శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ
[శ్రీశ్రీ కవితలకు బాపూ గీసిన ఈ బొమ్మల సంకలనం ఈమాట పాఠకులకోసం ప్రత్యేకం. 1981లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో కొన్ని వారాలపాటు వచ్చిన బొమ్మలూ, విదేశాంధ్ర ప్రచురణల మహాప్రస్థానంలో (లండన్ ప్రతి, 1981) బొమ్మలూ ప్రత్యేక అనుమతితో సేకరించి, పూర్తి కవితలతో జతచేసి ఈ కవితాచిత్రసంకలనం మీకందిస్తున్నాం - సం.]
వేణు అభిప్రాయం:
January 3, 2010 12:50 am
శ్రీశ్రీ కవితలకు బాపు బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు!
‘ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన ఒంటె’ కవితకు (బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను) ఆంధ్రజ్యోతి వారపత్రికలోనే వచ్చిన బాపు బొమ్మ మిస్సయింది, ఈ సంకలనంలో! అయితే ఆ బొమ్మ.. కవితలోని పదచిత్రానికి తగ్గట్టుగా లేదని రా.రా. తన‘అనువాద సమస్యలు’లో ప్రస్తావించారనుకోండీ:)
[ఆంధ్రజ్యోతి పత్రికలో బొమ్మలు, ఎప్పుడో టెంత్‌లోనో ఇంటర్‌లోనో మా సంపాదకులొకరు సేకరించుకున్నవి. మీరు ప్రస్తావించిన బొమ్మ వాటిల్లో లేదు. ఎవరైనా పంపినా లేదా ఎవరిదగ్గరైనా ఉంటే తెలిపినా వారి అనుమతితో ఆ బొమ్మను కూడా ఈ సంకలనంలో చేర్చగలం. ఈ విషయం చెప్పినందుకు కృతజ్ఞతలు - సం.]
V Chowdary Jampala అభిప్రాయం:
January 3, 2010 3:50 am
ఈ సంకలనంలో శ్రీశ్రీ సంధ్యాసమస్యలు కవితకి బాపు వేసిన చిత్రం లేదు. ఆంధ్రజ్యోతికోసం వేసిన చిత్రాల పరంపరలోని ఈ చిత్రం తానా తెలుగు పలుకు (10వ సంపుటం, చికాగో, 1995)లోనూ, తెలుగునాడి జూన్ 2009్ సంచికలోనూ పునర్ముద్రించబడింది.
- జంపాల చౌదరి, మండలీన్, ఇల్లినాయ్.
[నిజమే. అది బొమ్మల స్కాన్లను ఒకటే డాక్యుమెంటుగా సంకలించడంలో జరిగిన పొరపాటు. ఆ బొమ్మను కూడా ఈ సంకలనంలోకి జత చేశాం. పొరపాటు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు - సం.]
siva rama prasad అభిప్రాయం:
January 26, 2010 5:58 am
శ్రీ శ్రీ కవితకి బాపు బొమ్మలు అద్భుతంగా వున్నాయి. రంగులు చాలా అందంగా ఉన్నాయి.
శ్రీనిధీ అభిప్రాయం:
February 27, 2010 3:04 pm
రెండు కళల అద్బుత సమ్మేళనము ఈ సంకలనమ్.