Comments on: మనకు తెలియని మన త్యాగరాజు -1

by: himabindu
మీ కృషి స్పూర్తిదాయకంగా ఉంది. నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మిగతా భాగం కూడా చదివాక నా పూర్తి అభిప్రాయం రాస్తాను. మీ మంచి ప్రయత్నం సాఫీగా సాగాలని అశిస్తూ,

హిమబిందు

by: Sai Brahmanandam
రవి గారూ,

తంజావూరులో అప్పుడు చాలా మతాలున్నా,ఇతర మతాల ప్రస్తావనెక్కడా  త్యాగరాజు తన కీర్తనల్లో తీసుకురాలేదు. ఒకే ఒక్క కీర్తనలో ఒక్క ముస్లిం పదమూ, మరో కీర్తనలో ఇంగ్లీషు పదమూ వాడాడు. ఆ వివరాలు ముందొస్తాయి. మీరు చెప్పిన కొనియాడు కీర్తన చరణంలో ఉన్న మతం పదానికర్థం ఆలోచనా విధానం. అభిమతం.  హిందూ, ముస్లిమ్, క్రిష్టియన్ అనబడే మతాలు మాత్రం కాదు. కాస్త మరోసారి ఈ చరణం చూడండి.

ప:    కొనియాడే నాయెడ దయ వెలకు

కొనియాడెదవు సుమీ రామ నిను

అ.    అనయము నీ సొగసును గని పొంగుచు-

నంతరంగముననతి ప్రేమతో నిను            ( కొని )

చ.    వింత వింత మతములలో చొరబడి

వెత జెందగ లేడను నీ మనసున-

కింత తెలిసి త్యాగరాజ సన్నుత-

యే వేళను నీ శుభ చరితమును            ( కొని )

- సాయి బ్రహ్మానందం

by: ravi
చాలా బావుంది. కాని, రక రకలా మతాల గురించి కొన్ని కీర్తన ల్లొ ప్రస్తావిస్తారు. ఉ: “కొనియాడె నాయడ” చరణంలో చూడండి.

by: Tarakaram
బాబోయి ఎంత రీసెర్చ్ చేశారు. మీ కాళ్ళ కి మొక్కుతున్నా.

by: Sai Brahmanandam Gorti
నాకు తెలుసున్నంత వరకూ త్యాగరాజు తమిళం లో ఒక్క కృతీ రాయలేదు.  మొదట్లో కొన్ని సంస్కృత రచనలు చేసినా, సింహ భాగం తెలుగులోనే రాసారు. త్యాగరాజుకి తమిళం ఖచ్చితంగా వచ్చే ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న శిష్యులు చాలామంది తమిళులే ! వారందరికీ తెలుగు వచ్చిందన్న నమ్మకం కలిగిన తరువాతే ఆయన స్వీయ రచనలు నేర్పాడు.

అప్పట్లో తెలుగు, తమిళం రెండూ రాజభాషలుగానే చెలామణీ అయ్యాయి. ముఖ్యంగా సాహిత్యభాషగా తెలుగుకి పెద్ద పీటే వేసారు తంజావూరు రాజులు.

-సాయి బ్రహ్మానందం

by: mOhana
త్యాగరాజుగారికి తమిళం బాగానే వచ్చి ఉంటుంది. కాని వారికి అందులో కవిత్వం వ్రాయగలిగిన శక్తి లేదేమో? ఆ కాలంలో దక్షిణదేశంలో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉండింది సాహిత్యభాషగా. అదీకాక వారి మాతృభాష తెలుగు కాబట్టి ఆ భాషలోనే తమ పాటలను వ్రాసి వాటికి స్వర జీవాన్ని పోశారు. ఆత్మ పొందే అవస్థను మాతృభాషలో కాక మరే భాషలో సులభంగా చెప్పగలం? ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన మణిప్రవాళ కీర్తనలు కొన్ని తెలుగు తమిళ భాషలలో ఉన్నాయి. విధేయుడు - మోహన

by: rahamthulla
త్యాగరాజుకు తమిళం వచ్చా? త్యాగరాజ కృతులన్నీతెలుగులోనే ఉన్నాయి. ఎక్కడో తెలుగు రాజ్యాలకి దూరంగా ఉన్న తంజావూరు తమిళరాజ్యంలో ఎన్నో తెలుగు కీర్తనలు పాడిన త్యాగరాజు అక్కడి ప్రజల భాష తమిళం లో కొన్ని కీర్తనలు కూడా పాడి ఉంటాడేమో అని నా అనుమానం.

by: కొడవళ్ళ హనుమంతరావు
karvera babu గారి వాదన ప్రకారం తాత ముత్తాతలు గల వాళ్ళని గూడ నేను తెగడినట్లే!

జీవిత చరిత్రలో పూర్వీకుల గురించి ఉంటే నష్టమేమిటి? గిబ్బన్ అంతటి వాడే సమర్థించలేదా?

“Nor does the man exist who would not peruse with warmer curiosity the life of a hero from whom his name and blood were lineally derived. The Satirist may laugh, the Philosopher may preach; but reason herself will respect the prejudices and habits which have been consecrated by the experience of mankind.”

– From “Family History,” in “Memoirs of My Life,” by Edward Gibbon.

ఎటొచ్చీ గిబ్బన్ ఏం రాసినా చదవడానికి చాలా ఇంపుగా ఉంటుంది. ఈ వ్యాసంలో నాకు నచ్చనవి, నేను gory details అని విమర్శించినవి చాలా dry గా ఉన్నాయి. సాయి గారు వంశవృక్ష పటాన్ని అనుబంధంలో ఉంచి, ఇతరులు చేసిన పొరబాట్లని footnotes లో ప్రస్తావించి, అసలు కథని బిగువుగా నడిపిస్తే ఇంకా రక్తి గడుతుంది.

కొడవళ్ళ హనుమంతరావు

by: karvera babu
హనుమంత రావు వాడిన “గోత్రాల గొరీ” అన్న పదము, గోత్రాలు కల కులాలను తెగడినట్లనిపిస్తుంది

by: Sai Brahmanandam Gorti
హనుమంత రావు గారికి,

మీకు నచ్చిన విషయాలు చెప్పినందుకు కృతజ్ఞుణ్ణి.

ఈ వ్యాసం ఎందుకు రాయాల్సి వచ్చిందో ముందుమాట గా మొదట్లో రాసాను. ఈమాటకి పంపే ముందు ఒకరిద్దరి  సంగీత విద్వాంసుల ( ఇండియాలో ) చేత సమీక్ష చేయించాను. ముందుమాట అవసరం లేదని కొందరంటే తీసేసాను. అందులో మీరడిగిన కొన్నింటింకి జవాబులున్నాయి. వీలయితే ఈ వ్యాసం చివర్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది వ్యాసంగా రాయాలని మొదలు పెట్టలేదు. సమగ్రంగా పుస్తకం తేవాలని నా ఆలోచన. నేనుదహరించిన పుస్తక సూచికే కాక, చాలా పుస్తకాలు సేకరించాను. నాకు భాష అంతగా తెలీకపోయినా తమిళ, కన్నడ పుస్తకాలూ తెప్పించుకొని, భాష తెలుసున్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాను. అన్ని వివరాలూ ఒకే పుస్తకంలో ఎక్కడా కనిపించలేదు.

మీరు అడిగన వాటికి:

1. ఆరుద్రగారన్నట్లు, మనకి  రాజులు చరిత్రలు రాయడమే తెలుసు. కావ్యాలూ, పురాణాలూ తెలుసు. కవుల/రచయితల జీవిత చరిత్రలు రాసిన దాఖలాలు అతి తక్కువగా ఉన్నాయి. అందువల్ల వారి వారి రచనల బట్టీ, తోటికవుల ప్రస్తావనల బట్టీ కొన్ని జీవిత వివరాలు తెలిసాయి. రాజుల చరిత్రల్లో కవులకి సంబంధించిన విషయాలు ప్రస్తావన వచ్చినప్పుడే కవుల గురించీ తెలిసేది.

ఏ ఏ సందర్భంలో, ఏఏ కాలాల్లో, ఏఏ స్ఫూర్తితో రాసారో తెలీదు. త్యాగరాజు విషయంలూనూ జరిగిందిదే. రాసిన కృతుల బట్టి, అందులో భావాన్ని బట్టే పలానా దాని గురించి రాసారన్న ఊహ మొదలయ్యింది.  గిరిరాజ సుత తనయ కృతి సందర్భాన్ని ఎవరికి తోచినట్లు వాళ్ళు రాసారు.  అధారాలు లేని ఆపాదన్లు చేసేసారు. అందులో కొంతమంది రాసింది సరికాదు అని చెప్పడానికి ఈ వంశ వృక్షం ఉపయోగించవచ్చని అనుకుంటున్నాను.  అది తెలియడం వల్ల వచ్చిన లాభం లేకపోయినా నష్టమేమీ లేదని అనుకున్నాను.  ఒకరకంగా ఇది చారిత్రిక ఆధారమే కదా అనిపించింది.  ఇహ గోత్రాల విషయం. గోత్రాలు ఏ వ్యక్తి ఏ వంశం వాడని చెప్పడానికుపయోగపడతాయి కదా?  వాటిపై నమ్మకాలూ, అపనమ్మకాలన్నవి వేరే విషయం. కేవలం త్యాగరాజు జీవితంలో అతి ముఖ్య వ్యక్తుల గురించి రాయడం అవసరం అనిపించింది.  అందుకే వారి వారి రచనల్లో ఈ విషయాలని ఎలా రాసారో చెప్పాను.

2.  చరిత్రనిర్ధారించే ముందు కట్టుకధలూ తెలియాలి. ఒకే కట్టు కథ ఎలా రూపాంతరం చెందిందో చెప్పాలి. అందులోంచి ఏది చరిత్రకి దగ్గరగా ఉంటుందో తెలుసుకోవడం సులభం అవుతుందని నాకనిపించింది. చారిత్రక ఆధారాలు వెతికే చిన్న ప్రయత్నమే ఇది.  అందులో కొన్నింటికి అధారాలుండచ్చు. మరికొన్ని ప్రతిపాదనలు కావచ్చు. ఇంకొన్ని అందరికీ తెలిసే ఉండచ్చు.  అసలాధారాలే దొరక్కపోవచ్చు. అన్నీ ఒకో చోట కూర్చే అతి చిన్న ప్రయత్నం ఇది. అంతే!

త్యాగరాజు కృతుల్లో  ఛందస్సు, అలంకార ప్రయోగాల వివరాలు ముందుముందు వస్తాయి. కాస్త ( 4 నెలలు ) ఓపిక పట్టండి. కేవలం కళ్యాణి రాగాలాపన్ని అయిదునుంచి ఎనిమిది గంటలవరకూ పాడే వారని రాసారు.  త్యాగరాజు ఇది పాటించకుండా రాగ విస్తారణని సంగతుల్లో ప్రవేశపెట్టి, సాహిత్యాన్ననుసరించి ఆశువుగా కల్పన చేసే విధానానికి జీవం పోసి, కృతులకి మరో కొత్త రూపం ఇచ్చాడు.  కేవలం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండే సంగీతాన్ని సులభతరం చేసాడు.  ఇవన్నీ ముందొస్తాయి.

చివరగా,  అభిమానంగా  నా గురించి మీరునుకున్నదాంట్లో ఆసక్తన్నదోక్కటే నిజం.  నా సంగీత జ్ఞానం మితం. అవగాహన మరీ పరిమితం.

అద్దంలో రోజూ నన్ను నేను చూసుకుంటాను. :)-

- సాయి బ్రహ్మానందం

by: Raghava
హనుమంతరావు గారూ,

మీకు నచ్చని వివరాలు నాకు నచ్చాయి. అవి ఉండడం వల్ల ఈ వ్యాసానికొచ్చిన నష్టం ఏమీ లేదని అనుకుంటున్నాను. లోకప్రసిద్ధమైన విషయాలు పాఠకులకు ఉపయోగకరమనే నా అభిప్రాయం.

by: కొడవళ్ళ హనుమంతరావు
సాయి గారికి సంగీతంపై కేవలం ఆసక్తే కాక అపారమైన పరిజ్ఞానం ఉందని తెలుస్తుంది. ఈ వ్యాసంలో చారిత్రక నేపథ్యం, తంజావూరు చరిత్రా బావున్నాయి. నాకు నచ్చని విషయాలు:

1. త్యాగరాజు తాత ముత్తాతల వంశ వృక్షాల గోత్రాల గోరీ వివరాలకి అంత ప్రాధాన్యత అవసరమా?.

2. ప్రచారం లో ఉన్న కట్టు కథలని స్థూలంగా చెప్పి అసలు చరిత్ర మీద కేంద్రీకరిస్తే బావుండేది.

అప్పుడప్పుడూ పాత తెలుగు సినిమా పాటలను వినడం మినహా నాకు సంగీతంలో ఓనమాలు కూడా తెలియవు. కాబట్టి నేనడగబోయే ప్రశ్న మరీ అమాయకంగా (naive గా) ఉండొచ్చు.

అప్పటిదాకా లాగుడు పీకుడు రాగాలతో ఉన్న శాస్త్రీయ సంగీతాన్ని త్యాగరాజు శ్రావ్యం చేశాడన్నారు. దీనిక చారిత్రక శాస్త్రీయ ఆధారాలేమిటి? అంతకు ముందర ఈ సంగీతం నిజంగాఅంత కర్ణ కఠోరంగా ఉండేదా?

కొడవళ్ళ హనుమంతరావు

by: Rohiniprasad
My two cents:

ఇంగ్లీషువాళ్ళని గురించి వాళ్ళెప్పుడూ చెప్పుకుని ఉండరు కనక మనవాళ్ళకి వాళ్ళ గురించి ఫ్రెంచివాళ్ళ ద్వారా తెలిసి ఉండాలి. అందుకని వాళ్ళకి ఫ్రెంచి ఉచ్చారణని బట్టి ఆంగ్లేయులు అని పేరు పెట్టారు. అలాగే దక్షిణాది సంగీతం గురించి మహారాష్ట్రులకి ముందుగా తెలిసి ఉంటుంది. అది పాడేవాళ్ళంతా కర్ణాటక ప్రాంతంవాళ్ళయి ఉంటారు కనక దానికి కర్ణాటక సంగీతం అని పేరు పెట్టి ఉంటారు. రాగాలు తెలియని కొన్ని నాట్య సంగీత్ పాటలకి కర్నాటకీ అని రికార్డులమీద రాసి ఉంటుంది. As if it is self-explanatory!

by: mOhana
కర్ణాటకమా లేక కర్నాటకమా అనే దానిని గురించి ఒక కన్నడ కవి (బహుశా కువెంపు కాబోలు) అది “నొణ  (నకార ణకారాలు)  కాట” (ఈగ పోరు) అని అన్నారు. ణ-కారాన్ని  న-కారంగా పలకడం సర్వసామాన్యం. హిందీ వంటి భాషలో ఇది వ్యాకరణరీత్యా సరియైనదే. అందుకే తెలుగులో ఈ రెండు అక్షరాలకు ప్రాస (యతి) సరిపోతుంది. కాని నాకు నచ్చనిది కర్నాటిక్ అనడం! - మోహన

by: Sai Brahmanandam Gorti
శశాంక గారూ,

కర్ణాటకం సరైందా? లేక కర్నాటక అనే రాయాలా? అన్నవిషయం పై భాషాశాస్త్ర పరంగానూ, చరిత్ర పరంగానూ వివరిస్తూ ఓ పది పేజీల వ్యాసం రాయచ్చు. నాకు తెలిసీ రెండు విధాలుగానూ అనచ్చు.  కాదని పండితులెవరైనా అధారాలతో వివరిస్తే మంచిదే!  వినడానికి కర్ణాటకం, పలకడానికి కర్నాటకం ఎంచుకోడంలో ఇబ్బందుండదనుకుంటాను.

by: sasAmka
కర్ణాటక సంగీతం కాదు బాబోయ్..కర్నాటక సంగీతం

by: Sai Brahmanandam Gorti
సూర్యనారాయణ గారూ,

ఎన్నో సంస్కృత పదాలు  మనం తెలుగు పదాలుగా వాడుతాం. కొన్ని పదాలైతే ఇవీ సంస్కృత పదాలూ, తెలుగువి కావన్న తేడా కూడా తెలీకుండా వాడుకలో ఉన్నాయి. గ్రాంధిక భాషలో వచ్చిన అనేక కావ్యాలలో సంస్కృత పదాలు తెలుగు పదాలుగానే వ్యవహరింపబడ్డాయి. ముఖ్యంగా దైవ స్తుతి వచ్చేసరికి చాలామందిపై సంస్కృత స్తోత్రాల ప్రభావం చాలా కనిపిస్తుంది. ఆ ధోరణిలోనే రచనలు కనిపిస్తాయి. మీరుదహరించిన త్యాగరాజు కృతుల్లో అన్నీ సంస్కృత పదాలే! కానీ అవన్నీ ఎంతో కొంత తెలుగు చదువుకున్న వారికి తెలీని పదాలు కావు. పూర్తి అర్థాలు తెలీక పోయినా చాలా పదాలు వాడుకలో కనిపించేవే!

త్యాగరాజు మొదట్లో చేసిన రచనల్లో సంస్కృత భాష ప్రభావం అమితంగా ఉంది. రాను రానూ పూర్తిగా తెలుగులోనే కృతులు కనిపిస్తాయి. వాగ్గేయకారుడిగా రచనల్లో పరిణామ క్రమం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే కొన్ని త్యాగరాజు కీర్తనలు ఆయన ముద్రతోనే ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి ప్రక్షిప్తాలా లేక త్యాగరాజు స్వీయరచనలా అన్నది స్పష్టంగా తెలీదు. చాలా భాగం త్యాగరాజు కీర్తనలు ఆయన శిష్యుల ద్వారా లభించినవే!

స్వలిఖితంగా  ఉన్న ఒక్క త్యాగరాజ కృతీ దొరకలేదు.

కొన్ని కృతులు త్యాగరాజు రాయలేదన్న సంగీత శాస్త్రజ్ఞుల వాదన కూడా! సామజవరగమన ఆయన కృతే అని శైలిని బట్టి చెప్పచ్చు. ఇందులో వాడిన కొన్ని పదాలు వేరేచోట్ల మరికొన్ని కృతుల్లో కనిపిస్తాయి. కానీ “శ్రీ గణనాధం భజామ్యహం” కృతి మాత్రం ప్రక్షిప్తమనీ చెప్పడానికి కొన్నైనా ఆధారాలు చూపగలం.

ఇవన్నీ ముందు ముందు నాకు తెలుసున్నంత వరకూ చర్చిస్తాను.

నేను రాసిన ” త్యాగరాజు సంస్కృతంలో రాసిన కృతి ఇదొక్కటే! ” అన్న వాక్యం ఉపసంహరించుకుంటున్నాను. అది తొలగించమని ఈమాట వారిని అడుగుతాను. మీరు “సవరణ” చెప్పినందుకు కృతజ్ఞతలు.

by: suryanarayanna
సామజవరగమనా , నాదతనుమనిశం, శ్రీ నారసింహ మాం పాహి ……..యిలా ఇంకా చాలా సంస్కృత కీర్తనలు త్యాగరాజ కీర్తనలు గానే, ఆయన ముద్రతో ప్రాచుర్యం లో ఉన్నాయి.

“త్యాగరాజ స్వామి సంస్కృత కీర్తనలు ”  అని ఒక 10 లేక 12 కీర్తనల సంకలనం శ్రీ బాలమురళీ  కృష్ణ గారు పాడిన  ” సంగీతా ”  కంపెనీ వారి కేసెట్టు కూడా ఒకటి ఉంది.

బ్రహ్మానందం గారూ ,  “నమోనమోరాఘవాయ”  అనే కృతి ఒక్కటే త్యాగరాజ స్వామి వారి ఏకైక సంస్కృత రచన అంటారా ?  రూఢి గా ? ( మీరు వ్యాసం లో ఒకచోట చెప్పినట్లు )

by: mOhana
ఈ వ్యాసం మిగత భాగాలకు ఎదురుచూస్తున్నాను. సాయి

బ్రహ్మానందం గారి శ్రద్ధ, ఆసక్తి, కుతూహలం ఈ వ్యాసంలో

ప్రతిబింబిస్తున్నాయి. ఒక వాగ్గేయకారునికి ముఖ్యంగా

కావలసినవి - సంగీతంలో విద్వత్తు, సాహిత్యంలోని

సుళువులు. ఈ రెంటికి ఎలా పొత్తు కుదిరిస్తే పండిత

పామర రంజకంగా ఉంటుందనే విషయాన్ని తెలిసిన

వారిలో త్యాగరాజు అద్వితీయుడు. ఏ మహానుభావుడైనా

అంత గొప్పవాడు ఎలా అయ్యాడని తెలిసికోవాలంటే అతని

జీవిత చరిత్ర దీనికి కొంతైనా సహాయకారి అవుతుంది.

దీనికి ఈ వ్యాసం ఎంతైనా తోడ్పడుతుంది. త్యాగరాజుని

తలచుకొంటుంటే ఒక్కొక్కప్పుడు విదేశాలలో ఉండే మన

స్థితి గుర్తుకు వస్తుంది. తెలుగులో ఆసక్తి ఉన్న

దేశాంతరవాసులంతా ద్వీపాలే. తమిళదేశంలో ఉండే

త్యాగరాజు కూడ ఒక తెలుగు ద్వీపమే. అతడు ద్వీపం

మాత్రమే కాదు, ఒక దీపం కూడా. మనలో ఒక కొందరికి

తెలుగు భాషను అభివృద్ధి చేయాలనే ఆశ ఉన్నది.

దీనికి కూడా ఇట్టి వ్యాసాలలో మార్గాలు దొరుకుతాయేమో?

బ్రహ్మానందంగారి శ్రమ ప్రశంసనీయం. ఇందులో

ఉదహరించబడిన ఒక పుస్తకం కింది లింకులో

లభ్యము -

tyAgarAja - Life and Lyrics - Jackson

(Digital Library of India, IISc)

విధేయుడు - మోహన

by: chandrasekhar
వ్యాసంబాగుంది. పంచపాకేశ, మాతృభూతేశ్వర వంటి పేర్లు తప్పుగా రాశారు. మీరు కొత్తగా కనుక్కున్నదేమిటి?