ఈమాట » రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది

Expand to right
Expand to left

రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది

చెడ్డ గాలి గంతులు వేసింది
ఎండు తాటాకులను ఎగరగొట్టింది
తాతమ్మ పాక గిజగిజలాడింది

దొడ్డి వాకిలి చప్పుళ్ళు చేసింది
నీళ్ళ బిందెలో తరంగం ఏర్పడింది
మేకుకున్న పటం ఊగిసలాడింది

మూకుడులో రొట్టె చల్లారిపోయింది
చమురు దీపం మూలన అల్లల్లాడింది
వెల్ల వేసిన గోడంతా నీడలమయమైనది

గాలి హోరులో కలవరింత పచార్లు చేసింది
నవారు మంచంపైన అది జాగారం చేసింది
రాత్రంతా వర్షం కురుస్తూనే ఉన్నది

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. బొల్లోజు బాబా అభిప్రాయం:

    November 2, 2009 3:33 am

    అద్బుతమైన దృశ్య చిత్రణ. చాలా గొప్పగా సాగింది.

    చెడ్డ గాలి అన్న పదప్రయోగం నప్పలేదనిపిస్తుంది.

  2. జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    November 2, 2009 10:05 am

    అరవయ్యో దశకంలోని బాల్యం గుర్తుకొచ్చింది. అల్లలాడిన చమురుదీపాలు నులకమంచాన్ని విడిచి ఒక్క అరుగుపైచేరి కుంపటి ఎగదోసుకుంటూ, జాగారపు గీతాలను ఆలపించిన గొంతులేవో అస్పష్టంగా వినబడుతున్నాయి.

    అభినందనలు

  3. Seetha Kumari అభిప్రాయం:

    April 6, 2010 10:44 am

    మీ కవిత ఏదైనా మనసుకు హత్తుకునేలా ఉంటుంది….మంచి పద చిత్రాలు వేస్తారు మీరు..

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a