ఈమాట » మరోపువ్వు

Expand to right
Expand to left

మరోపువ్వు

ఈ సెలయేటిలో దాహం తీర్చుకుంటాను
ఈ చెట్టు నీడలో విశ్రమిస్తాను
వచ్చిపోయే మేఘాల్ని లెక్కించడంలో
మధ్యాహ్నమంతా గడిచిపోతుంది

సాయంకాలం
గూళ్ళని చేరే పక్షులతోపాటు
నా మనసుకూడా
పాటనుండి క్రమంగా
మౌనంలోకి ప్రయాణిస్తుంది

అర్ధరాత్రి నిశ్శబ్దంలో
ఆత్మనొక పుష్పంగా
వికసింపజేసే రహస్యం
ప్రతిమొక్కా నాకు
చెప్తూనే ఉంటుంది

* * *

వేకువ కాంతిలో
వెలిగిపోతూ…
నీ పాదాల చెంత
మరో పువ్వు!


మూలా సుబ్రహ్మణ్యం

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు.  ...

 

(4 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. రాజశేఖరుని విజయ్ శర్మ అభిప్రాయం:

    September 2, 2009 7:47 am

    చాలా బాగా రాశారు.

    ” ఆత్మకొక పుష్పంగా ” అని కాకుండా
    ఆత్మ నొక పుష్పంగా అంటే బాగుండేదేమో.

  2. Subrahmanyam Mula అభిప్రాయం:

    September 4, 2009 11:46 pm

    శర్మ గారు, కృతజ్ఞతలు.. అక్కడ “ఆత్మనొక” అనే ఉండాలి. టైపో కావచ్చు.

    Dear Editors,
    Can you please correct the typo? thanks.

    సుబ్రహ్మణ్యం.

    [అలాగే, సవరించాం … సం.]

  3. రాకేశ్వర రావు అభిప్రాయం:

    October 6, 2009 1:21 pm

    ఆఖరి పద్యం చాలా బాగుంది.
    మీ కవితలతో నాకెప్పుడూ వుండే మొఱ ఒకటే. నిడివి.
    రుచి చూపించి వదిలేసినట్టుంటుంది.

  4. Srinivas Nagulapalli అభిప్రాయం:

    October 9, 2009 8:55 pm

    చక్కని భావం. రవీంద్రుని కవితలను గుర్తుకుతెచ్చింది.

    ఎత్తులో కదిలే మేఘాలు, కొంచెం క్రిందగా ఎగిరే చిన్ని పక్షులు, ఇంకా కిందగా మొక్కపై చిన్న పువ్వు- నడిపించిన క్రమం- పరిNaతితో పాదాలు చేరడం, కాదు, చేర్పించడం రమ్యంగా ఉంది.
    ____________
    విధేయుడు
    _Srinivas

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a