ఈమాట » వెదురు వేది

Expand to right
Expand to left

వెదురు వేది

మొగ్గ
తొడగదన్న
చింతలేదు
ఓపిగ్గా తోటనంతా
కోవెల చేరుస్తుంది

        పలుకులు
        చిలకవన్న
        బాధలేదు
        వేళ్ళతో పలకరిస్తే
        వేణువై శ్వాసిస్తుంది

తోడు లేదన్న
ధ్యాస లేదు
లోక కళ్యాణానికై దేహాన్ని
పందిరిగా మారుస్తుంది

        పెరట్లో
        చోటులేదన్న
        పట్టింపు లేదు
        ఊగే పుట్టుకనీ
        విశ్రమించిన ఊపిర్నీ
        బంధువై మోస్తుంది.

అడవి
మనిషినన్న
గొడవ లేదు
దేహాన్ని గోడ చేసి
అక్కున చేర్చుకుంటుంది.

        నిలువునా చీల్చినా
        నిలువెల్లా కోపం రాదు.
        మెరుపు తారాజువ్వలా
        ఆనందాన్ని
        ఆకాశానికి అతికిస్తుంది.

ప్రాణం తీసారని
కన్నీరై విలపించదు.
గుండెపై చెక్కిన
అక్షర శిల్పాన్ని
కవన కోవెల్లో
భద్రంగా దాస్తుంది.

 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. mOhana అభిప్రాయం:

    January 6, 2010 3:05 pm

    చక్కని కవిత! విధేయుడు - మోహన

  2. Srinivas Nagulapalli అభిప్రాయం:

    January 7, 2010 5:22 pm

    చెట్టంత భావాన్ని చిన్ని పదాలలో చెప్పారు, హృద్యంగా.
    విధేయుడు
    -Srinivas

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a