రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కొన్ని అపురూపమైన గొంతుకలు

రచన: పరుచూరి శ్రీనివాస్
మే 2011

[పరుచూరి శ్రీనివాస్ కొన్ని ఎంతో అపురూపమైన అలనాటి తెలుగు ప్రముఖుల గొంతులను సేకరించి మనకందిస్తున్నారు. ఏ కోణం నుంచి చూసినా ఈ ప్రముఖుల మాటలు వినగలగడం ఒక అనిర్వచనీయమైన అనుభవం. ఆడియో అంతగా బాలేకపోయినా వినడానికి ఇబ్బంది కలిగేంతగా లేదు. ఈ సేకరణ ఈమాట పాఠకులకు ప్రత్యేకం. ఈ ఆడియోలలో పరిచయ వ్యాఖ్యాత(లు) ఎవరో గుర్తు పట్టగలరా? – సం]

1. గుఱ్ఱం జాషువా

//eemaata.com/Audio/may2011/Jashua.mp3

పీడిత జనజీవనానికి అద్దం పట్టిన యుగకవి గుఱ్ఱం జాషువా స్వీయ కవిత. (నిడివి 2ని.)

2. పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు

//eemaata.com/Audio/may2011/Puttaparti.mp3

పురావస్తు పరిశోధనలో విశేషమైన కృషి చేసిన పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు బర్మా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో నిక్షిప్తమైన హిందూ సంస్కృతీ చిహ్నాలపై చేసిన ఆంగ్ల ప్రసంగం నుండి (నిడివి 2ని).

3. పింగళి లక్ష్మీకాంతం

//eemaata.com/Audio/may2011/Pingali.mp3

ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి, పింగళి కాటూరి జంటకవులలో ఒకరు అయిన పింగళి లక్ష్మీకాంతం భాస నాటకానికి చేసిన పరిచయం (నిడివి 1ని 50క్ష.).

4. ఆచంట లక్ష్మీపతి

//eemaata.com/Audio/may2011/Achanta.mp3

ఆయుర్వేదంలో ప్రముఖులైన ఆచంట లక్ష్మీపతి ఆంగ్ల ప్రసంగం నుండి (నిడివి 1ని.).

5.మునిమాణిక్యం నరసింహారావు

//eemaata.com/Audio/may2011/munimanikyam.mp3

కాంతం కథల సృష్టికర్త మునిమాణిక్యం నరసింహారావు ఒక పిచ్చాపాటిలో (నిడివి 50క్ష.).

6. దామోదరం సంజీవయ్య

//eemaata.com/Audio/may2011/damodaram.mp3

కవి, ప్రజానాయకుడు అయిన దామోదరం సంజీవయ్య మద్యనిషేధంపై చేసిన ప్రసంగం నుంచి (నిడివి 1ని. 45క్ష.).

7.జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి

//eemaata.com/Audio/may2011/jaruk.mp3

జరుక్ శాస్త్రిగా పేరెన్నిక కన్న కవి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పద్య నిర్మాణంలో వ్యావహారిక భాష వినియోగం గురించి చేసిన చర్చ నుండి (నిడివి 2ని. 36క్ష.).

8. జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి

//eemaata.com/Audio/may2011/Jonnalagadda.mp3

ఆంగ్లభాషాకోవిదుడు, వక్త అయిన జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి తెలుగు భాషపై చేసిన ఆంగ్ల ప్రసంగం నుండి (నిడివి 3ని 5క్ష.).

9. టంగుటూరి ప్రకాశం పంతులు

//eemaata.com/Audio/may2011/Tanguturi.mp3

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 1954లో తమ కాశ్మీర్ పర్యటన అనంతరం చెప్పిన ముచ్చట్లు (నిడివి 2ని 20క్ష.).

10. వేదుల సత్యనారాయణ శాస్త్రి

//eemaata.com/Audio/may2011/vedula.mp3

గౌతమీ కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి తమ గురువైన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గురించి మాట్లాడుతూ… (నిడివి 2ని 20క్ష.).

11. మొక్కపాటి నరసింహ శాస్త్రి

//eemaata.com/Audio/may2011/mokkapati.mp3

బారిస్టర్ పార్వతీశం రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి గోదావరి తీరంలో స్నేహితులతో గడిపిన సాయంకాలాల గురించి సరదాగా చెప్పిన కబుర్లు (నిడివి 2ని 15క్ష.).

12. తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి

//eemaata.com/Audio/may2011/Sivasankar.mp3

నవ్యసాహిత్యానికి కేతనమెత్తిన కవి, పద్యనాటికకు ఆద్యుడు స్వామి శివశంకర్ యోగవాశిష్ట గ్రంథం గురించి చెప్పిన విషయాలు కొన్ని (నిడివి 2ని 28క్ష.).

13. దేవరకొండ బాలగంగాధర తిలక్

//eemaata.com/Audio/may2011/Tilak.mp3

వచనకవితకి వన్నెలద్దిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ స్వీయ కవితా పఠనం (నిడివి 3ని 48క్ష.).

14. విస్సా అప్పారావు

//eemaata.com/Audio/may2011/vissa.mp3

వస్తుతహా వైజ్ఞానికుడైనా మనోధర్మ రీత్యా సంగీతానికి అంకితమయిన విస్సా అప్పారావు క్షేత్రయ్య గురించి మాట్లాడిన మాటలు కొన్ని (నిడివి 1ని 48క్ష.).

    
   

28అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Sowmya May 1, 2011 9:33 am

    వ్యాఖ్యాతలు ఎవరు? అన్నది గుర్తుపెట్టే సీను నాకు లేదు కానీ, ఈ ఆడియోలు మాత్రం చాలా బాగున్నాయి. నాకెంతో ఇష్టమైన జరూక్ శాస్త్రి గారి గొంతుక వినడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు!

  2. 2
    శివరామప్రసాద్ కప్పగంతు May 1, 2011 10:40 am

    అపురూప వ్యక్తుల గళాలు వినగలగటమే అదృష్టం. వ్యాఖ్యాత ప్రముఖ నటుడు జగ్గయ్య అనిపిస్తున్నది. ఆయన ఆకాశవాణిలో కొద్దికాలం పనిచేశారు.

  3. 3
    Rajendra Kumar Maharana May 1, 2011 11:25 am

    మీ ఈ మాట చాలా బాగున్నది. అభినఁదనలు.
    ఆ కొన్న వీనులకు చక్కటి విఁదు దొరికిఁది.

  4. 4
    శివరామప్రసాద్ కప్పగంతు May 1, 2011 10:46 pm

    సత్యం శంకరమంచి గారి గళం కూడ ఈ వ్యాఖ్యాత గొంతును పోలి ఉన్నది.

  5. 5
    M.ravikumar May 2, 2011 12:15 am

    మీ ఈ మాట చాలా బాగున్నది. ఈ అపురూపమైన అలనాటి తెలుగు ప్రముఖుల గురించి పుస్తకాలలొ చదవటమేగాని, వారి గొంతులను వినలేదు. ఇది ఒక అనిర్వచనీయమైన అనుభవం.

  6. 6
    గోపీకృష్ణ May 2, 2011 10:29 am

    చాలా బాగుంది. ఆ మహానుభావుల గొంతులు వినగలిగే అదృష్టాన్ని ప్రసాదించినందులకు క్రుతజ్ఞుడను.
    వ్యాఖ్యాత కె.వి.రమణాచారి గారు.

    భవదీయుడు,
    గోపీకృష్ణ

  7. 7
    ravindranathkadarla May 3, 2011 11:17 am

    The collection of these voice audios of reputed persons in their chosen fields is very appreciable.

  8. 8
    సూర్యుడు May 3, 2011 12:26 pm

    జాషువా గారి పరిచయ కర్త, జగ్గయ్య గారే.

    వీటిని సేకరించి అందించిన పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.
    /సూర్యుడు

  9. 9
    ravikanti srinivas May 5, 2011 6:53 am

    చాలా బాగుంది. గొప్ప గొప్ప వారి మాట‌ల‌ను విన‌డం మంచి అనుభ‌వం. ధ‌న్యవాదాలు.
    -రావికంటి శ్రీ‌నివాస్‌.

  10. 10
    రవి May 5, 2011 6:54 am

    అపురూపమైన కలెక్షను. ధన్యవాదాలు.

  11. 11
    ydaya May 8, 2011 4:31 am

    thank you sir,
    it is verry good work and verry usefull for next genaration.

  12. 12
    Dr.Sudhakar May 9, 2011 3:22 pm

    It is a great privilege to be able to listen to the voices of great telugu people. Many thanks to Paruchuri Srinivas. It is one of the invaluable experiences internet offers to its users. I feel no hesitation at all in mentioning in this context about the great speeches of swami vivekananda made in the USA back in 1893 IN HIS ORIGINAL VOICE! wonderful experience too! ( for those who have not heard them already on internet wwwdot you tubedot com’ ).

  13. 13
    శివరామప్రసాద్ కప్పగంతు May 15, 2011 10:31 pm

    “…swami vivekananda made in the USA back in 1893 IN HIS ORIGINAL VOICE.”

    Whether it was possible to record a voice in 1893? I doubt the veracity of the audio file in circulation passing off as that of Shri Vivekananda’s.

  14. 14
    SHANKAR.S May 16, 2011 2:17 am

    జరుక్ శాస్త్రి గారి గొంతు వినిపించినందుకు మీకు బోలెడన్ని ధన్యవాదాలు. వీలయితే ఆయన ఫోటో కూడా సంపాదించగలరా?

  15. 15
    Dr.Sudhakar May 19, 2011 11:28 am

    Re: Swami Vivekananda’s speech in his ‘ Original Voice’ on ‘ you tube’.

    So far, I am under the impression that Swami Vivekananda’s speech was his original voice. ( We all know gramophone was invented in 1850’s. May be gramophone recording of Swami’s speech could be the source?! ) I tried to search on internet to know the veracity of the ‘speech’ online.
    I looked up in the Internetarchivedotcom. But nothing was mentioned about the source of the recording. Could any one help solve this issue?

    Sudhakar

  16. 16
    మోహన May 20, 2011 6:35 pm

    వివేకానందుని గొంతుకగా చెలామణి అయ్యేది అతని ప్రసంగాన్ని మరొకరు మళ్లీ యిచ్చినది. శ్రీరామకృష్ణ మఠము వాళ్లు తమ వద్ద అలాటి ధ్వని ముద్రికలు లేవని తెలిపియున్నారు. విధేయుడు – మోహన

  17. 17
    balantrapuprasuna June 21, 2011 7:26 am

    its్ difficult to say who the commentator is. it could be jaggayya. but we don’t know the year. but thankyou srinivas garu for uploading such great collection. and special thanks for the poetry pieces of jashua and balagangadhar tilak.mokkapati’s reminiscences are also great and we cant forget jaruk sastri.thank you sir.

  18. 18
    prasanth June 21, 2011 3:00 pm

    మన జాతి ..మేధావులని బతికి ఉన్నన్ని నాళ్ళూ వాళ్ళని నిర్లక్ష్యమ్ చేస్తుంది. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ల గుర్తులని విని మురిసిపోతుంది.ఇది ఏ రకమైన సంస్కృతో.. దీనికి ఎవరిని నెపం పెట్టాలో నాకు తెలియదు గానీ ఈ స్వభావమ్ మీద మాత్రమ్ ఆ జాతిజనులు ఆత్మ విమర్శ అన్నది చేసుకోవడమ్ అన్నది.. ముఖ్యమైనది ఎప్పుడైనా!! ఒకతరం లోని వారు గతించేదాకా ఆగి.. అప్పుడు వగచేకన్నా ..అంతకన్నా వారు తమకాలంలో తమతో సమాంతరంగా బతుకుతున్న కవుల రచయితల వేదాంతుల స్వరాలనీ ..వారి ఆలోచనలనీ తమకాలంలోనే శాస్త్రీయ మార్గాల ద్వారా నిల్పుకునే శ్రధ్ధని చూపించడమ్ ఉత్తమమ్ కాదా?? అప్పుడు రేపటి తరాలు ఇప్పుడు రాస్తున్న ఇలాంటి ఉత్తరాలని రాయాల్సిన అవసరం ఉండదు కద. అయితే బహుశా మనం మన సమకాలం లోని వారిని నోరుతెరిచి పొగడటం చేయలేమేమో మరి. జరుక్ శాస్త్రి కీ ..జాషువాకీ మాత్రం ఆ రోజుల్లో ఏమ్ జాగ్రత్త దొరికింది గనక?? ఆకాశవాణి వారు ఎన్ని మంచి మంచి స్వరాలని చెరిపేయగా ఇవాళ్టికి అక్కడా ఇక్కడా ఏరుకోవాల్సి వస్తోందీ?? ఇంతే మరి తెలుగువాళ్ళు !! చేమకూరవెంకట కవి చెప్పనే చెప్పాడు కద? చిన్న చిన్న అహంకారాలతో మనం పెద్ద పెద్ద నష్టాలు ఎప్పుడూ ఇష్టపడ్డాం !!

    ఇంకా అలా ఇష్ట పడుతూనే ఉన్నాం! మరి కొన్ని తరాల నష్టాల కోసం!! మరికొన్ని కాలాల తర్వాత వాళ్ళు అచ్చం ఇలాగే..ఇప్పుడు అందరూ వగచినట్లే ఇలాగే వగచాలని!!.

    వ్యక్తిగత అభిమాఅనం ఉన్నవారి వలన తప్పితే సత్కవులు రాణకు వచ్చేరు తప్ప ఇతరత్రా అవార్డులూ రివార్డులూ మన సమకాలం లోనే చవటలకి వెళ్తూంటే అలాగే కళ్లప్పగించి చూస్తున్నవాళ్ళం.. రేపటి దాకా .. అలాగే అన్నీ చూస్తూనే ఉంటాం కూడాను. ఎప్పటికో మేలుకుని..తెలివితెచ్చుకుని.. ఇప్పుడు “అయ్యయ్యో” అని అన్నట్టుగానే అప్పుడూ అంటాం.!! కదా మరి …మనం తెలుగువాళ్ళం !! చిన్న చిన్న అహాలకి బానిసలం. దురాలోచనలే తప్ప దూరాలోచనలు లేనివాళ్ళం!! ఎప్పడూ అర్హతలేని వాళ్లకి ఎత్తైన పీటలు వేస్తూ ..పండితులనైనా సరే ..కిందనే కూర్చోబెట్టగలిగినవాళ్ళం!! మనం తెలుగువాళ్ళం !!

    ప్రశాంత్

  19. 19
    Sreenivas Paruchuri June 23, 2011 8:58 am

    వినిపించిన గొంతులు చాలామందికి నచ్చినందుకు సంతోషం. ఇవి విజయవాడ రేడియో కేంద్రం సుమారు ముప్పయ్యేళ్ళ క్రితం “ప్రముఖుల గళాలు” అన్న శీర్షిక క్రింద ప్రసారం చేసిన ధారావాహికలోని భాగాలు. వ్యాఖ్యాత శ్రీ శంకరమంచి సత్యం. అవును “అమరావతి కథలు” రాసిన సత్యంగారే!

    మరికొందరి ప్రముఖుల గొంతులు రాబోయే సంచికల్లో.

    భవదీయుడు,
    — శ్రీనివాస్

  20. 20
    Rohiniprasad June 23, 2011 10:24 am

    ఈ మంచి కలెక్షన్‌లో నేను చిన్నప్పుడు వ్యక్తిగతంగా చూసినవారు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, మొక్కపాటి నరసింహ శాస్త్రి , తల్లావజ్ఝల శివశంకర శాస్త్రిగార్లు.

    1962లో పదమూడేళ్ళ వయసులో నేను మద్రాసులో జరిగిన ఆంధ్రమహిళాసభ రజతోత్సవానికి రెండువారాలపాటు ప్రతిరోజూ హాజరయాను. అక్కడ ప్రసంగించిన ప్రముఖుల్లో ఉపాధ్యక్షుడు రాధాకృష్ణన్‌, ఏపీ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, కవుల్లో గిడుగు సీతాపతి, దేవులపల్లి మొదలైనవారి ప్రసంగాలు విన్నాను. ఇటువంటివారికి కొన్నేళ్ళ తరవాత తమ గొంతులను మనకు వినిపించే అవకాశం ఉండబోదని అప్పట్లో నాకు అనిపించలేదు. వారి దృశ్యాలూ, మాటలన్నీ మహిళాసభవారు అప్పుడు తీసిన డాక్యుమెంటరీలో లభించవచ్చు. నేనది చూడలేదుగాని, అందులో ముందువరసలో కూర్చున్న నేనుకూడా కనిపించానని మా అమ్మమ్మ 1970 ప్రాంతాల నాతో చెప్పింది!

    జనరల్‌గా మనవాళ్ళకి చారిత్రక దృక్పథం తక్కువే. ప్రశాంత్‌గారి స్పందన అటువంటిదే. ఇప్పటి యువతీయువకుల్లో కొందరికైనా తెలుగువారి recent history గురించిన ఆసక్తి ఉందనడంలో అనుమానంలేదు. వారికి సమాచారం అందించే బాధ్యత పాత తరానిదే.

    ఈ వ్యాసంలోని ప్రముఖుల పేర్ల వెంట వారి జీవితకాలం బ్రాకెట్లలో రాస్తే బాగుంటుంది. నాకు వీలున్నప్పుడల్లా సంగీతరావు, రజనీకాంతరావు, రావి కొండలరావు వంటి పెద్దవారితో ముచ్చటించి, ఆ వివరాలను తెలియజెయ్యడం ప్రశాంత్‌గారు చేసిన ఫిర్యాదు వంటిది తలెత్తకుండా ఉండటానికే. త్వరలోనే రావు బాలసరస్వతి, సుసర్ల దక్షిణామూర్తి, పాలగుమ్మి విశ్వనాథం మొదలైనవారిని కలుసుకోవాలని ఉంది.

    నా చిన్నతనంలో మద్రాసు, విజయవాడ, హైదరాబాద్ రేడియో స్టేషన్ల నుంచి ప్రతి ఉగాదికీ కవిసమ్మేళనాలు ప్రసారం అయేవి. అప్పటి కవుల రికార్డింగులన్నీ దొరికే అవకాశం ఉండే ఉంటుంది.

  21. 21
    srinivas gattu June 24, 2011 3:50 am

    చాలా బాగున్నది ఈ కలెక్షను. ధన్యవాదములు.

  22. 22
    RAMESH U June 25, 2011 7:32 am

    చాలా బాగున్నది ఈ కలెక్షను. ధన్యవాదములు.

  23. 23
    శివరామప్రసాదు కప్పగంతు June 29, 2011 8:31 pm

    @రోహిణీప్రసాద్ గారూ,

    ఆకాశవాణి వారి వద్ద పాత రికార్డింగులు ఉన్నాయో లేదో తెలియదు. ఉన్నా అవి ఏ స్థితిలో ఉన్నాయో చెప్పగల వాళ్ళు ఇప్పుడు ఆ స్టుడియోల్లో ఉన్నారా అని అనుమానం. ఈ మధ్యనే ఆకాశవాణి వారు ఒక అభ్యర్ధన ప్రెస్ ద్వారా శ్రోతల ముందుంచారు, శ్రోతల దగ్గర ఆకాశవాణీ వారి రికార్దింగులు ఉంటే వారికి ఫంపమని. వారు డిజిటైజ్ చేస్తారుష. అంటే వారిదగ్గర అలనాటి కార్యక్రమాల టేపులు లేనట్టే.

  24. 24
    Rohiniprasad June 30, 2011 10:24 am

    శివరామప్రసాదుగారు చెప్పినదాంట్లో పాయింటుంది.

    ఆకాశవాణి సవ్యంగా పనిచేసే రోజుల్లో కూడా అన్నీ సవ్యంగా ఉండేవికావని విన్నాం. 1950లలో బడే గులాం అలీఖాన్ పాకిస్తాన్‌ నుంచి వచ్చి నేషనల్ ప్రోగ్రాముల్లో కచేరీలు చేసిన రోజుల్లో ఆయన విదేశీయుడనే కారణంగా దేన్నీ రికార్డు చెయ్యలేదట. ఒక ఇంజనీరు తన అభిమానంకొద్దీ రికార్డు చెయ్యబోతే ‘సకాలంలో’ గమనించి అడ్డుకున్నారట!

    మా చిన్నతనంలో, 1958 ప్రాంతాల మొదటిసారిగా స్పూల్ టేప్‌రికార్డర్ ఎలా ఉంటుందో చూశాం. మా మేనమామ కొమ్మూరి సాంబశివరావు ఒకటి కొని కొన్నేళ్ళు వాడడంకూడా జరిగింది. రేడియో స్టేషన్లలో వీటికి కొదవలేకపోయినా సంస్కృతిని పరిరక్షించాలనే విజ్ఞత మాత్రం తక్కువే.

  25. 25
    prashanth gundavarapu June 30, 2011 12:02 pm

    అయ్యా !! ఆ “విజ్నత” గురించే ఇప్పుడు కూడా అందరూ ఆలోచించాలీ అని అంటున్నాను నేను. సమకాలంలో అవకాశాలని వదిలేసి మనకాలం లోని పేరెన్నిక గన్నవారి గొంతులనీ అలాగే వివిధ అంశాలమీద వారి వారి అభిప్రాయాలనీ.. ఆడియో వీడియో లలో భద్రపరచడం చేయడం గురించి ఎవరైనా నిజంగా ఆలోచిస్తున్నారా ? అని నా సందేహం. మరి అలాంటి పన్లు ఇవాళ కూడా చెయ్యకపోతే మరి కొన్నాళ్ళకి ఇవాళ్టి వాళ్ళని గురించిన ఎటువంటి సమాచారానికైనా రేపటి తరాలు తడుముకోవలసిందే కదా? ఆకాశవాణి వాళ్లకి ముందుచూపులేకపోబట్టి కదా ఇవాళ ఆ నస్టాన్ని భరిస్తున్నాం. ఈ కాసింత ధ్వని రూపకమైన వారి స్మృతులకి ఇంతగా పరవశమైపోతున్నారు ఈ పాఠకులు [శ్రోతలు]. ఆ పనే ఇప్పటికీ మనకాలం లోని
    టీవీలూ ..రేడియోలూ ఆ మునుపటి నిర్లక్ష్యం తోనే వ్యవహరిస్తూంటే ..ఏ రకమైన చరిత్రని మనం జాగ్రత్త పరుచుకున్నవాళ్ళం అవుతున్నాం !! ఎవరైనా దీని గురించి ఆలోచించాలి. ముందుచూపుని చూపించాలి. లేకపోతే మరికొన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇవాళ మాట్లాడుకుంటున్న ఈ మాటలనే రేపు ఇంకో తరం ఇవాళ్టి మహనీయుల పక్షాన మాట్లాడుకోబోతుంది మరి. తస్మాత్ జాగ్రత.

    ప్రశాంత్

  26. 26
    శివరామప్రసాద్ కప్పగంతు July 3, 2011 1:04 am

    ప్రశాంత్ గారూ,

    మూడు మూడున్నర దశాబ్ధాల క్రితం వరకూ కూడా రికార్డ్ చెయ్యటం అనేది సామాన్యుడి చేతిలోలేదు. ఒక్క ఆకాశవాణి వారికే అది కుదిరే పని. ఎక్కడో డబ్బున్న వాళ్ళ దగ్గర స్పూల్ టేఫ్ రికార్డర్ లు ఉండి ఉంటే ;ఉండి ఉండవచ్చు. కాని వాళ్ళకు అభిరుచి కూడా ఉండాలికదా. ప్రస్తుతం సాంకేతిక అభివృధ్ది పుణ్యమా అని నాలాంటి సామాన్యులు కూడా స్వంతంగా రికార్డ్ చేసుకోగలుగుతున్నాము. ఈనాటి మహనీయులు వారి వారి గోంతులు, వీడియోలు ఎన్నెన్నో కలెక్షన్లలో తయారవుతున్నాయతంఎతోమది ఔత్సాహికులు ఎవరి పరిధిలో వారు ఈ కలెక్షన్లు తయారుచేసుకుని, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ వారి వారి సేకరణను పరిపుష్టం చేసుకుటూనే ఉన్నారు.

    నా బాధ ఒక్కటే అలనాడు ఆకాశవాణి అధికారులకి కొద్దిగా ముందు చూపు ఉండి వాళ్ళు తయారు చేసిన టేపులను భధ్రపరచి ఉండి ఉంటే, ఈ రోజున మనకు ఎన్నో ఆణిముత్యాలు దొరికేవి. అది జరుగలేదు. అదే బాధ.

  27. 27
    prakash July 5, 2011 7:04 am

    sreenivas gaaru.. many thanks for your lovely collection!!
    I saw your ealier efforts in http://www.oldtelugusongs.com/ also.

  28. 28
    rohini November 27, 2011 4:20 am

    మీ ఆలోచన బాగా ఉన్నది. కాని దీనిలొ ఉషశ్రీ గారి ప్రస్తావన లెదు. దయచెసి పరిశీలించగలరు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మరికొన్ని అపురూపమైన గొంతుకలు
  • చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి
  • గాయకులుగా సంగీత దర్శకులు
  • రక్తకన్నీరు
  • మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్

ఇటువంటివే…

  1. మరికొన్ని అపురూపమైన గొంతుకలు
  2. కొన్ని లలితగీతాలు
  3. కొన్ని లలితగీతాలు
  4. సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు
  5. కడపసీమలో అపురూపమైన కలివి కోడి

మే 2011 సంచికలో ...

  • ఈమాట మే 2011 సంచికకు స్వాగతం!!
  • కొన్ని అపురూపమైన గొంతుకలు
  • కోనసీమ కథలు: విలేకరి
  • గాంధీ అభిమాని
  • గురుదేవునికి అంజలి
  • నల్లతోలు: కథ నచ్చిన కారణం
  • నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి
  • పలుకుబడి: వ్యుత్పత్తి, నిరుక్తము
  • పలుకుబడి: సంఖ్యా పదాలు – 1
  • పిల్లల కోసం
  • ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం: రెండో సారి!
  • ప్రాప్తం
  • మందులను ఎలా కనుక్కొంటారు?
  • మస్తానీ
  • మూడు లాంతర్లు – 4
  • మూడు లాంతర్లు – 5
  • యానాం బోటులో..
  • రెండు కవితలు
  • లోపలి పిలుపు విని
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నల్లతోలు: కథ నచ్చిన కారణం
గురుదేవునికి అంజలి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.