ఈమాట » గాలిపటం

Expand to right
Expand to left

గాలిపటం

ఏమిటో ఆ గాలిపటం
ఎగిరిపోతున్నది
పడమటి గాలులకు
ఎగసిపోతున్నది

గతంలో కూడా ఇలాగే ఎన్నో గాలిపటాలు
రెక్కలు విప్పిన విహంగాల్లా
రివ్వుమన్న విమానాల్లా
దూసుకుపోయి
అంబరాన్ని చుంబించే ప్రయాణాల్లో
పల్టీలు కొడుతూ అట్టహాసాలు చేస్తుంటే

ఇక్కడ నేలపై
గుండెలు జారిపోతున్నా
శక్తినంతా కూడదీసుకుని
వాటి ప్రతి కదలికనూ నిలకడ చేస్తే …

తీరాలు దాటి దూరాలు చేరిన
సంబరాల్లో
నడిపించిన చేయి విడిచిపోయి
పేగుబంధం తెంచుకుంటే
కొమ్మనొదిలిన ఎండుటాకుల్లా కొట్టుకొచ్చీ
చేవ చచ్చి చిత్తుకాగితాల్లా విసిరివచ్చీ
ముళ్లపొదల్లో చిక్కలేదా…

మరి ఎందుకో ఆ గాలిపటం
మురిసిపోతున్నది
పడమటి గాలులకు
మిడిసిపడుతున్నది!

 

(6 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Vamshi అభిప్రాయం:

    January 5, 2010 4:08 am

    మీ కవితలో చాలా లోతైన భావం ఉన్నది….

  2. నారాయణ గరిమెళ్ళ అభిప్రాయం:

    January 20, 2010 2:23 am

    గాలి పటాలు అందు బాటులో ఉండి ఎగురుతుంటేనే, వాటి స్వేచ్చకు
    ఎగరేసినవారి స్పూర్తి/సామర్ధ్యాని కి అందం/అర్థం.

    ఏ దిక్కు గాలుల్నైనా ఎలాగూ నిలువరించలేము, కాబట్టి,
    తయారీ సమయములోనే బాధ్యతగా ఎగరడమెలాగో నేర్పించాలి.
    అంతేనంటారా, సమీర్ గారూ?

    నారాయణ గరిమెళ్ళ.

  3. Ch J Satyananda Kumar అభిప్రాయం:

    January 23, 2010 1:56 pm

    మిత్రమా,

    గాలి పటం కవిత చాలా బాగుంది. దాన్ని ఇంగ్లీషులో అనువదించి ఈ క్రింద ఇస్తున్నాను. museindia.com లో కూడా వేస్తాను రెండు దినాల్లో.

    Don’t know why that kite is
    Flying away skyward
    Driven by western winds
    Soaring high upward

    In the past too while many kites
    Like wing stretched birds
    Like dashing planes
    Zipped fast
    In their flights to kiss the heavens
    Somersaulting and rumbling

    Here on land
    despite losing spirits
    Pooled-up all energies and
    Stabilized their every movement..

    In the revelry
    Of reaching distant coasts, when
    Left the hands that guided
    Severed the umbilical cord

    Drifted like dry leaves distanced from the tree branch
    Lost vigor and blown away like torn waste paper pieces
    Didn’t they caught-up in thorny bushes….?

    మిత్రుడు
    సత్యానంద కుమారు

    Then why that kite is
    exulting
    Driven by western winds it is
    exciting

  4. sameer అభిప్రాయం:

    January 27, 2010 4:02 pm

    చాలా బాగా చెప్పారు నారాయణ గారూ.

  5. sameer అభిప్రాయం:

    January 27, 2010 4:32 pm

    సత్యానంద కుమార్ గారు,
    మీ ప్రశంసకు ధన్యవాదాలు. మీ ప్రయత్నము బాగుంది. అనువాదము చాలా కష్టమైన ప్రక్రియ. మీకు తెలియంది కాదు. భావములో ఏ మాత్రము తేడా రాకుండా మీరు అనువదించారు కానీ ఇంగ్లీషు పదాలు తెలుగు వాక్య నిర్మాణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మీరు ప్రయోగించిన ఇంగ్లీషు పదాలు చాలా బాగున్నాయి. ఇంగ్లీషు వాక్య నిర్మాణం ప్రకారంగా మీరు దీన్ని మారిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. మీరేమంటారు?

  6. siva rama prasad అభిప్రాయం:

    February 24, 2010 3:04 pm

    CH satyanand kumar garu, do English poems resemble your translation? It cannot be English poetry. its only word to word translation. Somersaulting ? queer usage. గాలిపటాలు గిరికీలు కొడతాయి గాని పల్టీలు కొట్టవండి. Wing stretched birds? I never heard or read/ came across such usage in English.విసిరితే వస్తుందా? విసిరి వచ్చి అక్కడి పదాల కూర్పు విచిత్రంగా అనిపిస్తుంది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a