Comments on: పడమట సంధ్యారాగం

by: Prem
Its been sometime that I read contemporary Telugu literature. I am not sure how I feel about this story here. I like the way the author started off but I think somewhere in the process he lost what he wanted to convey. Also, I am wondering whether this is something on the lines of the way Jeorge Louis Borges writes. Starting something and leaving it off just like that leaving the responsibility with the reader to finish the story.

Guess its a good effort poorly executed.

by: Sowmya
“పొరపాటున రెండు ఈగలు గనక ఒకేసారి లోపలికొస్తే, అటునించి ఇటు, ఇటునించి అటూ స్వేచ్చగా ఎగరడానికి కూడా స్థలం చాలదు. ఎదురుబొదురు గోడలకి తలకాయలు కొట్టుకొని వాటంతట అవ్వే చస్తాయి. మన ప్రమేయం అనవసరం.”

- :)) Good one!

కథ బాగుంది. I enjoyed reading it.

by: మాలతి
పైన నావ్యాఖ్యలో పొరపాటు. భగవంతునికోసం కథ రాసినవారు త్రిపురగారు. వివిన మూర్తిగారు కాదు. ఇద్దరు రచయితలకీ క్షమాపణలు. - మాలతి.

లైలా ఆ కథ 22 ఏళ్లక్రితం రాసేనని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు.

[కథ అసలు పేరు భగవంతం కోసం - సం.]

by: lyla yerneni
ఒకరోజులో సాయంసంధ్య పగటినించి రాత్రివేపు నడిపించేది. సుందరానికి రెండుసంబంధాలలోనూ ఎదురయింది చీకటే. -మాలతి అభిప్రాయం

సుందరానికి “కుడి ఎడమల కుసుమ పరాగం”  దొరకలేదంటారు. :-)

వేలూరి  కథ చదివి ఉల్లసించిన వారు  - మాలతి రాసిన కథ  “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” గాని  చదివితే మళ్ళీ రంజిస్తారు. నాకు చాలా నచ్చింది.   ప్రస్తుతం నెట్ లో ఉంది.  మొదటగా 1987లో, ఆంధ్రప్రభ వార పత్రికలో వేశారట.ఆ కథ చదివి  చాలా బాగుంది. శభాష్! అనుకున్నాక,  మాలతి పుస్తకం -

“Telugu Women Writers 1950 -1975″ -వెంటనే  నా బుక్ షెల్ఫ్ నుండి బైటకు లాగాను.

వివరాలు కావాలంటే రచనలు చేసిన వారే సరిగ్గా చెపుతారు కదా.

లైలా

by: రాఘవ
కథని అర్థం చేసుకునే శక్తి నాకు లేదో ఏమో తెలియదు కానీ, — మొదటిసారి చదివితే నాకు ఈ కథ ఏమీ అర్థం కాలేదండీ. అర్థం కాలేదు కదా అని — రెండవసారి చదవడం ప్రారంభించాను. అలా మొదలుపెట్టగానే కథలోని మొదటి వాక్యం నన్ను వెక్కిరించినట్టు అనిపించి ఠక్కున ఆపేసాను. :(

ఎవరైనా కాస్త ఉప్పందించి సహాయం చేయగలరని ఆశిస్తూ…

by: మాలతి
నేను కూడా చాలాకాలం కథకి సన్నివేశాలూ, సంఘర్షణలూ, గట్రా వుంటాయన్న ఉద్దేశ్యంతోనే వ్యాఖ్యలు చేస్తూ వచ్చేను కానీ ఈమధ్య మాత్రం అది న్యాయం కాదనిపిస్తోంది నాకు. ముఖ్యంగా ఈరోజుల్లో కథలు అవునా కాదా అనిపించేవి చాలా వస్తున్నాయి. వాటిని చదివి ఆనందించే పాఠకులూ వుంటున్నారు.

వేలూరికథ చదివినప్పుడు నాకు రెండు కథలు గుర్తొచ్చాయి. Samuel Becket రాసిన Waiting for Godot, అదే నమూనాలో వివిన మూర్తిగారు రాసిన భగవంతునికోసం. ఇలాటిరచనల్లో పాఠకుడిని పట్టి ఊపేసే కథ వుండదు కనక కథనం -చెప్పేతీరు - బలంగా వుండాలి, ఈకథ నాకు ఎక్కడా విసుగనిపించలేదు. ఒకటి రెండు చోట్ల హాస్యం, చమత్కారం కూడా చోటు చేసుకున్నాయి.

పైన చెప్పిన రెండుకథల్లోనూ కేవలం ఒకపూట ఒకమనిషి ఆలోచనలు నమోదు చేయడమే రచయితలు చేసినపని. చెప్పుకోదగ్గ “కథ” ఏమీ లేదు, వేలూరివారిరచనలో కొంతవరకూ కథ వుంది.

సుందరం అనే ఒక ఉద్యోగిజీవితంలో ఒక సాయంసంధ్యవేళ. ఇందులో రెండు సన్నివేశాలున్నాయి. సుపూరఉత్తరాలు చదువుతున్నప్పటి గల్టీ ఫీలింగ్ అతను ఆమెతో పెట్టుకున్న అక్రమసంబంధంతాలూకు గిల్ట్‌ కావచ్చు. అవి చదువుతూ, తనని తాను సమర్థించుకోడం తన అక్రమసంబంధాన్ని సమర్థించుకుంటున్నట్టు కనిపిస్తుంది.

సుందరానికి భార్య అంటే గౌరవంలేదు. జాలో, హేళనో మరేదో కానీ గౌరవం మాత్రం లేదు.

శీర్షిక మాటకొస్తే, ప్రాచుర్యంలో వున్న అందాలమాట పక్కన పెట్టి చూడండి. ఒకరోజులో సాయంసంధ్య పగటినించి రాత్రివేపు నడిపించేది. సుందరానికి రెండుసంబంధాలలోనూ ఎదురయింది చీకటే. సుపూరా తాళం ఎక్కడుందో చెప్పి తనసుముఖతని వెల్లడించినా అతనికోసం ఇంట్లో ఎదురుచూస్తూ కూర్చోలేదు. తరవాతయినా రాలేదు! Red-eye flight తీసుకుని ఇంటికి వస్తే, ఇంట్లో సంధ్య లేదు. ఎలా చూసినా అతనికి మిగిలింది చీకటే, శూన్యం!

పీర్ రెవ్యూగురించిన సందేహం నాక్కూడా కలిగింది. ఈమాటవారు తమ అభిప్రాయాలని మరొకసారి రెవ్యూ చేసుకుంటున్నారు అనుకోవచ్చా?

by: lyla yerneni
“సంధ్య ఇంట్లో లేదు. ”

సంధ్య ఇంట్లో లేదా? ఏమయ్యింది?  బెడ్రూం లో వస్తువులన్నీ ఎక్కడి వక్కడే ఉన్నయి.  రోజూ వాడే పర్సు  -డ్రెస్సరు మీదే ఉంది.  ఇంట్లో వేసుకు తిరిగే చెప్పులు -అక్కడే మంచం పక్కనే ఉన్నయ్యి . గరాజ్.   గరాజ్ .. ..- గరాజ్లో టయోటా కేమ్రీ కారు ఉందా ? కారూ అక్కడే ఉంది.  సంధ్య అప్పుడప్పుడూ లేక్ పక్కనే సైకిలు తొక్కుతుంది.  ఆ సైకిలు , ఆ సైకిలు - ఉంది,  అదిగో ఆ మూలగా గార్బెజ్ బిన్నుల పక్కనే ఉంది.  అదే మూల, బట్టలు ఆరెయ్యటానికని కొనుక్కొచ్చిన పొడుగాటి తాడు అక్కడే ఉండాలే . అది లేదు . అప్రయత్నంగా అతను గరాజ్  సీలింగు దూలాల  వంక చూశాడు. గుండె దడదడ లాడింది.

సంధ్యా, సంధ్యా !  అంటూ గభిక్కున …

ఏం పాఠకులండీ?  రామాయణంలో పర్ణశాలలో  సీత కనపడక పోతే అక్కడ వాల్మీకి కథ ఆపితే  - సీత ఏమైయ్యిందో అని మధన పడరూ.  సీతా! సీతా! అంటూ  రాముడితో పాటు అటూ ఇటూ పరిగెట్టరూ. ఏం పాఠకులండీ?

కథలు కథలుగా చదువుకునే పాఠకులేరీ.  అందరూ విమర్శకులే. ఏ వల్లంపాటి  కధా శిలపం, కథా విమర్శ -పుస్తకాలో చదివేసుకుని  - ఇది కథేనా?  శైలి బాగుంది .  Keep it up. వస్తువు శూన్యం. సంభాషణలు - అసలు తెలుగు వాళ్ళూ ఇలా మాట్లాడుకోరు. ఈ కథలో నాకు ముగింపు చదవక ముందే తెలిసి పోయింది. కథ వాస్తవానికి దూరంగా ఉంది. వాస్తవానికి మరీ ఇబ్బంది కలిగించేంత దగ్గిరగా ఉంది. కధాకధన విధానము బాగుంది ….అంటూ ఏంటేంటో  రాస్తారు.

ఏం పాఠకులండీ! కథలు ఇలానా చదువుకుంటారు?

పోనీ మళ్ళీ చందమామ కథలన్నా చదవండి. :-)

లైలా

[పై వ్యాఖ్యలపై వచ్చిన ప్రతివ్యాఖ్యలను చర్చావేదికలో ఉంచాము - సం.]

by: Maddipati Krishna Rao
ఈ కథ గురించి కిరణ్ గారి అభిప్రాయం పై నేను ముందు వ్రాసిన అభిప్రాయంలో వ్రాద్దామనుకున్నాను కానీ, కథ గురించి నేను చెప్పదలుచుకున్నది మరుగున పడుతుందని ఆపేశాను:

పొడుపు కథలు, భేతాళ కథలు, కాశీ మజిలీ కథలు, ఇత్యాదులన్నీ ముఖ్యంగా కొస మెరుపు కథలు. ఈ కథలో కొస మెరుపున్నా, అంతవరకూ సాగిన కథకు ఆఖరి సన్నివేశం కంటే ఎక్కువ విలువుందని నా అభిప్రాయం. ఆఖరి సన్నివేశం 360వ డిగ్రీ మాత్రమే! పుస్తకం వెనకాల ఉన్న కోట్ దగ్గర్నుంచి, ఇల్లీగల్ ఇమ్మోరల్, అంత ఇల్లీగల్ కాదు గాని ఇమ్మోరల్, అంత ఇమ్మోరల్ కాదు, నుంచి స్లై డాగ్, స్లై బి_ వరకు సాగిన ప్రస్థానంలో రచయిత వదిలిన క్లూలు నిజంగానే పాఠకుణ్ణి ‘హింట్లు చూసి కథ రాసుకో’ మనడమే! పాఠకుల మీద ఎంత నమ్మకం, గౌరవం లేకపోతే రచయిత  తన కథను అలా ఊహలకొదిలేస్తారు చెప్పండి?

సాఫ్ట్‌వేర్ తయారు చేసేవారు చేసేది పనిముట్లన్న సంగతి మరచిపోకూడదు. పనిముట్లే ఇల్లు కాదుగదా! (వాడే సాఫ్ట్‌వేరే వ్యాపారం కానట్టు). ఇక్కడ రచయిత చేసింది పనిముట్టు కాదు. చైతన్య స్రవంతి అనే సాహిత్య పనిముట్టుతో వేసిన చిత్రం. అందులో పాఠకులాక్కావల్సింది వారినే వెతుక్కోమంటున్నారు!

కృష్ణారావు

by: Ravikiran Timmireddy
ఒక సంఘటన, ఒక సంఘర్షణ కథెందుకు కాగూడదు? “సంధ్య ఇంట్లో లేదు” అనే వాక్యానికి పొడిగింపు, వివరణ ప్రతి పాఠకుడు ఈ కథలో తనకు తాను ఇచ్చుకునే ముగింపు మీద ఆధారపడి ఉంటుందేవో కదా. అల్లికలో మరికొంచం జాగ్రత్త అవసరవే కానీ, కథ బాగనే వుంది.

by: సాయి బ్రహ్మానందం
పై వ్యాఖ్యలు చూసాక ఇది రాయాలానిపించింది.  వెస్ట్రన్ కథ పరిణామం చెందినంతగా తెలుగు కథ కాలేదు.  కధంటే ఇలాగే వుండాలని మన పెద్దలు నిర్ణయిచేశారు. కథంటే మొదలుండాలి. నాయకుడుండాలి. శిల్పం వుండాలి. ముగింపుండాలి. చివర్లో ఓ సందేశముండాలి. సూక్తిముక్తావళుండాలి. ఏ మాత్రం బుర్రకి పదును పెట్టకుండా అరటిపండొలిచినట్లుండాలి. ఇలా ఎవరికి తోచింది వారు చెప్పారు. చెప్పడమే కాదు, మనకలాంటి కథలు చదవడమే నేర్పించారు. అందువల్ల తెలుగు కథ వారు ఏర్పరిచిన చట్రంలోనే ఇరుక్కుని ఊపిరాడకుండా వుంది.

ఈ కథ చాలా మంచి కథని అనను కానీ వైవిధ్యమున్న కథ.  డయాస్పోరా కథల కోవకి చెందిన కథ. ఎవరికీ తెలియదనుకుంటూ తప్పులు చేసుకు పోయే ఒక పాత్రకొచ్చే మానసిక సంఘర్షణ కనిపించింది. తను చేసే ప్రతీ దానికీ ఒక కారణం ( జస్టిఫికేషన్ ) వెతికే ప్రయత్నం కనిపిస్తుంది.  ఆ కారణం ఏదైనా కావచ్చు. అది అనుమానమవ్వచ్చు. భయం కావచ్చు. లేదా తనకి తను సర్దిబుచ్చుకునే మనస్తత్వం కావచ్చు. ఇవన్నీ ఈ సుందరం పాత్రలో కనిపించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనలోనే ( అంటే ప్రవాస భారతీయులు ) కనిపించే పాత్ర.  సుందరానికి సఫూరాతో అక్రమ సంబంధమున్న సంగతి ఎవరికీ తెలియదనుకుంటూ గడిపే క్యాజువల్ మనస్తత్వ చిత్రీకరణలో,  చేసే పనిని సమర్ధించుకునే నైజం చూపించారు.  చాలామంది మగాళ్ళు భార్యలు వెర్రిబాగుల ఇల్లాళ్ళుగా జమకట్టి,  తాము ఏం చేసినా గ్రహించలేరు. పైగా వారూ ధైర్యం చెయ్యరని అనుకుంటూ వుంటారు.  వారు పరస్త్రీతో ఎలా అక్రమ సంబంధ పెట్టుకుంటారో మరో మగాడు కూడ తమ స్త్రీలతో అలా చేసే అవకాశముంది కదా? అన్న చిన్న విషయాన్ని విస్మరిస్తారు. పైపెచ్చు తమ తమ క్రియలకి కారణాలు వెతుకుతారు. ఇదీ ఈ కథలో నాకు కనిపించిందీ, అనిపించిందీ!

ఈ కథలో సుందరం యాంటీ హీరో! ఒక నెగిటివ్ షేడ్సున్న వ్యక్తి.   ముగింపు మరీ ఒక్క వాక్యంలో తేల్చేయడంతో పాఠకుల్ని ఆలోచించ నీయకుండా అయోమయంలో నెట్టేసింది. “సంధ్య ఇంట్లో లేదు. ” అన్న వాక్యం ఏ రకంగానైనా ఊహిచుకునేలా చేసిందంతే!   బహుశా కథలో వున్న అతి క్లుప్తతవల్ల ఈ అయోమయం ఏర్పడిందేమోనని నా అభిప్రాయం. ప్రతీ వాక్యమూ ఓపిగ్గా చదివి అర్థం చేసుకుంటేనే ఈ కథ ఎక్కుతుంది. లేదా ఇదీ కధేనా అనిపిస్తుంది.

by: Maddipati Krishna Rao
చైతన్యస్రవంతి శైలిలో సాగిన కథపై ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటి అభిప్రాయాలు రావడం వింత కాదనుకుంటాను. ఇలాంటి కథలు బాగా నచ్చనైనా నచ్చుతాయి లేకపోతే అసలు అర్ధంకాక చిరాకైనా కలిగిస్తాయి. శైలిని సరిగా నిర్వహించలేకపోతే రెండవ రియాక్షన్‌కు రచయిత బాధ్యత అవుతుంది. కానీ, సరిగా అర్ధం చేసుకోవడంలో పాఠకుల బాధ్యత కూడా చాలానే ఉంటుంది. ఉదాహరణకు, ఈ కథను అర్ధం చేసుకోవడానికి/అనుభవించడానికి పాఠకులు సుందరం పాత్రలో పరకాయ ప్రవేశం చెయ్యాలి. కథకు నాయకుడు, పరమార్ధం, ముగింపు, నీతి, వగైరా సూత్రాలు (లక్షణాలు?) ఖచ్చితంగా ఇలా ఉండాలి అనుకునే పాఠకులకు ఈ కథ నచ్చకపోవచ్చు. కానీ సుందరం ‘మొరాలిటీ జారుడు బల్ల’పై ప్రయాణం అతని వ్యక్తిత్వాన్ని ఊహింపజేస్తుంది. దానికి సాపేక్షంగా సఫూరా, సంధ్య ల వ్యక్తిత్వాలనూ విశదీకరిస్తుంది. కథలో చెప్పినదానికంటే పాఠకుల ఊహకు ఒదిలేసిందే ఎక్కువ. ఐతే ఆ ఊహలను నడిపించే మార్గాన్ని ఎన్నెన్నో పొరల్లో చూపిస్తున్నారు రచయిత. ఇంతకన్నా ఎక్కువ చెప్పుంటే కథ క్షీణించిపోయుండేదని నా అభిప్రాయం. తిరిగి చదివినకొద్దీ పొరల్లో దాక్కున్న కథ కనిపిస్తూంది. చక్కటి డయాస్ఫోరా కథనిచ్చినందుకు హేట్సాఫ్ మాష్టారూ!

కథలో రెండు చిన్న టెక్నికల్ తప్పులున్నాయని నాకనిపించింది. మొదటిది ఫోన్ 30 సార్లు మ్రోగడం. నాకు గుర్తున్నంత వరకూ, ఉత్తర అమెరికా టెలిఫోన్లు ఇదివరలో 15 సార్లకంటే ఎక్కువ రింగయ్యేవి కాదు. (ఇప్పటి సంగతి నాకు తెలియదుగాని, ఇదివరలో కొన్ని ఆన్సరింగు మెషీన్లు ఆపేసి ఉంటే 15వ రింగుకి ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి, మెసేజి తీసుకునేవి!). ఇప్పుడూ అంతేనో కాదో టెస్టు చెయ్యాలి! రెండవది, హేండ్ కారీ మరచిపోయి విమాన ప్రయాణం చెయ్యడం. సాధారణంగా టిక్కెట్లు అందులోనేగా ఉంచేది. పోనీ టిక్కేట్టు కోటు జేబులో ఉన్నాయనుకుందామంటే, మరీ చేతులూపుకుంటూ విమానం ఎక్కే వాళ్ళనెంతమందిని చూశాం? ఇవి పెద్ద లోపాలని అనలేను గాని, కథా గమనంలో పంటికింద రాయై అనవసరంగా భూమార్గం పట్టించాయి నన్ను!

కృష్ణారావు

by: అఫ్సర్
వేలూరి కథ మీద జరుగుతున్న చర్చలో వొక ముఖ్యమయిన అంశాన్ని గుర్తు చెయ్యడానికి ఈ రెండు ముక్కలూ రాస్తున్నాను. కథలో వర్ణనాత్మకత , నాటకీయతల మీద ఇంకా మనకి చాలా మోజు వుంది. తెలుగు కథ తక్షణం వదిలించుకోవాల్సిన లక్షణాలు ఇవి రెండూను. వేలూరి కథ గొప్ప కథ అవుతుందా లేదా అన్నది కాసేపు పక్కన పెట్టి, ఈ కథ శిల్ప పరంగా వొక అనాటకీయ/ అవర్ణనాత్మక శిల్పాన్ని మన ముందు పెడుతుంది. వస్తువు పరంగా డయాస్పోరా కథ అంటే నాస్టాల్జియా మాత్రమే అన్న పరిమితిని దాటి, ప్రవాస జీవితంలోని ఇప్పటి సంక్లిష్టతని ఈ కథ తాకుతుంది. ఇందులో సఫూరా ముస్లిం దేశం నించి రావడం ఈ కథలో అదనపు సంక్లిష్టత. ఈ కథలో రచయిత వర్ణించిన సెట్టింగు నించి , ఇంకా నాటకీయతనీ, వర్ణనల్ని గుప్పించి దీన్ని వొక అనుభూతి కళా ఖండంగా మార్చవచ్చు. ఆ అవకాశాన్ని రచయిత చేజేతులా వదులుకున్నట్టు మనకి అర్ధం అవుతూనే వుంది.

నా ప్రశ్న ఏమిటంటే: కథలో వర్ణన/ నాటకీయత పరిమితులు ఏమిటి? తెలుగు కథ ఆ రెండిటి మధ్య ఆడుతున్న దాగుడు మూతల్లో చాలా కాలంగా అసలయిన వాస్తవికతకి దూరం అవుతోంది. వొక్క అనవసరమయిన వాక్యమూ లేకుండా కథ రాయడం ఇవాల్టి అవసరం. వేలూరి కథ ఆ అవసరాన్ని గుర్తు చేసింది. ఈ లక్షణం ఇంకా కొంత పరిపక్వ దశలో ఇదే సంచికలోని మాచిరాజు సావిత్రి కథలో కనిపిస్తుంది.

ఈ కథకి పెట్టిన శీర్షిక గురించి నాకూ అభ్యంతరం వుంది. మొదట: అది డయాస్పోరా మీద వచ్చిన వొక సినిమా పేరు కావడం. రెండు: ఈ కథ పరిధిని ‘సంధ్యా పాత్రకి మాత్రమే పరిమితం చేస్తుంది ఈ శీర్షిక. ఇందులో సంధ్య ఎంత ముఖ్యమో, సఫూర కూడా అంతే ముఖ్యం. సుందరం యాంటీ- హీరో లక్షణం అంత కంటే ముఖ్యం.

యాంటీ హీరో తనం ఈ కథలోని వర్ణనా , నాటకీయతల వ్యతిరేకతలో భాగమే. పెట్టె బయటి నించి ఆలోచిస్తే ఈ కథ కొంత అర్ధం అవుతుందేమో? ఈమాట పాఠకులకు ఆ మాత్రం సహనం వుందని నా నమ్మిక.

అఫ్సర్

by: yasasvi
కధ అని అన దగ్గ ఒక్క లక్షణమూ లేని దీన్నీ “కధ” పేరుతో అచ్చు వేయటం చూస్తే ముఖ్య సంపాదకుల రచన అయినందువల్లనేమో అన్నింటినీ పక్కకు పెట్టి ప్రచురించిన ట్టు గా తెలిసిపోతోంది. ఈమాట వాళ్ళు చెబుతున్న స్థాయి ..ప్రమాణం లాంటివి ముఖ్య సంపాదకుల్కి మాత్రం వర్తించదా? సొంత పత్రిక అన్న ధైర్యమా? పాఠకులు వెర్రివాళ్ళన్న ఎగతాళా?? ఆశ్చర్యం!! మేం ఇద్దరు ముగ్గురు అభిప్రాయాల్ని తీసుకున్నాకానే..రివ్యూ చేయించాకానే ఒక రచనని అచ్చు వేస్తాం అని ఈమాట “స్థాయి”ని గురించి చెప్పిన వారికి  మరి..ఈ రచనని కధ గా ఒప్పుకున్న ఆ రివ్యూ చేసిన వారు అయినా  చెప్పాలి.. ఇందులో ఏముందో?!ఎలా దీన్ని ప్రచురించారో? ఎదరివాళ్ళ రచనలకి ఒక విధానమూ..వారి రచనలకి మరో విధానమూ పాటిస్తారని తెలిపేలా ఉందిది.

యశస్వి.

by: Kiran
ఇలాంటి కథల కన్నా పొడుపు కథలు బెటరు. వచన కవిత్వం పేరుతో, కథల పేరుతో గాలి రాయడం పెద్ద ఫేషనైపోయింది, “హింట్లు చూసి కథ రాయుము”, “బొమ్మ చూసి కథ రాయుము” టైపులో సగం కక్కిన భోజనం లాంటి కవితలూ, కథలూ పత్రికల్లో చెలామణీ చెయ్యడం చూస్తే పాఠకుల్ని ఎంత వెర్రోళ్ళనుకుంటారో కదా ఈ రచైతలు అనిపిస్తుంది.

సాఫ్ట్ వేర్లు డెవలప్ చేసేటప్పుడు User Friendly Interfaces కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉపయోగించేవాడికి అర్థం కాకపోతే ఎంత గొప్ప సాఫ్ట్ వేర్ అయినా చెత్తకిందే లెక్క. ఒక్క ఈ అతితెలివి రచయితలే End Users ని లోకువ సరుకుగా లెక్కగడతారు. అందుకే సాహిత్యం అంతరించిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అతి తెలివిగా రాసే కథలూ, కవితలూ రాసినవాళ్ళే చదూకుని మిగతా జనాభా అంతా వెర్రోళ్లనుకుని తృప్తి పడుతూ బతుకుతారు.

by: M.S.Prasad
ఈ కధలో చివరి ఒకటో-రెండో పేజీలు సంపాదకులు ఎక్కడో పారవేసుకొని ఉన్నవాటినే యమర్జెంటుగా ప్రచురించినట్లు తోస్తోంది.  ధారా వాహికగా తదుపరి సంచికలో మిగిలిన భాగం (దొరికితే) ప్రచురిస్తారని ఆశిస్తాను.  కధ ఇంతే అని బుకాయిస్తే మాత్రం ఇది ఈమాట పాఠకులపై ప్రయోగించిన Practical Joke అని భావించాల్సి వుంటుంది.

భవదీయుడు

by: MJ Thatipamala
మంచి కథ. అనుమానం పెనుభూతం అంటారు. ముగింపు బాగుంది, అక్కడ 30సార్లు ఫోను మోగడం, ఇక్కడ 30సార్లు డోరు బెల్లు కొట్టడం, సంధ్య ఇంట్లో లేకపోవటం…

కథ పేరుకి, కథావస్తువుకి పొంతన కుదరలేదేమో?!

by: Venkat
ఏమి చెప్పాలనుకున్నారో అసలు అర్థం కాలేదు.