ఈమాట » నేను పులిని

Expand to right
Expand to left

నేను పులిని

నేను పులిని
రౌద్రానికీ, క్రౌర్యానికీ,
హింసకీ, ప్రతిహింసకీ
నిర్వచనాన్ని.
కానీ కపటం లేని జంతు విశేషాన్ని.
అందుకే
సాహితీ జగత్తులో నేను
శ్రేష్ఠతకి పర్యాయ పదమై వెలిశాను.

ఇది గతం.

నేనిప్పుడు
బాహ్య ప్రపంచంలో
క్రమేణా అంతరించి
మరింత భయంకరాకారంతో
ఎదుగుతూ ఉన్నాను.
ఇప్పుడు నా పేరు స్వార్థం.
కపటం ఇప్పుడు నా అదనపు గుణం.

ఇక నన్ను శ్రమపడి
అడవుల్లో వెతకొద్దు
నేను కనిపించలేదని నిట్టూర్చొద్దు.
జాగ్రత్తగా మనిషిలో చూడు
తప్పక కనిపిస్తాను.

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. V. Harsha Vardhan అభిప్రాయం:

    July 15, 2010 6:22 am

    ఈ మధ్య టైగర్ రిజర్వ్ లకు వెల్లి చూసినా పులులు కనిపించడం లేదు. కారణం ఇదన్న మాట. జంతువులు అంతరించిపోవడానికి మానవ స్వార్థం కారణమన్న కవితాత్మక వివరణ బాగుది

  2. శ్రీధర్ అభిప్రాయం:

    July 30, 2010 6:09 am

    తన స్వార్ధం కొసం ప్రకృతి సమతుల్యతను హరింపచెస్తున్న మనిషితొ, తన సహజ గుణాన్ని కాదని గడ్డి కూడా తినని పులిని పొల్చటం అంత సమంజసనీయం కాదనిపించింది.

  3. phani kumar sarma అభిప్రాయం:

    August 11, 2010 8:29 am

    చాలా బాగా వున్నది……….

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a