ఓ బుజ్జి కుక్క పిల్ల
వాళ్ళమ్మకి బొచ్చు కుక్క గురించి చెప్పింది డాలీ. పెంచుకుంటే అలాంటి కుక్కనే పెంచుకోవాలనీ, ఎలాగయినా కొనమని పేచీ పెట్టింది. డాలీ పోరు భరించలేక వాళ్ళమ్మ పార్కుకొచ్చి అతన్ని ఎక్కడ కొన్నాడో అడగడానికి ఒప్పుకుంది. ఆ ఒప్పుకోడానికి డాలీ బాగా చదువుతాననీ, చెప్పినమాట వింటాననీ, టీవీ చూడననీ ఒకటేమిటి చాలా ప్రామిస్సులు చేసింది. ఆ రోజు సాయంత్రం తల్లిని తీసుకొని పార్కుకొచ్చింది డాలీ. అతని కోసం చూసింది. ఎంత సేపు చూసినా అతను రాలేదు. ఎదురు చూసి చూసి విసుగు పుట్టి, తల్లితో తిరిగెళ్ళి పోయింది.
ఈ లోగా డాలీ తాతయ్యకి అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేర్చారని కబురొస్తే వాళ్ళందరూ రాజమండ్రి వెళ్ళారు. డాలీకి వాళ్ళతో వెళ్ళక తప్పలేదు.
డాలీ తాతయ్య కోలుకున్నాక, ఓ నెల్లాళ్ళ తరువాత వైజాగ్ తిరిగి వచ్చింది. వచ్చీ రాగానే ఆ సాయంత్రం వాళ్ళమ్మని పార్కుకు రమ్మనమని పోరేసింది డాలీ.
“వచ్చే వరకూ పీక్కు తినేస్తావు కదే?” అంటూ వాళ్ళమ్మ తిట్టుకుంటూనే బయల్దేరింది.
వస్తూనే అతను ఎప్పుడూ కూర్చునే బెంచీ వైపు చూసింది డాలీ. ఎప్పటిలాగే అతనికి ఒక చేతిలో పుస్తకం, రెండో చేతిలో సిగరెట్టుతో కనిపించాడు. వెంటనే టామీ కోసం కళ్ళు వెతికాయి. కనిపించలేదు. ఆ బెంచీకి కాస్త దూరంగా ఓ నల్ల కుక్క గడ్డిలో దేనితోనో ఆడుతోంది. బంతేమో అనుకుంది డాలీ. కానీ అలా అనిపించలేదు. బెంచీ మీద అతన్ని చూసి ఒక్క ఉదుటున పరిగెత్తుకెళ్ళింది డాలీ. ఆ పిల్ల పరుగు చూసి ఆ బెంచీ మీదున్న వ్యక్తి తలతిప్పాడు. డాలీని గుర్తుపట్టి నవ్వుతూ పలకరించాడు. ఇంతలో డాలీ వాళ్ళమ్మ అక్కడికొచ్చింది. వాళ్ళిద్దరూ పరిచయాలు చేసుకున్నారు. డాలీ వాళ్ళమ్మ టామీ ప్రస్తావన తెచ్చింది.
“మా డాలీ రోజూ మీ టామీ గురించే చెప్పి బుర్ర తింటుంది. మీరు ఈ టామీని ఎక్కడ కొన్నారు? ” నవ్వుతూ అడిగింది వాళ్ళమ్మ.
” హైద్రాబాదునుండి తెప్పించుకున్నాం. నా వైఫ్‌కి అదంటే ప్రాణం.”
“అలాగా! ఈ వైజాగులో ఎక్కడ దొరుకుతాయి?”
“గాజువాకలో ఒకాయన కుక్కపిల్లల్ని తెప్పిస్తాడు. మీకెలాంటి కుక్క కావాలంటే అది ఆయన్ని అడగొచ్చు.”
డాలీ వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటోంది. ఇంతలో దూరంగా ఉన్న నల్లకుక్క పిల్ల వచ్చి అతని కాళ్ళని నాకింది. ఆ కుక్క పిల్లని చూసి కాస్త ఎడంగా జరిగింది డాలీ.
“మీ టామీ భలే బావుంది.” నవ్వుతూ అంటున్న అమ్మకేసి చూసింది. టామీ పేరెత్తగానే అతని మొహంలో రంగులు మారాయి.
“ఇది టామీ కాదు. జూలీ!”
“టామీని ఇంటి దగ్గరొదిలేసారా?”
లేదన్నట్లు తలాడించాడతను. “టామీ మూడు వారాల క్రితం చనిపోయింది. మా వైఫ్ టామీ లేందే ఉండలేదు. దాంతో ఆవిడ బెంగ పెట్టుకుంది. టామీ బదులు ఈ జూలీని తెచ్చుకున్నాం. మా వైఫ్ ఇంకా టామీని మర్చిపోలేకపోతోంది…” నెమ్మదిగా అన్నాడతను.
“ఐ యాం సారీ! దీన్ని చూసి టామీ అనుకున్నాను.”
“పరవాలేదు.” అతను సర్దుకున్నాడు. డాలీ మనసంతా ఒక్కసారి వెలితిగా అయిపోయింది. ఏం అనాలో తెలీడం లేదు. ఒక్క మాట పెగల్లేదు.
“టా..మీ..ఎలా..పోయింది?” డాలీ ఒక్కొక్క మాటా కూడదీసుకుంటూ అడిగింది.
“టామీకి వంట్లో బాగాలేకపోతే డాక్టరుకి చూపించాం. కేన్సర్ అని చెప్పాడు. ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుందని అన్నారు. ఈలోపలే పోయింది.” చెబుతూంటే అతని గొంతు జీరబోయింది.
“కేన్సరా…?”
“అవును. లంగ్ కేన్సర్!”
“అయ్యో పాపం. మా ఫాదరిక్కూడా నెల క్రితం లంగ్ కేన్సరొచ్చింది.. ఎర్లీ స్టేజి లోనే కనుక్కున్నారు. ప్రస్తుతం పర్వాలేదు. కుక్కలకి కూడా కేన్సరా..?”
అవునన్నట్లుగా తలూపాడతను. డాలీ వాళ్ళ మాటలు వింటోంది. టామీ చచ్చిపోయిందన్న విషయం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. వాళ్ళమ్మ గాజువాకతని అడ్రసు తీసుకొని వెళ్ళొస్తామని చెప్పింది. దిగాలుగా వాళ్ళమ్మని అనుసరించింది డాలీ. ఆమె మనసులో టామీ రూపమే మెదులుతోంది. తెల్లటి తెలుపు రంగులో, విపరీతమైన బొచ్చుతో ఉండేది. చిన్నగా బొద్దుగా ఉండేది. డాలీ స్నేహితులతో ఆడుకోడానికెళ్ళ లేదు. డాలీని తీసుకొని ఇంటి ముఖం పట్టింది వాళ్ళమ్మ. వెళుతూ, వెళుతూ ఒక్క సారి వెనక్కి తిరిగి చూసింది డాలీ. అతను ఎప్పటిలాగే బెంచీ మీదే పుస్తకం తిరిగి చదువుతూ కనిపించాడు. మరో చేతిలోలో సిగరెట్టు. రింగు రింగులుగా అతను గాలిలో పొగూదుతున్నాడు.టామీ చచ్చిపోయిందని గుర్తొచ్చి భయమేసింది. దూరంగా ఆ నల్ల కుక్క ఎముక నాకుతూ కనిపించింది. మొదటి సారి ఆ కుక్క పిల్లని చూసి ఏవగింపు కలిగింది డాలీకి.
“టామీ చచ్చిపోయాక ఏమవుతుంది?” దారిలో అమ్మనడిగింది.
“ఏమవుతుంది. పైకెళిపోతుంది..” అంటూ ఆకాశం వైపు చూపించింది.
“పైకెళితే మళ్ళీ తిరిగి రాదా?”
“రాదమ్మా”
“కేన్సరొస్తే చచ్చిపోతారా? కేన్సరంటే ఏంటి?”
“కేన్సరంటే పెద్ద కురుపులా వస్తుంది. అయినా ఏంటీ పిచ్చి ప్రశ్నలు?”.
డాలీకి వాళ్ళమ్మ మొహంలో చాలా విసుగు కనిపించింది. ఇహ డాలీ ఇంకేమీ అడగలేదు. ఆలోచిస్తోంది. తాతయ్యకీ లంగ్ కేన్సరని ఇంట్లో అందరూ చెప్పుకోడం వింది.
తల్లినడిగితే తాతయ్య చుట్ట కాల్చడం వల్ల కేన్సరొచ్చిందని చెప్పడం గుర్తొచ్చింది డాలీకి. చుట్టకాలిస్తే కేన్సర్ వస్తుంది కానీ, సిగరెట్ కాలిస్తే రాదు కదా? అయినా అతను సిగరెట్టు కాల్చాడు కానీ కుక్క సిగరెట్టు కాల్చలేదు కదా? మరి కుక్క ఎలా చచ్చిపోయింది? అతను ఒకదాని వెంబడి మరొకటి కాల్చడం చూసింది తను. ఎప్పుడూ టామీ అతని ఒళ్ళోనే ఉండేది. ఆ పొగ ఘాటు దూరంగా ఆడుకుంటున్న వాళ్ళకీ వచ్చేది. అయితే ఆ కుక్క కూడా అతనొదిలిన పొగని తాగిందా? తల్లినడుగుదామంటే తిడుతుందనుకొని మౌనంగా ఉండిపోయింది. అర్థంకాని ఎన్నో ఆలోచన్లతో ఇంటికొచ్చింది.
తండ్రి సోఫాలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. రెండో చేతిలో సిగరెట్ వెలుగుతూ కనిపించింది. డాలీని చూడగానే అతను సిగరెట్ పక్కన పడేసి కూతుర్ని దగ్గరకి తీసుకున్నాడు. డాలీకి పొగ వాసనొచ్చింది.
“ఏయ్ డాలీ! నీకో సర్ప్రైజ్!” అంటూ డాలీని సోపాలో కూర్చోబెట్టి, లోపలికెళ్ళి తిరిగొచ్చాడు.
అతని చేతిలో ఓ తెల్ల బొచ్చు కుక్క పిల్లుంది.
“నీకోసమే! మా ఫ్రెండొకాయిన ఇచ్చాడు. ఏం పేరు పెడదాం?”
డాలీ ఆ కుక్క పిల్ల కేసే చూస్తూ ఉండిపోయింది. కుక్క పిల్లని చూడగానే ఎగిరి గంతేస్తుందనుకున్నాడు. కూతురు ఏం మాట్లాడకపోయేసరికి ఆశ్చర్యపోయాడతను.
“నిజంగా! నీ కోసమే…” అంటూ కుక్క పిల్లని డాలీ చేతిలో పెట్టాడు.
డాలీ కుక్కపిల్లని ఒదిలించుకొని పక్కనబెట్టేసింది. ఏం మాట్లాడలేదు. అర్థంకాక తండ్రి తనవైపే చూస్తున్నా తలదించుకునే వుంది. రింగు రింగులుగా పొగలొదుల్తూ పార్కులో అతను గుర్తొకొచ్చాడు డాలీకి. ఆ పొగల మధ్య తెల్లటి బొచ్చుతో టామీ తలాడిస్తూ గుర్తుకొచ్చింది.
“నాకు కుక్క పిల్ల వొద్దు. వెనక్కిచ్చేసెయ్యి నాన్నా” అంటూ ఒక్కుదుటున తల్లి దగ్గరికి పరిగెత్తింది డాలీ.
chinna అభిప్రాయం:
March 9, 2010 12:01 pm
నాకు నచ్చిన ఓ బుజ్జి కుక్క పిల్ల ఇదీ ఒకటీ.
Shiva kumar అభిప్రాయం:
March 18, 2010 12:27 am
ఇది నిజంగా చాలా బాగుంది. ఇటు వంటి వాటిని మీరు ఇంకా ఆదరించాలని కోరుతు..మీ అభిమాని.
భూషణ్ అభిప్రాయం:
March 19, 2010 12:27 pm
సెకండు హాండు స్మోకింగు చాలా హానికరం అని చెప్పాలన్నది ఈ కధ ఉద్దేశ్యం అని నాకర్థమైంది. అది చాలా చక్కటి విషయం. దానితో విభేదించాల్సింది ఏమీ లేదు. అయితే, చెప్పిన విధానం మాత్రం చాలా కృతకంగా, వికృతంగా, కృత్రిమంగా, పరమ యాంత్రికంగా వచ్చింది. నాకు మాత్రం నచ్చలేదు.
ఇట్లు,
భూషణ్
raghu అభిప్రాయం:
March 19, 2010 2:42 pm
Poor Narration.
bhaarati అభిప్రాయం:
April 6, 2010 6:08 pm
కథ చెప్పిన పద్ధతి నాకు బాగా నచ్చింది. సిగరెట్ల పై డాలీ కొచ్చిన ఫీలింగ్స్ చక్కగా చెప్పారు.
చెప్పేపద్ధతిలో ” కృతకం, కృత్రిమం, వికృతం ” ఏమీ స్ఫురించ లేదే!
“యాంత్రికంగా ” లేనే లేదు.
ఈ రచయిత అంటే ఈ పై విమర్శకుడికి ఏమంత ఇష్టం లేనట్టు కనిపిస్తోంది; కానీ, రచనపై లేని అభాండాలు రుద్దడం ఏమంత నాగరీకం కాదేమో!
యస్. భారతి
ashwini అభిప్రాయం:
April 17, 2010 7:49 am
Its very good story all want to learn from this ” smoking is injurious to others life also”
medavaram kanthi mumar అభిప్రాయం:
April 23, 2010 6:54 am
nice story. simple and easy understandable sentenses. but selected concept is very simple, eventhough, the texture is gentle.
bhanu అభిప్రాయం:
July 1, 2010 7:17 am
very nice story.Depicts the understanding of the child.
nani అభిప్రాయం:
February 25, 2011 12:16 am
చాలా బాగుంది.