దుప్పట్లో ముడుక్కున్నా
రేగుతోంది చలిగాలి
కొయ్యబారింది కిటికీ
వంట గదిలో ఏదో
వెదుకుతోంది ఎలుక పిల్ల
దూరంగా తాగుబోతు కేక
లీలగా మనుషుల ఊసు
చీకట్లో ఒకటే
మొరుగుతోంది ఊరకుక్క
చెవి దగ్గర దోమ ఫిడేల్
కీచురాయి కంఠశోష
గూర్ఖా లాఠీ చప్పుళ్ళకి
పారిపోతోంది దొంగల ముఠా
ఇంకిప్పుడు మెల్లిగా
మాయాలోయల్లోకి జారి
సోయలేని నా పక్కన-
లాఠీ తిప్పుతున్న ఎలుకపిల్లల ముందు
పిల్లి మొగ్గలు వేస్తున్న భేతాళ మాంత్రికులు
ఫిడేల్ ఎత్తుకుపోతున్న పిండారీల వెనకాల
కేకలు పెడుతున్న కింపురుషులూ
తెల్లవార్లూ తచ్చాడతారు.
Apple Prasad అభిప్రాయం:
November 6, 2010 2:31 am
మీ ఆలోచనలని బాగా తెలియజేశారు.
sivasankar అభిప్రాయం:
November 6, 2010 3:46 pm
అర్ధవంతముగా ఏమీ అనిపించడము లేదు. మీరు మనసులో అనుకున్నవి స్పష్టముగా తెలియపరచలేకున్నా ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది.
నరేన్ అభిప్రాయం:
November 10, 2010 12:02 am
బాగుంది. కానీ మీ ‘వానకు తడిసిన పువ్వొకటి ‘ అంత క్లుప్తమైన సునిశిత పరిశీలన ఇందులో కనిపించట్లేదు. అలాంటి కవితలు ఆశిస్తూ….
madhurasree అభిప్రాయం:
November 30, 2010 6:53 am
తీసుకున్న వస్తువును శిల్ప పరంగా చెప్పడం సాహిత్య లక్షణం లక్షణం కోల్పొయింది