దారి కాదు
మిట్ట మధ్యానం
కొట్టు తీయించేరు
బావికొండకి తోవిలాగేనా? అంటారు.
దాహానికి ఛల్హటివి నీళ్ళు తెమ్మంతారు!
నిద్దర చెడగొట్టీసేరు,
ఇక్కడెవులున్నారు?
నీళ్ళేవు నిప్పుల్లేవు ఎల్లండెల్లండి!
ఎర్రటెండల్లంట
మీకెవుల్రమ్మన్నారు?
గండిగుండం కాసెల్లి
ఎనక్కొచ్చీసేరు.
ఈ అగ్గికత్తెర్లంట
ఏటెతుకుతున్నారు?
అవతలేటున్నాది,
అటూరూ లేదు కాడూ లేదు.
ఆ దిబ్బూసు మీకేల? ఆ దుక్కెల్లకండి!
రాళ్ళు బండల మీద
రాతలేటి చదివెస్తారు?!
గట్లు తవ్వెస్తారు
లెక్క రాసెస్తారు -
కరణాలు మునసబులు నర మానవుల్లేరు!
గుడి కూలిపోయింది
అందలెవులున్నారు?!
చెప్తుంటె మీక్కాదు? పల్లకుండండీ!
బావి కొండకి
తోవ లేదు!
gana అభిప్రాయం:
May 1, 2010 1:40 pm
అవును. బావి కొండకే కాదు, భావి కొండకు కూడా దారి మూసుకుపొతోంది.
వనరుల్ని కొల్పోతూ ఉన్నంతకాలం, వేసవి వెక్కిరిస్తూనే ఉంటుంది.
సుబ్రహ్మణ్యం మూలా అభిప్రాయం:
May 3, 2010 2:52 am
చాలా బావుంది. మీ “భ్రంశధార” కవితకి దగ్గరగా ఉంది.
కవితలో ఒక మాండలికాన్ని వాడేటప్పుడు అన్ని వాడుకలూ అదే మాండలికంలో ఉంటే బావుంటుందేమో
గుడి కూలిపోయింది — గుడు కూలిపోనాది
తోవ లేదు — తోవ నేదు