మీర్జాగాలిబ్ (యే న థీ హమారీ కిస్మత్)
యే న థీ హమారి కిస్మత్ – మీర్జా గాలిబ్
కనలేక పోతి ప్రియ నే నది నాదు విధియె గాదా
మనియున్న నింక నదియే మది గోరు కోర్కె గాదా
నిను నమ్ము జీవితము నా కది యౌను కల్ల గాదా
చనిపోదు సంతసముతో నది నిక్కమవగ రాదా
మది నీది చంచలముగా యిక మాట నమ్మనౌనా
యది మీఱ నౌనె స్థిరమై మది యుండ నిల్చు గాదా
అడిగేరు ఎందుకని యా శర మెక్కు పెట్ట వంచు
వడి నన్ను దాక నాకీ వ్యధ లేకనుండు గాదా
ఇది యేమి స్నేహ మయెనో సలహాల నిచ్చు వారే
వ్యధ దీర్చు వారు యెవరో దయ జూప రైరి గాదా
ప్రతి నరమునుండి పడెగా సతతమ్ము రక్త మతిగా
వెత యంచు దల్చ నదియే ఒక దీప మగును గాదా
వెత నింపె ప్రేమ మదిలో మది ముక్తి నీయ దౌరా
వెత నీయ కున్న వలపుల్ వెత నిచ్చె బ్రదుకు గాదా
ఇది సంధ్యవేళ వెతలన్ ఎవరైన గలరొ వినగా
అది యొక్కమారు రాగా మరణమ్ము చింత గాదే
అవమాన మరణ మున కా నది మునిగి చావు బాగౌ
శవ ఖనన మవదు స్మృతికై యొక గుర్తు లేదు కాదా
కననౌనె వాని నిజమై యసమానమూర్తి యతనిన్
ద్వయితంపు తావి నిజమై పరిచయము నిచ్చు గాదా
అతి తత్త్వ పూర్ణ మగు నీ సవి మాట లెల్ల గాలిబ్
మతి నిచ్చు జ్ఞాని దగునో, అరె త్రాగినావు గాదా
మీనాకుమారి (మెహజాబీన్ బాను) (చాంద్ తన్హా )
చాంద్ తన్హా – మీనాకుమారి
చంద్రుడో యొంటరి గగన మొంటరిగా
మానస మ్మాయెగా నిట నొంటరిగా
ఇంకెగా నాశ గ్రుంకెగా తార
మంచు వణికేనె యిట నొంటరిగా
జీవితమ్మది యిదంచు బిలిచేరో
దేహమో ఒంటరి జీవ మొంటరిగా
దారిలో నొకని నే గాంచినచో
వేరు దారుల వెళ్ళెద మొంటరిగా
వెలిగి యారేను కాంతిదీపికలే
మిగిలె నొక గృహ మ్మిక్క డొంటరిగా
పథము వెదకుచుందు యుగయుగాలు
వీడిపోయెద నీ భూమి నొంటరిగా
జిబ్రాన్
నాకు ఖలీల్ జిబ్రాన్ అంటే కూడ చాల ఇష్టము. అతని రెండు కవితలకు నా అనువాదాన్ని క్రింద జతపరుస్తున్నాను.
సృష్టి మొదటినుండి పృథివిపై నున్నాను
అంతమువఱ కుందు నవనిపైన
అంతమదియు లేదె యని దోచె నాకు నీ
వ్యధల నిండియున్న బ్రదుకునందుయానమ్ము చేసినా నా నీల గగనాన
తూలినా తేలినా త్రుళ్ళి త్రుళ్ళి
ఆదర్శ భువనమ్ము కాదు నేడీ భూమి
బందీగ చెఱలోన బ్రదుకుచుంటికన్ఫ్యూషియసు వాక్కు కర్ణమ్ములను వింటి
బ్రహ్మ దెల్పిన వేద వాణి వింటి
సిద్ధార్థు జెంత నే బౌద్ధ సారము వింటి
నేడు మూఢునిగాను నిలిచియుంటిమోసెస్ జెహోవాను పులకించి జూడగా
సైనాయిపై నుంటి నేను నిజము
అద్భుత చర్యల నా యేసు జేయగా
జోర్డను తీరాన జూచినాను
మహమదు దర్శించు మంచి సమయములో
నే మదీనాపురి నిలిచియుంటి
కాని నిజమ్ముగా నీ నాడు భువిపైన
సమ్మోహితుండనై దిమ్మపడితికనులార బాబిలాన్ ఘనశక్తి నే గంటి
ఈజిప్టు ఉచ్ఛత నెల్ల గంటి
రోమన్ల రణరంగ సామర్థ్యమును గంటి
కాని దెచ్చె నవియు కనుల నీరుమంత్రవాదులతోడ మాట లాడితి చాల
ఐనుదూరు, మొరాకొ యందు నేను
అసిరియాలో నుండు యా తత్త్వవేత్తల
గూడి చర్చించితి గోరి నేను
పలు దేవదూతలు వఱలు పాలెస్తీను
లో నేను సత్యపు లోతు గంటి
నేడు నే నింకను వీడకుండక సత్య
శోధన గావించుంటి గాదెఆర్జించితిని జ్ఞాన మా భారతములోన
నరబు ప్రాచీనత నరయ గంటి
వినదగునది వింటి గనదగునది గంటి
నంధుడ బధిరుడ నైతి నిపుడుఅతి నిరంకుశులచే నణచబడితి నేను
బానిస నైతిని బరుల క్రింద
అలమటించితి గడు ఆకలితో నేను
సతమతమైతిని వెతలతోడ
ఇంకను నాలోన గ్రుంకక యున్నది
ఒక శక్తి గాంచ సూర్యోదయమ్ముమతి నిండినను నాదు మనసు నిండకయుండె
తనువు ప్రాతది కాని మనసు లేత
ఈ లేత యువతలో హృదయమ్ము పెఱుగుగా
కోరుచు ముదిమికై కొలుతు నతని
మఱల నా ప్రభువును మనసార జేరగా
మనసు నిండును నాదు మనికి నిండుసృష్టి మొదటినుండి పృథివిపై నున్నాను
అంతమువఱ కుందు నవనిపైన
అంతమదియు లేదె యని దోచె నాకు నీ
వ్యధల నిండియున్న బ్రదుకునందు
– జిబ్రాన్ (I was here from the moment of the Beginning – Song of Man)