ఈమాట » నాయినమ్మ యిల్లు

Expand to right
Expand to left

నాయినమ్మ యిల్లు

అలికిన పొయ్యిపై
చెరగని చేతిగురుతులు,

తరాలుగా
తడి పీతాంబరాలు మోసి
వొరిగిన దండెం,

తనకిక పనిలేదని
తాపీగా పడుకున్న వ్యాసపీఠం,

వానప్రస్థం స్వీకరించి
ధ్యానంలో మునిగిన వసారాలు.

ఎపుడో హంపీ శిథిలాల్లో
పాడుకున్న విషాదగీతం
పెదవులమీదకి వచ్చింది.

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. rajeshwari అభిప్రాయం:

    December 9, 2009 7:58 pm

    మీ కవిత బాగుంది.

  2. naren g అభిప్రాయం:

    December 26, 2009 11:30 pm

    క్లుప్తంగా వ్రాసినా, చాలా బాగా వ్రాసారు.

    గతించిన మా అమ్మమ్మతో పాటూ నా జీవితాన్ని అల్లుకున్న అనేక మంది బామ్మలను వారు వదలి వెళ్ళిన పరిసరాల పరిమళాల్ని జ్ఞప్తికి తెచ్చారు.

    ధన్యవాదాలు,
    నారాయణ గరిమెళ్ళ.

  3. ramnarsimha అభిప్రాయం:

    February 28, 2010 5:15 am

    చాలా బాగున్నది.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a