రసానుభూతితోబాటు నాటకమును, సంగీతమును రెంటిని ఒకే చోట జతపరచిన ప్రయత్నము యిది. భారతీయ సంగీతపు బహుముఖ వైవిధ్యమును శ్రోతలు ఇక్కడ అనుభవించవచ్చును.

సంస్కృత గీతికల వివరణ

[వరుస: రూపకంలో గీతిక వచ్చే సమయం – గీతిక వివరణ. కుండలిలో ఉన్నది గీతికకు మూలమైన మేఘదూత కావ్యంలో పద్యపు సంఖ్య (ఈమాట గ్రంధాలయపు ప్రతిలో).]

4:00
నాందీవాక్యము – శ్రీరస్తు, శుభమస్తు అంటూ ఆరంభమవుతుంది. చిరవియోగ పీడితులైన దంపతులకు శీఘ్రమే సంయోగసిద్ధి కలగాలని కవి ఆశ్వాసిస్తాడు. మహాకవి కాళిదాసు మేఘసందేశ శ్రవ్య కావ్యము రజనీకాంతునిచేత రూపకముగా వ్రాయబడినదై విశ్వవిఖ్యాతి చెందుగాక అంటాడు సూత్రధారుడు.
5:43
మేఘదూతమునందలి ప్రథమ పద్యమైన కశ్చిత్కాంతా విరహగురుణా అనే మందాక్రాంత వృత్తము పాడబడినది. కథా సందర్భమును వివరించాడు సూత్రధారుడు. హేమమాలి అనే యక్షుడు ప్రభువైన కుబేరునిచే శపించబడి దండకావనములో రామగిరిలోని ఒక ఆశ్రమములో తన కాలమును వెళ్ళబుచ్చుతున్నాడు. వసంతగ్రీష్మ ఋతువులంతమైనవి. దుష్కరమైన గ్రీష్మతాపం, దుస్సహమైన వియోగతాపం నాయకుడైన యక్షుడిని దహించివేస్తున్నవి. (1.01)
8:12
యక్షుడు పాడుతున్నాడు. ఓ ప్రియా, మనకు సుఖాన్ని ఇవ్వలేని వసంతకాలము గడచిపోయినది. వియోగశాపము హృదయాన్ని భేదిస్తున్నది. గ్రీష్మాతపము జ్వాలాతోరణమువలె జగాలను దహిస్తున్నది. ప్రియతమా, ఈ వేసవి రాత్రిలో చంద్రుడు కూడా దుఃఖిస్తున్నాడు. కుసుమాలు దావాగ్నిస్ఫులింగాలను వెడలగ్రక్కుతున్నాయి.
10:05
దుస్సహమైన విప్రలంభమునకు కారణము తెలియబరచడానికి భూతకాలములోకి వెళ్ళుతుంది కథ. భార్యావియోగమనే దుస్సహమైన శాపాన్ని యక్షరాజైన కుబేరుడు ఎలా ఇచ్చాడు? యక్షునికి తన ప్రియురాలిపట్ల ఉండిన అనురక్తి ఎటువంటిది? అంత శిక్షింపతగిన నేరమేమి చేశాడు?
11:00
అలకాపురిలో సదా వికసించిన పూలచెట్లుండే ఉపవనములో యక్షదంపతులు క్రీడించుచున్నారు.
11:50
వాళ్ళిద్దరు యుగళగీతాన్ని పాడుకొని ఆనందిస్తుంటారు.
ఓ సఖీ, ఇక్కడ కూర్చుందాము. నేను తెచ్చిన బంగారు కమలాలని స్వీకరించు.
ఇటు, ఇటు ఈ ఉపవనమందిరానికి రా.
ఈ కాలువలు, పొదరిళ్ళ చుట్టూ తిరగవద్దు.
ఈ వనమంతా పూర్తిగా చూడలేదు కదా. అప్పుడే అలసిపోయావా?
మానససరోవరంలో వికసించిన గొప్ప కమలాలను నీ ముంగురులలో నా చేతులతో అలంకరించనీ.
నీ చేతులతోనే అలంకరించాలని ఉత్సుకపడుతున్నావు. ఒక్క క్షణం ఆగు. శుకపికాలు చూస్తున్నాయని నాకు సిగ్గు కలుగుతోంది.