ఈమాట » పట్టుకో పట్టుకో

Expand to right
Expand to left

పట్టుకో పట్టుకో

తెల్ల ఈక ఒకటి
కొన్ని పిట్టలు
నేనూదే సబ్బు బుడగలు
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని.

ఎర్ర తోక గాలిపటం
గాజు రెక్కల తూనీగలు
ఊదు కడ్డీ పొగల తీగెలు
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని.

ఆరేసిన పచ్చ చీర
నువ్వు రాసిన ఉల్లి పొర ఉత్తరం
నీలం రంగు పమిట నాది
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని.

 

(5 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. obul reddy అభిప్రాయం:

    July 1, 2009 9:42 am

    కవితలో పదహారణాల భావుకత.. చక్కటి కవిత ..అభినందనలు !

  2. yasasvi అభిప్రాయం:

    July 1, 2009 9:06 pm

    భావుకత కరవైపోతోన్న ఇవాళ్టి కాలంలో ఇంద్రాణి గారి కవిత ఆహ్లాదంగా
    అన్పించింది. రోజూ మన చుట్టూ ఉండే చిన్న చిన్న అందాలని గమనించలేని
    వేగపు బతుకైపోయి ఎవరైనా ‘పట్టుకో పట్టుకో” అని వెనకబడమంటూ..ఊరించే దృశ్యాలని చూపిస్తే “హమ్మయ్య” అని జీవించటానికి
    ఇంత నమ్మకం కలగదూ!! అంత నమ్మకాన్నిచ్చింది ఈ కవిత. ఆమెకు అభినందనలు.

    యశస్వి.

  3. Subbarao Nanduri అభిప్రాయం:

    July 2, 2009 7:20 am

    కానీ నేను వాటిని పట్తుకొనేందుకు
    ప్రయత్నమే చెయ్యలేదు,
    అందకుండా ఆకాశానికి ఎగిరిపోతున్న ధరలనీ,
    ఆగకుండా పాతాళానికి జారిపోతున్న ఆశలనూ,
    నిరాశల ఊబిలో కూరుకుపోతున్న ఆశయాలనూ,
    అవసరాల అగ్నిలో ఆవిరయిపోతున్న విలువలనూ,
    పట్టుకోలేని నాకు,
    వీటిని పట్టుకొనే శక్తి ఎక్కడిది?

  4. hrk అభిప్రాయం:

    July 2, 2009 7:20 am

    గాలా బాగుంది కవిత, పోగొట్టుకున్న బాల్యంలో కొంచెం తెచ్చి ఇచ్చినట్టుగా, హాయిగా.
    -హెచ్చార్కె.

  5. బొల్లోజు బాబా అభిప్రాయం:

    July 2, 2009 8:46 pm

    చాలా బాగున్నది.
    చక్కటి పద చిత్రాలు. అల్లిక.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a