శ్రీపాదరాయలు

4. కొంబు కొళల – మాయామాళవగౌళ రాగము, అట తాళము.

పల్లవి:
కొంబు కొళల నూదుత్త నంబిసి పోదనె యవ్వా
అంబుజనాభగె మన హంబలిసుత్తదె యవ్వా
చరణం:
నడెయలారెనె యవ్వా అడియిడ లోశవిల్ల
బెడగుగారన కూడె నుడి తెరళిత్తె యవ్వా
చరణం:
మాతు మనసు బార దవ్వా సోతెవవ్వా కృష్ణగాగి
ఆతన కాణదె మన కాతరిసుతిదె యవ్వా
చరణం:
అన్నోదక ఒల్లెవవ్వా కణ్ణిగె నిద్రె బారదు
మన్నణెగారన కూడె హెణ్ణు జన్మ సాకె యవ్వా
చరణం:
మనెమనె వారుతెగె మనవెళసదె యవ్వా
మనసిజపితనొడనె మన తెరళితె యవ్వా
చరణం:
గోపన వారుతెగె తాప హిరియదాయితవ్వా
గోపజనర కూడిద శ్రీపతి రంగవిఠలా

చారు మురళి మ్రోయించి వెడలిపోయెను నమ్మించి
వారిజనాభుని మది కోరుచు కుందెనె యమ్మా

నడువజాలమె యమ్మా అడుగుల నుంచలేమె
సొగసుగాడిని దలువ నుడి కంపించె నమ్మా

ఆడకుంటి మాట లమ్మా ఓడినా మే వానికొఱకు
వాడిని గానక మది వాడె గలత నమ్మా

అన్నపాన మేమి లేదే కన్నుల నిదుర రాదే
మన్నన వానిని జేర కన్నె బదుకు చాలునె యమ్మా

అనఘుని వార్తలకు మది గోరును గాదా
మనసిజపితునికై మది కదలెనె యమ్మా

గోపుని వార్తలకు తాప మధికమాయె నమ్మా
గోపజనుల గూడిన శ్రీపతి రంగవిఠలా

5. పోపు హోగోణ – ధన్యాసి రాగము, ఆది తాళము.

పల్లవి:
పోపు హోగోణ బారో రంగ
పోపు హోగోణ బారో
చరణం:
జాహ్నవియ తీరవంతె జనకరాయన కువరియంతె
జానకియ వివాహవంతె జాణ నీ బరబేకంతె
చరణం:
కుండినీయ నగరవంతె భీష్మకన కువరియంతె
శిశుపాలన ఒల్లళంతె నినగె వాలె బరెదళంతె
చరణం:
పాండవరు కౌరవరిగె లెత్తవాడి సోతరంతె
రాజ్యవన్ను బిడబేకంతె రంగవిఠల బరబేకంతె

వేగ వెడదాము రారా రంగ
వేగ వెడదాము రారా

జాహ్నవీ తీర మంట జనకరాయల తనయ యంట
జానకికి వివాహ మంట వెంటనే రావాలంట

కుండినుని నగర మంట భీష్మకుని దుహిత యంట
శిశుపాలుని గోర దంట నీకు కమ్మ వ్రాసె నంట

పాండవులు కౌరవులకు జూదమాడి యోడి రంట
రాజసభను విడవాలంట రంగవిఠలుడు రావాలంట

6. నందనందన – వసంతరాగము, అఠతాళము.

నందనందన పాహి గుణవృంద
సుందరరూప గోవింద ముకుంద

దినకరభవపాల కనకాంకితచేల
జనకజాలోల జనకానుకూల

పవనజపరివార యవనవిదార
నవరత్నహార నవనీతచోర

తుంగ విహంగతురంగ దయాపాంగ
రంగవిఠల భవభంగ శుభాంగ

ఉగాభోగములు

ఇంతకు ముందే చెప్పినట్లు కన్నడములో వచనములు సుప్రసిద్ధములు. వచన శైలిలో తాళము లేక రాగయుక్తముగా పాడడానికి అనుకూలముగా వ్రాయబడినవే ఉగాభోగములు. సామాన్యముగా త-న-న, త-ద-రి-న లాటి అర్థముకాని ఊత పదాలతో రాగాలాపన చేస్తారు. ఈ ఉగాభోగములలో రాగాలాపన అర్థవంతములైన పదాలతో ఉంటుంది. తరువాతి వాగ్గేయకారులకు ఇవి కరదీపికలాంటివి. కింద శ్రీపాదరాయల ఉగాభోగములలో రెంటిని మీకు పరిచయము చేస్తున్నాను:

కరుణది తనుమనధనంగళెల్లవు
నిన్న చరణకమలకొప్పిసిద బళిక
మరళి ఎన్న మరుళుమాడువరె
సరకు ఒప్పిసిద మ్యాలె సుంకవుంటె దేవా
కరుణాకర నిన్న చరణదడియొళిట్టు కాయో రంగవిఠల

దయకై తనుమనధనమ్ము లన్నిటి
నీదు పదకమలములం దుంచితిని
మఱిక నన్ను మాయ జేసెదవె
సరకు నొసగితిని పిదప సుంక మేల నయ్యా
కరుణాకర నీదు యడుగులందు జేర్చికావుమ రంగవిఠల

ధ్యానవు కృతయుగది
యజన యజ్ఞవు త్రేతాయుగది
దానవాంతక దేవతార్చనె ద్వాపరయుగది
ఆ మానవరిగెష్టు ఫలవో అష్టు ఫలవు
కలియుగది గానదలి కేశవ యెనలు
కైగొడువను రంగవిఠల

ధ్యానము కృతయుగమున
యజ్ఞయాగము త్రేతాయుగమున
దానవాంతకుని దేవతార్చన ద్వాపరయుగమున
ఆ మానవుల కెంత ఫలమో యంతె ఫలము
కలియుగమున గానమున కేశవ యనగ
కాపాడును రంగవిఠలుడు

ఈ ఉగాభోగము విష్ణుపురాణములోని కింది శ్లోకమునకు అనువాదమే!

ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైః
త్రేతాయాం ద్వాపరోऽర్చయన్
యదాప్నోతి తదాప్నోతిః
కలౌ సంకీర్త్య కేశవం