మరో ప్రపంచం పిలిచింది
[శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చదివి వినిపించిన మహాప్రస్థానం కవిత వీడియో ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం. - సం.]
నిడివి: షు. 2ని.
(సేకరణ: మద్దిపాటి కృష్ణారావు, వడ్లమూడి బాబు)
[శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చదివి వినిపించిన మహాప్రస్థానం కవిత వీడియో ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం. - సం.]
నిడివి: షు. 2ని.
(సేకరణ: మద్దిపాటి కృష్ణారావు, వడ్లమూడి బాబు)
Dr. Apparao Nagabhyru అభిప్రాయం:
January 8, 2010 3:14 pm
How fortunate we are to see this wonderful video of Sri Sri rendering Maro Prapancham.
Thanks to Krishnarao garu & Babu garu.
Apparao
rama bharadwaj అభిప్రాయం:
January 11, 2010 1:09 am
శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని గూటాలకృష్ణమూర్తిగారు విదేశాంధ్ర ప్రచురణల పేర 80వ దశకంలోనే లండన్ నించి ప్రచురించారు. ఈ పుస్తకం తాలూకు ప్రత్యేకత మహాప్రస్థానం లోని గేయాలని శ్రీశ్రీ చేతిరాతతో ప్రచురించడం! ఇందులోని కొన్ని కవితలకి బాపు బొమ్మలు వేసారు. ఈ పుస్తకంతోపాటుగానే శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థానం గీతాల ఆడియోకేసెట్ కూడా ఉంటుంది.
ఈమాట సంపాదకవర్గం గూటాల కృష్ణమూర్తిగారిని సంప్రదించి ఈ శ్రీశ్రీ ప్రత్యేక సంచికలో ఆ ప్రతినీ చేర్చి ఉంటే బాగుండేది.ఈమాట పాఠకులకి శ్రీశ్రీ చేతిరాత శ్రీశ్రీ గొంతుకనించి మహాప్రస్థానం .. రెండూ లభించి ఉండేవి..మరి ఆ ప్రయత్నం ఎందుకని జరగలేదో!?
రమ.
ఆ ప్రయత్నం జరిగింది, కానీ ఫలించలేదు …[సం.]
Jagannadha Rao అభిప్రాయం:
January 20, 2010 7:19 am
అనందం
అద్భుతం
ఆశ్చర్యం
నా జీవితం ధన్యం
శ్రీ శ్రీ కి జొహరులు
madhavi godavarthy అభిప్రాయం:
May 24, 2010 7:58 am
శ్రీ శ్రీ గారిని చూస్తూ వినడం గొప్ప అనుభూతి.
Dr Tatiraju Venugopal అభిప్రాయం:
May 28, 2010 11:52 am
1979లో బరంపురంలో అఖిలాంధ్ర రచయితల సమ్మేళనం మార్చి 20-22 ల మధ్య జరిగినప్పుడు మహాకవి ‘ అల్లూరికి వారసుడా శ్రీశ్రీ కవితా లాలసుడా, దేర్ ఫోర్ ఊగరా ఊగరా’ అని ప్రసన్న వదనంతో చదవడం, ‘ఒక్క మతితోనే సతమతమౌతుంటే నాకీ బహు మతులెందుకూ’ ‘ అన్న పానుగంటి వారి జోక్ ని వినిపించి ‘సాక్షి’ వ్యాసాలు ప్రస్తావించడం- ఇవన్నీ మననం చేసుకుంటుంటే అటువంటి ‘మూవింగ్ ఎన్ సైక్లోపీడియా’ కవి 20వ శతాబ్దంలోనే కాదు, ఇప్పుడూ లేడు అనిపిస్తుంది. మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది- ఈ గేయం ఎన్నో రూపాలతో సినీ గీతంగా మళ్ళీ మళ్ళీ శ్రీశ్రీ కలంనుండే రావడం బహుశ: గిన్నీసు వారి దృష్టికి రాలేదేమో. రణ భేరి చిత్రంలో కొంత భాగం ‘మార్చింగ్ సాంగ్’ గా, మిగతా భాగం బుర్ర కథ గా మలిచారు. ఇవన్నీ ఒక చోటికి తీసుకు రాగలిగేది, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, ఈ మాటే!
-వేగోతారా