ఈమాట » రంగనాధునివా రాతిబొమ్మవా

Expand to right
Expand to left

రంగనాధునివా రాతిబొమ్మవా

రంగనాధునివా రాతిబొమ్మవా

రాగం: రేవగుప్తి
తాళం: ఆది

స్వర రచన, సంగీతం, గానం: పేరి పద్మావతి
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్

సాహిత్యం

ప్రార్ధన:
జీర్ణ మందిర విషుప్త నటమ్ చిద్వాయకమ్ మౌని నాయకమ్
పరిహృత నిందా స్తుతి వాక్సాయకమ్ రంగనాయకమ్
నవనీత శీత కరుణా ఛ్ఛవి కృత్య మనో హర హరీ
అవనత శిరసా వందే కవి తార్కిక కేసరీ.
పల్లవి:
రంగనాధునివా రాతిబొమ్మవా?
మన్ననలెరుగని నంగనాచివా?!
అనుపల్లవి:
అభయహస్తమా అంకిలి చలమా
ఉభయ భ్రష్టమై పొమ్మని శలవా?
ఆడికోలు ఆనవు వేడుకోలు వినవూ
ఆలకింప చెముడా నీ ఊడిగములింతా?      |రంగ|
చరణం:
యోగపు నిదురా దాఁగిలి నటనా
ఆగమ ఘోషమా ఆగమాగమా?
పాముపై పడకా గారఁడీని కఱుదా
సోమరికి సొమ్ములిడి స్వామియని బిఱుదా?      |రంగ|
చరణం:
ఉయ్యాల సేవలా ఊగులాట వగలా
అయ్య! ఇది అనంత శయనమని ఎగపా?
ఊరేగి పూజలా ఊర్పోక చిన్నెలా
ఎవ్వరికి పొలుచునీ అడవీఁగు వెన్నెల?      |రంగ|
చరణం:
రంగధామమా అంగడింటి కొలువా
పంగనామములన్న ఆ పరమార్ధమిట్టిదా?
పరిపూర్ణ నిద్రా దొరతనపు కులుకా
అఱచి కొఱలాడితే కఱకు శిల పలుకునా?      |రంగ|

(ఈ గీతానికి స్వర రచన కావలసినవారు ఈమాట సంపాదకుల ద్వారా మమ్మల్ని సంప్రదించమని మనవి.)


For Dr. బందా రామారావుగారు


 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. sridevi అభిప్రాయం:

    September 27, 2012 12:16 am

    పాట చాలా బాగుంది. రచన బాగుంది. పద్మావతి గారు చాలా బాగా పాడేరు. స్వరరచన కూడా చాలా చాలా బాగుంది. వీలుంటే ఇద్దరి ఫోన్ నం. ఇవ్వగలరు.

    sridevi

  2. rajesh అభిప్రాయం:

    March 8, 2013 10:27 am

    పద్మావతి గారు చాలా బాగా పాడారు. రచన కూడా చాలా చాలా చాలా చాలా బాగుంది. శ్రీ దేవి గారికి కృతజ్ఞతలు.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a