ఈమాట » పురూరవ: శ్రవ్య నాటిక

Expand to right
Expand to left

పురూరవ: శ్రవ్య నాటిక

సేకరణ: పరుచూరి శ్రీనివాస్.

మొదటిసారిగా 1974లో ఆకాశవాణి లో ప్రసారితమైన పురూరవ శ్రవ్యనాటికను మీకందిస్తున్నాం. చలం రచించిన ఈ నాటిక సాహిత్యపరంగానూ, శ్రవ్య రూపంలోనూ కూడా పేరుగన్నదే. ఈ నాటికలో ఊర్వశి నవ్వుకి అప్పటికీ ఇప్పటికీ ఎందరో అభిమానులైనారు, చలం తో సహా. ఈ నాటికలో ఊర్వశి పాత్రకు వాచకాన్ని అందించి ప్రాణం పోసినవారు శ్రీమతి శారదా శ్రీనివాసన్. వారి గురించి, ఈ మధ్యనే ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడ్డ వారి జ్ఞాపకాలలోనే చదవండి.

నిడివి: 61ని.

[మాకు లభించిన ఈ ఆడియోలో చివరి కొన్ని క్షణాల సంభాషణ లేదు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. పరిహారంగా, ఊర్వశి చివరిగా పురూరవునితో అన్న మాటలను ఇక్కడ పొందుపరిచాం . ఈ వాక్యాలు ఆడియో ఆగిపోయినప్పటి సంభాషణల ఆధారంగా పురూరవ పుస్తకం నుంచి సేకరించబడ్డాయి.

పురూరవ నాటికలో చివరి భాగం

[పురూరవ నాటికలో చివరి భాగం — సంపాదకులు]

ఊర్వశి: పిచ్చివాడా, ఊర్వశి అంటే ఏమిటి? మీ లోకం మల్లే యోచించకు. ఊర్వశి అంటే ఒక అనుభవం. శరీరం కాదు. శరీరమైనా ఒక అనుభవమే కదా. ఈ వియోగం, బాధ, ఎందుకని ఏడుస్తావు గాని, వాటి వల్ల కలిగే అశాంతే లేకపోతే ఏం అందుకోగలరు మీరు? అన్నీ సహించు. విధిని ప్రార్ధించు. దిక్కులదిరేట్టు ‘ఊర్వశీ’ అని ప్రశ్నలడుగు. సాధించు. నీకొసమే కాచుకుని ఉంటాను నేను. నేను చాలా సత్యం. నీదాన్ని. నీ జీవితం ఒక్క క్షణం. ఊర్వశితో అనుభవం అనంతం. ఆ లోకంలో కలుసుకుందాం. మన కలలన్నీ సార్ధకం చేసుకుందాం.

నీది పాపమూ కాదు. పొరబాటూ కాదు. తప్పదు. నీ జీవితానుభవానికి అంతే పర్యవసానం. దానినుంచి ఏట్లానూ తప్పించుకోలేవు. నన్ను పొందగలిగిన ఔన్నత్యం ఎట్లానో తెచ్చుకున్నావు కొంతకాలం. అంత ఔన్నత్యాన్నీ మామూలుగా నీ స్వభావానికి తెచ్చుకోగలగాలి నువ్వు. దానికోసమే ఇన్ని యేళ్ళు దారుణ తపనం నమ్ము. సన్నిహితంగా రాలేననుకోకు. కానీ నేను నీకు దగ్గరైనానా, నన్ను వొదలలేవు. నేను వెళ్ళాక ఆ బాధను భరించలేవు. నీతో కలిసి సుఖించిన ఊర్వశినే తలుచుకో, నన్నందుకో గలిగే వరకూ. నేను వెడతాను.

(ఆమె కాంతి అతని చుట్టూ నిలిచి చలించి మాయమయింది)

ఆసక్తి గలవారు పూర్తి నిడివి నాటకం పుస్తక రూపంలో ఇక్కడ చదవవచ్చు.

 

(7 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. sasAnk అభిప్రాయం:

    November 7, 2008 9:33 am

    చాలా థ్యాంక్స్ అండీ ఈ ఆడియో కి. శారద గారితో కలిసి విన్నాను కానీ అప్పుడు నేను చిన్న పిల్లని. నా పక్కనున్న శారద గారు అని తప్ప, ఊర్వశినీ, చలాన్నీ గుర్తించలేక పోయాను. తర్వాత ఆవిడతో కలిసి అంత సమయం గడపలేక పోయాను.

  2. appaji అభిప్రాయం:

    November 14, 2008 5:57 am

    చాలా థ్యాంక్స్ అండీ

  3. రాఘవ అభిప్రాయం:

    November 21, 2008 1:18 am

    నిజమే. శారదగారి నవ్వు భలే బాగుంది :)

  4. శ్రీనివాస్ అభిప్రాయం:

    December 19, 2008 9:29 am

    సేకరణ అద్భుతం. ధ్వని కూడా బహు నాణ్యంగా వుంది. రచన పూర్తి పాఠం విడిగా ఇవ్వడం చాలా బాగుంది.

    అప్పట్లో రేడియో నాటకాలు ఆదివారం మధ్యాహ్నం రెండూ మూడూ మధ్య వచ్చేవి. అన్ని కేంద్రాల్లోనూ (హైదరా, విజయ,, విశాఖ, కడప) ఒకేసారి ప్రసారమయ్యేవి. ఏ కేంద్రం వారు నిర్మిస్తే వారి పేరు ముందొస్తుంది. సినిమాకి ముందు పేర్లేసినట్టు, రేడియో నాటకానికి ముందు పేర్లు చదివేవారు. ” ఇందలి పాత్రలూ, పాత్రధారులూ… ” అంటూ “శబ్ద” దానం చేసిన వారి పేర్లూ, అటు వెంబడి “నిశ్శబ్దంగా” వెనుక పనిచేసిన వారి పేర్లూ చదివేవారు. వాటిలో ఎక్కువగా వినిపించి నాకు జ్ఞాపకమున్న పేర్లు - శారదా శ్రీనివాసన్ (పాత్రధారి), వాడ్రేవు పురుషోత్తం (నిర్వాహకులు).

    శ్రోతల ఆదరణ పొందిన మరో నాటకం “దీక్షాంతం”. ఇందులోనూ ఊర్వశి పాత్ర వుంటుంది. ఎవరి గొంతో జ్ఞాపకం లేక పోయినప్పటికీ, నిర్వాహకులు మాత్రం శ్రీ వాడ్రేవు పురుషోత్తం.

    మీ కృషి శ్లాఘనీయం. మరిన్ని అజరామరమైన రేడియో నాటకాలని వినిపిస్తారని ఆశిస్తాను.

  5. nagaraju raveender అభిప్రాయం:

    March 5, 2009 8:11 pm

    చాలా అరుదైన నాటకం. మీరు దీనిని ఈ వెబ్ సైట్ లో పెట్టి చాలా గొప్ప పని చేశారు.

  6. SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:

    May 25, 2009 8:39 am

    చాలా చక్కటి పనిచేశారు ఈ నాటకాన్ని నలుగురికీ అందించి. నేను నా చిన్నతనంలో ఒక మోనో టేపు రికార్డర్ తో ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి ప్రసారమయిన కొన్ని చిన్న నాటికలను రికార్డు చెయ్యగలిగిన అదృష్టం కలిగింది. ఆ నాటికలను నేను సురసా నెట్లోకి అప్లోడ్ చేశాను. ఈ కింద లింక్ తో ఆ నాటికలను వినవచ్చు. అక్కడే, గణపతి నాటకం కూడ మరెవరో అందించారు. ఆసక్తి గలవారు ఈ సైటులోకి వెళ్ళి వినవచును.

    http://surasa.net/music/telugu-natika

    కన్యాశుల్కం, వరవిక్రయం, గణపతి నాటకాలు సి డి లరూపంలో ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో ఉన్న చిన్న షాపులో అమ్ముతున్నారు.

    శివరామప్రసాదు కప్పగంతు

  7. P.V.S.N.SARMA అభిప్రాయం:

    September 28, 2009 1:09 am

    It is really a golden opportunity to listen to this SabdanaaTakam of my favourite radio artists komala swaravarshini Smt.Sarada Srinivasan garu. Her voice is so heart touching and melodious. To praise her and her voice is too little time now. Hats off to her.
    With Vijayadasami Subhakanshalu.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a