జీలకర్ర - బెల్లం
వచ్చింది
మళ్లీ వసంతం
ఇచ్చింది
మాకులకు సౌభాగ్యాన్ని
పూవులకు సౌరభాన్ని
ప్రకృతికి సౌందర్యాన్ని
తెచ్చింది
గడచిన వసంతపు జ్ఞాపకాలను
ఆనాడు నువ్వన్నావు
“మన ఈ గాంధర్వవివాహానికి
ఆకాశమే పందిరి
పక్షులే సాక్షులు
పూలరేకులే తలంబ్రాలు
నేనే బెల్లం
నువ్వే జీలకర్ర
బెల్లం జీలకర్రతో కలిసిపోతుంది
జీలకర్ర బెల్లంతో కలిసిపోతుంది”
ఈనాడు
ఆ ఆకాశం రంగు మార్చుకుంది
ఆ పక్షులు ఎగిరిపోయాయి
ఆ పూలు రాలిపోయాయి
ఆ బెల్లం కరిగిపోయింది
కను మరుగై పోయింది
మిగిలిందంతా జీలకర్ర
ఈ జీవం లేని కర్ర
ఏ వసంతం ఈ రోకలి కర్రకు
మళ్లీ చివుర్లు తొడిగిస్తుందో
baabjeelu అభిప్రాయం:
May 13, 2010 11:45 am
ఇదేటమ్మా ఇలా రాస్సేవూ?
నువ్వు రోకలి వి కాదు తల్లీ. రోకళ్ళకి చివుర్లు తొడిగించీదానివి తల్లీ.
కళ్ళ్ళు తుడిచీసుకుని పాపిష్టి పీడకలని మర్చిపో.
ఇలా ఇంకెప్పుడూ రాయకు.
బాబ్జీలు
B.Narendrababu అభిప్రాయం:
June 16, 2010 3:30 am
అద్భుతం. అవును నిజం. ఇన్ని రోజులు ఈ కవిత ఎందుకు చదవలేకపోయానా అనిపించింది.