ఈమాట » వానా వానా…

Expand to right
Expand to left

వానా వానా…

నల్ల మబ్బు నీటి చెంగు నేల తడుపుకెళ్ళుతుంటె
పిల్లగాళ్ళు దాని క్రింద చిందులేస్తు చేరినారు..

గాలీ వాన జట్టుగట్టి పరుగు పందెమాడుతుంటె
తాత మనసు కుర్చి నొదిలి వాటితోడు ఉరికిపాయె.

నేలజేరు చినుకులన్ని వీధులెంట పరుగులెట్టి
వెంటనున్న మబ్బునిప్పి, విడిది చేసె తడవకుండ.

ఒళ్ళుతడిసి వణుకుతున్న చెట్ల సేద తీరునట్లు
వెదురుపొదల ఈలపాట సాగుతుంది గాలి లాగ.

వాన నాప పురిని విప్పి అడ్డుకున్న నెమలి గారి
ఈక తడిసి తోకముడిచి చెట్టుక్రింద చేర చూసి,

చుట్టుతిరిగి చూరు చేరు పిచ్చికమ్మ ఆపలేక
తలను తీసి రెక్కలోన దాచి పెట్టి నవ్వుకుంది!

 

(4 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. k.v.gopala rao అభిప్రాయం:

    September 10, 2009 3:07 am

    ప్రకృతి, తాత గారు కవిగారు కలసి చక్క ని వాక్ చిత్రన్ని అందించారు. పద్యం లోని ప్రతి పదం లయబద్ఢంగా ఉంది. ఇలా కవి గారు అన్ని ఋతువులూ వర్ణిస్తీ సాహిత్యానికి బాలసాహిత్యానికి మా అందరికీ ఎంతో మేలు జరుగుతుది

  2. Tadanki Ramakrishna అభిప్రాయం:

    October 9, 2009 7:01 pm

    [ఈ అభిప్రాయంలో వ్యాకరణదోషాలు వగైరా సరి చేసాము. –సంపాదకులు]

    Good, but the telugu typing keyboard is very hard. When I read this kavitha, I felt that something is lacking. I felt that is no target for this content, only the expression in the form of few words. I think the kavi has to think about the good language of expression. We can express vasntarutuvu excellently in our language. “తోకముడిచి చెట్టుక్రింద చేర చూసి” we can read this only.
    But, the bhavanm is not matured. So the language is not also matured.

  3. telugu4kids అభిప్రాయం:

    March 9, 2010 10:36 am

    చాలా బావుంది. ఇలా రాయాలి కదా పిల్లల కోసం!
    ఈ కవితను telugu4kids లో పరిచయం చెయ్య వచ్చా?
    http://telugu4kids.com/TeluguPaatalu.aspx లో “పాప”, “పువ్వులు”, “హరివిల్లు” పరిచయం చేసినట్లు?

    [ఈమాట నుంచి తీసుకోబడింది అని లింకు ద్వారా ప్రస్తావించి మీరు మీ వెబ్‌సైట్లో ఈ కవితను పరిచయం చేసుకోవచ్చును - సం.]

  4. telugu4kids అభిప్రాయం:

    March 10, 2010 9:34 am

    Thanks.
    పేరు చెప్పి లంకె ఇచ్చి ప్రచురిస్తాను.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a