శ్రీశ్రీ ఉపన్యాసం
[శ్రీశ్రీ 1981లో అమెరికా పర్యటనలో పిట్స్‌బర్గ్ నగరంలో ఒక సభలో చేసిన ప్రసంగపు వీడియో ఈమాట పాఠకుల కోసం ప్రత్యేకం. శ్రీశ్రీతో పాటుగా వేదికపై సాలూరి రాజేశ్వరరావు, సినారేలు కూడా ఉన్నారు. - సం.]
నిడివి: షు. 30ని.
(సేకరణ: మద్దిపాటి కృష్ణారావు, వడ్లమూడి బాబు)
mOhana అభిప్రాయం:
January 2, 2010 8:19 pm
శ్రీశ్రీ చేసిన ఈ ప్రసంగము అందరూ తప్పక విని, ఆనందించి, ఆలోచించవలసినట్టిది. వారు ఆధునిక కవియైనా, ప్రాచీన సాహిత్యాన్ని కూలంకషముగా చదివి, అందులోని విషయాలను అవగాహన చేసికొని ముందడుగు పెట్టారు. భారత కవులు రాసిన పద్యాలను ఉత్సాహంతో చదివి అందులోని లోతులను తెలియ బరచారు. కాని తన దృష్టిలో తిక్కన, వేమన, గురజాడలే కవిత్రయమని వివరించారు. తిక్కన నాటకీయత, వేమన అప్పటి సమాజములోని కుళ్ళును చూపి తన పద్యాలతో ప్రజలను చైతన్య పరచుట, గురజాడ పాత జమిందారి కవిత్వపు ఛాయలను త్యజించి ప్రజల వాడుక భాషలో పాడుకోతగ్గ మాత్రా ఛందస్సులో వ్రాయుట ఇందులకు కారణాలు. తాను కూడా భావ కవిత్వం వ్రాసిన తరువాతే అభ్యుదయ కవిత్వం రాశానని, ఆ కాలపు పరిస్థితులు (ఆర్థిక మాంద్యము, స్పానిష్ సివిల్ వార్, ఫాసిసం) తన్ను ఉద్రేక పరచాయని వివరించారు. వారి గళములో పొలాలనన్నీ హలాల దున్నీ … గేయాన్ని విని ఉప్పొంగిపోవచ్చు. ఈ కానుక నందిచ్చిన మద్దిపాటి కృష్ణారావుగారికి, వడ్లమూడి బాబుగారికి మనం ఋణపడి ఉన్నాము.
విధేయుడు - మోహన
din అభిప్రాయం:
January 12, 2010 9:49 pm
itz really very nice sir
నారాయణ జి. అభిప్రాయం:
January 30, 2010 5:58 pm
మద్దిపాటి కృష్ణారావు, వడ్లమూడి బాబు గార్లకు ధన్యవాదాలు.
శ్రీ శ్రీ గారిని చూడటంతో పాటూ, పురాణేతిహాసాల సాహిత్యం పట్ల వారి ఆశక్తి, విశేష ప్రతిభ ఎంతటివో తెలిశాయి.
నేల నుండి సాము చేసి మహాకవి అయ్యారని అని నిరూపించుకున్నారు.
నారాయణ జి.
IVNS Raju అభిప్రాయం:
February 20, 2010 8:48 am
It is a rarest footage on the great poet Sri Sri. Many thanks for bringing this out. I wonder if Sri Sri would have been a champion of Sanathana Dharma how he would have excelled in doning that role!! With the unfolding of the spiritual energy hidden in the people of this world, in this information era, we certainly miss Sri Sri. Rendu Sirulanu daachukunna vaadu. Oka siri tana Kavanam and marokasiri noothanatwaanni maanavatvaanni vedake manasu. Idi chaaladu Sri Sri ni Aadhunika Aadhyaatmika Jeevi ani cheppadaaniki.
Dhoorjati loni power of confession
Potana loni bhakti paaravasyam
Telugu biddalaku andacheyaali
Anduku maroka Sri Sri kaavali.
Aa Sri Sri Aadhyatmika Kavi
Adhivaastavikatanunchi Aadhyatmikam vaipu adugulesina Sri Sri kaavali
Namassulato
__
IVNS Raju
rama bharadwaj అభిప్రాయం:
February 23, 2010 12:49 am
ముందు రవ్వంత మొహమాటంగా మొదలెట్టి పక్క సీట్లో సినారె ఉన్నందు వల్ల కాబోలు..యూనివర్సిటీలలోని పిహెచ్ .డి లని గురించి కూడా ప్రస్తావించి….తెలుగు ఉపన్యాసకుడిలాగా మాట్లాడటమ్ మొదలుపెట్టిన ఆ మహాప్రస్థాన కారుడి నెమ్మదితనం ముందు కొంచెం అసహజంగా అన్పించింది..కానీ మెల్లగా ఆయన కవిత్వం వేపు మళ్ళాకా మాత్రం ఆయన తన ముద్రని అక్కడి శ్రోతల మనసులమీద వేసాడు. “ప్రతిజ్ఙ” కవితని చదివి ముగించాకా అక్కడి వాళ్ళు కొట్టిన చప్పట్లు తరవాత ఆయన ముఖంలోని చిన్నపిల్లవాడి ముఖంలోని ఆ అమాయకపు నవ్వుని గమనించగలిగితే [కవిగా ఆయన ఎంత తేటగా ఉన్నాడో ఆ వయసున కూడా] అన్న సంతోషం కలుగుతుంది.
ఆయన చదివిన మహాభారతంలోని పద్యాలన్నీ బాగా ప్రసిధ్ధికెక్కిన పద్యాలే!! కానీ వాటిని ఆయన ధాటీగా అనర్గళంగా చదవడం ఆయన పద్యాలని ధారతో గుర్తుపెట్టుకోవడం ఆయన మీద ఉన్న చందస్సు ప్రభావం ..పద్యం మీద ఆయనకున్న పట్టుని కూడా చెపుతోంది.
మొత్తానికి శ్రీశ్రీ నించి క్లుప్తంగా ఆయనపైని కవిత్వ ప్రభావాలనీ..తెలుగు కవిత్వాన్ని ఆయన అంతే క్లుప్తంగా అక్కడి శ్రోతలకి చెప్పడాన్నీ ఈవీడియో ప్రదర్శించింది.ఆయన “దహ్యప్రభావానల …సలిపిరి దీర్ఘ వాసర నిశల్ ” అన్న మహాభారత పద్యం చదువుతూంటే మాత్రం ..”కన్యాశుల్కం”లో “అట్టె అట్టె దహ్య ప్రభవానలము అంటే అర్ధమేమిటిరా?” అని కరటకశాస్త్రులు వెంకటేశాన్ని అడిగినప్పుడు గిరీశం కల్పించుకుని “ఇప్పటి మటుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు….అంటూ వెంకటేశాన్ని కరటక శాస్త్రినించి తప్పించడానికి పడ్డ తమాషా గుర్తొంచింది.
శ్రీశ్రీ పక్కన కూచున్న నారాయణరెడ్డి అలా కుర్చీలో కదులుతూ ఉండటం మాటిమాటికీ కళ్లజోడుని తుడుచుకుంటూండటం..జుట్టుని సవరించుకోవడమ్ లాంటి అసహజ కదలికలు చూపుకి చికాగ్గా ఉన్నా శ్రీశ్రీని క్లోజ్ అప్ షాట్ లోకి పెట్టాకా ఆ బెడద వదిలి మిగతా శ్రీశ్రీ మాటల్ని స్థిమితంగా ఆస్వాదించడానికి వీలయ్యింది.
మద్దిపాటి కృష్ణారావు, ఇంకా వడ్లమూడి బాబులకి సంతోషాన్ని తెలియజేస్తూ..
రమ.