అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర
పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్న అలనాటి ఊర్మిళాదేవి నిద్ర పాట ఇది. ఈ పాట 1930లలో రికార్డు చేయబడిందని, ఈ పాట పాడింది శ్రీమతి బి. సుబ్బులు అనే గాయని అని మాత్రమే, అదీ ఆ రికార్డు లేబుల్ మీద ఉన్న వివరణ ద్వారా మనకు తెలిసిన సమాచారం. ఇంతకు మించి ఈమె గురించి ఇంకేమీ తెలియకుండా పోవడం విచారించాల్సిన విషయం. 78rpm రికార్డుపై పట్టడం కోసం ఈ పాట సంక్షిప్తంగా పాడబడింది, కేవలం ఆరు నిమిషాల నిడివిలో.
ఈ అపురూపమైన ఆడియో అందించినందుకు పరుచూరి శ్రీనివాస్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ గాయని వివరాలు మీకేమైనా తెలిస్తే మాతో పంచుకోమని మనవి - సం.
పైన పేర్కొన్న రికార్డు వచ్చిన కాలంలోనే విడుదలైన ఇంకో రికార్డు నుండి ‘కస్తూరి రంగ రంగా’ పాటను కూడా ఇక్కడ అందిస్తున్నాం. ఈ పాట కూడా ఊర్మిళనిద్ర పాట నడచిన నడకలోనే ఉండడం గమనించవచ్చు.
Sowmya అభిప్రాయం:
January 2, 2012 5:13 am
ఇందులో కొంత మాకు స్కూల్లో ఉండేది!! మా తెలుగు టీచర్ సరిగ్గా ఇలాగే పాడి వినిపించారు క్లాసులో…దాదాపుగా. నాకు అంత గుర్తు లేదు కానీ - శ్రీరామభూపాలుడు, పట్టాభిషిక్తుడై కొలువుండగా…అనే మొదలైనట్లు గుర్తు మా పాఠం కూడా.
గుర్తు చేసినందుకు ఈమాటకు ధన్యవాదాలు :)
srinivasaraov,khammam అభిప్రాయం:
January 2, 2012 3:23 pm
శ్రీలక్ష్మీ నీ మహిమలు చిత్రమై పోవునమ్మా పాట గుర్తుకొస్తోంది.
ranichintam అభిప్రాయం:
January 18, 2012 5:57 pm
What a beautiful song of Urmila devi. It really brought back memories of mom and auntie. KEEP UP THE GOOD WORK!
Krishnamohanreddy అభిప్రాయం:
February 18, 2012 4:22 am
నేను చిన్నప్పుడు విన్న చెక్క భజన పాటలు గుర్తుకొస్తున్నాయి. పాట పాడిన విధము కూడా బాగుంది.
madhavi అభిప్రాయం:
February 18, 2012 8:22 pm
ఈ పాట మా ఆమ్మ నా చిన్నతనములొ పాడుతూ వుండెవారు. మా అమ్మ గొంతు చాల బాగుండేది. ఈ పాట వింటే చనిపొయి చాలా కాలం అయిన మా అమ్మ గుర్తుకు వచ్చింది. కృతజ్ఞతలు.